ఏపీలో ఏడాది కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని.. ఆడబిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టమని చంద్రబాబుకు హితవు పలుకుతూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించింది. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.


