గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పాడ్యమి రా.8.30 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: శ్రవణం సా.5.53 వరకు, తదుపరి ధనిష్ఠ,వర్జ్యం: రా.10.07 నుండి 11.49 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.41 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు, అమృత ఘడియలు: ఉ.6.40 నుండి 8.22 వరకు.
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం: ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.
మిథునం: పనులలో ఆటంకాలు. ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా కొంత ఇబ్బంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అయోమయ పరిస్థితి.
కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మరింత సానుకూలం.
సింహం: వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.
కన్య: విద్యార్థులకు శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. దైవచింతన.
తుల: సోదరుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
వృశ్చికం: కొత్త పనులు ప్రారంభం. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. కళాకారులకు సన్మానాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
ధనుస్సు: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మకరం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. తీర్థయాత్రలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. సోదరుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
మీనం: బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వాహనయోగం. వ్యాపారాలు, ఉధ్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.


