గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.విదియ రా.9.14 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ధనిష్ఠ రా.7.20 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.2.49 నుండి 4.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: ఉ.8.19 నుండి 10.01 వరకు.
సూర్యోదయం : 5.41
సూర్యాస్తమయం : 6.31
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానయోగం.
వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం: కుటుంబ సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
సింహం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. విందువినోదాలు..
కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
తుల: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఆలయ దర్శనాలు.
ధనుస్సు: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: చేపట్టిన పనుల్లో కొద్దిపాటి అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ. దైవచింతన.
మీనం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వాహన, గృహయోగాలు.


