నిప్పులు చెరిగిన ష‌మీ.. సౌత్‌జోన్‌ కకావికలం | Mohammed Shami Fiery Spell-Destructed-South Zone-Duleep Trophy Final | Sakshi
Sakshi News home page

Duleep Trophy: నిప్పులు చెరిగిన ష‌మీ.. సౌత్‌జోన్‌ కకావికలం

Sep 8 2026 4:22 PM | Updated on Sep 8 2026 5:02 PM

Mohammed Shami Fiery Spell-Destructed-South Zone-Duleep Trophy Final

Photo Credit: Twitter

దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ త‌ర‌ఫున ఆడుతున్న‌ టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ సౌత్‌జోన్‌తో ఫైన‌ల్లోనూ చెల‌రేగుతున్నాడు. సెమీఫైన‌ల్లో ఐదు వికెట్లు తీసిన ష‌మీ ఫైన‌ల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవ‌ర్లు వేసిన ష‌మీ 4 మెయిడెన్లు స‌హా 17 ప‌రుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. 

ముఖేశ్ కుమార్ కంటే త‌క్కువ ఎకాన‌మీతో బౌలింగ్ చేసిన ష‌మీని ఎదుర్కోవ‌డంలో సౌత్‌జోన్ బ్యాట‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం సౌత్‌జోన్ జ‌ట్టు 69 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ (37), శ్రేయ‌స్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. 

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ జ‌ట్టు 163 ఓవ‌ర్ల‌లో 708 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇషాన్ కిష‌న్ (270) డ‌బుల్ సెంచ‌రీతో మెర‌వగా, కుమార్ కుశాగ్ర (101) సెంచ‌రీతో రాణించగా, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ (72), శిఖ‌ర్ మోహ‌న్ (85) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. త్రిపురణ విజయ్‌ నాలుగు వికెట్లతో మెరిశాడు.

ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.

చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడ‌నున్న మెస్సీ, రొనాల్డో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement