కర్ణాటక రాజకీయాలు కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా నడిచాయి. ఆ రాష్ట్ర సీఎం మార్పు జరగనుందంటూ ఊహాగానాలు రేగడం దానిని బలపరూస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడంతో కొద్దికాలం పాటు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. అయితే సీఎం మార్పు అంశంలో తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రాష్ట్రంలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కొద్దికాలం పొలిటికల్ వార్ జోరుగానే సాగింది. ఐదేళ్లకు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని సిద్ధరామయ్య అనగా ఇచ్చిన మాట కంటే గొప్పది మరోటి లేదని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంట్రీతో ఇద్దరు నేతలు కొంత తగ్గి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని తెలపడంతో సీఎం కుర్చీ వార్‌కు కొద్దిగా చల్లబడిందని పొలిటికల్ వర్గాలు భావించాయి.
అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోకా సీఎం మార్పుపై అసెంబ్లీలో సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. "ప్రజలు మమ్మల్ని దీవించారు. అనంతరం ఎమ్మెల్యేలలంతా నన్ను నాయుకుడిగా ఎన్నుకున్నారు.ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే తదనంతరం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని సిద్ధరామయ్య అన్నారు. అసలు తానేప్పుడు రెండున్నర సంవత్సరాల సీఎం ఒప్పందం గురించి చెప్పలేదని అసలు అలాంటి అగ్రిమెంటే జరలేదన్నారు.
అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమ వర్గం నాయకులకు ప్రత్యేక వింధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. గత నెలతో రెండున్నరేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం మారనున్నారని జోరుగా ప్రచారం నడిచింది.


