source: X
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్తాన్ ప్లేయర్లకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మైదానంలో అతి చేసినందుకు ఇద్దరు ప్లేయర్లపై ఐసీసీ గంటల వ్యవధిలో చర్యలు తీసుకుంది.
భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్ చేసినందుకు నిన్న ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించగా.. నిన్న హాంకాంగ్ చైనాతో మ్యాచ్‌లో అతి చేసినందుకు ఇవాళ గుల్ ఫెరోజాపై కూడా అవే చర్యలు (మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్) తీసుకుంది.
ఫెరోజా నిరసన
హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఫెరోజా వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన ఆమె.. అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించకుండా నిరసన తెలిపింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇలా చేయడం నిబంధనల ఉల్లంఘణ కిందికి వస్తుంది. దీంతో రిఫరి ఫెరోజాపై చర్యలు తీసుకున్నారు.
ఫాతిమా ఓవరాక్షన్
భారత్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఫాతిమా సనా చాలా అతి చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్‌కు దారి చూపిస్తూ దురుసుగా ప్రవర్తించింది. దీనిపై ఐసీసీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఫాతిమా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్దారించి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, అలాగే ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది.
ఇదిలా ఉంటే, భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక సెమీస్‌కు చేరుకున్నాయి. ఇవాళ బంగ్లాదేశ్-యూఏఈ మ్యాచ్ విజేతతో భారత్ సెమీస్‌లో తలపడుతుంది. పాకిస్తాన్, శ్రీలంక రెండో సెమీస్‌లో పోటీపడతాయి. భారత్ మ్యాచ్ సెప్టెంబర్ 10న, శ్రీలంక-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగునున్నాయి.
చదవండి: పాక్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!


