breaking news
Against
-
‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం
హేగ్: సింధు జలాల ఒప్పందం (ఐడబ్యూటీ) విషయంలో హేగ్(నెదర్లాండ్స్)లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (CoA) జారీ చేసిన తాజా ఆదేశాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ‘పాండేజ్ లాగ్‌బుక్’లను సమర్పించాలని కోర్టు కోరగా, ఆ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది.అసలు ఈ మధ్యవర్తిత్వ కోర్టు ఏర్పాటునే భారత్ అక్రమమని, దానికి ఎటువంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేసింది. ఈ అంశంపై ఫిబ్రవరి 2, 3 తేదీల్లో హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో విచారణ జరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 2025 ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ప్రతిష్టంభన ఏర్పడింది. పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న మర్నాడే భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్‌కు నీటి సహకారం అందించడం సాధ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినందున, అంతర్జాతీయ వేదికలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకు లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడిన పాకిస్తాన్ వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. పాక్‌లోని తర్బేలా, మంగ్లా వంటి కీలక జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను వాడుకుంటోందని భారత్ ఆరోపించింది.భారత్ ఈ విచారణలో పాల్గొనకపోయినప్పటికీ, హేగ్ కోర్టు మాత్రం పాకిస్తాన్ విన్నపం మేరకు విచారణను కొనసాగిస్తోంది. ఒకవేళ భారత్ సమాచారం ఇవ్వకపోతే ప్రతికూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. అయితే భూతలాన ఉన్న యథార్థ పరిస్థితులను విస్మరించి, ఒప్పందాలు సాగవని భారత్ గట్టిగా వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు కేవలం నీటి పంపకాలకే పరిమితం కాకుండా, భారత్-పాక్ మధ్య ఒక వ్యూహాత్మక దౌత్య యుద్ధంగా మారింది. భారత భాగస్వామ్యం లేని విచారణ ఏకపక్షమే అవుతుందని, అది ఏ రకంగానూ ఒప్పందాన్ని శాసించలేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్ -
మెన్ ఇన్ 2025: వచ్చే ఏడాదైనా...మేల్ ఎంచుదాం!
‘వాడికేం మగాడు’ అనేవారు గతంలో. ‘అయ్యో... మగాడు’ అనేలా ఉన్నాయి రోజులు అనుకుంటున్నారు పురుషులు. 2025 సంవత్సరం పురుషుడిని మరింత ఒంటరిని చేసిందని పరిణామాలు చెబుతున్నాయి. ‘అవతార పురుషుడు’, ‘ఆపద్బాంధవుడి’గా గతంలో చెప్పబడిన పురుషుడు నేడు సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడని నిపుణులు అంటున్నారు. 2025లో పురుషుడి స్థితిగతులపై ఓ నజర్.మగాడి కోసం రెండు ప్రయివేటు బిల్లులు2025 ముగిసి, 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ 365 రోజుల జీవితాన్ని మొత్తం తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అని పురుషులని అడిగితే ‘అసలు తరచి చూసే అవకాశం, తీరిక మాకెక్కడిదీ’ అనేది పురుషుల మాట. హడావిడి, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, సామాజిక వ్యవహారాలు, ఆర్థిక కష్టనష్టాలు... అన్నీ కలిపి నిమిషం తీరిక లేకుండా చేస్తే ఇక జీవితం ఎలా సాగుతోందో చూసి, అంచనా వేసే అవకాశం ఎలా ఉంటుంది? 2025లో పురుషుల సమస్యల మీద అనేకమంది వైద్య నిపుణులు, సామాజికవేత్తలు గొంతెత్తారు. ఆధునిక జీవనంలో అబ్బాయిల పరిస్థితి అధ్వానంగా మారిందని, సమస్యలు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక వారు అవస్థ పడుతున్నారని పేర్కొన్నారు. అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. రీల్స్‌లో ఒక జోక్... నలుగురు మగవారు ‘గోవాకు వెళదాం’ అని ΄్లాన్ చేస్తూ ఉంటారు. కలిసినప్పుడల్లా గోవా ΄్లానే. కాని సంవత్సరాలు గడిచిపోతాయిగానీ గోవాకు మాత్రం వాళ్లు వెళ్లరు. నిజానికి గోవాకు వెళ్లడం పెద్ద విషయం కాదు. తగినన్ని డబ్బులు అందరి దగ్గరా ఉంటున్నాయి. కాని కదల్లేని మెదల్లేని పరిస్థితులు నేడు పురుషుడి కనీస సరదాలను కూడా తీర్చడం లేదు.‘మగాళ్లు పైలాపచ్చీసు’గా తిరుగుతుంటారు అనేది పాతమాట. కనీసం రెండురోజుల లీవ్ దొరకని ఉద్యోగాల్లో వాళ్లు ఒళ్లు హూనం చేసుకుంటున్నారని ఎవరికి తెలుసు?రైట్ టు డిస్ కనెక్ట్ బిల్మగవారు ఆఫీసులో ఉన్నంత సేపే డ్యూటీ చేసినట్టు కాదు.. ఇంటికొచ్చాక కూడా కాల్స్ అటెండ్ చేస్తూ ఆఫీస్ పని చేస్తూ అదనపు డ్యూటీ చేస్తూనే ఉంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు సర్వసాధారణం. మగవారికే కాదు పురుష/మహిళా ఉద్యోగులందరికీ పని గంటల తర్వాత ఆఫీసుతో డిస్కనెక్ట్ అయ్యే హక్కును ప్రతిపాదిస్తూ ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్’ను ప్రయివేటు బిల్లుగా 2025లో పార్లమెంట్ మెంబర్ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. అత్యవసర సేవల్లో ఉంటే తప్ప ప్రతి ఉద్యోగంలో ఇలా డిస్కనెక్ట్ అయ్యే సౌలభ్యం మగవారికి ఉంటే వారు మరింత క్వాలిటీ లైఫ్‌ను అనుభవించగలరు.జాతీయ పురుషుల కమిషన్ పురుషుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించే చట్టబద్ధమైన సంస్థను రూ΄÷ందించడానికి ఈ ఏడాది తొలి ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 6న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ‘జాతీయ పురుషుల కమిషన్ బిల్లు’ను ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టారు. పురుషులపై చట్టపరమైన వివక్ష, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ చట్టాలలో పక్షపాతాలు, కొన్ని నేర నిబంధనల దుర్వినియోగాన్ని పరిశీలించడానికి సంస్థాగత యంత్రాంగం కావాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇలాంటి కమిషన్ ఉండాలని ‘భార్యా బాధితులు’ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 2025లో కొన్ని భరణం కేసులు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయే విధంగా కోర్టు ముందుకు వచ్చాయి.ఆయుష్షు తక్కువ‘నూరేళ్లు వర్థిల్లు’ అనుకోవడమే గాని పురుషుడి ఆయుష్షును తగ్గించే విషయాల గురించి చింత ఉండటం లేదు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుష్షు నాలుగు సంవత్సరాలు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం దేశంలో సగటు ఆయుర్దాయం ఇప్పుడు 70.3 సంవత్సరాలు. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కేరళలో 75.1 సంవత్సరాలతో అత్యధికంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే, పురుషుల ఆయుర్దాయం జమ్మూ కాశ్మీర్లో 73.4 సంవత్సరాలు కాగా, మహిళలకు కేరళలో 78.4గా ఉంది. అత్యంత తక్కువ ఆయుర్దాయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. అక్కడ పురుషులకు 62.4 సంవత్సరాలు కాగా, మహిళలకు 67.1 సంవత్సరాలు. పురుషుల మరణాలకు ప్రధాన కారణంగా హృదయ సంబంధ వ్యాధులే కావడం గమనార్హం.పాపం ఒక్కడుఅవును! ఇంటికి అతను ఒకే ఒక్కడు. ఉమ్మడి కుటుంబాలు పోయి దేశంలో చిన్న కుటుంబాల వ్యవస్థ మొదలైన తర్వాత భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అనే సంస్కృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మగవాడు భర్త బాధ్యతనంతా భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య అతనికి సహకరిస్తున్నా పని ఒత్తిడి, బాధ్యతలు నిమిషం ఖాళీగా ఉంచడం లేదని నిపుణులు అంటున్నారు. పనులు పంచుకునేవారు లేక, కాసింత విశ్రాంతి దొరకక చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని అంటున్నారు. 2025లో పురుషుల మానసిక సమస్యల గురించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్యం అతడికే... జరిమానాలు అతడికే...పురుషుడు పని చేయాలంటే కాలు బయట పెట్టాలి. బయట అడుగుపెడితే కాలుష్యం, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.... ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే మన దేశంలో అత్యధిక పురుషులు టూ వీలర్ల మీద తిరుగుతూ కాలుష్యం బారిన పడుతున్నారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం వీరి సమస్య. చూపు మందగించడం, చర్మం ముడతలు పడిపోవడం వంటి సమస్యలకు లెక్కలేదు. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో చాలామంది పురుషులు చిన్నవయసులోనే బీపీ, డయాబెటిస్ బారిన పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు పురుషుల్లో సర్వ సాధారణం. ఇక వీరు ట్రాఫిక్ జరిమానాల బారిన పడుతూ అవి కట్టలేక చేసే ఆర్తనాదాలకు అంతు లేదు.బెట్టింగ్ బర్బాదీబెట్టింగ్ యాప్స్ ఎరకు చిక్కుకున్న పురుషుల పెను విషాదాలు 2025లో అత్యధికం చోటు చేసుకున్నాయి. మద్యం, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకున్నవారు కూడా సులభదారుల్లో డబ్బు వస్తుందని బెట్టింగ్ యాప్స్‌కు చిక్కుకుని ్రపాణాలు కోల్పోతున్నారు. వీరిలో యువకులు ఎక్కువ ఉంటే సైబర్ మోసగాళ్ల చేత చిక్కి వారు పెట్టమన్న చోట పెట్టుబడులు పెట్టి కోట్లు నష్టపోయిన వారిలో అనుభజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉన్నారు. జీవన తాత్త్వికత, జీవన సౌలభ్యాలు తెలుసుకోకుండా అసలు ఎటువంటి వివేచనాపూరిత ఆలోచనలు లేకుండా ఎక్కువ సంఖ్యలో పురుషులు ఉంటూ మూక స్వభావంతో జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. గడ్డం పురుష లక్షణంఎన్ని చెప్పుకున్నా ఇప్పటికీ ఇది పురుష ప్రపంచమే. పురుషులే ఆకర్షక శక్తులుగా నిలిచే ఆనవాయితీ పోలేదు. ఒకప్పుడు పురుషులు శుభ్రంగా గడ్డం గీసుకుని కనిపించేవారు. ఇప్పుడు గడ్డం కలిగి ఉండటం పురుష లక్షణంగా మారింది. 2025లో బారు గడ్డాల సౌందర్యంతో రణబీర్ కపూర్, రణధీర్ కపూర్‌తో మొదలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో సహా విరాట్ కోహ్లీతోపాటుగా హల్చల్ సృష్టించారు. ప్రస్తుతం ‘వారణాసి’ కోసం మహేష్ బాబు కూడా గడ్డం పెంచారు. ప్రపంచవ్యాప్తంగా నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తి స్త్రీ కాదు. అమెరికన్ గాయకుడు–గేయరచయిత డేవిడ్ ఆంటోనీ బర్క్ (ఈ4ఠిఛీ). మనదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మొదటి ఐదుగురిలో నలుగురు మగవారే కావడం విశేషం. వారిలో తొలిస్థానం యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో క్రికెటర్లు ప్రియాంశ్ ఆర్య, అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు.ఎవరికీ చెప్పుకోలేక‘మగవాడివి.. నువ్వు ఏడవకూడదు’ అని చిన్ననాటి నుంచి వినే మాటలు, ఇంటా బయటా నూరిపోసే పురుష అహం ఆ సమయానికి బాగున్నా వయసు పెరిగే కొద్ది పురుషులను సతమతం చేస్తున్నాయి. దీంతో ఎంత కష్టం వచ్చినా బయటకి చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక నలిగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన అధ్యయనాల్లో అనేకమంది పురుషులు తమ తమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, చిన్న చిన్నవి బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనో, ఎగతాళి చేస్తారనో లోలోపలే దాచుకొని కుమిలిపోతున్నారని తేలింది. ఉదాహరణకు ఇంట్లో అవమానకరమైన, సూటిపోటి మాటలు ఎదురవుతుంటే ఆ పురుషుల బాధ వర్ణనాతీతంగా ఉంది.ఒక ఉద్యోగం చాలదుఒక ఉద్యోగానికే సమయం సరిపోకపోతే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి స్థలాలు– ఇళ్ల ధరలు, ఇళ్ల అద్దెలు మగవాణ్ణి మరో ఉపాధిని కూడా వెతుక్కునే అగత్యానికి నెడుతున్నాయి. ఏ.ఐ ప్రవేశం తర్వాత ఉద్యోగాలు పోతాయన్న హెచ్చరికలు వారిని అభధ్రతలో నెడుతున్నాయి. అప్పులు చేసి, వడ్డీలు కట్టక తప్పని పరిస్థితో ఈఎంఐలకు చిక్కుకోత తప్పని పరిస్థితో నెలకొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని పురుషులు ఈ ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగంతోపాటు పార్ట్‌టైం ఉద్యోగాలూ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఊబర్, ఓలా సర్వీసుల్లో ఇలాంటి మగవారు ఎందరో కనిపిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర కాచి పని చేస్తున్నారు.అనూహ్యమైన ఆమెభార్యాభర్తల అనుబంధం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనది. దాని కోసం స్త్రీ, పురుషులిద్దరూ ఎన్నో త్యాగాలకు, సర్దుబాట్లకు సిద్ధమవుతూనే ఉంటారు. అయితే గతంలో గృహహింసలో మగవారి పాత్ర వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు స్త్రీ హింస వార్తలుగా కనిపించడం మగవారికి బెంబేలు పుట్టిస్తోంది. భర్తల ్రపాణాలకు భార్య వల్ల ముప్పు ఏర్పడే పరిస్థితి రావడం 2025లో ఎక్కువ సంఘటనల వల్ల కనిపించిన సామాజిక విషాదం. ఇంత ప్రమాదం అరుదే అయినా భార్య నుంచి వేధింపులు, ఆమె కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు ఇటీవల పెరిగాయని పురుషులు చేస్తున్న ఆరోపణ. నకిలీ వేధింపులు కేసులు, వరకట్న కేసులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విడాకుల కోసమో, మరే కారణం చేతనో సూటిపోటి మాటలు అనడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల సంఖ్య పెరిగింది. -
సీఎం చిట్‌చాట్‌ల పేరుతో దాక్కోవద్దు: కేటీఆర్
సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌ల పేరుతో దాక్కోవడం కాదు దమ్ముంటే బయిటకొచ్చి కేసులపై మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం నల్గొండలో నిర్వహించిన బీర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా రోజుకో కేసు అంటూ లీకులిస్తుందని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ గర్జిస్తే కాంగ్రెస్ నేతలెవరూ సమాధానం చెప్పలేకపోయారని వారికి ఆ దమ్ములేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ఎన్నికలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యంగా చేసుకున్నట్లు, బీఆర్ఎస్ కార్యకర్తల దృష్టి కూడా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపైనే ఉండాలన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడకూడదని కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గత ఆదివారం జరిగిన బీఆర్ఎస్సీఎల్పీ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు బీఆర్ఎస్కు మరింత అనుకూలంగా ఉండేవన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. దానితో పాటు 2023లో బీఆర్ఎస్ హాయాంలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా వన్ రేసు అవినీతి కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. -
సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
కర్ణాటక రాజకీయాలు కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా నడిచాయి. ఆ రాష్ట్ర సీఎం మార్పు జరగనుందంటూ ఊహాగానాలు రేగడం దానిని బలపరూస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడంతో కొద్దికాలం పాటు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. అయితే సీఎం మార్పు అంశంలో తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రాష్ట్రంలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదన్నారు.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కొద్దికాలం పొలిటికల్ వార్ జోరుగానే సాగింది. ఐదేళ్లకు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని సిద్ధరామయ్య అనగా ఇచ్చిన మాట కంటే గొప్పది మరోటి లేదని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంట్రీతో ఇద్దరు నేతలు కొంత తగ్గి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని తెలపడంతో సీఎం కుర్చీ వార్‌కు కొద్దిగా చల్లబడిందని పొలిటికల్ వర్గాలు భావించాయి.అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోకా సీఎం మార్పుపై అసెంబ్లీలో సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. "ప్రజలు మమ్మల్ని దీవించారు. అనంతరం ఎమ్మెల్యేలలంతా నన్ను నాయుకుడిగా ఎన్నుకున్నారు.ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే తదనంతరం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని సిద్ధరామయ్య అన్నారు. అసలు తానేప్పుడు రెండున్నర సంవత్సరాల సీఎం ఒప్పందం గురించి చెప్పలేదని అసలు అలాంటి అగ్రిమెంటే జరలేదన్నారు.అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమ వర్గం నాయకులకు ప్రత్యేక వింధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. గత నెలతో రెండున్నరేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం మారనున్నారని జోరుగా ప్రచారం నడిచింది. -
మళ్లీ శశిథరూర్ లొల్లి.. ఈసారి అమ్మ కారణం?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమవుతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ కీలక సమావేశాలకు తరచూ గైర్హాజరు కావడం, ప్రధాని నరేంద్ర మోదీని బహిరంగంగా ప్రశంసించడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. థరూర్ వైఖరిని కాంగ్రెస్ నేతలు ‘అవిశ్వాసం’గా పరిగణిస్తున్నారు. మోదీ విజన్, ఆయన అభివృద్ధి విధానాలపై ధరూర్ కురిపిస్తున్నప్రశంసల జల్లు పార్టీలోని సహచరుకు కూడా మింగుడుపడటం లేదు. శశిథరూర్ కాంగ్రెస్ పార్టీపై చూపుతున్న నిరసన మరోమారు బయటపడింది.నేటి (సోమవారం)నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వ్యూహాత్మక బృందం సమావేశానికి ఎంపీ శశి థరూర్ హాజరు కాకపోవడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే థారూర్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని, అతని 90 ఏళ్ల తల్లి సంరక్షణను పర్యవేక్షిస్తున్నందున, ఈ సమావేశానికి రాలేకపోయారని ఆయన కార్యాలయం వివరణ ఇచ్చింది. కాగా ఈ తరహా గైర్హాజరు ఇది తొలిసారేమీ కాదు. అంతకుముందు కూడా అనారోగ్యం పేరుతో ‘సర్’ అంశంపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. థరూర్ గైర్హాజరీపై పార్టీలో ప్రశ్నలు తలెత్తడానికి ప్రధాన కారణం అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు పెట్టారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతపై థరూర్ చేసిన బహిరంగ ప్రశంసలు కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత విభేదాలకు దారితీశాయి. ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారతదేశాన్ని ఉద్భవిస్తున్న మోడల్‌గా మార్చాలనే మోదీ ఆలోచనను థరూర్ కొనియాడారు. ముఖ్యంగా, వలసవాద బానిస మనస్తత్వంను రూపుమాపడం, భాష, సంస్కృతి, వారసత్వం ద్వారా జాతీయ గౌరవాన్ని పెంపొందించడంపై మోదీ దృష్టి సారించడాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని పలువురు నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ సమయంలో థరూర్ తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం మాత్రమే ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్‌లోనే ఉంటానని థరూర్ ఎంత గట్టిగా చెబుతున్నా, ఆయన తీరుతెన్నులు, అభిప్రాయాలు పార్టీలో అంతర్గత విభేదాలకు కారణంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ కీలక సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం, ప్రధానిని బహిరంగంగా ప్రశంసించడం తదితర చర్యలు ఆయన త్వరలో కాంగ్రెస్ గూటిని వీడతారేమో అనే సందేహాన్ని మరింతగా పెంచుతున్నాయి. ప్రస్తుతానికి థరూర్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఆయన పార్టీని వీడుతారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్ -
‘బంగ్లా’లో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా
ఢాకా: పొరుగుదేశం బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాపై నేడు (గురువారం) కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగ్లాదేశ్.. కాల్పులు, దేశీయ బాంబు దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇది 2024లో చోటుచేసుకున్న విద్యార్థి నిరసనలను తలపించింది. నాడు జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతిచెందారు.రాజధాని ఢాకా గురువారం పటిష్టమైన కోటగా మాదిరిగా మారింది. హసీనాకు చెందిన ‘అవామీ లీగ్ ’ ఢాకా లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సభ్యులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద బహుళ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా రవాణాను అణువణువునా తనిఖీ చేస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండే రోడ్లలో నిశ్శబ్దం నెలకొంది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, ఆమె సహాయకులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల కేసులో నేడు (నవంబర్ 13)న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో భారతదేశానికి చేరుకున్న హసీనా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హత్య, కుట్రతో పాటు పలు ఆరోపణలున్నాయి.కాగా తాజాగా జరిగిన అల్లర్లలో నిరసనకారులు బ్రహ్మన్బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి, అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ముహమ్మద్ యూనస్ ఈ గ్రామీణ బ్యాంకును స్థాపించారు. నిరసనకారులు రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు బస్సులను తగులబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయని, ముగ్గురు గాయపడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి.రాజకీయ కార్యకలాపాల నుంచి నిషేధించిన హసీనా ‘అవామీ లీగ్’కు చెందిన 44 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఢాకా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నారాయణగంజ్‌లో, పార్టీకి చెందిన మరో 29 మంది నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని ఒక ఇంటి నుండి పెద్ద మొత్తంలో ముడి బాంబులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: Bihar Election: నితీష్ ఇంటి ముందు ‘టైగర్’ పోస్టర్ -
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
-
మళ్లీ పాక్ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘనవిజయం సాధించిందని చెబుతూ, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది.పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్‌పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ‘ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్’ అనే పేరుతో, పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో, ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.కాగా పాక్ విషప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర మీడియా, విశ్లేషకులు, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి. ‘వాస్తవాలను వక్రీకరిస్తూ, జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరం’ అని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి. ఉపగ్రహ చిత్రాలు, స్వతంత్ర మీడియా రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమయ్యింది. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర.. విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
Bihar: ప్రధాని మోదీ దివంగత తల్లికి మళ్లీ అవమానం.. వీడియోను షేర్ చేసిన ఉపముఖ్యమంత్రి
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన బీహార్ అధికార్ యాత్ర లో ప్రధాని మోదీ దివంగత తల్లిని మళ్లీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఈ సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది బీహార్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. కాగా దీనిపై ఆర్జేడీ ఇంకా అధికారిక ప్రతిస్పందన వెల్లడించలేదు.తేజస్వి యాదవ్ పర్యటనలో ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషను ఉపయోగించారని బిజెపీ ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ అరోపణలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తేజస్వి యాదవ్ కార్యకర్తల వేధింపుల తీరును ప్రోత్సహిస్తున్నారని, ఈ తరహా ప్రవర్తన బీహార్ సంస్కృతిని నాశనం చేస్తున్నదని రాశారు. బీహార్‌లోని మహిళలు ఈ అవమానంపై ప్రజాస్వామ్య రీతిలో ప్రతిస్పందించాలని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. तेजस्वी यादव ने फिर दिलवाई- मोदी जी की मृत माताजी को गाली। इन्होंने बिहार की संस्कृति को एक बार फिर तार-तार कर दिया।रैली में आरजेडी के कार्यकर्ता जितना ही गाली दे रहे, तेजस्वी उतना ही हौसला बढ़ा रहे थे। इस गुंडई की मानसिकता और गाली का हिसाब बिहार की माताएँ-बहनें जरूर करेंगी। pic.twitter.com/p4TNr4J20V— Samrat Choudhary (@samrat4bjp) September 20, 2025ఈ ఘటనను ప్రజాస్వామ్యానికి జరిగిన తీవ్ర అవమానంగా చౌదరి అభివర్ణించారు. మహిలలను అవమానించడం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారిందా? అని ప్రశ్నించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రతిస్పందన తెలియజేశారు. తేజస్వి యాదవ్ తన పర్యటనలో ప్రధాని మోదీ దివంగత తల్లిపై దుర్భాషలాడారని అన్నారు. ఈ రకమైన రాజకీయాలు ఆమోదయోగ్యం కాదని, దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాగా బీజేపీ ఆరోపణలపై ఆర్జేడీ నుండి అధికారిక స్పందన రాలేదు. కాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సెప్టెంబర్ 16న జెహానాబాద్ నుండి తన బీహార్ అధికార్ యాత్రను ప్రారంభించారు. యాత్రలోని మొదటి దశ నలంద, బెగుసరాయ్ తదితర ప్రాంతాల గుండా సాగి, సెప్టెంబర్ 20న వైశాలిలో ముగిసింది. -
ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వుల జారీపై వెనుకంజ
న్యూఢిల్లీ: వివిధ ట్రిబ్యునళ్లలోని నాన్ జ్యుడీషి యల్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడానికి ఇష్టపడటం లే దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేందుకు కృషి చేయా లని వారిని కోరారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)–2025 ఆలిండియా కాన్ఫరెన్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిబ్యునళ్లలోని పలు సమ స్యలు, దేశంలోని న్యాయవ్యవస్థ తీరు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్, పీఎంవోలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపా లనా ట్రిబ్యునళ్లు న్యాయస్థానాలకు భిన్నంగా ఉంటాయని, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య వీటికి ఒక ప్రత్యేకత ఉందన్నా రు. ట్రిబ్యునళ్లలోని సభ్యులు కొందరు పరి పాలనా విభాగానికి చెందిన వారైతే మరికొందరు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన వారని తెలిపారు. ‘ఒక న్యాయమూర్తిగా, నేను వ్యక్తి గతంగా గమనించిందేమంటే.. పరిపాలనా విభాగాల నుంచి వచ్చిన ట్రిబ్యునళ్ల సభ్యులు కొందరు తమ పూర్వ అనుభవాలను మర్చిపోవడం లేదు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏదైనా ఉత్తర్వును జారీ చేయడానికి ఇష్టపడటం లేదు. వీరి ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నా’అని సీజేఐ అన్నారు. వీరి కోసం న్యాయ విద్యావేత్తలతో వర్క్‌షాపులు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నానన్నారు. ట్రిబ్యునళ్లలో సభ్యుల నియామకం, సర్వీసు నిబంధనల విషయంలో ఏకీకృత ప్రక్రియను తీసుకువస్తే బాగుంటుందన్నారు. -
6ఏ నోటీసులపై భగ్గుమన్న రైతులు
నక్కపల్లి: రైతుల ఆమోదం లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం బల్‌్కడ్రగ్ పార్కుకు అదనపు భూ సేకరణ చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు కోసం అదనంగా 197 ఎకరాల భూమిని సేకరించడానికి మేలో ప్రభుత్వం 6ఏ నోటీసు ప్రకటన విడుదలచేసి అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది. అయితే, భూములిచ్చేది లేదంటూ రైతులు పలుమార్లు నిరసన తెలిపినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై వారంతా రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలో.. శనివారం వైఎస్సార్సీపీ, సీపీఎంల మద్దతుతో రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల ఎకరాలను బల్క్‌డ్రగ్ పార్కు కోసం కేటాయిస్తే మరో 700 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇందులో 197 ఎకరాలు జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం రెవెన్యూ పరిధిలో తీసుకోవడానికి పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ.. రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.జజిల్లాలో ఎక్కడాలేని విధంగా హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కపల్లి మండలంలోనే వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు కంపెనీలకు భూములిచ్చేస్తే వాటిపై వచ్చే తక్కువ పరిహారంతో ఎలా బతుకుతారని వారు ప్రశ్నించారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. వచ్చేనెల 6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకుని నిరసన తెలియజేస్తామని వారు స్పష్టంచేశారు. పలువురు టీడీపీ నేతలు కూడా భూములు ఇవ్వబోమంటూ తహశీల్దార్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. -
తిరగబడ్డ ఆడబిడ్డ.. కూటమి విఫల పాలనపై ఆగ్రహజ్వాలలు (చిత్రాలు)
-
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం


