ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 03-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు

Aug 3 2026 1:12 AM | Updated on Aug 3 2026 1:12 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-08-2026 In Telugu

 గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పంచమి రా.8.23 వరకు, తదుపరి షష్ఠి,నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.44 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.6.19 నుండి 7.54 వరకు, దుర్ముహూర్తం:  ప.12.30 నుండి 1.22 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృత ఘడియలు: ప.3.54 నుండి 5.30 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం     :  6.29
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం: ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. బంధువుల

మిథునం: దూరపు బంధువుల కలయిక. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు.

కర్కాటకం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

సింహం: ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. కార్యజయం. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి.

తుల: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. కార్యజయం. శుభవార్తలు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు పురస్కారాలు.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబంలో మరిన్ని బాధ్యతలు తప్పవు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. తీర్థయాత్రలు.  వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది..

మకరం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళాకారులకు సత్కారాలు.

కుంభం: వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం. ఆధ్యాత్మిక చింతన.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విందువినోదాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement