చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాన్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణకు ఆదేశించింది. ఓ అత్యాచారం కేసుకు సంబంధించి రాజీ కుదిర్చేందుకు, కేసును తొక్కిపెట్టేందుకు ఆమె రూ. 5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది.
ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి రెండు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్ బహిరంగంగా చేసిన ప్రకటనల ఆధారంగా ఈ ఫిర్యాదు కమిషన్ ముందుకు వచ్చింది. ఈ ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, కీలక ఆధారాలు తారుమారు కాకుండా భద్రపరచాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు.
AAP NEFARIOUS ANTI WOMAN POLITICS EXPOSED!
BLATANT CORRUPTION OF AAP IN BROAD DAYLIGHT!
Worse. AAP TRIED TO SILENCE IT!
NHRC has taken cognisance of allegations that the wife of Punjab CM Bhagwant Mann sought ₹5 CRORE to suppress a rape case — allegations reportedly made… pic.twitter.com/AqdxQMBAso— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) August 22, 2026
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కానూంగో నేతృత్వంలోని ధర్మాసనం మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 12 కింద ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని మహిళా భద్రతా విభాగానికి కూడా ఈ కేసు వివరాలను నివేదించింది. బాధితురాలి గౌరవం, రక్షణ, న్యాయం పొందే హక్కులకు భంగం కలగకుండా నిష్పక్షపాత విచారణ జరగాలని కమిషన్ స్పష్టం చేసింది.
అయితే ఈ దశలో వీటిని కేవలం ఆరోపణలుగానే పరిగణిస్తున్నామని, పూర్తి నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది. మరోవైపు ఈ వ్యవహారంపై డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాన్ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్‌కు ఆమె న్యాయపరమైన నోటీసు పంపారు. 24 గంటల్లోగా బేషరతుగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయస్థానంలో పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరాకు రంజిత్ సింగ్ స్వయానా బావమరిది అని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: బీజేపీలో నితిన్ మార్క్ షురూ.. తొలి రోజే ఎన్నికల రోడ్‌మ్యాప్ సిద్ధం!


