గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: పౌర్ణమి రా.7.17 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఉత్తరషాఢ సా.3.59 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.8.18 నుండి 10.01వరకు, దుర్ముహూర్తం: ప.11.39 నుండి 12.31 వరకు, అమృత ఘడియలు: ఉ.8.58 నుండి 10.43 వరకు, గురు పౌర్ణమి.
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
వృషభం.... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
మిథునం.... అదనపు ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు కొన్ని ముందుకు సాగవు. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
కర్కాటకం.... చేపట్టిన పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
సింహం.... వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆలయ దర్శనాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య....... బంధువులతో మాటపట్టింపులు.ప్రయాణాలలో మార్పులు. చేపట్టిన పనులలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
తుల... ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో పనిఒత్తిళ్లు.
వృశ్చికం.... సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
ధనుస్సు... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులలో ప్రతిష్ఠంభన. ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో కొద్దిపాటి ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం.
మకరం.... ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.
కుంభం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.
మీనం... నూతన వరిచయాలు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. వాహనయోగం. దైవదర్శనాలు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.


