breaking news
Kranti Gaud
-
చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ మైదానంలో మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది.స్మృతి మంధాన అర్ధ శతకంలండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్- భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం ఏకైక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం (83)తో మెరిసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ అర్ధ శతకం (52)తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.క్రాంతికి ఐదు వికెట్లుఇక భారత బౌలర్లలో పేసర్ క్రాంతి గౌడ్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్‌లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. మిగిలిన వారిలో సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.యస్తికా సెంచరీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (115 పరుగులు) కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా సెంచరీ (113)తో సత్తా చాటింది.ఇంగ్లండ్ లక్ష్యం 457ఫలితంగా టీమిండియా ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఈ క్రమంలో 130/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో 56 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.ఆఖరి రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లిస్టోన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు కూల్చారు.సంక్షిప్త స్కోర్లుభారత్ : 285 &3 41/7 డిక్లేర్డ్ఇంగ్లండ్ : 170 & 186ఫలితం : ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపు.చదవండి: టీమిండియాలోకి సూర్య! -
170 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. చరిత్ర సృష్టించిన భారత పేసర్
భారత మహిళల క్రికెట్ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనత సాధించింది. ఈ మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తూ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రాంతి 17 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. ఫలితంగా భారత్ ఇంగ్లండ్‌ను 170 పరుగులకే కుప్పకూల్చి, 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.ఈ ప్రదర్శనతో క్రాంతి మరో ఘనత కూడా సాధించింది. టెస్టు క్రికెట్లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు నమోదు కావడం ఏ క్రికెటర్‌కైనా ఓ కల. అలాంటి అరుదైన గౌరవాన్ని తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్న క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది.మ్యాచ్ విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (44) ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరితో పాటు మయా బౌచియర్ (23), మ్యాడీ విల్లియర్స్ (10), సోఫీ ఎక్లెస్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. -
భారత క్రికెటర్‌కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
భారత స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.గతేడాది భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.తొమ్మిది వికెట్లు కూల్చి.. అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్ తొలిసారిగా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్.. క్రాంతి తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్‌కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ క్రమంలోనే మున్నా సింగ్ తిరిగి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.మా నిర్ణయం వల్ల గౌడ్ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్ యూనిఫామ్‌లో రిటైర్ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసిన మున్నా సింగ్ 2012లో సర్వీస్ నుంచి తొలగించబడ్డారు.మున్నా సింగ్‌పై అందుకే వేటుఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్ క్రికెటర్ కావాలన్న తన కలను వదల్లేదు.ట్విస్టు ఏంటంటే?కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్‌కప్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్డీటీవీ వివరాల ప్రకారం.. జూన్ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్‌కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


