మేషం...
ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి తరచూ ధనలాభాలు కలిగే సూచనలున్నాయి. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరణ, పురోగతిలో స్వీయనిర్ణయాలు మంచిది. ఉద్యోగాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దేవీస్తుతి మంచిది.
వృషభం...
అన్ని విధాలా విశేషయోగదాయకమైన కాలం. ఆర్థికంగానూ, సామాజికంగానూ బలపడతారు. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై ప్రేమానురాగాలు చూపుతారు. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అకారణ ఆహారవిహారాదులకు స్వస్తి చెప్పండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కష్టాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యసా«దనలో ముందుకు సాగుతారు. వారం మధ్యలో బంధువులతో విభేదాలు. మానసిక ఆందోళన. నీలం, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం...
ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మాటల నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకోవడం సంతోషం కలిగిస్తుంది. సేవాతత్పరతతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం అందుకోనున్నారు. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం...
వ్యవహారాలు పూర్తి కావడంలో సోదరులు సహకరిస్తారు. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనలాభం ఉండవచ్చు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. భూములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్నివిధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. గులాబీ, ఎరుపు రంగులు. . విష్ణుధ్యానం చేయండి.
సింహం...
పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఒక ప్రధాన సమస్య తీరి ఒడ్డునపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థనీయంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య...
ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొన్నా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆస్తిలాభ సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల బారి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, వైద్యరంగం వారి సేవలు విస్తృతమవుతాయి. వారం చివరిలో అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల...
అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. సోదరులు, మిత్రుల ప్రోత్సాహంతో కీలక విషయాలలో ముందడుగు వేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించినస్థాయిలో లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిíß తులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే సూచనలు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు...
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో ఆదరణ మరింత పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, గులాబీ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చికాకు పరుస్తాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కొత్త సమస్యలు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు. తెలుపు, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం...
పరిస్థితులను క్రమేపీ అనుకూలంగా మలచుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అత్యంత నేర్పుగా శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మీనం....
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. భూముల కొనుగోలులో వివాదాలు సర్దుకుంటాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలో కీర్తి గడిస్తారు. ఎన్నడో పోగొట్టుకున్న కొన్ని డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.


