గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.తదియ రా.9.27 వరకు తదుపరి చవితి, నక్షత్రం: శతభిషం రా.8.17 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.2.48 నుండి 4.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.24 వరకు, అమృత ఘడియలు: ప.12.46 నుండి 2.26 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: బాకీలు వసూలవుతాయి. వస్తు,వస్త్రలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో ఉన్నతి.
వృషభం: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
మిథునం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గౌరవం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పై హోదాలు దక్కుతాయి.
తుల: మిత్రులతో కొద్దిపాటి విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చికం: ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.
ధనుస్సు: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మకరం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు.ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మీనం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉండవచ్చు.


