
ట్రిబ్యునళ్లలోని నాన్ జ్యుడీషియల్ సభ్యులపై సీజేఐ వ్యాఖ్య
న్యూఢిల్లీ: వివిధ ట్రిబ్యునళ్లలోని నాన్ జ్యుడీషి యల్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడానికి ఇష్టపడటం లే దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేందుకు కృషి చేయా లని వారిని కోరారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)–2025 ఆలిండియా కాన్ఫరెన్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ట్రిబ్యునళ్లలోని పలు సమ స్యలు, దేశంలోని న్యాయవ్యవస్థ తీరు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్, పీఎంవోలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపా లనా ట్రిబ్యునళ్లు న్యాయస్థానాలకు భిన్నంగా ఉంటాయని, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య వీటికి ఒక ప్రత్యేకత ఉందన్నా రు. ట్రిబ్యునళ్లలోని సభ్యులు కొందరు పరి పాలనా విభాగానికి చెందిన వారైతే మరికొందరు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన వారని తెలిపారు.
‘ఒక న్యాయమూర్తిగా, నేను వ్యక్తి గతంగా గమనించిందేమంటే.. పరిపాలనా విభాగాల నుంచి వచ్చిన ట్రిబ్యునళ్ల సభ్యులు కొందరు తమ పూర్వ అనుభవాలను మర్చిపోవడం లేదు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏదైనా ఉత్తర్వును జారీ చేయడానికి ఇష్టపడటం లేదు. వీరి ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నా’అని సీజేఐ అన్నారు. వీరి కోసం న్యాయ విద్యావేత్తలతో వర్క్‌షాపులు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నానన్నారు. ట్రిబ్యునళ్లలో సభ్యుల నియామకం, సర్వీసు నిబంధనల విషయంలో ఏకీకృత ప్రక్రియను తీసుకువస్తే బాగుంటుందన్నారు.