source: BCCI X
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ మరో వివాదానికి దారితీసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్ క్రాంతి గౌడ్‌పై పాక్ అభిమానులు లింగ వివక్షతో కూడిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
The people are a reflection of the country 🤡 pic.twitter.com/4WzNwWfy96
— Out Of Context Cricket (@GemsOfCricket) September 6, 2026
టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న క్రాంతి గౌడ్‌ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు (పాకిస్తాన్‌కు చెందిన వారుగా అనుమానం) ఆమె లింగం, రూపురేఖలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు వినిపించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇలాంటి చెత్త ప్రవర్తన పాకిస్తాన్ అభిమానులకు మాత్రమే సాధ్యమని అంటున్నారు. మహిళా క్రీడాకారిణులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదయోగ్యం కాదని కొందరు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.
చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్ కెప్టెన్


