చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? | Religious Tolerance Mob Attacks Social Harmony | Sakshi
Sakshi News home page

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా?

Nov 21 2026 12:46 AM | Updated on Nov 21 2026 12:46 AM

Religious Tolerance Mob Attacks Social Harmony

ఇన్‌ బాక్స్‌

మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, సర్వమత సమ భావానికి నిలయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఎవరి నమ్మకాల్ని వారు ఆచరించుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అయితే, ఇటీవలి కాలంలో వివిధ మతా లకు చెందిన వ్యక్తులపై, ముఖ్యంగా మత ప్రచార నిమిత్తమో లేక వ్యక్తిగత పనులపై వివిధ ప్రాంతాలకు వెళ్ళే మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ కోవకే చెందిన ఒక సంఘటనలో, మత ప్రచారం కోసం వెళ్లిన కొందరు యువతులపై జరి గిన భౌతిక దాడి, మన సామాజిక జీవనంలో నైతిక క్షీణతకూ, అసహనం పెరిగిపోతున్న తీరుకూ అద్దం పడుతోంది. సమాజంలో పరమత సహనం క్రమంగా కరిగిపోతోంది. ఒకరి భావాలనూ, ఆచారా లనూ గౌరవించే సంస్కృతి మరుగున పడి, క్షణికా వేశంతో దాడులకు తెగబడే సంస్కృతి వేళ్లూనుకుంటోంది. చట్టాన్ని చేతిలోకి తీసు కునే హక్కు ఎవరికీ లేదన్న కనీస స్పృహ కోల్పోయి మూక దాడి సంస్కృతి విజృంభిస్తుండటం ప్రమాదకర పరిణామం.

సోషల్‌ మీడియా, అందులోని తప్పుడు సమాచారాలూ పోషిస్తున్న పాత్ర వినాశకరమైనది. ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు దాని వాస్తవ సత్యాలను నిర్ధారించుకోకుండా, కేవలం అనుమానాల ఆధారంగా రెచ్చ గొట్టే ధోరణి పెరిగింది. చట్టపరమైన మార్గాలను ఆశ్రయించకుండా మహిళలని కూడా చూడకుండా భౌతిక దాడికి దిగడం ఏ నాగరిక సమాజం కూడా హర్షించని విషయం. ఈ తరహా ఘటనలు దేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీయడమే కాకుండా, శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తాయి. హింస ఏ రూపంలో ఉన్నా అది సహించలేని నేరమే. బాధ్యులపై కఠిన చర్యలు తీçసుకుంటే  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవు.

అయితే, కేవలం చట్టపరమైన చర్యలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించదు. గ్రామస్థాయి నుంచీ పట్టణాల వరకూ ప్రజల్లో మత సామ రస్యంపైనా, పరస్పర అవగాహనపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువత ఉద్వేగాలకు లోనుకాకుండా, విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకునేలా విద్యా విధానంలోనూ, కుటుంబ వాతావరణంలోనూ మార్పు తేవాలి. శాంతి, సహనం, మానవత్వం లేని సమాజం ఎంత పురోగతి సాధించినా అది వ్యర్థమే. ఆప్యాయతలూ, అనురాగాలూ పంచాల్సిన ఈ గడ్డపై ద్వేషం శాసించకుండా చూసే బాధ్యత మన అందరిపై ఉంది.
– టి. భాగ్యశ్రీ ‘ లా స్టూడెంట్, హైదరాబాద్‌

ఇదీ చదవండి: ‘గేమ్‌ ఆడండి.. మీ జీవితంతో ఆడుకోవద్దు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement