గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.42 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పూర్వాషాఢ ప.1.43 వరకు, తదుపరి ఉత్తరషాఢ,వర్జ్యం: రా.10.28 నుండి 12.13 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.43 వరకు,అమృత ఘడియలు: ఉ.8.24 నుండి 10.10 వరకు.
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం.. మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
వృషభం... వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. కళాకారులకు ఒత్తిడులు.
మిథునం... చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విందువినోదాలు.
కర్కాటకం....కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో విజయం. బంధువులతో సఖ్యత. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
సింహం... రుణబాధలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
కన్య... ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఖర్చులు అధికం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.
తుల... నూతన పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చికం... కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
ధనుస్సు... సోదరులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..
మకరం.... ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..
కుంభం.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
మీనం.. పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు.


