ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 05-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి

Aug 5 2026 3:05 AM | Updated on Aug 5 2026 3:05 AM

Rasi Phalalu: Daily Horoscope On 05-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం, తిథి: బ.సప్తమి సా.5.41 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: అశ్వని రా.7.25 వరకు, తదుపరి భరణి, వర్జ్యం:  ప.3.34 నుండి 5.06 వరకు, తిరిగి తె.4.34 నుండి 6.05 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.32 వరకు, అమృత ఘడియలు: ప.12.30 నుండి 2.01 వరకు.

సూర్యోదయం : 5.43
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం.... శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృషభం... బంధువులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కుటుంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం..... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం... కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా  బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

కన్య..... కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు.

తుల.... చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం... రుణాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు.. వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

మకరం.... కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం.. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం... ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు. కొన్ని అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. మానసిక అశాంతి. వృత్తులు, వ్యాపారాలలో చికాకులు. దైవదర్శనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement