breaking news
National News
-
‘కాక్రోచ్‌గా మారిపోవాలేమో!’.. మాల్యా సంచలన వ్యాఖ్యలు
బ్యాంకు రుణాల ఎగవేత, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవహారం, మనీలాండరింగ్ ఆరోపణలతో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న ఆయన.. తనపై భారత ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా మరోసారి ఆరోపణలు చేశారు. తన ఆస్తులు, నిధుల నుంచి బ్యాంకులకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్‌లో వరుస పోస్టులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మాల్యా చేసిన ఓ వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. తనపై జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఎదుర్కొంటున్న, ఇప్పటికీ ఎదుర్కొంటున్న అన్యాయాలన్నింటినీ చూస్తుంటే.. నేను కాక్రోచ్‌గా మారిపోవాలేమో అనిపిస్తోంది. బహుశా కాక్రోచ్ వైపు జీవితం మెరుగ్గా ఉండొచ్చు’’ అని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరు ప్రస్తావనకు వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత చేసిన బొద్దింకల వ్యాఖ్యల నేపథ్యంలో సెటైరిక్ క్యాంపెయిన్‌గా పుట్టుకొచ్చింది సీజేపీ, అభిజిత్ దీప్కే నేతృత్వంలో పుట్టిన ఈ పార్టీ.. ఆ తర్వాత జంతర్ మంతర్ నీట్ నిరసనలతో దేశం చూపును ఒక్కసారిగా తమ వైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ‘కాక్రోచ్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ మాల్యా చేసిన కామెంట్ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.With all the injustices I have faced and continue to face, I wonder if I should become a cockroach. Maybe a better life on the cockroach side.— Vijay Mallya (@TheVijayMallya) September 9, 2026రూ.14 వేల కోట్లపై మాల్యా వాదనతనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మాల్యా ఈడీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. బాంబే హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్లో.. తన నుంచి రూ.14 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులు, నిధులను స్వాధీనం చేసుకుని, వాటిని తాను బకాయిపడిన బ్యాంకులకు చెల్లించినట్లు పేర్కొందని ఆయన అన్నారు. 2021లోనే ఈ మొత్తాన్ని బ్యాంకులకు అందించినట్లు తెలిపారు.‘‘నా మాటలను నమ్మకపోతే పర్వాలేదు. కోర్టులో ఈడీ ఏం చెప్పిందో చూడండి’’ అంటూ తన వాదనకు మద్దతుగా మాల్యా పేర్కొన్నారు. తనపై భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికే తన ఆస్తులు, నిధుల నుంచి పెద్ద మొత్తంలో బ్యాంకులకు చెల్లింపులు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.కింగ్‌ఫిషర్ ఉద్యోగులకూ చెల్లింపులుకింగ్ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయాన్ని కూడా మాల్యా ప్రస్తావించారు. ఈడీ అటాచ్ చేసిన తన నిధుల నుంచి రూ.350 కోట్లకు పైగా విడుదల చేసి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. తన వద్ద నిధులు ఉన్నప్పటికీ.. అవి ఈడీ అటాచ్ చేయడంతో తాను నేరుగా చెల్లింపులు చేయలేకపోయానని వివరించారు.ఇదే సందర్భంగా తన నివాసం, పౌరసత్వం, భారత్‌కు తిరిగి రావడం వంటి అంశాలపై వస్తున్న విమర్శలకు మాల్యా వివరణ ఇచ్చారు. బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా ఉండటం, అక్కడి పౌరసత్వం కలిగి ఉండటం రెండూ ఒకటి కాదని చెప్పారు. అలాగే బ్యాంకులకు బకాయిలు చెల్లించడానికి తాను తప్పనిసరిగా భారత్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.‘భగోడా’ వ్యాఖ్యలపైనా స్పందనభారత్కు తిరిగి రావడం లేదంటూ తనను ‘భగోడా’(పరారీలో ఉన్న వ్యక్తి) అని విమర్శిస్తున్న వారిపైనా మాల్యా ఇటీవల స్పందించారు. తాను 1992 నుంచే బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదాలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి బయటకు వెళ్లకుండా తనపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తనపై తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. 2026 ఫిబ్రవరిలోనూ మాల్యా ఇదే విషయాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటన్ కోర్టుల ఆంక్షల కారణంగా ఇంగ్లండ్, వేల్స్ నుంచి బయటకు వెళ్లలేనని చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా దాన్ని కలిగి ఉండటం కూడా తనకు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత, మోసం, మనీలాండరింగ్, ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాల్యా భారత్‌లో పలు కేసులు ఎదుర్కొంటున్నారు. 2015లో ఐడీబీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత మాల్యాపై పలు కేసులు నమోదయ్యాయి. న్యాయపరమైన ఒత్తిడి పెరుగుతున్న సమయంలో 2016 మార్చిలో ఆయన భారత్ విడిచి బ్రిటన్ వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయనను భారత్‌కు తీసుకురావడం, బ్యాంకుల బకాయిలు వసూలు చేయడం వంటి అంశాలపై భారత్, బ్రిటన్లలో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.అయితే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను మాల్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ‘కాక్రోచ్’ వ్యాఖ్యతో మరోసారి తనపై జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్నదంతా అన్యాయమేనన్న భావనతోనే ఈ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఆమె రీ ఎంట్రీకి ఇదే మాంచి ఛాన్స్! -
బెంగాల్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్లో కొత్త సస్పెన్స్‌కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్ లేదంటే రిజినగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్ కబీర్ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్, రిజినగర్ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముర్షిదాబాద్ జిల్లాలోని రిజినగర్లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.ఈసీ షెడ్యూల్ ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 6న నందిగ్రామ్, రిజినగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మరో సస్పెన్స్!ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్ ఘోష్ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్ -
తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది కరెక్టే: స్టాలిన్
అసెంబ్లీ వేదికగా స్టాలిన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘అవినీతి’ ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. అలాగే స్టాలిన్‌పైనా విజయ్ బాడీ షేమింగ్ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో స్టాలిన్ వాటిపై స్పందించారు. తన తండ్రి, డీఎంకే మాజీ సీఎం కరుణానిధి హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. ‘‘తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది నిజమే. అబద్ధం కాదు’’ అంటూ ఈ ఉదయం ఓ వీడియోను రిలీజ్ చేశారాయన. తన తండ్రి కరుణానిధి, తనను విజయ్ టార్గెట్‌గా చేసుకోవడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తన దవడ వెనుక కథ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ సభ నిర్వహించి మీసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తుచేశారు. అనంతరం 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిందన్నారు. ఆ వెంటనే గోపాలపురం ఇంటికి పోలీసులు వచ్చి తనను మీసా కింద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.‘‘ఆ రోజు నేను ఇంట్లో లేను. నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు.. రేపు వస్తాడు. వచ్చిన వెంటనే నేనే ఫోన్ చేస్తా.. వచ్చి అరెస్టు చేసుకోండి’’ అంటూ కరుణానిధి పోలీసులను వెనక్కి పంపారని తెలిపారు. మరుసటి రోజు తాను ఇంటికి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులకు ఫోన్ చేసి తనను అరెస్టు చేయించారని చెప్పారు. జైల్లో తనను తీవ్రంగా హింసించారని స్టాలిన్ పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశంలో చిన్న గదిలో పది మందిని బంధించారని, అదే గదిలో ఒకే కుండను మూత్ర విసర్జనకు ఉపయోగించాల్సి వచ్చేదని వివరించారు. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా పోలీసులు లాఠీలతో కొట్టేవారని, బూట్లతో తన్నేవారని చెప్పారు. ఖైదీల దాడిలో ఎంపీ చిట్టిబాబు మరణించారని, తన దవడ ఎముక విరిగిందని తెలిపారు. నాటి దాడుల గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.‘‘మా సిద్ధాంత నాయకుడినని చెబుతున్నావు. పెరరింజర్ అన్నా(సి.ఎన్. అన్నాదురై) కాలం నుంచి ఇదే డీఎంకే చరిత్ర. అందులో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరెంత తక్కువ చేసి చూపించాలని చూసినా చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్ అన్నారు.సర్కారియా కమిషన్.. విజయ్‌కు మరో కౌంటర్అదే సమయంలో సర్కారియా కమిషన్, అవినీతి ఆరోపణలపైనా విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్కారియా కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే ఇన్నేళ్లలో తప్పకుండా చర్యలు జరిగేవని అన్నారు. ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కూడా విజయ్‌పై స్టాలిన్ విమర్శలు చేశారు. ఈడీ నమోదు చేసిన అనేక కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదని, నిందితులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని ఉపయోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ నేతలపైనా ఈడీ కేసులు పెట్టిన విషయాన్ని విజయ్ ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు.అసెంబ్లీని వివాదాలకు వేదిక చేయొద్దుతమిళనాడు అసెంబ్లీకి ఎంతో గౌరవం, చరిత్ర ఉందని.. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్టాలిన్ సూచించారు. శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తమిళనాడు హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. అనవసర వివాదాలను అసెంబ్లీలోకి తీసుకురావద్దని విజయ్‌కు హితవు పలికారు.విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై విజయ్ తీవ్ర విమర్శలు చేశానని ఆయన చెప్పగా.. ‘‘పర్లేదు తమ్ముడూ.. వాటిని మనసులో పెట్టుకోను’’ అని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ పదవికి తగ్గ హుందాతనం కనిపించాలని సూచించారు.‘సినిమా షూటింగ్‌లా పాలన’విజయ్ ప్రభుత్వ పనితీరుపైనా స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము నిర్మించిన వంతెనపై నిలబడి ఫొటోషూట్లు చేయడం, అసెంబ్లీని రీల్స్‌కు వేదికగా మార్చడం సరికాదన్నారు. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి తమిళనాడు అభివృద్ధిని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రైతులకు పూర్తి రుణమాఫీ, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సాయం వంటి హామీల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు.‘‘అప్పుడు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మార్పు కావాలని ఓటేసిన యువత ఇప్పుడు నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో గమనిస్తోంది’’ అని స్టాలిన్ అన్నారు.అధికారం లేకున్నా ప్రజల కోసం పోరాటమేచివరగా డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు పూర్తిగా తమకు మద్దతు ఇవ్వకపోవడంతో అధికారంలోకి రాలేకపోయామని, కానీ ప్రభుత్వం చేసే తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘‘మనకేం సంబంధం’’ అనే ధోరణి ఉండకూడదన్నారు. అధికారంలో ఉండటం, లేకపోవడం రెండూ ప్రజాసేవలో భాగమేనని పేర్కొన్నారు. తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘వాళ్ల(ప్రజలను ఉద్దేశించి..) తాతల కోసం పోరాడాం. వాళ్ల తండ్రుల కోసం పోరాడాం. ఇప్పుడు వాళ్ల కోసం పోరాడతాం. ఇదే డీఎంకే చరిత్ర. ఆ చరిత్ర ఎప్పటికీ మారదు.. మారకూడదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8— M.K.Stalin (@mkstalin) September 10, 2026సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో పోలీస్ శాఖపై చర్చకు సీఎం విజయ్ సమాధానం ఇస్తూ.. ఎమర్జెన్సీ–MISA అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో దవడ దగ్గర చేతితో హావభావం చేశారు. ఈ సైగపై డీఎంకే నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల దాడిలో దవడ విరిగిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని ఆరోపించారు. వామపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం.. స్టాలిన్ గాయాన్ని హేళన చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అయితే దీనిపై సెప్టెంబర్ 8న విజయ్ వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీజేపీకి చెక్ పెట్టేందుకే విజయ్‌కు తోడుగా.. -
విజయ్ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్‌దే అని నేతలు స్పష్టం చేశారు.వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్..ఇటీవల ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్‌సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్ మాత్రం టీవీకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్‌లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.వామపక్షాలు మాత్రం దూరం..కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది. అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్ నిర్మాణం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. అయితే విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: గెట్ రెడీ ఫర్ సీబీఐ రైడ్స్! -
శబరిమలలో ఇకపై రోజుకు 5 సార్లు పడిపూజ..!
కేరళ: శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీలో విజిలెన్స్ అధికారులు భారీ ఆర్థిక వ్యత్యాసాలను గుర్తించారు. ప్రసాదం కొరతగా ఉండటం, అలాగే పాడైన ప్రసాదం పేరుతో నమోదు చేసిన లెక్కలకు వాస్తవ పరిస్థితులకు మధ్య తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిన విషయాలను అధికారులు దేవస్థానం ప్రత్యేక కమిషనర్‌కు చేరవేయగా వాటిని కేరళ హైకోర్టుకు నివేదిక రూపంలో సమర్పించారు.విజిలెన్స్ అధికారుల వివరాల ప్రకారం.. ప్రసాదం కొరతను చూపించేందుకు పెద్ద మొత్తంలో అరవణ, అప్పం పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, అధికారులు ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డుల్లో పేర్కొన్న స్థాయిలో ప్రసాదం ధ్వంసమైనట్లు నిర్ధారించే భౌతిక ఆధారాలు కనిపించలేదని తెలిపారు. దీంతో రికార్డుల్లోని వివరాలపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అరవణకు సంబంధించి మొత్తం 7,594 టిన్లు పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు ₹7,59,400గా లెక్కించారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో అరవణ ధ్వంసమై ఉంటే అందుకు సంబంధించిన ఇతర భౌతిక ఆధారాలు ఉత్పత్తి కేంద్రంలో కనిపించాల్సి ఉంటుందని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.అదే విధంగా అప్పం పంపిణీలోనూ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఉన్నట్లు విచారణలో తేలింది. సుమారు ₹1,21,365 విలువైన 2,697 అప్పం కవర్లు పాడైపోయినట్లు లేదా ధ్వంసమైనట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ, ఉత్పత్తి కేంద్రంలో పరిశీలించిన పరిస్థితులు మాత్రం ఈ గణాంకాలకు భిన్నంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారం 2025 మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌కు సంబంధించినవిగా తెలుస్తోందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో శబరిమలలో అరవణకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో భక్తులకు ఒక్కొక్కరికి గరిష్టంగా ఐదు అరవణ టిన్లు మాత్రమే విక్రయించేలా పరిమితి విధించగా, అదే సమయంలో పెద్ద సంఖ్యలో అరవణ పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు కావడం పలు ప్రశ్నలకు దారితీసిందని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.ఆటోమేటెడ్ విధానంలో అరవణ, అప్పం తయారవుతున్నందున సాధారణంగా ఉత్పత్తి సమయంలో పాడయ్యే ప్రసాదం పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని అధికారుల పరిశీలనలో తేలింది, అయితే, ఇంత పెద్ద మొత్తంలో అరవణ టిన్లు, అప్పం కవర్లు పాడైనట్లు రికార్డుల్లో నమోదు కావడం సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఉందని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రసాదం లెక్కలు, నిల్వ, పంపిణీ విధానాలను అధికారులు మరింతగా పరిశీలించినట్లు సమాచారం.అయితే, విజిలెన్స్ విచారణలో గుర్తించిన లెక్కల ప్రకారం అరవణ, అప్పం విషయంలో మొత్తం ఆర్థిక వ్యత్యాసం సుమారు ₹8.8 లక్షలుగా అంచనా వేయగా, రికార్డుల్లో చూపించిన ప్రసాదం నిజంగా ధ్వంసమైందా, లేదా ఇష్టానుసారంగా పంపిణీ జరిగిందా అనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో శబరిమల ప్రసాదం తయారీ నుంచి భక్తులకు పంపిణీ చేసే వరకు ప్రతి దశలో లెక్కలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ అధికారులు సూచించారు. ప్రసాదం నిల్వ, లెక్కలు, పంపిణీపై అంతర్గత నియంత్రణలను పటిష్టం చేయడంతో పాటు, విచారణలో గుర్తించిన అంశాలపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్‌పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్‌ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్‌ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్‌కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్‌ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం -
జైలు నుంచి వచ్చాక.. ఆ షుగర్ డాడీ పని పడతా!
భార్యపై అనుమానంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె తలను ఫ్రిడ్జిలో భద్రంగా దాచాడు. ఈ ఘటన దేశం మొత్తాన్ని నివ్వెర పోయేలా చేసింది. అయితే పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తాజాగా మీడియా ఎదుటే.. తన భార్యను చంపినందుకు బాధపడడం లేదని, బయటకు వచ్చాక మరో వ్యక్తిని చంపి తీరతానంటూ నిందితుడు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.అస్సాం రాజధాని గువాహటి(గౌహతి) సమీపంలో జరిగిన ఈ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య రియా తాలుక్దార్ (25)ను హత్య చేసి, ఆమె తలను నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు రమానుజ్ గోస్వామి. అయితే మంగళవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో హతిగావ్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ షుగర్ డాడీని చంపుతా’’ అంటూ హెచ్చరించాడు.అయితే ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించగా.. అతడు కోపంతో ఊగిపోయాడు. ‘‘నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. క్షమాపణ కూడా చెప్పను’’ అని చెప్పాడు. Wife murder accused Ramanuj Goswami allegedly showed no remorse over the killing of Riya Talukdar during questioning at Hatigaon Police Station.Ramanuj reportedly made shocking remarks and even threatened another person referred to as a “sugar daddy.”He also allegedly… pic.twitter.com/hY2uVDyELC— The Sentinel (@Sentinel_Assam) September 8, 2026భార్యపై అనుమానంతోనే?రియా, రమానుజ్లకు సుమారు ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని.. భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో రమానుజ్ వివాదానికి దిగేవాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో ఆవేశానికి లోనై రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనల క్రమాన్ని దర్యాప్తు ద్వారా నిర్ధారించాల్సి ఉంది.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలోని దంపతుల నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకు రెండ్రోజుల ముందు నుంచి.. కుటుంబ సభ్యులు వాళ్లకు కాంటాక్ట్ మిస్ అయ్యారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. శరీరం కొంత కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. తల కనిపించలేదు. ఇంట్లోని ఫ్రిజ్‌ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచిన రియా తలను గుర్తించారు. ఆమె వేళ్లు కూడా నరికిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులకు లొంగిపోయిన భర్తఘటన అనంతరం రమానుజ్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.‘షుగర్ డాడీ’ ఎవరు?షుగర్ డాడీ అంటే Sugar Daddy సాధారణంగా తనకంటే చిన్న వయసున్న వ్యక్తికి డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశచూపి లోబర్చుకోవడం. రమానుజ్ చేసిన తాజా వ్యాఖ్యలు.. ఈ కేసులో మరో కోణాన్ని తెరపైకి తెచ్చాయి. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమా? అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. పైగా ‘షుగర్ డాడీ’ని శిక్ష పూర్తయ్యాక తిరిగొచ్చి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి ఎవరు? రియాతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది? నిజంగానే అలాంటి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.పోలీసు కస్టడీకి అనుమతిరమానుజ్ను కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటన జరిగిన సమయం, నిందితుడి కదలికలు, ఆయుధం వినియోగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. -
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్‌పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్‌ను ఆమె ప్రస్తావించారు. తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ -
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన ఆరోపణలు తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విజయ్ ఆరోపణలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది.డీఎంకే హయాంలో లోన్ ఈఎంఐ తరహాలో లంచాలు తీసుకున్నారంటూ నిన్న సీఎం విజయ్ ఆరోపించారు. పార్టీ ఫండ్ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతూ.. ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికను ప్రస్తావించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరుల పేర్లను కూడా విజయ్ ప్రస్తావించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే విప్ ఈవీ వేలు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే విజయ్ ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఉన్నవేనని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.డీఎంకే డిమాండ్‌ను న్యాయశాఖ మంత్రి ఆర్.ఎన్. నిర్మల్‌కుమార్ కూడా వ్యతిరేకించారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు సర్కారియా కమిషన్ నివేదిక, ఈడీ అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గత డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ఆయన సమర్థించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ఆందోళనకు దిగారు. తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో నినాదాలు కొనసాగుతుండటంతో సభా నాయకుడు కేఏ సెంగొట్టయ్యన్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కూడా డీఎంకే సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని స్పీకర్ హెచ్చరించారు. ఒక నిమిషంలోపు సీట్లలో కూర్చుంటే కేఎన్ నెహ్రూ లేదా ఈవీ వేళుకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ డీఎంకే సభ్యులు వెనక్కి తగ్గలేదు.సభలో గందరగోళం.. అలాగే అనుమతి లేకుండా పోస్టర్లను సభలోకి తీసుకురావడంపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించడంతో.. చివరకు మార్షల్స్‌ను రంగంలోకి దించారు. స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. కొందరు సభ్యులు ప్రతిఘటించడంతో వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి.குழப்பவாதிகள் கூண்டோடு வெளியேற்றப்பட்டனர்‼️#TVK #Vijay pic.twitter.com/7saYzn4m3c— Vivek Rangasamy (@VivekRangasamy) September 8, 2026మరోవైపు, విజయ్ గత ప్రభుత్వంలోని అవినీతి అంశాలను ప్రస్తావించడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా సీఎం గతాన్ని తవ్వుతున్నారని విమర్శించారు. విజయ్ చేసిన ఆరోపణలు కోర్టులో నిరూపితం కానివేనని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. రాష్ట్రంలో వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికార టీవీకే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో సభలో వాగ్వాదం, నినాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్యమంత్రి విజయ్ ఘాటుగా బదులిస్తూ.. నేరస్తులు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ‘పార్టీ ఫండ్స్’ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపించడం సభలో మరింత వేడి పెంచింది.సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ కోరారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత మొదలైంది.దీనిపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నేరాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పోలీసులు మంచివారికి మిత్రులుగా, నేరస్తులకు శత్రువులుగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు.‘పోలీసులు పవర్ సెంటర్ కాకూడదు’పోలీసు వ్యవస్థ ప్రజలను భయపెట్టే పవర్‌సెంటర్‌గా మారకూడదని విజయ్ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని చెప్పారు. గత మూడు నెలల్లో జరిగిన నేరాలను ఒకేసారి జరిగిన ఘటనలుగా చూడటం సరికాదని, వాటిలో అనేకం పాత కక్షలు, ప్రతీకారాల కారణంగా జరిగినవేనని వివరించారు.డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, చెన్నైలో మూడు నెలల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద 330 కేసులు నమోదు చేసి 556 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకేపై విజయ్ సంచలన ఆరోపణలుశాంతిభద్రతల అంశంతో మొదలైన అసెంబ్లీ రచ్చ.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో మరింత ముదిరింది. తమపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని విపక్షాలు పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. విజయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాన్ని ప్రస్తావించారు.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టు విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు ‘పార్టీ ఫండ్స్’ పేరుతో వసూలు చేశారని** ఆయన ఆరోపించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలో ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాలను లంచాల రూపంలో వసూలు చేశారని ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు విజయ్ సభలో చదివి వినిపించారు.‘లంచాలు.. లోన్ ఈఎంఐల్లా వసూలు’ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి పేరును ప్రస్తావించిన విజయ్.. ఆయన నుంచి రూ.29 లక్షలు లంచంగా వసూలు చేసినట్లు ఈడీ నివేదికలో ఉందన్నారు. అయితే ఆ మొత్తం ఒక్కసారిగా తీసుకోలేదని.. లోన్ ఈఎంఐలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు. అంతేకాదు.. ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు ‘పార్టీ ఫండ్స్’కు ప్రత్యక్ష లబ్ధిదారులుగా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రవి ప్రసాద్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనవి కావని, ఈడీ పత్రంలో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు.సర్కారియా కమిషన్ నివేదిక ప్రస్తావనడీఎంకేపై అవినీతి ఆరోపణలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేందుకు విజయ్ సర్కారియా కమిషన్ నివేదికను కూడా ప్రస్తావించారు. వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన వ్యవహారంలో ‘పార్టీ ఫండ్’ పేరుతో 2.5 శాతం డిమాండ్ చేశారన్న ఆరోపణలు కమిషన్ నివేదికలో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో టెండర్ విలువ రూ.16 కోట్లుగా ఉందని తెలిపారు.2001లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి పొన్నయ్యన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని విజయ్ గుర్తుచేశారు. ‘కొంచెం లోతుగా పరిశీలిస్తే మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి’ అంటూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు.చివరకు వాకౌట్..విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేశారు. పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పోడియం చుట్టూ చేరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: డీ బాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ నేత -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
టీచర్స్‌డే.. ఐటెం సాంగ్!
టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్‌కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.డెహ్రాడూన్‌లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్‌లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు. కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026 -
ఆర్ఎస్ఎస్ అంటే విద్వేషమా? మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలంపై ఏళ్లుగా రాజకీయంగా తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య అనుబంధం, ఏకత్వ భావనే సంఘ్ ఆలోచనకు ఆధారమని ఆయన స్పష్టం చేశారు. అలాగే వైవిధ్యాన్ని గౌరవిస్తూ అందరూ కలిసి ముందుకు సాగడమే తమ దృక్పథమని చెప్పారు.ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు విద్వేషమే పునాది అనే విమర్శలను ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ ఖండించారు. లండన్‌లో జరిగిన ‘సెలబ్రేషన్ ఆఫ్ వన్నెస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విద్వేషం కాదు.. అందరినీ కలిపే భావనే ఆర్ఎస్ఎస్ పునాది అని, అదే తమ సంస్థ పనితీరుకు ఆధారమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నుంచి కుటుంబం, సమాజం, మానవాళి వరకు ఒకరితో ఒకరికి అనుబంధ భావన ఉండటమే హిందూ ఆలోచనా విధానమని భాగవత్ చెప్పారు. భిన్నత్వం సహజమేనని, అయితే దాని వెనుక ఉన్న ఏకత్వాన్ని గుర్తించి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ‘వైవిధ్యం కోసం ఏకత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.. ఏకత్వం కోసం వైవిధ్యాన్ని తొలగించాల్సిన పనిలేదు’ అనే భావనను వివరించారు.‘అందరం కలిసి ఎదగాలి’ప్రపంచంలో ఘర్షణలు, పోటీ, పర్యావరణ సమస్యలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. మనిషి ప్రకృతిలో భాగమే తప్ప.. దానికి వేరుగా లేడని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రకృతిని దెబ్బతీయకుండా దాని పురోగతికి తోడ్పడాలని చెప్పారు. ‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు.. వారిని కూడా ఎదగనివ్వు’ అనే దృక్పథాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు.హిందూ దేశంపై వివరణ‘హిందూ’ అనేది కేవలం ఒక మతం లేదంటే పూజా విధానం కాదని భాగవత్ అన్నారు. భిన్న మార్గాలను గౌరవించడం, ప్రతి ఒక్కరూ తమ మార్గంలో ముందుకు సాగేందుకు అవకాశం కల్పించడమే హిందూ ఆలోచనా విధానమని చెప్పారు. ‘యూనిఫార్మిటీ అవసరం లేదు.. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉండాలి’ అని పేర్కొన్నారాయన. బ్రిటిష్ హిందువులపై.. బ్రిటన్‌లో నివసించే హిందువులు తమ కర్మభూమి అయిన బ్రిటన్ పట్ల విధేయతతో ఉండాలని మోహన్ భాగవత్ అక్కడున్నవాళ్లు వేసిన ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. బ్రిటన్, భారత్ ప్రయోజనాల మధ్య ఎప్పుడైనా విభేదం తలెత్తితే.. బ్రిటిష్ హిందువులు తమ కర్మభూమి వైపే నిలవడం సహజమని అన్నారు. “మీ కర్మభూమి ఎక్కడైతే ఉందో.. మీ విధేయత కూడా అక్కడే ఉండాలి. జన్మభూమి నుంచి విలువలను పొందుతారు.. ఆ విలువలను కర్మభూమిలో ఆచరిస్తూ అక్కడి సమాజానికి సేవ చేయాలి” అని చెప్పారు. హిందుత్వం ఎప్పుడూ కర్మభూమికి ద్రోహం చేయాలని చెప్పదని స్పష్టం చేశారు. భారత్ తమకు విలువలను అందించిన జన్మభూమి కాగా.. బ్రిటన్ తమ కర్మభూమి అని పేర్కొన్నారు.యువతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని భాగవత్ చెప్పారు. వారికి ఏం సాధించాలో లక్ష్యాన్ని నిర్దేశించాలి కానీ.. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న మార్గాన్ని మాత్రం వారికే వదిలేయాలని సూచించారు. కొత్త తరానికి తమదైన ఆలోచనలు, సామర్థ్యాలతో ముందుకు సాగే అవకాశం కల్పించాలని అన్నారు.Qs: If Britain 🇬🇧 and India’s 🇮🇳 interests ever diverge, what should British Hindus do?Mohan Bhagwat: There is no conflict. British Hindus will support the UK, because your loyalties lie with your karmabhoomi (land of work/host). But your values stem from your janmabhoomi (land…— Abhijit Majumder (@abhijitmajumder) September 6, 2026వందేళ్ల ప్రస్థానం.. ముందున్న లక్ష్యంఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌లో భాగవత్ పర్యటిస్తున్నారు. లండన్ కార్యక్రమంలో 326 సంస్థలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, మేయర్లు, కౌన్సిలర్లు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు. సమాజాన్ని మరింత సంఘటితం చేసి, ప్రజలంతా కలిసి ముందుకు సాగే వాతావరణాన్ని సృష్టించడమే తదుపరి లక్ష్యమని భాగవత్ చెప్పారు. ఇదీ చదవండి: ఛిద్రమైన కలల్ని నిలబెట్టగలరా? -
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్‌లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు మరణించారు. ప్రమాదకరమైన మలుపు దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం సైతం ప్రకటించారు. నమక్కల్ జిల్లా తిరుచెంగోడు(tiruchengode Accident) సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి బంధువైన మరో బాలిక.. నలుగురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న 19 ఏళ్ల యువతి తన ఇద్దరు చెల్లెళ్లను, బంధువైన బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.సంకరంపాళయం ప్రాంతానికి చెందిన సుభిత కలైసెల్వి (19), ఆమె చెల్లెళ్లు నివేత (17), ధనుశ్రీ (12), బంధువైన అభినయ (11) ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. సుభిత కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం.. ఎలచిపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తన చెల్లెళ్లు, అభినయను తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే..రసిపురం–తిరుచెంగోడు రహదారిపై చక్కరంపాళయం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. రసిపురం వైపు నుంచి వచ్చిన ముత్తాయమ్మాళ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి నలుగురూ రోడ్డుపై పడిపోయారు. సుభిత, అభినయ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన నివేత, ధనుశ్రీని తిరుచెంగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్ అరెస్ట్ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎలచిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. చివరకు డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, మృతికి కారణమైన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తాజా సమాచారం.Tiruchengode 🚨⚠️Disturbing Visuals🚨4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026పేద కుటుంబం.. పెద్ద కష్టంమృతుల్లో సుభిత, నివేత, ధనుశ్రీ ముగ్గురూ శేఖర్, అముధ దంపతుల కుమార్తెలు. వారు కూరగాయల వ్యాపారం/కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సుభిత చదువుకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్. ఉమా సహాయం చేసినట్లు సమాచారం. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుఓంది. ఇక అభినయ.. శేఖర్ సోదరుడు రమేశ్‌బాబు కుమార్తె. ఇలా ఒకే కుటుంబ బంధంలో ఉన్న నలుగురు చిన్నారులు, యువతులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో సంకరంపాళయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సీఎం విజయ్ సంతాపం.. రూ.3 లక్షల పరిహారంఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి బాధ కలిగించిందని అన్నారు. మృతులు సుభిత, నివేత, ధనుశ్రీ, అభినయ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదంచదువుకుని జీవితంలో ఎదగాల్సిన వయసులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి బంధువైన మరో బాలిక ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. సుభిత తన చెల్లెళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ప్రయాణమే.. ఆ కుటుంబానికి చివరి ప్రయాణంగా మారింది. అదే సమయంలో.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నలుగురు ఒకే బైక్‌పై ప్రయాణించడం.. అందునా ప్రమాదకరమైన మలుపులో ప్రయాణం.. తప్పంతా యువతులదే అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: తుక్కుతుక్కైన కారు.. 8 మంది బీటెక్ స్టూడెంట్స్ దుర్మరణం -
పెళ్లి విషయంలో గొడవ.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన ప్రియుడు!
తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు. -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్‌సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్‌సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News -
ఎందరి తాళిబొట్లు తెంచావో మరిచిపోయావా?
కశ్మీర్లో 1990లలో జేకేఎల్ఎఫ్ సాగించిన ఉగ్రవాద హింసకు బలైన కుటుంబాలు.. ఆ సంస్థ అధినేత యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నర్సు సరళా భట్ హత్య కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాలిక్.. అదే సమయంలో తన భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.జేకేఎల్ఎఫ్(JKLF) ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా భార్య నిర్మల్ ఖన్నా.. యాసిన్ మాలిక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 జనవరి 25న శ్రీనగర్‌లోని ఓ బస్‌స్టాప్ వద్ద రవి ఖన్నాతో పాటు మరో ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ప్రకారం ఈ దాడికి యాసిన్ మాలిక్ నాయకత్వం వహించి కాల్పులు జరిపిన ప్రధాన షూటర్‌గా అతడిని గుర్తించారు.“నా ఆయుధాలు లేని భర్తను చంపాడు. ఆయన శరీరంలోకి 28 తూటాలు దూసుకెళ్లాయి. ఇప్పుడు తానే గొప్ప వ్యక్తినన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడికి ఎలాంటి సానుభూతి అవసరం లేదు. మాలిక్‌కు మరణశిక్ష తప్ప మరో శిక్ష వద్దు. అతడిని ఉరితీసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అని నిర్మల్ ఖన్నా అన్నారు.మా సంగతేంటి?..తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు మాలిక్ చెప్పడంపై నిర్మల్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. “నీ భార్య వితంతువు కాకూడదని అంటున్నావు. మరి నీ వల్ల భర్తలను కోల్పోయిన ఎన్నో మహిళల సంగతేంటి? వారి కుటుంబాల బాధ నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా?” అని ప్రశ్నించారు.మాలిక్ చేతులకు రక్తం అంటుకుందని, అతడు చేసిన హింసకు మూల్యం చెల్లించాల్సిందేనని ఆమె అన్నారు. 36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ.. ఇంతకాలం గడిచినా బాధిత కుటుంబాలకు న్యాయం ఎందుకు జరగడం లేదని ప్రభుత్వం, న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. మాలిక్ తాజా అఫిడవిట్ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆరోపించారు.‘నా తల్లి కూడా వితంతువైంది’మరో ఉగ్ర బాధితురాలు డాక్టర్ సుష్మా షల్లా కూడా మాలిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ చునీలాల్ షల్లాను 1990 మే 1న ఉత్తర కశ్మీర్లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.“నేను ప్రత్యక్షంగా ఉగ్రవాద బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. యాసిన్ మాలిక్ తన పాపాలకు చివరకు మూల్యం చెల్లించాల్సి వస్తుండటం సంతోషంగా ఉంది. నా తండ్రిని జేకేఎల్ఎఫ్ చంపింది. నా తల్లి ఆయన మరణంతో వితంతువుగా జీవించాల్సి వచ్చింది. ఆ బాధను నువ్వెప్పుడైనా అనుభవించావా? ఇప్పుడు మాత్రం ఏడుస్తున్నావు” అని సుష్మా షల్లా మండిపడ్డారు.సరళా భట్ హత్య కేసులో..1990లో శ్రీనగర్‌లో నర్సు సరళా భట్ హత్యకు సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ అతడు తాజాగా అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇకపై విచారణలో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించబోనని కూడా స్పష్టం చేశాడు. అదే అఫిడవిట్లో పాకిస్థానీ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ రెండు నిర్ణయాల వెనుక సానుభూతి పొందే ప్రయత్నం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.36 ఏళ్లుగా ఎదురుచూపులు1990లలో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో భర్తలను, తండ్రులను కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాయి. యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఆ పాత గాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తన భార్య వితంతువు కాకూడదనే కారణాన్ని మాలిక్ ప్రస్తావించడమే ఇప్పుడు బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.ఇదీ చదవండి: ఆ పెళ్లి కూతురి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ -
కాక్రోచ్ పార్టీలో తిరుగుబాటు.. ‘కేజ్రీవాల్ టీమ్’ అంటూ కొత్త పార్టీ!
జెన్‌జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాక్రోచ్ జనతా పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్ సంచలన ఆరోపణలకు దిగారు. అసలు ఉద్యమ స్ఫూర్తికి సీజేపీ దూరమైందని, నిరసనల్లో పాల్గొన్న క్రియాశీలక వలంటీర్లను పక్కనపెట్టి కొందరితోనే పార్టీని నడుపుతున్నారని అన్నారు. అలాగే సీజేపీ నాయకత్వం రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారని అన్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రటిక్ (CJP-D) పేరుతో కొత్త వేదికను ప్రకటించారు. గురువారం ఢిల్లీలో మనీష్ బ్రహ్మభట్ కొత్త పార్టీని ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ తో సంబంధం లేకుండా సీజేపీ-డెమోక్రటిక్ పేరుతో ఇక తాను పోరాటం చేస్తానని అన్నారు. అభిజీత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీని ‘టీమ్ కేజ్రీవాల్’గా మార్చేశారని ఆరోపిస్తూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజల సమస్యలపై పోరాడటానికి బదులుగా బీజేపీని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దీప్కే సహా సీజేపీలోని ఎనిమిది మంది నాయకులకు ఆప్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని అన్నారాయన.Manish Brahmbhatt launches new group Cockroach Janata Party Democratic in DelhiManish Brahmbhatt launches a new group called Cockroach Janata Party Democratic in Delhi. He says the old Anna anti-corruption protest was hijacked by Arvind Kejriwal's team without asking real…— Ankit (@Extreo_) September 3, 2026మనీష్ బ్రహ్మభట్ గుజరాత్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. అలాగే, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు. సీజేపీ ఉద్యమంలో గుజరాత్ నుంచి వలంటీర్, కోఆర్డినేటర్‌గా పనిచేశారు. అయితే నీట్ నిరసనల తర్వాత.. ఆగస్టు మొదటి వారంలో సీజేపీ కోర్ టీమ్ సమావేశం జరిగింది. దానికి మనీష్‌కు ఆహ్వానం వెళ్లలేదు. మహారాష్ట్రలోని అభిజీత్ దీప్కే నివాసంలో(ఛత్రపతి శంభాజీనగర్‌కు) ఈ మీటింగ్ జరుగుతోందని మీడియా ద్వారా తెలుసుకుని బ్రహ్మభట్ అక్కడికి వెళ్లారు. అయితే ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. దీప్కే నివాసంలోకి అనుమతించకపోవడంతో.. మనీష్ అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. జంతర్‌మంతర్ ఉద్యమంలో పాల్గొన్న పలువురు వలంటీర్లను కీలక చర్చలకు.. అదీ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో బ్రహ్మభట్, ఆయన సహచరుడు రాహుల్ పాండ్యా ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీజేపీని తాను వీడుతున్నట్లు ఆయన ప్రకటించి.. ఇప్పుడు కొత్త వింగ్ ప్రకటించారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ కామెంట్ల నేపథ్యంతో.. మే 16న అభిజీత్ దీప్కే CJPని తొలుత వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభించారు. కానీ, అదే యువత వేదికగా మారింది. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అక్రమాల వంటి అంశాలను ఈ వేదిక ప్రస్తావించింది. అయితే సీజేపీ ఆవిర్భావం నుంచే అభిజిత్ దీప్కేకు, ఆప్‌కు సంబంధాలు ఉన్నాయనే చర్చా నడిచింది. జంతర్‌మంతర్ నిరసనల్లోనూ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు హాజరై సంఘీభావం తెలపడమూ తెలిసిందే. అభిజీత్ దీప్కే 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా, ఎన్నికల ప్రచార బృందంలో పనిచేశారు. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్‌లు, డిజిటల్ కంటెంట్ ద్వారా పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. 2023లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తర్వాత ఆప్‌తో తన అనుబంధం ముగిసిందని దీప్కే ఇదివరకే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బ్రహ్మభట్ చేసిన ఆరోపణలకు సీజేపీ నుంచి ఎలాంటి సమాధానం ఇంకా రాలేదు.ఇదీ చదవండి: అగ్రనేతల ఆమోదంతోనే.. ఆమె తొలగింపు జరిగిందా? -
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు కీలకమైన ఈఓఎస్-05 (జీశాట్-1ఏ) ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.రెండో ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన జీఎస్ఎల్వీ-ఎఫ్17.. సరిగ్గా 18 నిమిషాల తర్వాత 3.13 గంటలకు 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (సబ్-జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం 170 కి.మీ. పెరీజీ, 28,934 కి.మీ. అపోజీ(భూమికి అత్యంత దూరం) ఉన్న కక్ష్యలోకి చేరింది. సుమారు 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్‌కు ఇది 19వ జీఎస్ఎల్వీ మిషన్.ఇక ఈఓఎస్-05ను ఇస్రో సైంటిస్టులు ‘స్మార్ట్ బాయ్’ అని పిలవడానికి కారణం దాని అత్యాధునిక నిఘా సామర్థ్యాలే. భూస్థిర కక్ష్యలో ఉండి భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించగల ఈ ఉపగ్రహం.. అధిక రిజల్యూషన్‌తో స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ కెమెరాలతో పంటలు, అడవులు, నీటి వనరులు, ఖనిజ సంపదతో పాటు వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తులను దాదాపు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించగలదు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలపై నిఘా పెట్టడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. Another giant leap for India in Space! Kudos to Team @isro on the successful launch of GSLV-F17/EOS-05.EOS-05 is a state-of-the-art Earth Observation satellite and India’s first imaging satellite from Geosynchronous Orbit, enabling advanced imaging across visible, infrared,… pic.twitter.com/1HHJrWM7ze— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 3, 2026‘ఈఓఎస్-05’ ప్రత్యేకత ఏమిటంటే?సాధారణంగా లో-ఎర్త్ ఆర్బిట్, సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లోని ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని చిత్రీకరించడానికి కొంత సమయం తీసుకుంటాయి. అయితే ఈఓఎస్-05 భూస్థిర కక్ష్య నుంచి దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించే సామర్థ్యం కలిగి ఉంది. భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి సమాచారాన్ని పంపగలదు. ఇందులోని ఎంఎక్స్-వీఎన్ఆర్ పేలోడ్ అధిక స్పేషియల్ రిజల్యూషన్‌తో చిత్రాలను అందించనుంది. కనిపించే కాంతి, ఇన్ఫ్రారెడ్, మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ బ్యాండ్లలో సమాచారాన్ని సేకరించగలదు.రక్షణకు కీలక ఆయుధంసరిహద్దుల్లోని సైనిక స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలను పర్యవేక్షించడంలో ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఇంతకు ముందు చెప్పినట్లు.. ప్రకృతి విపత్తుల సమయంలోనూ దీని సేవలు కీలకం కానున్నాయి. వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల సమయంలో దాదాపు రియల్‌టైమ్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి చిత్రాలను ఉపయోగించుకోవచ్చు. పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, ఖనిజ సంపద వంటి అంశాలపై కూడా విలువైన సమాచారాన్ని అందిస్తుంది.పాత వైఫల్యానికి సమాధానం2021 ఆగస్టులో జీఎస్ఎల్వీ-ఎఫ్10 ద్వారా ప్రయోగించిన జీశాట్-1 మిషన్ విఫలమైంది. తాజాగా ఈఓఎస్-05ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం ద్వారా ఆ చేదు జ్ఞాపకానికి ఇస్రో చెక్ పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎదురైన పీఎస్ఎల్వీ వైఫల్యం తర్వాత కూడా శాస్త్రవేత్తలు పట్టుదలతో పనిచేసి తాజా మిషన్‌ను విజయవంతం చేశారు.వర్షంలోనూ ప్రయోగాన్ని వీక్షించిన 1,500 మందిప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లాంచ్ వ్యూ గ్యాలరీకి సుమారు 1,500 మంది తరలివచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే వర్షం కురుస్తున్నా వారు వెనక్కి తగ్గలేదు. వర్షంలోనే నిలబడి జీఎస్ఎల్వీ-ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాన్ని వీక్షించారు.ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రయోగం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తొలి మానవ రహిత గగన్‌యాన్ మిషన్‌ను కూడా చేపట్టేందుకు వేగంగా, పద్ధతిగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: వచ్చేస్తోంది.. సూపర్ ఎల్ నినో! -
అదంతా రాఘవ్ చద్దా ప్లానే.. ఆప్ ఎదురుదాడి
ఓటర్ జాబితాలో పేరు తొలగింపుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పొరపాటు కాదని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును తొలగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆప్ ఎదురుదాడికి దిగింది.ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఆగస్టు 13న విడుదలైన పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు లేదు. ఆయన పేరును ‘పర్మినెంట్‌గా షిఫ్ట్ అయ్యారు’ అనే కారణంతో తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని చద్దా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. అయితే ఇదంతా చద్దా వ్యూహంలో భాగమేనని.. ఢిల్లీలో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆయన ‘బ్యాక్‌డేటెడ్’ విధానాన్ని ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.‘బ్యాక్‌డేటెడ్ విధానం’ అంటే.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకుంటూ, గతంలోనే ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో చూపించడం. రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఓటరుగా నమోదు చేసుకునే విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అంటే.. ఇప్పుడు జరిగే ఓటరు నమోదును గత తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆప్ వాదన.‘రాజకీయ కక్షతోనే’..అంతకు ముందు.. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో నమోదై ఉందని చద్దా తెలిపారు. తాను పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఇది సాధారణ క్లరికల్ తప్పిదం కాదని.. రాజకీయ కక్షతోనే తన పేరును తొలగించారని ఆరోపించారు. అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని, అభ్యంతరాలు–దావాల ప్రక్రియ ద్వారా పేరు తిరిగి చేర్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.ఆప్ ఎదురుదాడి..చద్దా ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను నిర్వహించేది ఎన్నికల సంఘమే తప్ప పంజాబ్ ప్రభుత్వం కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు చేర్చాలి, ఎవరి పేరు తొలగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది.అంతేకాదు.. ఢిల్లీలోని రాజిందర్ నగర్లో తన ఓటరు నమోదును గత తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చేయడానికి చద్దా ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపింది. ఇలాంటి బ్యాక్‌డేటెడ్ లేదంటే చట్టవిరుద్ధమైన ప్రక్రియ జరిగి ఉంటే దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.‘ఢిల్లీలోనే ఉంటున్నారు’చద్దా ప్రస్తుతం పంజాబ్‌లో కాకుండా ఢిల్లీలో నివసిస్తున్నారని ఆప్ పేర్కొంది. ఒకవేళ ఆయన పంజాబ్‌లో నివసించకపోతే తన ఓటర్ నమోదును కొనసాగించడమో లేదంటే మార్చుకోవడమో ఆయన వ్యక్తిగత బాధ్యతేనని తెలిపింది. ఇప్పుడు ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపునకు ఆప్, పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సర్‌లో భాగంగా తొలగించిన పేర్లపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు.ఇదీ చదవండి: స్టాలిన్ ఆశలకు మద్రాస్ హైకోర్టు గండి -
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్ అసలు విచారణకే అర్హమైనది కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ను తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థి వీఎస్ బాబు ఓడించారు. బాబుకు 82,997 ఓట్లు (45.09 శాతం) రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు (40.32 శాతం) వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్టాలిన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే మే 4న ఫలితాలు వెలువడగా.. మే 7నే 14 ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్‌ను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి స్టాలిన్ దరఖాస్తు చేశారు. కానీ, ఈ 14 ఈవీఎంలు నియోజకవర్గంలోని మొత్తం 286 యంత్రాల్లో 5 శాతం. అయితే ఈ పరిశీలన జూలై 29న మాత్రమే జరిగింది. పరిశీలన సమయంలో రెండు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయని, మరో యంత్రానికి సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లపై అడ్రస్ ట్యాగ్లు సరిగ్గా లేకపోవడంతో పాటు సీల్ విషయంలోనూ లోపాలు ఉన్నాయని స్టాలిన్ ఆరోపించారు. ఒక కంట్రోల్ యూనిట్ తన పేరున్న బ్యాలెట్ యూనిట్‌ను గుర్తించలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అన్ని వీవీప్యాట్ లెక్కింపు కోరుతూ..కొలత్తూరు నియోజకవర్గంలోని మొత్తం 286 ఈవీఎంలను పరిశీలించడంతో పాటు 100 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని స్టాలిన్ కోర్టును కోరారు. ఈవీఎంల పరిశీలనలో బయటపడిన లోపాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వీఎస్ బాబు ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించాలని, తనను విజేతగా ప్రకటించాలని కూడా అభ్యర్థించారు.ఆలస్యంగా ఈవీఎంల పరిశీలన?స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వాదన చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 7న ఈవీఎంల పరిశీలనకు దరఖాస్తు చేసినప్పటికీ.. ఎన్నికల సంఘం జూలై 29న పరిశీలన చేపట్టిందన్నారు. అప్పటికి ఎన్నికల పిటిషన్ దాఖలు చేసేందుకు నిర్దేశించిన 45 రోజుల గడువు ముగిసిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశీలనలో లోపాలు బయటపడిన తర్వాత స్టాలిన్ ఎన్నికల పిటిషన్ ఎలా దాఖలు చేయగలరని ప్రశ్నించారు.ఈసీ అభ్యంతరం ఇదే..అయితే స్టాలిన్ పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం వాదించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బి) ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాలు చేయాలంటే ఎన్నికల పిటిషన్ ద్వారానే వెళ్లాలని పేర్కొంది. ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ ద్వారా ఆ ప్రక్రియను పక్కదారి పట్టించలేరని తెలిపింది.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ ‘నాట్ మెయింటెయినబుల్’ అని పేర్కొంటూ కొట్టివేసింది. దీంతో కొలత్తూరు ఎన్నికల ఫలితాలను ఈవీఎంల ఆధారంగా సవాలు చేసిన స్టాలిన్ ప్రయత్నానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: అలా.. విడాకులిచ్చేయాల్సి వచ్చింది! -
ఆ ఇద్దరు ఐఏఎస్‌లదీ ఒకే కథ!
సివిల్స్‌లో విజయం సాధారణమేమీ కాదు. మన దేశంలో ఎంతోమంది యువతకు అదొక కల. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కూడా. కానీ ఆ ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించిన తర్వాత కూడా.. అదే కెరీర్లో జీవితాంతం కొనసాగాలని లేదనుకుంటే?. రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలే దీనికి ఆసక్తికరమైన సమాధానం. ఇద్దరూ తమకు దక్కిన అవకాశాన్ని వదులుకుని.. తమకు నచ్చిన దారిని ఎంచుకున్నారు.రోమన్ సైనీ 2013లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి IASలోకి అడుగుపెట్టారు. మరోవైపు దివ్యా మిట్టల్ 2012 UPSC పరీక్షలో 68వ ర్యాంక్ సాధించి IASకు ఎంపికయ్యారు. ఆమె 2013 బ్యాచ్ అధికారిణిగా సర్వీసులో చేరారు. ఒకరు ఐఏఎస్‌లో చేరిన 20 నెలల్లోనే బయటకు వచ్చి స్టార్టప్ ప్రపంచంలోకి వెళ్లగా.. మరొకరు 13 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం తాజాగా రాజీనామా చేశారు. ఇద్దరి నిర్ణయాల వెనుక దారులు వేరు.. కానీ లక్ష్యం మాత్రం తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడమే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యాపారాన్ని ఎంచుకుంటే.. మరొకరు సుదీర్ఘ ప్రజాసేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రయాణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.ఇందులో రోమన్ సైనీ ప్రయాణం చాలా ప్రత్యేకం. 16 ఏళ్లకే ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన.. 2013లో యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ అయ్యారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్‌లో ఆయన కెరీర్ రెండేళ్లు కూడా కొనసాగలేదు. లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో ఉన్న సమయంలో గౌరవ్ ముంజాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐఏఎస్‌ను వీడి ముంజాల్‌తో కలిసి యూన్‌అకాడమీ నిర్మాణంలో భాగమయ్యారు.ఐఏఎస్ నుంచి ఎడ్టెక్ వైపు..2015లో ప్రారంభమైన యూన్ అకాడమీకి రోమన్ సైనీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. ఆన్లైన్ విద్య అంతగా విస్తరించని సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సాహసమే. అయితే కొవిడ్ సమయంలో యూన్ అకాడమీ భారీ స్థాయిలో విస్తరించింది. నెలకు లక్షకు పైగా లైవ్ క్లాసులు, దాదాపు 10 లక్షల మంది చెల్లింపు సబ్స్క్రైబర్లు ఉన్న దశను సంస్థ చూసింది. తాజాగా యూన్ అకాడమీని అప్‌గ్రాడ్ 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసింది. ఈ పరిణామంతో సైనీ ఐఏఎస్‌ను వదిలి నిర్మించిన అధ్యాయం మరో మలుపు తిరిగింది.13 ఏళ్ల తర్వాత దివ్యా మిట్టల్ రాజీనామారోమన్ సైనీకి పూర్తి భిన్నంగా దివ్యా మిట్టల్ ఐఏఎస్‌లో సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న ఆమె.. లండన్‌లో ఉద్యోగం చేసిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. దేవరియా, మిర్జాపూర్, సంత్‌కబీర్ నగర్ వంటి జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.మీర్జాపూర్‌లోని ఓ మారుమూల కొండ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాగునీరు అందించడం ఆమె సేవా కాలంలోని గుర్తుండిపోయే పనుల్లో ఒకటిగా నిలిచింది.2026లో ఈ ఇద్దరి కెరీర్ ప్రయాణాలు మరోసారి ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. యూపీఎస్సీ 2013 బ్యాచ్‌కు చెందిన రోమన్ సైనీ అప్పటికే ఐఏఎస్‌ను వదిలి వ్యాపార రంగంలోకి వెళ్లారు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఆయన సహ వ్యవస్థాపకుడిగా నిర్మించిన యూన్‌అకాడమీ మరో చేతుల్లోకి వెళ్లింది. రోనీ స్క్రూవాలా నేతృత్వంలోని ఎడ్టెక్ సంస్థ అప్‌గ్రాడ్, యూన్అకాడమీని 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో సొంతం చేసుకుంది. ఒకప్పుడు 3.44 బిలియన్ డాలర్ల గరిష్ఠ విలువను అందుకున్న యూన్‌అకాడమీ.. ఇప్పుడు దానితో పోలిస్తే దాదాపు 94 శాతం తక్కువ విలువకు డీల్ కావడం విశేషం. ఈ ఒప్పందంతో యూన్‌అకాడమీ షేర్హోల్డర్లకు upGradలో వాటాలు దక్కాయి. రోమన్ సైనీ మాత్రం సంస్థ నిర్వహణ నుంచి తప్పుకుని ఇకపై అడ్వైజరీ పాత్రలో కొనసాగనున్నారు.అదే సమయంలో దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్ సేవకు స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ నిర్మించి, 13 ఏళ్ల తర్వాత ఆ సంస్థ కొత్త యాజమాన్యంలోకి వెళ్లడాన్ని చూశారు. మరొకరు 13 ఏళ్లపాటు ఐఏఎస్‌గా సేవలందించిన తర్వాత స్వయంగా ఆ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరి ప్రయాణాలూ వేర్వేరైనా.. 2026లో మాత్రం ఇద్దరూ తమ జీవితాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.ఇద్దరి నిర్ణయాలు భిన్నమైనప్పటికీ.. సందేశం మాత్రం ఒకటే. యూపీఎస్సీలో విజయం అనేది కెరీర్‌కు ముగింపు కాదు.. కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. తాను సాధించిన ప్రతిష్ఠాత్మక స్థానంలోనే జీవితాంతం కొనసాగాల్సిన అవసరం లేదని ఈ ఇద్దరి కథలు చెబుతున్నాయి. ఒకరు ఐఏఎస్ నుంచి వ్యాపారవేత్తగా మారితే.. మరొకరు 13 ఏళ్ల పరిపాలనా సేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. అందుకే.. యూపీఎస్సీ క్లియర్ చేయడమే అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే అసలు సవాల్ అని రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలు గుర్తుచేస్తున్నాయి.ఇదీ చదవండి: రాఘవ్ చద్దా ఓటు మిస్సింగ్? -
రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఉద్దేశపూర్వకంగా ఆయా ప్రభుత్వాలు ఓటర్లను తొలగిస్తున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆప్ నేత రాఘవ్ చద్దా ఓటు గల్లంతు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై చద్దా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్ ప్రక్రియలో తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సాధారణ క్లరికల్ తప్పిదం కాదని చద్దా ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత తనపై ఆ పార్టీ నాయకత్వం కక్ష పెంచుకుందని చద్దా ఆరోపించారు. ఆ రాజకీయ విభేదాలను ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల జాబితా రూపకల్పనలో పనిచేసే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ.. తన పేరును ‘షిఫ్టెడ్’గా గుర్తించడంపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. తన పేరును ఏదైనా కారణంతో ఫ్లాగ్ చేసినప్పటికీ, SIR మార్గదర్శకాల్లోని నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు కల్పించిన ప్రత్యేక రక్షణ కింద తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో ఉంచాల్సి ఉందని వాదించారు. ఈ నిబంధనను తన విషయంలో ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని ఆరోపించారు.రూల్స్‌ను కావాలనే..SIR మార్గదర్శకాల్లోని పారా 4(d)ను కూడా రాఘవ్ చద్దా ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల పేర్లు ఎన్నికల డేటాబేస్‌లో ఫ్లాగ్ అయినప్పటికీ.. క్లెయిమ్స్, అభ్యంతరాల సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించుకునేందుకు వారి పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ నిబంధన చెబుతోందని అన్నారు. తాను పంజాబ్ నుంచి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడినని, అయినప్పటికీ తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో ఉంచకుండా ‘షిఫ్టెడ్’గా పేర్కొనడం నిబంధనల ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనని ఆరోపించారు.The AAP government in Punjab has now taken its politics of revenge to the Draft Electoral Rolls.I am a sitting Rajya Sabha MP from Punjab, with my voter ID registered in Mohali, Punjab. Yet my name has been classified as “shifted” in the draft electoral rolls.Thankfully,… pic.twitter.com/laAFAAWYiQ— Raghav Chadha (@raghav_chadha) September 3, 202620.66 లక్షల పేర్లు తొలగింపుపంజాబ్లో సర్ సందర్భంగా మొత్తం 20.66 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించారు. వీళ్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవాళ్లు, మరణించినవారు, డూప్లికేట్ నమోదులు ఉన్నవారు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఇది దాదాపు 9.7 శాతం. చద్దా పేరు కూడా ‘ఆబ్సెంట్, షిఫ్టెడ్, డిజీస్డ్ అండ్ డూప్లికేట్’ (ASDD) జాబితాలో పర్మినెంట్లీ షిఫ్టెడ్‌గా నమోదైంది. ఆప్ కౌంటర్అయితే చద్దా ఆరోపణలను అధికార ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను ఎన్నికల సంఘమే నిర్వహిస్తోందని, ఇందులో పంజాబ్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు చద్దా తన ఓటరు నమోదును ఢిల్లీకి మార్చుకునే ప్రయత్నం చేశారని ఆప్ ఆరోపించింది. దీంతో ఓటరు జాబితా వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. తుది జాబితా ఇంకా రాలేదు: ఈసీఇది ప్రస్తుతం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. పేరు తొలగింపుపై అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం చద్దాతో పాటు ఇతర ఓటర్లకు కూడా ఉంది. సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్‌లో తుది ఓటర్ల జాబితా వెలువడనుంది అని క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమే. పేరు తొలగింపుపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. తన పేరు ‘షిఫ్టెడ్’గా ఎలా నమోదైందనే దానిపై రాఘవ్ చద్దా అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్ మాత్రం SIR ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది.ఇదీ చదవండి: ఎవరు చెబితే అలా మాట్లాడుతున్నావ్?.. హీరోయిన్‌పై బీజేపీ ఫైర్ -
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
ఎల్ నినో పంజా.. ఐఎండీ షాకింగ్ అప్డేట్!
దేశంలో వర్షాల తీరును ఎల్ నినో ప్రభావం మార్చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాల పనితీరుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ లోటు వర్షపాతంతో ముగుస్తుందా? అనే అనుమానాల నడుమ.. భారత వాతావరణ విభాగం (IMD) షాకింగ్ అప్డేట్ ఇచ్చింది.దేశంలో వర్షాలపై ఎల్ నినో ప్రభావం మరింత స్పష్టమవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితులు బలపడుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. అయితే ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో వర్షాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆగస్టులో దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం నుంచి వచ్చే వర్ష వ్యవస్థలు దక్షిణం వైపు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం కూడా ఇందుకు కారణమైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వర్షాలపై ఆందోళన పెరిగింది.ఆగస్టులో దేశానికీ లోటేనైరుతి రుతుపవనాలకు కీలకమైన ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా 16.3 శాతం వర్షపాతం లోటు నమోదైంది. నెలలో సాధారణంగా కురవాల్సిన వర్షాలతో పోలిస్తే ఈ లోటు కనిపించింది. ఆగస్టు చివరి నాటికి దాదాపు 42 శాతం జిల్లాలు లోటు వర్షపాతం పరిధిలో ఉండగా.. మరో 5 శాతం జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అంటే లోటు కేవలం ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితం కాలేదన్నమాట.అల్పపీడనాలు.. ఉత్తరానికే మళ్లాయిఈసారి వర్షాల అసమాన పంపిణీకి అల్పపీడనాల గమనం కూడా ఒక కారణంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పలు అల్పపీడన వ్యవస్థలు ఉత్తర దిశగా పయనించి మధ్య, ఉత్తర భారతంపై ఎక్కువ ప్రభావం చూపాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు అందగా.. దక్షిణ ద్వీపకల్పంలో ఆశించిన వర్షాలు పడలేదు. ఒకే దేశంలో ఒకచోట వరదలు.. మరోచోట వర్షాభావం కనిపించడానికి ఇదీ ఒక కారణం.సెప్టెంబర్‌లోనూ నిరాశేసెప్టెంబర్ సాధారణంగా నైరుతి రుతుపవనాల చివరి కీలక నెల. ఈ సమయంలో కురిసే వర్షాలు ఖరీఫ్ పంటలకు, నేలలో తేమను నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరం. అయితే ఈసారి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ వర్షపాతం దీర్ఘకాల సగటులో 91 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని IMD అంచనా వేసింది. దీంతో సీజన్ ముగిసేలోపు వర్షాల లోటు కొంత మేర భర్తీ అయ్యే అవకాశాలు తగ్గాయి.రుతుపవనాలకు బలహీన ముగింపు?జూన్–సెప్టెంబర్ కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సెప్టెంబర్‌లోనూ వర్షాలు తగ్గితే.. మొత్తం సీజన్ సాధారణం కంటే గణనీయమైన లోటుతో ముగిసే అవకాశం ఉంది. అదే జరిగితే వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో నేల తేమ, సాగునీరు, జలాశయాల నిల్వలపై ఒత్తిడి పెరగొచ్చు. అయితే స్థానికంగా కురిసే భారీ వర్షాలు ఈ పరిస్థితిని కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది.పంటలకు కీలక దశప్రస్తుతం ఖరీఫ్ పంటలు కీలక ఎదుగుదల దశలో ఉన్నాయి. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలకు తగినంత నేలతేమ అవసరం. వర్షాల విరామం ఎక్కువైతే పంటల దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు నేలలో తేమ తక్కువగా ఉంటే రబీ పంటల సాగు ప్రారంభ సమయంలోనూ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.వర్షాలే కాదు.. వేడి కూడా?వర్షాల లోటుతోపాటు ఉష్ణోగ్రతల పరిస్థితిపైనా IMD నిఘా పెట్టింది. సెప్టెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా ఉంది. వర్షాలు తగ్గడం, నేల తేమ పడిపోవడం, వేడి పెరగడం ఒకేసారి జరిగితే నీటి అవసరం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, తాగునీటి వనరులపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.ముందున్నది కీలక సమయంఎల్ నినో ప్రభావం ఒక్కసారిగా దేశమంతా ఒకే విధంగా కనిపించదు. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల కదలికలు, ఇతర సముద్ర–వాతావరణ వ్యవస్థలు కూడా భారత వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే రానున్న నెలల్లో దీని తీవ్రత ఎలా మారుతుంది? దాని ప్రభావం శీతాకాలం, తదుపరి వర్షాకాలం వరకు ఎంతవరకు కొనసాగుతుంది? అన్నది కీలకంగా మారింది. ఐఎండీ అంచనా ప్రకారం.. ఎల్ నినో ఎఫెక్ట్ మార్చి వరకూ కొనసాగనుంది.మొత్తంగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల పంపిణీ దక్షిణాదికి పెద్దగా కలిసిరాలేదు. ఉత్తర, మధ్య భారతానికి అల్పపీడన వ్యవస్థల ద్వారా వర్షాలు అందుతుండగా.. దక్షిణ ద్వీపకల్పంలో లోటు కొనసాగుతోంది. సెప్టెంబర్‌లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోతే వ్యవసాయం, నేలతేమ, నీటి వనరులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. దీంతో ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో ఎలా మారుతుందన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: జెన్‌జీ.. కేర్ ఫ్రీ అనుకునేరు! -
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. అయితే అవి హింసాత్మకంగా మారకుండా, ప్రజలకో.. ప్రభుత్వ ఆస్తులకో నష్టం కలిగించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ సాక్షిగా ఓ కీలక ప్రకటన చేశారు.గత డీఎంకే ప్రభుత్వంలో రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం విజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్లు ధర్నాలు చేపడితే కేసులు పెట్టారని.. అది అమానవీయమని మండిపడ్డారాయన. ఆయా కేసులు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని సభలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో 2021 మే నుంచి 2026 వరకు ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నీ రద్దు కానున్నాయి.రైతులపై కేసులెందుకు?రాష్ట్రానికి.. దేశానికి రైతులే వెన్నెముక అని విజయ్ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సిప్కాట్ పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సందర్భంగా రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. విజయ్ ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ సభలోనే ఉండడం గమనార్హం.డీఎంకే హయాంలో పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలో.. విమానాశ్రయాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. టీచర్లపైనా..ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసినప్పటికీ వారిపైనా కేసులు పెట్టారని సీఎం విజయ్ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కేసులతో వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు.ఎన్ని కేసులు?అయితే డీఎంకే హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై వివిధ ఆందోళనలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయనే పూర్తి సంఖ్యను విజయ్ ప్రభుత్వం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. అయితే గతంలో తమిళనాడులో వివిధ ఉద్యమాలకు సంబంధించిన పెండింగ్ కేసులపై ప్రభుత్వాలు దశలవారీగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే స్పందించాల్సి ఉంది. ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నాంగత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన వారిని అమానవీయంగా వ్యవహరించారని విజయ్ ఆరోపించారు. కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కల్పించేందుకే కేసుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా, ఇటీవలే యాంటీ-నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు డీఎంకే హయాంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులను కొట్టేయాలని నిర్ణయించడం గమనార్హం.ఇదీ చదవండి: కాంగ్రెస్ ప్లాన్‌బీ.. వాళ్లకు బంపర్ ఆఫర్ -
రీల్స్.. ఫాలోవర్ల మోజు! పార్టీని పట్టించుకోరా?
పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలన సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతుందనుకున్న వేళ.. ఓ ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, సొంత ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే కొందరు నాయకులు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.బంకురా జిల్లా ఓండా నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్నాథ్ షాకా(Amarnath Sakha).. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా బీజేపీతో కొనసాగుతున్నానని, తప్పు అనిపించిన విషయాలపై మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ‘‘ఎవరినీ సంతోషపెట్టేందుకు నేను ప్రయత్నించను. తప్పు అనిపించిన దానిని వ్యతిరేకిస్తాను. అందుకే చాలామంది శత్రువులయ్యారు. అది నాకు సమస్య కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ నేతలు వాటిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం లేదని షాకా విమర్శించారు. ‘‘ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొందరు నేతలు సొంత ప్రచారంలోనే మునిగిపోతున్నారు. సీపీఐ(ఎం)కు కౌంటర్ లేదు.. నిరసన లేదు.. ఏమీ లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకంటే బయటి ఈవెంట్లలో ఎక్కువ పాల్గొంటున్నారు. అందరూ రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, ఫ్యాన్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు’’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పార్టీని పతనం దిశగా..’బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నేతల వైఖరిలో మార్పు వచ్చిందని షాకా ఆరోపించారు. పదవులు, అధికారంతో వచ్చే ప్రయోజనాలపైనే వారి దృష్టి ఉందని విమర్శించారు. ‘‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా.. అందరూ దాని ప్రయోజనాలను అనుభవించడంలో బిజీగా ఉన్నారు. సొంత కడుపులు నిండితే చాలు.. పార్టీ నరకానికి పోయినా పట్టించుకోరు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘సంపాదన మీదే దృష్టా?’’బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగత నాయకుల అభిమానులుగా కాకుండా పార్టీ కోసం పనిచేయాలని షాకా పిలుపునిచ్చారు. ‘‘ఫలానా నాయకుడి అనుచరుడు అవ్వడం బదులు ముందుగా పార్టీకి అనుచరులుగా మారండి. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుంది’’ అని సూచించారు.తాను పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని, యవ్వనాన్ని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టానని షాకా చెప్పుకున్నారు. సీపీఐ(ఎం) పాలనలో 34 ఏళ్ల హింస, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పాలనలోనూ ఎన్నో ఇబ్బందులు చూశానని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని అన్నారు.అయితే ఇప్పుడు కొందరి వ్యవహారశైలితో పార్టీ నష్టపోతోందని ఆరోపించారు. ‘‘పార్టీ బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదించడంపైనే అందరి దృష్టి’’ అని వ్యాఖ్యానించారు.వామపక్షాల పునరాగమనంపై చర్చమమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం టీఎంసీ పార్టీని పతన స్థితికి తీసుకెళ్లింది. ఇదే అదనుగా బెంగాల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి మరోసారి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. యువ నాయకులను ముందుకు తీసుకురావడంతో పాటు వీధి పోరాటాలను ముమ్మరం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వంపై షాకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. వామపక్ష కూటమి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 2021తో పోలిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి ఓటు శాతం దాదాపు నాలుగు శాతం తగ్గింది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు నెలల పాలన పూర్తి చేసుకోబోతున్న వేళ.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం లెఫ్ట్ పార్టీల జనాదరణ కాస్త పెరిగిందనే చెబుతున్నాయి.పార్టీ వేదికపైనే మాట్లాడాలి: బీజేపీ నేతషాకా సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలపై బీజేపీ స్పందించింది. ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన అంశాలను బహిరంగంగా కాకుండా అంతర్గత వేదికల్లో చర్చించాలని సూచించారు. షాకా పార్టీకి నమ్మిన బంటని.. సీనియర్ నాయకుడని, ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉందని, పార్టీ అంతర్గతంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తే పరిశీలిస్తామని పేర్కొన్నారు.ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరు నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వసూళ్లు, కట్‌మనీ వంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో షాకా తాజా వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా బెంగాల్లో వామపక్షాలు తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. బీజేపీ అంతర్గతంగా నాయకత్వం, సంస్థాగత పనితీరు, సోషల్ మీడియా ప్రచారం చుట్టూ మొదలైన ఈ వివాదం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.ఇదీ చదవండి: పాక్ ప్రధాని సమక్షంలో మోదీ స్ట్రాంగ్ కౌంటర్ -
టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.‘ప్రపంచం యుద్ధంలో ఉంది’ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్ ఇన్ ఇండియా’ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలుఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.మోదీ చెప్పిన ‘జూట్ కీ గూంజ్’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.7.8 శాతం వృద్ధిసోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ? విజయ్?? పీఎం అభ్యర్థి ఎవరసలు! -
విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి!
తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వాములైన తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే టీవీకే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ హస్తం పార్టీకి అసహనం తెప్పిస్తోంది. ఆ వెంటనే అసెంబ్లీలో సీటింగ్ మార్పు.. ఇరు పార్టీల మధ్య గ్యాప్‌నకు కారణమనే చర్చా నడిచింది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తరహై కత్బర్ట్(Tharahai Cuthbert) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీని విజయ్ కూడా అంగీకరించారని ఆమె పేర్కొన్నారు. ‘‘సీఎం రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఆయన కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని తెలిపారు.‘కాంగ్రెస్ ఎవరికీ బానిస కాదు’టీవీకేకు కాంగ్రెస్ లోబడి పనిచేయడం లేదని తరహై కత్బర్ట్ స్పష్టం చేశారు. తమిళనాడులో తమ పార్టీ స్వతంత్రంగా విస్తరిస్తోందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధమైన స్వతంత్ర పార్టీ అని పేర్కొన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ పార్టీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.అందుకే సీటు మారాల్సి వచ్చిందిఇదిలా ఉండగా.. అసెంబ్లీలో తన సీటు మార్పుపైనా కత్బర్ట్ వివరణ ఇచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే ఎమ్మెల్యేలతోనే కూర్చున్నారు. తాజా తాజా వివాదం నేపథ్యంలో వాళ్లు కావాలనే సీటు మారి విపక్ష సభ్యులతో కూర్చున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే తనకు ముందు వరుసలో సీటు కేటాయించారని, దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదని కత్బర్ట్ స్పష్టం చేశారు. ఇక ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదానికి సంబంధించి రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదవడాన్ని కూడా కత్బర్ట్ ప్రస్తావించారు. రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని ఆరోపించారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలిచిన నేపథ్యంలో టీవీకే కార్యకర్తలు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.‘విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చేస్తే బయటకొస్తాం’అంతకు ముందు.. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా టీవీకే ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ మంత్రులు తమిళనాడు ప్రభుత్వాన్ని వీడతారని ఆ పార్టీకి చెందిన మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ హెచ్చరించారు. ఆగస్టు 30న మార్తాండంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే తాను, మరో కాంగ్రెస్ మంత్రి విశ్వనాథన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ కేబినెట్ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు.విజయ్–రాహుల్ మధ్య సాన్నిహిత్యంమరోవైపు విజయ్, రాహుల్‌గాంధీ మధ్య మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కరూర్ ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్ ఫోన్ చేసి సంఘీభావం తెలపడాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన అరంగేట్రం చేసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి సవాల్ విసిరింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించగా.. వేదికపై ఆయనను తన ‘సోదరుడు’గా విజయ్ అభివర్ణించారు. టీవీకే ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కూడా మద్దతు ప్రకటించారు.మొత్తంగా.. విజయ్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, 2029 ప్రధాని అభ్యర్థిత్వం అంశం మాత్రం కూటమిలో కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలు విభేదాలు లేవని చెబుతున్నా.. విజయ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ మద్దతు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అంశం కూటమి మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ చెప్పిన ఆ గుంటనక్క ఎవరు? -
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి ఆయన్ని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది.అహింసా పద్ధతుల్లో.. శాంతియుత మార్గాల్లో అన్నా హజారే గతంలో పలు సత్యాగ్రహాలు చేశారు. ఇప్పటిదాకా ఆయన 22 సార్లు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇండియా అగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) మాత్రం ఆయనకు బాగా పేరొచ్చింది. ఆ తర్వాత రైతు చట్టాలు సహా అనేక ఉద్యమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవలి నీట్ నిరసనలపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు సంఘీభావంగా జూలై 23న రెండు గంటలపాటు మౌన దీక్ష కూడా చేపట్టారు.89 ఏళ్ల హజారే.. వైరల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలతో.. తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. రాలేగావ్ సిద్ధిలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. బాంబే ఆస్పత్రిలో వైద్యుడు గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. హజారే ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.కేజ్రీవాల్‌తో కలిసి..2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జనలోక్‌పాల్ బిల్లును బలంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభించడంతో ప్రభుత్వం జనలోక్‌పాల్ బిల్లుపై చర్చలకు దిగింది. ఈ ఉద్యమంలో సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు హజారేకు కీలక సహచరులుగా ఉన్నారు. హజారే ఉద్యమానికి కేజ్రీవాల్ బలమైన మద్దతు ఇవ్వడంతో ఇద్దరి పేర్లు అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. అనంతరం అదే ఉద్యమం నేపథ్యంలో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.ఇదీ చదవండి: బీజేపీ సర్కార్‌కు ఆరేళ్ల పిల్లాడి వార్నింగ్! -
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’
జంతర్ మంతర్ నిరసనల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పడం, బాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం.. ఆయన క్షమించేయడం.. పోలీసులు ఉండదని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింటకు చేరింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. ‘మోదీజీ.. మీరు నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటన తర్వాత తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పినట్లు ఉంది. ‘‘మీరు నన్ను ఎంతగా వెంటాడారంటే.. ప్రతిచోటా వేధింపులకు గురయ్యాను. ఎక్కడికెళ్లినా ముఖం దాచుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె అందులో చెప్పినట్లు ఉంది. ఈసారి తాను వెనక్కి తగ్గబోనని, కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ దీనిని తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాల్లో షేర్ చేశాయి. బాలికను బెదిరించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని ఇరు పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు.. బాలిక తరఫు న్యాయవాది మాత్రం ఆ వీడియో ఏఐ జనరేటెడ్ కాదని, అందులో ఉందని ఆమెనేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ వీడియో ఎప్పుడు తీశారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.జులై 23న జంతర్ మంతర్ నీట్ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సదరు బాలిక తిట్టిపోసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చాందెల్ ఫిర్యాదు చేయడంతో జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేశారు. తొలుత ఆమె వయసును పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పుగా పేర్కొన్నారు. అయితే.. తన వయసు 15 ఏళ్లేనని.. కొందరు రెచ్చగొట్టి అలా మాట్లాడించారని ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.మకాం మార్చేసి..జంతర్ మంతర్ ఘటన వివాదం, కేసు భయంతో ఆమె కుటుంబం ఆందోళనకు గురైంది. తమకు వేధింపులు వస్తున్నాయని, తన బిడ్డ చేసిన తప్పును పెద్ద మనుసుతో మన్నించాలని తల్లి, ప్రధాని మోదీని వేడుకుంది. ఆ తర్వాత నోయిడాలోని నివాసాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం హరియాణాలో తల్లిదండ్రులతో ఉంటున్నట్లు తెలిసింది.‘యువతకు మరో అవకాశం ఇవ్వాలి’ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఘటనలో పాల్గొన్న యువతపై కఠిన చర్యలకు బదులుగా వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో వివాదం క్రమంగా సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. ఇదీ చదవండి: డింపుల్.. మామూలు దూకుడు కాదది! -
అప్పుడు ఆరోపణలతో దూరం.. ఇప్పుడు ‘అస్త్రం’గా దూకుడు!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం స్పష్టమవుతోంది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కంటే ఇప్పుడు ఆయన భార్య, మైన్‌పురి ఎంపీ డింపుల్ యాదవ్ ఎక్కువగా రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ రాజకీయాల ఆరోపణలకు దూరంగా ఉంచిన ఆమెనే ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనేందుకు అఖిలేశ్ కీలక అస్త్రంగా ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తోంది.2017లో రాహుల్ గాంధీ చేసిన కుటుంబ రాజకీయాల విమర్శల నేపథ్యంలో అఖిలేశ్.. తన భార్య డింపుల్ యాదవ్ ఇక ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించారు. కానీ ఆ హామీ ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో కన్నౌజ్ నుంచి పోటీ చేసి ఓడిన డింపుల్.. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత 2022లో మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారు. 2024లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వరుస విజయాలతో ఆమె కేవలం యాదవ్ కుటుంబ వారసురాలిగానే కాకుండా, సొంత రాజకీయ గుర్తింపు ఉన్న నాయకురాలిగా ఎదిగారు.జంతర్ మంతర్ నుంచి లక్నో వరకు..ఈ మధ్యకాలంలో డింపుల్ రాజకీయం మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో ఆమె పాల్గొనడం, గాయపడిన నిరసనకారులను పరామర్శించడం చర్చనీయాంశమైంది. అఖిలేశ్ పార్లమెంట్లో ఉండగా.. డింపుల్ రోడ్డుపై నిరసనకారుల మధ్య కనిపించడం ఆమెకు నెక్ట్స్‌లెవల్ పొలిటికల్ ఇమేజ్ను తీసుకొచ్చింది.ఆగస్టు 26న లక్నోలోని లోహియా సభాగార్లో నిర్వహించిన కార్యక్రమంలోనూ డింపుల్ కేంద్రబిందువుగా నిలిచారు. మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిండిన వేదికపై అఖిలేశ్ ఒక్కరే ఉన్నారు. డింపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ను ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ఏటా రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ మహిళా ఓటు బ్యాంకుపై నేరుగా గురిపెట్టారు.మహిళా ఓటర్లే లక్ష్యంఉత్తరప్రదేశ్లో సమాజ్‌వాదీ పార్టీకి చాలాకాలంగా మహిళా ఓటర్ల మద్దతు బలహీనంగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో బీజేపీకి ఎస్పీ కూటమిపై గణనీయమైన ఆధిక్యం లభించింది. గతంలో ఎస్పీ పాలనలో శాంతిభద్రతలు, మహిళల భద్రత అంశాలను బీజేపీ పదేపదే ప్రచారాస్త్రంగా ఉపయోగించింది.ఇప్పుడు డింపుల్‌ను ముందుకు తీసుకురావడం ద్వారా ఆ ప్రతికూల ముద్రను కొంతమేర మార్చాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహిళల భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలపై డింపుల్ గళం వినిపిస్తున్నారు. మహిళలను ‘ఆధీ ఆబాదీ’(మెజారిటీ సమాజం)గా పరిగణిస్తూ పీడీఏ(పిచ్డా(OBC), దళిత్, అల్పసంఖ్యక్) సామాజిక సమీకరణాన్ని మరింత విస్తరించాలన్న సంకేతాలను ఇస్తున్నారు.ఆ ఫలితాలే ధైర్యానిచ్చాయా?2024 లోక్‌సభ ఎన్నికలు ఎస్పీకి కొత్త ఊపునిచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. ఇండియా కూటమి మొత్తం 43 స్థానాలను దక్కించుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో లోక్‌సభ విజయాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని అఖిలేశ్ వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లలో బీజేపీకి ఉన్న పట్టు సడలిస్తేనే అసెంబ్లీ పోరులో ఎస్పీకి గణనీయమైన లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే డింపుల్ యాదవ్‌ను మహిళా ముఖంగా ముందుకు తీసుకురావడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది.రాజకీయంగా అఖిలేశ్ దూకుడైన నేతగా కనిపిస్తే.. డింపుల్ అదే పోరాటాన్ని మరింత సౌమ్యమైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలరన్న అంచనా ఉంది. కుటుంబ వారసత్వం నుంచి వచ్చినప్పటికీ రెండు విజయాలతో తనకు తానుగా ఓ రాజకీయ బలం సంపాదించుకున్నారన్నది ఎస్పీ వర్గాల నమ్మకం. అందుకే ఒకప్పుడు కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి తప్పించేందుకు ఎన్నికలకు దూరంగా ఉంచిన డింపుల్.. ఇప్పుడు 2027లో అఖిలేశ్‌కు బీజేపీపై పోరులో అత్యంత కీలకమైన రాజకీయ అస్త్రంగా మార్చుతున్నారనే విశ్లేషణలు యూపీ రాజకీయాల్లో నడుస్తున్నాయి.ఇదీ చదవండి: విజయ్.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! -
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరుతో మరో కొత్త చర్చ మొదలైంది. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ను ప్రొజెక్ట్ చేస్తూ ఆయన పార్టీ టీవీకే వర్గాలు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ తరుణంలో.. అక్కడి ప్రతిపక్ష డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.రాజకీయ ఉద్దండులను తోసేసి మరీ.. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని రేసులో విజయ్ ఉన్నారన్నది ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. అంతేకాదు సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగానూ ఆయనకు అర్హత ఉందంటూ రాహుల్ గాంధీ తర్వాతి ప్లేస్‌ను కట్టబెట్టారు. దీంతో విజయ్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉందని.. రాబోయే రోజుల్లో పక్కా దేశానికి ప్రధాని అవుతారంటూ టీవీకే హడావిడి చేస్తోంది. అయితే ఈ ప్రచారంపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి స్పందిస్తూ ఆయన పార్టీ కార్యకర్తలు కోరుకుంటే విజయ్ పీఎం ఏంటి.. ఏకంగా ఐక్యరాజ్యసమితి అధిపతి అవుతారని సెటైర్ వేశారు.“వారి ఊహలకు హద్దుల్లేవు.. ఏదైనా ఊహించుకోనివ్వండి” అంటూ ఆర్ఎస్ భారతి కామెంట్ చేశారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆ పార్టీ ఆశయం ఏమైపోతుందో అంటూ ఇంకో చురక అంటించారు.కాంగ్రెస్ గుంటనక్క కథ.. ఇండియా టుడే సర్వే, టీవీకే చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కూడా పరోక్షంగా స్పందించినట్లు ఆయన తాజా ట్వీట్‌తో స్పష్టమవుతోంది. ‘ది ఫాక్స్ ఫేక్ పోల్’ పేరుతో ఓ నక్క కథను ఎక్స్‌లో పంచుకున్న ఆయన.. సర్వేలో ఎంతమందిని ప్రశ్నించారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు అడిగారు? ఫలితాలను ఎలా లెక్కించారు? వంటి అంశాలను ప్రస్తావించారు. “ప్రతి సంఖ్య నిజాన్ని చెప్పదు.. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు” అంటూ తేల్చేశారు. ఆయన చెప్పిన కథలో ఏముందంటే..ఒక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులు. అడవికి సంబంధించి ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసే తీసుకుంటారు. వారి స్నేహాన్ని చూసి ఈర్ష్యపడిన గుంటనక్క.. కొందరిని మాత్రమే అడిగి ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వే పేరుతో సింహానికి ఏనుగుపై, ఏనుగుకు సింహంపై అనుమానాలు కలిగించి వాళ్లను విడగొట్టాలని చూస్తుంది. చివరకు ఓ చీమ.. ముందుకు వచ్చి నక్కను అందరి ముందే నిలదీస్తుంది. సర్వేలో ఎంతమందిని అడిగారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు వేశారు? ఫలితాలను ఎలా లెక్కించారు? అని ప్రశ్నించడంతో నక్క నీళ్లునములుతూ కనిపిస్తుంది. అలా ఏనుగు-సింహం స్నేహం చెడిపోకుండా కాపాడుతుంది. படித்ததில் பிடித்த ஒரு குட்டி கதை …நரியின் போலி கருத்துக்கணிப்புஒரு காட்டில் சிங்கமும் யானையும் நெருங்கிய நண்பர்களாக இருந்தனர்.காட்டில் எந்தப் பெரிய முடிவாக இருந்தாலும், இருவரும் ஒன்றாக ஆலோசனை செய்வார்கள்.ஒருநாள், அந்த நட்பைப் பார்த்து பொறாமைப்பட்ட நரி, ஒரு…— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 30, 2026ఇండియాటుడే చానెల్ ఈ మధ్యే తమిళంలోనూ అడుగు పెట్టింది. అది సీఎం విజయ్ చేతుల మీదుగానే ప్రారంభం కావడం గమనార్హం.విజయ్‌కు మూడో స్థానంఆగస్టు 28న వెలువడిన తాజా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి ప్రజల ఎంపికలో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. వీటితో పాటు గత ఆరు నెలల్లో నిర్వహించిన మరో 91,795 ఇంటర్వ్యూల డేటాను కూడా విశ్లేషణలో ఉపయోగించారు. మొత్తం 9.2% మంది విజయ్ తదుపరి ప్రధాని కావడానికి అనుకూలంగా ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 48.7%, రాహుల్ గాంధీకి 27.1% మద్దతు లభించింది. దీంతో 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే వర్గాల్లో ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదం మరింత బలంగా వినిపిస్తోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విజయ్ను ప్రధాని చేయాలంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ తరుణంలో మిత్రపక్షం కాంగ్రెస్ నుంచే కౌంటర్లు రావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 17న తమిళ రాజకీయాల్లో బిగ్ బాంబ్? -
యోగి సర్కార్‌పై విమర్శల వేళ.. అంకిత్ కేసులో ట్విస్ట్
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంకిత్‌పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. సోమవారం వేకువ జామున షామ్లీ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరారైన మరికొందరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.హరియాణాలో పుట్టి పెరిగిన అంకిత్ బల్యాన్.. యూపీకి వలస వచ్చి స్థిరపడ్డాడు. తొలుత కబడ్డీ ప్లేయర్‌గా రాణించి.. గాయం కారణంగా సంగీతం వైపు మళ్లాడు. యూట్యూబ్ వీడియోలతో పాటు హర్యాన్వీ సాంగ్స్‌తోనూ మాంచి గుర్తింపు దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ఆయన వీడియోలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. అయితే.. ఆగస్టు 26న సాయంత్రం షామ్లీ జిల్లా కోత్వాలి పీఎస్ పరిధిలో ఓ జిమ్ బయట అంకిత్ బల్యాన్ దారుణ హత్యకు గురయ్యాడు.జిమ్ నుంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్తున్న అంకిత్‌పై రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులు అంకిత్ వైపు దూసుకొచ్చి వరుసగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. కనీసం 16 రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారుఅయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు ఈ ఉదయం ఎన్కౌంటర్ అయ్యారు. వాళ్ల పేర్లు సుమిత్, మోహిత్‌గా పోలీసులు నిర్ధారించారు. అయితే వాళ్లు ఏ గ్యాంగ్? ఎందుకు అంకిత్‌ను హతమార్చారు అనేదానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ఉధృతం చేసినట్లు మాత్రమే వెల్లడించారు.భార్య తీవ్ర హెచ్చరికహత్య అనంతరం అంకిత్ కుటుంబం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంకిత్ భార్య డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో హంతకులను పట్టుకోకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మాహుతికి పాల్పడతానని ఆమె హెచ్చరించారు.నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు.. అతడికి ఎలాంటి శత్రుత్వం లేదు. అన్యాయంగా అతడిని చంపారు. నా కొడుకును ఎలాగైతే చంపారో.. ఆ హంతకులనూ అలాగే చంపాలి అని సీఎం యోగికి అంకిత్ తండ్రి విజ్ఞప్తి చేశాడు. దీంతో.. పోలీసులు అంకిత్ కుటుంబాన్ని కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు అనుమానితులు ఎన్కౌంటర్లో హతమవడం కేసులో కీలక మలుపుగా మారింది.గోగీ గ్యాంగ్ పేరు తెరపైకిఅంకిత్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తాను హరియాణాలోని సోనిపట్‌కు చెందిన భోలు షాపురి అని చెప్పుకుంటూ.. ఈ హత్యకు గోగీ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటించాడు. దీంతో కేసులో గ్యాంగ్‌వార్ కోణం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రకటనను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. అంకిత్‌కు ఎవరితోనైనా పాత వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమా? గ్యాంగ్ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు అనుమానితుల నుంచి లభించే సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.యోగి సర్కార్‌పై విమర్శలుఅంకిత్ బల్యాన్ హత్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై మరోసారి రాజకీయ దుమారం రేపింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆరోపించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ హత్యపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కోణాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ హత్య కేవలం నేర ఘటనగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది.ఎవరీ అంకిత్ బల్యాన్?33 ఏళ్ల అంకిత్ బల్యాన్ హర్యాన్వీ సంగీతంలో గుర్తింపు పొందిన గాయకుడు, యూట్యూబర్. షామ్లీకి చెందిన ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. సంగీతంలోకి రాకముందు అంకిత్ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఉన్నారు. 2013–14 వరకు ఢిల్లీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో కబడ్డీకి దూరమై అనంతరం జిమ్‌లో చేరారు. 2022 ప్రాంతంలో హర్యాన్వీ సంగీతంపై దృష్టి పెట్టారు.గాయకుడిగా మాత్రమే కాకుండా గీత రచయితగా, సంగీత స్వరకర్తగా కూడా పనిచేశారు. తన కెరీర్లో 50కి పైగా పాటలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘భారీ కోర్ట్ మే గోలి మారేంగే’, ‘బాడీ బిల్డర్’, ‘పీటీఐ’, ‘ఏక్ ఖటోలా జైల్ కే భీతర్’ వంటి పాటలతో పాపులర్ అయ్యారు. ఆయన పాటలు, వీడియోల్లో తుపాకులు, గొడవలు, గ్యాంగ్‌లు, లగ్జరీ కార్ల ప్రస్తావనలు తరచూ కనిపించేవి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అంకిత్ భావిస్తున్నట్లు గతంలో సమాచారం వచ్చింది.హత్యకు కొన్ని గంటల ముందు..అంకిత్ హత్యకు కొన్ని గంటల ముందే తన కొత్త పాట ‘బేబీ బద్మాష్’కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో హత్యను ప్రస్తావించే కొన్ని పంక్తులను పాడారు. హత్య తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ పాటకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.ఇదీ చదవండి: జాక్‌పాట్ కొట్టిన కానిస్టేబుల్.. ఏకంగా కోట్లలో లాటరీ! -
సునామీలా వరద.. ఆ పరమశివుడే కాపాడాడేమో!
కొండలపై నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద.. క్షణాల్లోనే అంతా తుడిచిపెట్టేసింది. చుట్టూ బురద, రాళ్లు, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువే కనిపించింది. ఇంత విషాదంలో కొందరి ప్రాణాలు మాత్రం అద్భుతంగా దక్కాయి. తాము చూసిన భయానక దృశ్యాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ వారు చెప్పిన మాటలు ఆ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన తమిళనాడు యాత్రికులకు నేపాల్‌లో ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆగస్టు 26న రసువాగఢి ప్రాంతంలో ఒక్కసారిగా కొండలపై నుంచి నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయి. క్షణాల్లోనే రహదారులు, భవనాలు కొట్టుకుపోవడంతో 21 మంది యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చివరకు సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు.తమ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదీ తీరంలో భారీగా పొగలాంటిది కనిపించిందని యాత్రికులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత ఏదైనా పేలుడు జరిగిందని భావించామని.. అంతలోనే కొండపై నుంచి నీరు, మట్టి, ఇసుక, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం దూసుకొచ్చిందని చెప్పారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ తమ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.వరద ప్రవాహం బస్సులకు చేరువవుతుండటంతో డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చి సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొందరు మహిళలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడటంతో.. చీర సాయంతో ఒకరినొకరు పైకి లాగుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు నానా అవస్థలు పడి చివరకు ఓ రెస్క్యూ కేంద్రానికి చేరుకున్నారు.ఆ పరమశివుడి ప్రతిరూపం..తమను స్వయంగా ఆ శివుడే కాపాడాడని కొందరు యాత్రికులు నమ్ముతున్నారు. వరద ప్రవాహం తమవైపు దూసుకొస్తున్న సమయంలో సమీపంలోని కొండపై మట్టి, బురదతో శివుడి ముఖం ఆకారంలో ఓ రూపం కనిపించిందని వారు భావోద్వేగంగా చెబుతున్నారు. కైలాసానికి వెళ్లి శివుడి ఆశీస్సులు పొందాలనుకున్న తమను.. ఈ విపత్తు నుంచి కూడా ఆయనే కాపాడాడని చెప్పారు. నేపాల్ సైన్యానికి కృతజ్ఞతలువిపత్తులో చిక్కుకున్న యాత్రికులను నేపాల్ సైన్యం, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారిని ఖాట్మాండుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి న్యూఢిల్లీ మీదుగా చెన్నైకి తరలించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యాత్రికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా వందలాది మంది ఆచూకీ లేదుఇదిలా ఉండగా.. నేపాల్, టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 700కు దగ్గర్లో చేరగా.. 2,426 మంది గల్లంతైనట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్‌కు ఆహారం, మందులు, దుప్పట్లు, సోలార్ ల్యాంపులు తదితర సహాయక సామగ్రిని కూడా భారత్ పంపుతోంది.“We saw Lord Shiva’s face on the mountain as the water came hurtling towards us.”A group of 60 pilgrims from Tamil Nadu were travelling in three buses on the Kailash Mansarovar pilgrimage. The whereabouts of around 40 travelling in two of those buses remain unknown.The 21… pic.twitter.com/qmnWUhcF0Z— Rahul Kanwal (@rahulkanwal) August 28, 2026ఇదీ చదవండి: యుగాంతం వచ్చేసిందా? అన్నట్లు.. -
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మనుస్మృతికి, డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుస్మృతిని అనుసరిస్తున్నాయి. మనుస్మృతి ఆధారంగానే దళితులపై వివక్ష కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభలను వాళ్లు శుద్ధీకరణ చేస్తున్నారు. ఈ ఘటనే వాళ్ల వివక్షకు నిదర్శనం. అంటరాని తనం పాటిస్తున్నారు.. అది నేరం. దేశంలో దళితులపై అనాదిగా కొనసాగుతున్న అణచివేతకు ఇప్పటికీ పూర్తిగా తెరపడలేదని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం, ‘శుద్ధీకరణ’ పేరుతో వివక్ష చూపడం వంటి ఘటనలు అంటరానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కులాలకు చెందిన వాడినని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం పాత కుల వివక్ష విధానాలనే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కొత్త సంస్థలు, కొత్త పేర్లు, కొత్త విభాగం వచ్చినా.. దాని విధానాలు మాత్రం మారలేదని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, హక్కులను కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారుLIVE: Special Congress Party Briefing by LoP Shri @RahulGandhi at AICC HQ, New Delhi https://t.co/f6sL6o2vHX— Congress (@INCIndia) August 29, 2026 ఇదీ చదవండి: సోనియా బుక్.. అందుకే బీజేపీ భయపడుతోందా? -
ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం భారత్‌లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని అంటోంది.సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్.. పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్రూప్‌లోని సంస్థగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లో ఈ పుస్తకానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది.మూడు అంశాలే అసలు వివాదమా?కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీలో మూడు కీలక అంశాలపై పెంగ్విన్ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం.‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్ ఆరోపణఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్.. పెంగ్విన్ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్‌లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు.‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేసవన్ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్ అలోక్.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ప్రచురణకర్తలు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.ఆత్మకథలో ఏముంది?‘Belonging: A Journey of Love’లో తన జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాన్ని సోనియా గాంధీ వివరించారు. ఇటలీలో ఓ చిన్న పట్టణంలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్ గాంధీ భార్యగా భారత్‌కు రావడం, ఇందిరా గాంధీ కోడలిగా మారడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావడం వంటి కీలక ఘట్టాలను పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన తన రాజకీయ జీవితంతోపాటు.. 2004లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించిన నిర్ణయం గురించి కూడా తన జ్ఞాపకాలను పంచుకున్నట్లు ప్రచురణకర్త వెల్లడించింది.ఇక భారత్‌లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెంగ్విన్ ఇండియా నుంచి పుస్తక ప్రచురణ తప్పుకున్న నేపథ్యంలో హార్పర్‌కాలిన్స్ సహా పలు భారతీయ ప్రచురణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే పెంగ్విన్ అభ్యంతరాలపై కాంగ్రెస్-బీజేపీ మధ్య కౌంటర్లతో సోనియా గాంధీ పుస్తకం విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన Four Stars of Destiny విషయంలోనూ ప్రచురణపై వివాదం చెలరేగింది. అలాగే వెండీ డోనిగర్ రచించిన The Hindus: An Alternative History పుస్తకాన్ని 2014లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా సోనియా గాంధీ Belonging: A Journey of Love విషయంలోనూ ప్రచురణపై వివాదం తెరపైకి రావడంతో పెంగ్విన్ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మలాలా ఆత్మకథ చదివినందుకు.. పనిష్మెంట్! -
లంచగొండి ఆఫీసర్‌కు చుక్కలు చూపించిన జనం!
దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్‌కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్‌లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్‌ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO— Truth India Live (@Truthindialive) August 29, 2026అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? -
విజయ్ మరో సంచలనం.. మోదీ, రాహుల్ తర్వాత ప్లేస్!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత.. తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే–సీ ఓటర్ నిర్వహించిన తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితం వెల్లడైంది.ప్రధాని పదవికి తదుపరి ఎంపికగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. నరేంద్ర మోదీకి 48.7 శాతం మంది, రాహుల్ గాంధీకి 27.1 శాతం మంది మద్దతు తెలిపారు. అనూహ్యంగా విజయ్‌కు ఏకంగా 9.2 శాతం మంది మద్దతు పలికారు. దీంతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2 శాతంతో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 1.7 శాతంతో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతంతో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆ రకంగానూ విజయ్‌కు ఆదరణేప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్ మంచి స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో రాహుల్ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్ 7.5 శాతం, అఖిలేశ్ యాదవ్ 6.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.రెండేళ్లలోనే సీఎం.. ఇప్పుడేమోవిజయ్ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రారంభించారు. 2029 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే సంకేతాలు ఇస్తున్నారు.‘దక్షిణం నుంచి ప్రధాని రావాలి’విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకున్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన టీవీకే మంత్రి శరత్‌కుమార్.. విజయ్ భవిష్యత్ ప్రధాని అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.అంతకుముందు టీవీకే నేత, తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఇండియాటుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.25 వేల మందితో తాజా సర్వేఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా తాజా సర్వేను సీ ఓటర్ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన సాధారణ ట్రాకింగ్ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్‌కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: దటీజ్ విజయ్.. తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం -
ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్
ఢిల్లీ: నీట్, జేఈఈ లాంటి కీలక పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కీలక నియామకాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌ను ఎన్టీఏ డైరెక్టర్‌గా నియమించింది. ఐదేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (DoPT) గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ప్రసన్న వెంటేష్‌తో పాటు 2012 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్‌ను ఎన్టీఏకు మరో డైరెక్టర్‌గా నియమించారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ప్రసన్న వెంకటేశ్, రవి కుమార్ సింగ్ ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లు లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు.. ఏది ముందైతే అప్పటివరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు.ప్రసన్న వెంకటేశ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. మరోవైపు రవి కుమార్ సింగ్ కేంద్ర డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయనను ఎన్టీఏ డైరెక్టర్‌గా నియమించారు.ఇదే సమయంలో 2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్) అధికారి అమిత్ సాందారియాను NTA జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయి హోదాలో ఆయన నాలుగేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నీట్ పేపర్ లీకేజ్, పరీక్షల అవకతవకల నేపథ్యంలో ఎన్టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దాని ప్రక్షాళనకు దిగిన కేంద్రం.. పలువురిని తప్పించింది కూడా. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఎవరీ ప్రసన్న వెంకటేశ్?2012 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వీ ప్రసన్న వెంకటేశ్. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరులో బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. ఐఏఎస్‌లోకి వచ్చిన తర్వాత పాడేరు సబ్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, అనంతరం ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, పోర్ట్స్ డైరెక్టర్, కర్నూలు జాయింట్ కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా 2019లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. పారిశుధ్యం, చెత్త నిర్వహణ, నీటి సరఫరా, ట్రాఫిక్, నగర హరితీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై నుంచి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి నియమించింది. దేశవ్యాప్తంగా NEET, JEE వంటి కీలక పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ కీలక పాత్ర పోషిస్తుండడం, వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలనలో అనుభవం ఉన్న ప్రసన్న వెంకటేశ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: ఇక నో ఫెయిల్.. స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ -
అసెంబ్లీలో సీఎం విజయ్ కొత్త రూల్.. ప్రతిపక్షాల అభ్యంతరం
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం ఆసక్తికరంగా వ్యవహరించారు. సాధారణంగా స్పీకర్ కుర్చీకి సమీపంలో సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక సీటులో కూర్చునే ఆయన.. తొలిసారి ఆ స్థానాన్ని వదిలి మంత్రుల వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. విజయ్ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కుడివైపున ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీటు ఉంటుంది. ఆయన పక్కనే మంత్రులు వారి సీనియారిటీ ఆధారంగా కూర్చుంటారు. అయితే గురువారం మధ్యాహ్నం సమావేశాల సందర్భంగా విజయ్ తన సీటు నుంచి లేచి.. సభా నాయకుడు, మంత్రి కేఏ సెంగొట్టయ్యన్, మరో మంత్రి ఆధవ్ అర్జున మధ్యలో కూర్చున్నారు. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విజయ్ ఇష్టానుసారం వ్యవహరించడం తగదని.. పాలనకంటూ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయని.. వాటిని ఆయన పాటించాలని సూచించాయి. అయితే సహచర మంత్రులతో మాట్లాడేందుకే ఆయన ఇలా స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. CM Vijay is in some discussion with Minister KAS pic.twitter.com/CynRjQChQB— Actor Vijay FC (@ActorVijayFC) August 27, 2026సాధారణంగా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు తమ సహచరులతో మాట్లాడేందుకు కొద్దిసేపు సీట్లు మారడం కనిపిస్తుంటుంది. కానీ ముఖ్యమంత్రి తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల కోసం ఉద్దేశించిన సీటులో కూర్చోవడం మాత్రం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా.. సభలో అధికారుల గైర్హాజరుపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్న సమయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు అసెంబ్లీలోనే ఉండేలా చూడాలని స్పీకర్‌ను కోరారు. గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగినప్పుడు అప్పటి సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు చీఫ్ సెక్రటరీ, శాఖల కార్యదర్శులు సభలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం, ఉన్నతాధికారులు సభలో కనిపించడం లేదని విమర్శించారు.దీనిపై మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. అధికారులు పక్కనే ఉన్న ‘వార్ రూమ్’లో ఉండి, సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఉదయనిధి సూచనతో ఏకీభవించిన స్పీకర్.. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీనియర్ అధికారులు సభలోనే ఉండేలా ఆదేశిస్తామని చెప్పారు. అంతకుముందు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం విజయ్.. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు.ఇదీ చదవండి: రాఖీ పండుగను రాజకీయం కోసం వాడేసుకుంటున్నారా? -
మోదీ హవా తగ్గిందా? లేదా?.. తాజా సర్వేలో షాకింగ్ లెక్కలు
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా నిజంగా తగ్గిందా?.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి ఏంటి?.. జెన్‌జీ ఎఫెక్ట్‌ను తట్టుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. అయితే ఆ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇండియా టుడే–సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వే వెల్లడించింది.మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాస్త సర్ప్రైజింగ్ విషయాలే కనిపించాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఏకంగా 326 సీట్లు వస్తాయని తెలిపింది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 261 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుని 106 సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. అయితే ఇదే పోల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో జరిపిన సర్వే కంటే ఎన్డీయేకు ఇప్పుడు కాస్త ప్రతికూలతే కనిపిస్తోంది. జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీయే కూటమి బలం 26 సీట్లు తగ్గడం గమనార్హం. ఆ టైంలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని ఇదే సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీకి పార్టీకి 287 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఆ సంఖ్య ఇప్పుడు 26 సీట్లు తగ్గినట్లైంది. అయినప్పటికీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒరిజినల్‌గా బీజేపీ సాధించిన 240 సీట్ల కంటే తాజా అంచనా కూడా ఎక్కువగా ఉండటం విశేషం.మరోవైపు కాంగ్రెస్ బలం గణనీయంగా పెరిగే అవకాశముందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు 106 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది 26 సీట్ల పెరుగుదల. అప్పట్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని అంచనా వేశారు.ఇండియా కూటమికి 185మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో.. ఎన్డీయే కూటమికి 326 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని తాజా ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది స్వల్పంగా మాత్రమే పెరిగింది. అప్పట్లో ఇండియా కూటమికి 182 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఈ కూటమి వాస్తవంగా.. 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్డీయే ఓటు షేర్ 45.1 శాతంఓటు శాతం పరంగానూ ఎన్డీయే ముందంజలోనే ఉంది. తాజా సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. జనవరి సర్వేలో ఇది 47 శాతంగా ఉంది. మరోవైపు ఇండియా కూటమి ఓటు షేర్ స్వల్పంగా పెరిగి 39.1 శాతానికి చేరుతుందని అంచనా. జనవరిలో ఇది 39 శాతంగా ఉంది.400 పార్కు దూరమే..!ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఇప్పటికీ ఓటర్లలో గట్టి మద్దతు ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ‘400 పార్’ నినాదానికి ఈ అంచనా చాలా దూరంలో ఉంది. ముఖ్యంగా యువత, విద్యార్థులకు సంబంధించిన అంశాలు బీజేపీకి సవాలుగా మారుతున్నాయని సర్వే విశ్లేషణ పేర్కొంది.పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలు వంటి అంశాలపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపింది. అదే సమయంలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పలు కీలక అంశాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం ఆ పార్టీకి కొంత మేర రాజకీయంగా కలిసొస్తున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.ఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఈ తాజా అంచనాలను రూపొందించారు. సీ ఓటర్ నిర్వహించిన ఈ సర్వేలో జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన రెగ్యులర్ ట్రాకింగ్‌లో భాగంగా సేకరించిన 91,795 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషణలో పరిగణనలోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: విదేశీ పర్యటనకు మోదీ.. పుతిన్ భేటీకి ఛాన్స్? -
నేపాల్-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
వరదలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని మరో ప్రకృతి ముప్పు వణికించింది. రెండు చోట్లా గురువారం రాత్రి భూకంపం సంభవించింది. నేపాల్‌లో రిక్టర్‌స్కేల్‌పై 3.2 తీవ్రతతో.. టిబెట్‌లో 5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో నమోదు అయ్యింది. అదే సమయంలో బారియర్ సరస్సు కట్టలు తెంచుకుని విరుచుకుపడొచ్చని చైనా హెచ్చరికలు నేపాల్‌ను మరింత వణికిస్తున్నాయి.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ప్రకృతి విలయంలో ప్రాణనష్టం 500కి చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నేపాల్, టిబెట్ రెండు చోట్లా కలిపి 1500 మంది గల్లంతయ్యారు. ఇందులో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉండగా.. అత్యధికంగా భారతీయులే 300 మంది ఉన్నట్లు సమాచారం. వాళ్లలో అత్యధికంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. టెలికాం వ్యవస్థలు నాశనం కావడంతో చాలామంది జాడ తెలియక ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తెగిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక బృందాలకు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా విషాదానికి కారణం భూకంపం కాదని.. హిమనదం కూలిపోవడంతో భారీ మంచు–రాళ్ల ప్రవాహం ఏర్పడి ఆకస్మిక వరదలకు(ప్లాష్ఫ్లడ్స్) దారితీసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తేల్చిచెప్పింది. మరో వరద ముప్పునేపాల్ ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్తగా ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకరంగా మారింది. భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. సహజంగా ఏర్పడిన అడ్డంకి తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి.భారతీయుల ఆచూకీ లేదుఈ విపత్తుతో భారత్‌లోనూ ఆందోళన నెలకొంది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భారతీయుల్లో 84 మందిని రక్షించినట్లు సమాచారం. మరోవైపు టిబెట్ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు సమాచారం. వీరిలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు. విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు.ఎటు చూసినా బురద.. వరదల ధాటికి సెకన్ల వ్యవధిలో రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికాం వ్యవస్థలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులకూ భారీ నష్టం వాటిల్లింది. నేపాల్ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. నదీ తీరాలు, బురదలో కూరుకుపోయిన ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమైనా.. తాజా భౌగోళిక విశ్లేషణలు మరో విషయాన్ని వెల్లడించాయి. హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి జారిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, మట్టి, శిథిలాలు దిగువకు దూసుకెళ్లి ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉండటంతో విపత్తు ఇంకా ముగియలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. This is apocalyptic 👀What really caused these Nepal floods? Could it have been prevented from happening? pic.twitter.com/UPPDcutom5— Dr. Chika (@chikaehiemere) August 27, 2026ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కళ్ల ముందే సర్వనాశనం! -
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు మెడోగ్ డ్యామ్‌పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.నేపాల్ వరదలతో పెరిగిన ఆందోళనఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.చైనా మెగా డ్యామ్ ఇదే..చైనా టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.భూకంప జోన్లో భారీ నిర్మాణంమెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కే ఎందుకు ముప్పు?యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్‌లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.భారత్ వ్యూహం సిద్ధంచైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ భావిస్తోంది.భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భవిష్యత్తు ఎలా?ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్-టిబెట్ ప్లాష్ఫ్లడ్లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్.. భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్ వరదలపై అమెరికా సంచలన ప్రకటన -
కంగనా-కృతి వార్‌లోకి కేంద్ర మంత్రి.. ఏం చెప్పారంటే?
నటి కృతి సనన్ నటించిన నగల యాడ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ యాడ్‌ను బీజేపీ ఎంపీ.. నటి కంగనా రనౌత్ విమర్శించడం, నటి కృతి సనన్ విమర్శలకు ఘాటు సమాధానం ఇవ్వడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించడం, రాహుల్‌ను టార్గెట్ చేస్తూ కంగనా సెటైర్లు ఇలా రాజకీయ వివాదం నడిచింది. దీంతో సదరు జ్యువెలరీ బ్రాండ్ ఆ యాడ్నే తొలగించి.. క్షమాపణలు చెప్పింది. అయితే తాజాగా ఈ వివాదంపై.. కంగనా తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. యాడ్‌లో రాఖీ కట్టే సమయంలో కృతి సనన్ ధరించిన దుస్తులపై కంగనా రనౌత్ విమర్శలు చేశారు. సంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనల్లో ఇలాంటి దుస్తుల వినియోగంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు కంగనా వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను విమర్శించారు. అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒకరికి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నట్లే, ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించే హక్కు కూడా ఇతరులకు ఉంటుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.ఓ న్యూస్‌చానెల్ పాడ్‌కాస్ట్‌లో ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ప్రశ్నించగా.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక వైపుకే పరిమితం చేయలేమని అన్నారు. ‘‘మీకు నచ్చిన విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటే.. ఆ వ్యాఖ్యలతో విభేదించే లేదా వాటిని వ్యతిరేకించే హక్కు ఇతరులకు ఎందుకు ఉండకూడదు?’’ అని రిజిజు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంటుందని.. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ప్రశ్నించడం కూడా అదే స్వేచ్ఛలో భాగమని పేర్కొన్నారు.ఆంక్షలు విధించలేను, కానీ..బీజేపీ ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆమెకు సభా నిబంధనలు, విధానాలపై సూచనలు చేయగలనని రిజిజు తెలిపారు. అయితే పార్లమెంట్ వెలుపల వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని చెప్పడం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు.‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా స్పందనఇటీవల జెన్ జీ నిరసనల సమయంలో కంగనా చేసిన ‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా రిజిజు స్పందించారు. ఆమె మొత్తం యువతను ఉద్దేశించి అలా మాట్లాడలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారని వివరించారు. ప్రధానిని లేదా ఆయన కుటుంబ సభ్యులను అవమానించే భాషను తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం, రాజకీయంగా వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు.అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే ప్రమాణంవిమర్శలు, అభిప్రాయాల విషయంలో యువతీ యువకులకు వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదని రిజిజు పేర్కొన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. మనుస్మృతిపై జరుగుతున్న చర్చపైనా రిజిజు స్పందించారు. ఓ మత గ్రంథంలోని కొన్ని అంశాలను వ్యతిరేకించినంత మాత్రాన ఎవరినీ మత వ్యతిరేకిగా పరిగణించకూడదన్నారు. భారతదేశం మనుస్మృతి ఆధారంగా కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు ఒక నమ్మకాన్ని సమర్థించే హక్కు ఉన్నట్లే.. దానిని ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు.“ఎవరైనా ఒక విషయాన్ని నమ్మవచ్చు.. మరొకరు దానిని వ్యతిరేకించవచ్చు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి” అని రిజిజు పేర్కొన్నారు. అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, హింసను ప్రోత్సహించేలా చేసే వ్యాఖ్యలకు మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.స్విమ్మింగ్ మీమ్స్‌పై రియాక్షన్అరుణాచల్ ప్రదేశ్‌లో తాజాగా ఓ నదిలో కిరెన్ రిజిజు ఈత కొట్టారు.అయితే ఆ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. రాహుల్ గాంధీలా చేయాలని చూసి బోల్తా పడ్డారంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై పాడ్‌కాస్ట్‌లో కిరెన్రిజిజు స్పందించారు. అరుణాచల్‌లో నదుల్లో ఈత కొట్టడం.. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టినట్లు కాదని, ట్రోల్ చేసేవాళ్లుక అది అర్థం కాదని అన్నారాయన. తాను అక్కడి బిడ్డనని, అక్కడి నేలా నీరు తనకు అలవాటేనని చెప్పారు. పార్లమెంట్ మళ్లీ కొలువుదీరుతుందా?పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అవసరమైతే ఇదే సెషన్లో మరోసారి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. పార్లమెంట్‌ను ఎప్పుడు సమావేశపరచాలన్నది ప్రభుత్వ నిర్ణయమని.. రాష్ట్రపతికి ప్రభుత్వం సిఫార్సు చేస్తే సభను తిరిగి పిలవొచ్చని చెప్పారు. అయితే ప్రత్యేక సమావేశం ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘నా వ్యాఖ్యలను రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు’’ అంటూ రిజిజు చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై(డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు) ప్రభుత్వం మరోసారి ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.అరుణాచల్ చిన్నారికి రిజిజు భరోసా‘మమ్మల్ని చైనీస్ అని పిలవొద్దు.. మేము భారతీయులం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన అరుణాచల్‌ప్రదేశ్ చిన్నారి టింకిల్‌తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వీడియో కాల్లో మాట్లాడారు. ‘‘ఇప్పుడు మొత్తం భారత్ నిన్ను ప్రేమిస్తోంది’’ అంటూ చిన్నారిని రిజిజు అభినందించారు. ఆమె తల్లిదండ్రుల గురించి అడిగి.. ధైర్యంగా మాట్లాడినందుకు ప్రశంసించారు. ఇటానగర్‌కు చెందిన టింకిల్.. తనను చైనీస్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. ఈశాన్య ప్రాంత ప్రజలను రూపం ఆధారంగా వేరే దేశస్థులుగా భావించే ధోరణిపై మరోసారి చర్చ మొదలైంది. రిజిజు కూడా ఈశాన్య ప్రజలు భారతదేశంలో అంతర్భాగమని, వారి గుర్తింపును గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లుగా ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: మేకెదాటు వివాదంలో కొత్త ట్విస్ట్.. సాలిడ్ వార్నింగ్ -
సింగర్ దారుణ హత్య.. యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు
ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశం.. మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. షామ్లీ జిల్లాలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో ప్రజలకు, ప్రముఖులకు రక్షణ కరువైందని యోగి సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.పోలీసుల వివరాల ప్రకారం.. అంకిత్ బల్యాన్ జిమ్(33) నుంచి బయటకు వస్తుండగా బైకులపై వచ్చిన ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే కూలిపోగా.. దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు షామ్లీ ఎస్పీ ఎం.పీ. సింగ్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అంకిత్‌పై దుండగులు దాదాపు 18 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.ఎవరీ బల్యాన్ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోనూ అంకిత్ బల్యాన్ యూట్యూబ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన గాయకుడు. ఆయన ఛానల్‌కు 3.66 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. హర్యాన్వీ పాటలు, ప్రదర్శనలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వీడియోల్లో పాటలతో పాటు లగ్జరీ కార్లు, ఆయుధాల ప్రదర్శన హైలైట్ అయ్యేవి. ఇదిలా ఉండగా.. అంకిత్ బల్యాన్ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అఖిలేష్ ఆగ్రహంఅంకిత్ హత్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అయితే ఎస్సీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. ఈ ఘటన భయాందోళనలకు కారణమైందని పేర్కొన్నారు. అంకిత్ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని విలపించిన దృశ్యం హృదయ విదారకమని అన్నారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కక్షల కోణంలోనూ దర్యాప్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ హత్యపై జాట్ వర్గంలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జాట్లు మొత్తం జనాభాలో సుమారు 2–3 శాతం వరకు ఉంటారని అంచనాలు ఉన్నాయి. అయితే పశ్చిమ యూపీలోని షామ్లీ, ముజఫర్‌నగర్, బాఘ్‌పత్, మీరట్ వంటి జిల్లాల్లో వీరి ప్రభావం గణనీయంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో జాట్ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.ఇప్పటికే యూపీలో శాంతి భద్రతల గురించి దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్ల గురించి యోగి ప్రభుత్వ తొలి కాలంలో సానుకూల చర్చ నడిచినా.. ప్రస్తుత టర్మ్‌లో మాత్రం కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. అమాయకులు బలైపోతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు.. అభివృద్ధి అంశం పూర్తిగా పక్కకు జరిగిపోయిందనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంకిత్ బల్యాన్ హత్య రాజకీయ చర్చకు దారి తీసింది. జాట్ సంఘాలు దీనిని పెద్ద అంశంగా తీసుకుని ఆందోళనలు చేస్తే యోగి సర్కార్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితే ఎదురు కావొచ్చు.ఇదీ చదవండి: సీఎం కటింగ్ ఖరీదు 50రూ. -
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా.. -
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
నటి కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆ యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై విమర్శలు రావడంతో ఆమెకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొంటూ ‘స్మాష్ ద ప్యాట్రియార్కీ’ (పితృస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే దీనికి మరో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందిస్తూ కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో.. బ్రో.. కాస్త ఆగండి. భారత్ ‘మాతా’ కీ జై.. ప్రారంభిద్దాం’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో మాతా(తల్లి)ని హైలైట్ చేస్తూ.. రాహుల్‌కు కంగనా వెటకారంగా కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయితో రాహుల్ గాంధీ సంభాషణ అలాగే కొనసాగుతుంది. ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదనే ధోరణితో ఆమె రాహుల్‌ను ప్రశ్నించినట్లు ఆ బొమ్మలను కంగనా తన ఇన్‌స్టాలో స్టోరీలా పోస్ట్ చేశారు. ఓ యాడ్‌లో కృతి సనన్ దుస్తులపై మొదలైన వివాదం.. రాహుల్ జోక్యంతో రాజకీయ చర్చగా మారగా, కంగనా తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారింది.రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల బ్రాండ్ రూపొందించిన 32 సెకండ్ల ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించారు. అందులో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉంది. కృతి ధరించిన దుస్తులు, ప్రకటనలో పండుగను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగ సందర్భంగా కృతి ధరించిన దుస్తులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనను ‘ఇంటెన్షనల్లీ క్రీపీ’(ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికరంగా చూపించారు)గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో కంగనా–కృతి మధ్య సోషల్ మీడియా వేదికగా వాదన మొదలైంది.తనపై వస్తున్న విమర్శలకు కృతి సనన్ కూడా ఘాటుగానే స్పందించారు. ఒక మహిళ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఆమె ధరించే దుస్తులతోనే ఎందుకు అంచనా వేయాలని ప్రశ్నించారు. పండుగల అసలు భావం దుస్తుల్లో కాకుండా వాటి వెనుక ఉన్న అనుబంధం, విలువల్లో ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. అలాగే కుక్కకు రాఖీ కట్టడంపైనా స్పందిస్తూ.. రక్షాబంధన్ తమ కుటుంబంలో సోదరసోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, ప్రేమకు ప్రతీక అని కృతి వివరించారు. తన సోదరి, తాను ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటామని.. ఆ బంధంలో సోదరుడు మాత్రమే రక్షించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.కృతి స్పందనను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఎంపిక. తన స్వేచ్ఛను ఉపయోగిస్తున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపండి” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ‘Smash the Patriarchy’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఇక్కడే ఎంట్రీ ఇచ్చిన కంగనారాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే కంగనా తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ‘భారత్ మాతాకీ జై.. ప్రారంభిద్దాం’ అని పేర్కొనడం ద్వారా రాహుల్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి.ఇదీ చదవండి: అన్నాచెల్లెళ్ల ఆలయంలో.. రాఖీ వేడుకలు -
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్‌స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్‌తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
‘మమత ఉన్నారనుకుని వెళ్లాం.. మోసపోయాం!’
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్ గ్రూప్‌లో తాజాగా కలకలం రేగింది. ఎమ్మెల్యే మహమ్మద్ కాసెం సిద్ధిఖీ తిరిగి మమతా బెనర్జీ శిబిరంలో చేరారు. అంతేకాదు.. తిరుగుబాటు నేతలు తమను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.సోమవారం ఎమ్మెల్యే కునాల్ ఘోష్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధిఖీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. తాను ఎప్పటికీ మమతా బెనర్జీతోనే ఉంటానని స్పష్టం చేశారు. తిరుగుబాటు వర్గంలో చేరిన సమయంలో మమతా బెనర్జీ కూడా తమ నాయకురాలిగా కొనసాగుతారని భావించానని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఆ వర్గంతో ఎలాంటి సంబంధం లేదని తెలిసిందన్నారు.‘‘మమతా బెనర్జీ ఉన్నారని భావించి ఆ వర్గంలోకి వెళ్లాను. కానీ అక్కడ ఆమె కనిపించలేదు. ఆ వర్గానికి మమతతో ఎలాంటి సంబంధం లేదని తర్వాత అర్థమైంది. ప్రజలు మమతను చూసే ఓటు వేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆమె పోస్టర్లతోనే తిరిగాను. మమత ఎక్కడ ఉంటే.. మేమూ అక్కడే ఉంటాం’’ అని సిద్ధిఖీ పేర్కొన్నారు.‘గందరగోళంలో సంతకాలు చేయించారు’తిరుగుబాటు వర్గంలోకి తన చేరిక ఎలా జరిగిందో కూడా సిద్ధిఖీ వివరించారు. రితబ్రత బెనర్జీ తమను ఒక్కసారి సమావేశానికి పిలిచి.. మమతా బెనర్జీయే తమ నాయకురాలిగా కొనసాగుతారని చెప్పారని తెలిపారు. ఆ సమయంలో నెలకొన్న గందరగోళంలో తమతో ఒక లేఖపై సంతకాలు చేయించారని ఆరోపించారు. తర్వాత అసలు విషయం అర్థమైందని, మమతా బెనర్జీకి ఆ వర్గంతో సంబంధం లేదని తెలుసుకున్నానని చెప్పారు. సిద్ధిఖీ వ్యాఖ్యలకు కునాల్ ఘోష్ కూడా మద్దతు తెలిపారు. గందరగోళం, తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యేల నుంచి సంతకాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.రెబల్ క్యాంపులో కలకలంరితబ్రత బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ వేరు కుంపటి పెట్టింది. అంతేకాదు.. తమదే అసలైన టీఎంసీ అని చెప్పుకుంటోంది. అయితే కాసెం సిద్ధిఖీ తిరిగి మమతా శిబిరంలోకి రావడం తిరుగుబాటు వర్గానికి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు సిద్ధిఖీ తిరిగి టీఎంసీలోకి వచ్చిన సమయంలోనే ఆమ్‌డాంగా మాజీ ఎమ్మెల్యే రఫీకుర్ రహ్మాన్ తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో రఫీకుర్ రహ్మాన్‌ను కాదని ఆ స్థానంలో కాసెం సిద్ధిఖీని మమతా బెనర్జీని టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దించారు.ఎవరీ కాసెం సిద్ధిఖీ?ఆమ్‌డాంగా ఎమ్మెల్యేగా ఉన్న కాసెం సిద్ధిఖీ.. ఫుర్ఫురా షరీఫ్‌కు చెందిన ప్రముఖ పీర్జాదా కుటుంబానికి చెందినవారు. ఫుర్ఫురా షరీఫ్ ‘బోరో పీర్’గా ప్రసిద్ధి చెందిన అబు బకర్ సిద్ధిఖీ వారసుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2024 నుంచి మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉన్న సిద్ధిఖీ.. 2026 ఎన్నికల్లో ఆమ్దంగా నుంచి బీజేపీ అభ్యర్థి అరిందమ్ డేను ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.తిరుగుబాటు వర్గంలో చేరిన కొద్ది నెలలకే సిద్ధిఖీ తిరిగి మమతా బెనర్జీ శిబిరానికి రావడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఆమె గూటికే చేరతారనే ప్రచారం అక్కడ జోరుగా కొనసాగుతోంది.ఇదీ చదవండి: రాజకీయ సన్యాసమా? దీదీ ఏమన్నారంటే.. -
సీనియర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ షాకిచ్చిన వేళ.. పక్క రాష్ట్రం తమిళనాడు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు(2010 కంటే ముందు) టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని మంగళవారం విజయ్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.సీనియర్ టీచర్లకు ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుంచి మినహాయింపునకు సంబంధించిన తీర్మానాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తిగా, శాశ్వతంగా మినహాయించాలని అందులో కోరారాయన. ఈ ప్రతిపాదన ద్వారా సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.3.28 లక్షల మందికి ప్రయోజనం2010 ఆగస్టు 23కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన సుమారు 3,28,701 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ నిబంధన పరిధిలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. వీరిలో చాలామంది ఇప్పటికే 15 నుంచి 20 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరీక్ష రాయాల్సి రావడం వారి ఉద్యోగ భద్రత, జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు.Minister Rajmohan has moved a resolution urging the Central Government to exempt teachers who joined service before 2010 from the Teacher Eligibility Test (TET). pic.twitter.com/p4PiMcJFmL— Vignesh Theni (@Vignesh_twitz) August 25, 2026కేంద్రాన్ని కోరిన తమిళనాడుసీనియర్ టీచర్లకు ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా కోరుతున్నట్లు రాజ్‌మోహన్ తెలిపారు. ఇందుకోసం 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రమోషన్లకు ఇబ్బంది లేకుండా..టెట్ నిబంధన కారణంగా ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ ప్రయోజనాలు, ముఖ్యంగా పదోన్నతులు నిలిచిపోకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను కొత్తగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి నుంచి తప్పించడం ద్వారా వారి సర్వీస్ ప్రయోజనాలను కాపాడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోంది.ఏపీలో ఇదే అంశంపై కొంతకాలంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కనీసం మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలో 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయుల విషయంలో టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, NCTE స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఆరెస్సెస్ స్కెచ్.. జెన్‌జీ టార్గెట్ -
ముమ్మాటికి అది నీటి సమస్యేనా..? పరిశోధకులు సైతం..
అది కేవలం నీటి సమస్యేనా.. అంతకుమించి మరేదైనానా..!? టెక్నాలజీ పెరిగింది.. అంతరిక్షానికి చేరువయ్యే మేథస్సుని అందిపుచ్చుకుంటున్నా.. ఇంకా కులం కోరల్లో మగ్గిపోతున్నారు చాలచోట్ల. వీచే గాలి, ప్రసరించే ఎండకు లేని భేదం మనిషికి మనిషికి మధ్య కులం అనే అడ్డుగోడ సృష్టించే సమస్యలకు నిలువెత్తు నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌లో కనిపించే సమస్య. శాస్త్రవేత్తలను సైతం దిగ్బ్రాంతికి గురిచేసే మానవీయ సమస్య.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎండలు మండిపోతుండటంతో నీటి కష్టాలు తీవ్రంగా మారుతున్నాయి. కరువు, తక్కువ వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి కోసం ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికే ఉన్న కుల వివక్షను మరింత తీవ్రం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.జలౌన్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల మమత పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దళితురాలైన ఆమె.. కుటుంబ సభ్యులు, పశువుల అవసరాల కోసం ప్రతిరోజూ హ్యాండ్‌పంప్(బోరింగ్) వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తోంది. గ్రామంలో ప్రభుత్వ పథకం కింద ఏర్పాటు చేసిన నల్లాలు రెండేళ్లుగా పనిచేయకపోవడంతో సుమారు వెయ్యి మంది ప్రజలు కొద్దిపాటి హ్యాండ్పంపులపైనే ఆధారపడుతున్నారు. దీంతో మమత రోజుకు 8 నుంచి 10 సార్లు నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.అయితే నీటి కోసం వెళ్లే మమతకు ఎండలతో పాటు కుల వివక్ష కూడా ఇబ్బందిగా మారిందని ఆమె ఆరోపిస్తోంది. ఆధిపత్య కులాలకు చెందినవారు హ్యాండ్‌పంప్ వద్ద ఉన్నప్పుడు తాము నీటిని పట్టుకోలేమని, వారు వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాకుండా నిమ్నకులాలు తాకిన హ్యాండ్పంప్ని వారు వెళ్లిన తర్వాత నీటిని పోసి శుద్ధి చేస్తారని ఆరోపించింది. ఇదే తరహా అనుభవాన్ని షాజహాన్‌పూర్‌కు చెందిన శివ్ కూడా ఎదుర్కొంటున్నాడు. ఆధిపత్య కులాల వారు నీటిని తీసుకుంటున్నప్పుడు తమ వర్గానికి చెందినవారు హ్యాండ్‌పంప్ వద్దకు వెళ్లరని, ఎంత ఎండగా ఉన్నా వేచి ఉండాల్సిందేనని తెలిపాడు. కుటుంబ సభ్యులు ఎంత దాహంగా ఉన్నాసరే.. అగ్ర కులాలవారు అక్కడినుంచి వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాలని, గతంలో నీటి విషయంలో జరిగిన గొడవలో తన తల్లిపై దాడి కూడా జరిగిందని ఆరోపించాడు.వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలో చలికాలంలో రోజుకు 2, 3 సార్లు మాత్రమే నీటి కోసం వెళ్లే మమత.. వేసవిలో ఏకంగా 8 నుంచి 10 సార్లు నీటికోసం వెళ్లాల్సి వస్తోందని చెబుతోంది. మరోవైపు బుందేల్‌ఖండ్‌లో ఇటీవలి వేసవిలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ఆ ప్రాంతం రాతి నేల కారణంగా భూగర్భ జలాలను ఎక్కువగా నిల్వ చేసుకోలేకపోవడం, వర్షపాతం తక్కువగా ఉండటం కూడా నీటి సమస్యను అధికం చేస్తున్నాయి. అయితే నీటి వనరుల వద్ద కుల వివక్ష జరుగుతోందన్న ఆరోపణలను స్థానిక అధికారులు కొట్టివేస్తున్నారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు పైపుల ద్వారా తాగునీరు అందించడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపడుతున్నామని వారు చెబుతున్నారు.అయితే నీటి వనరులను పెంచడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఎండలు ఇప్పటికే ఉన్న సామాజిక అసమానతలను మరింత తీవ్రం చేస్తున్నాయని వారు చెబుతున్నారు. నీరు కొరతగా మారిన కొద్దీ నీటికై పోటీ పెరుగుతోందని, ఈ క్రమంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష మరింత స్పష్టంగా బయటపడుతోందని అంటున్నారు. అందరికీ సమానంగా నీరు అందేలా చూడటంతో పాటు కుల వివక్షను తొలగించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే బుందేల్‌ఖండ్ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ఇవి చదవండి: పర్యావరణ హిత జీవన సేద్యం -
యూపీఐకి పదేళ్లు.. మీ అనుభవమేంటో చెప్పండి: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి బాటలు వేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఇదొక కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ తరుణంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికరమైన పిలుపు ఇచ్చారాయన.‘‘యూపీఐ ప్రారంభమై పదేళ్లు పూర్తయ్యాయి#10YearsOfUPI. దాని స్థాయి, విస్తృతి ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం’’ అని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. యూపీఐతో తమకు ఎదురైన అనుభవాలను, అది తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను పంచుకోవాలని ప్రజలను కోరారు. #10YearsOfUPI హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పంచుకున్నారు.చిన్నగా మొదలై.. భారీ విప్లవంగా2016 ఏప్రిల్ 11న 21 బ్యాంకులతో యూపీఐ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. అదే ఏడాది ఆగస్టు 25 నుంచి యూపీఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటినుంచి యూపీఐ వినియోగం అనూహ్యంగా పెరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్ల వార్షిక లావాదేవీలు ఉండగా.. 2025–26లో ఏకంగా 24,162 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల విలువ కూడా తొలి ఏడాదిలో రూ.0.07 లక్షల కోట్ల నుంచి 2025–26లో సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది.ప్రపంచంలోనే అగ్రస్థానంలో..యూపీఐ ఇప్పుడు భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. 700కు పైగా బ్యాంకులు యూపీఐతో అనుసంధానమై ఉండగా.. ప్రపంచ రియల్‌టైమ్ చెల్లింపుల్లో దాదాపు 49 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.A decade ago, UPI was rolled out, marking a major turning point in India’s digital payments journey.The sheer scale and reach of UPI are something every Indian must be proud of. Tell me about your UPI experience and how it impacted your life... #10YearsOfUPI pic.twitter.com/Xtto6V6gpU— Narendra Modi (@narendramodi) August 25, 2026టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు.. స్నేహితులకు డబ్బులు పంపడం నుంచి బిల్లులు చెల్లించడం వరకు యూపీఐ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. నగదు అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో చెల్లింపులు చేసే సౌలభ్యం డిజిటల్ లావాదేవీలను సామాన్యులకు మరింత చేరువ చేసింది.‘మీ అనుభవం చెప్పండి’యూపీఐ పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ.. ఈ వ్యవస్థ తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో ప్రజలు చెప్పాలని కోరడం ఆసక్తికరంగా మారింది. యూపీఐ కేవలం చెల్లింపుల విధానాన్ని మార్చడమే కాకుండా.. భారత్ డిజిటల్ మౌలిక వసతుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన విజయగాథగా నిలిచిందని కేంద్రం పేర్కొంటోంది.పదేళ్లలో 1.78 కోట్ల నుంచి 24 వేల కోట్లకు పైగా లావాదేవీల స్థాయికి చేరిన యూపీఐ.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.ఇదీ చదవండి: UPI సృష్టికర్త ఎవరో తెలుసా? -
బీజేపీకి గుడ్‌బై.. ఆ వెంటనే విజయ్ TVK బంపర్ ఆఫర్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తమిళగ వెట్రి కజగం (TVK) రాజకీయంగా విస్తరించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకే పరిమితం కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అవకాశాలను ఇప్పటికే పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్‌కు మాంచి ఆఫర్ ఇచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బీజేపీపై రగిలిపోతున్న ఆ సీనియర్ నటుడే ఓ జాతీయ మీడియా చానెల్‌కు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ టీవీకే సకాలంలో అందిపుచ్చుకుంది. అద్భుత విజయంతో అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ కన్ను పక్క రాష్ట్రాలపై పడింది. విజయ్ క్రేజ్, అలాగే.. రాజకీయ పరిస్థితులను బేరీజూ వేసుకుని విస్తరణకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కేరళలో టీవీకే విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన దేవన్‌కు.. టీవీకే పార్టీ తాజాగా కేరళ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. దేవన్ ఆగస్టు 16న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన బీజేపీపై భగ్గుమన్నారు. దాదాపు ఐదేళ్లు పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదని, పనిచేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే సీఎం విజయ్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని దేవన్ తెలిపారు.#WATCH | Kollam, Keralam: On joining TVK after resigning from BJP, Malayalam actor Devan said, "...I've been working for the BJP very affirmatively, aggressively, taking a lot of risks. But they couldn't understand my mission and my planning. They are against all these things. I… pic.twitter.com/q9PW7Ur3Tp— ANI (@ANI) August 23, 2026ఆ తర్వాత టీవీకేకి చెందిన ఇద్దరు నేతలు తన ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం సీనియర్ నేతలతో గూగుల్ మీట్ ద్వారా కూడా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ TVK రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.విజయ్‌తో భేటీ తర్వాతే ప్రకటనదేవన్ త్వరలో చెన్నై వెళ్లి విజయ్ను కలవనున్నారు. సెప్టెంబర్ 10 తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విజయ్‌తో చర్చించిన అనంతరం TVKలో చేరిక, కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.విజయ్, దేవన్‌కు సినిమా రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధమే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణానికి దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే!మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దేవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. బాషా, ధర్మక్షేత్రం, రౌడీ మొగుడు, శుభాకాంక్షలు, పెళ్లి చేసుకుందాం, చన్నకేశవరెడ్డి, దేశముదురు, ఏ మాయ చేశావె, ఢమరుకం, హార్ట్ ఎటాక్, రాజుగారి గది-2, సాహో వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. దేవన్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. విద్యార్థి దశలో కాంగ్రెస్, KSUతో అనుబంధం ఉన్న ఆయన.. 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో దాన్ని నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునరుద్ధరించి, 2021లో బీజేపీలో విలీనం చేశారు. అనంతరం కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి TVK వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం కేరళలో అధికార, ప్రతిపక్ష కూటముల మీద జనాలకు అసంతృప్తి నెలకొందని, మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తే టీవీకే రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారాయన.కేరళలో ‘కొత్త ప్రత్యామ్నాయం’..కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఈ రెండు కూటముల మధ్యే అధికార పంపిణీ రొటీన్‌గా మారింది. ఈ మధ్యలో బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని భావించినా ఫలితం దక్కలేదు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, విజయ్ నేతృత్వంలోని TVK వైపు యువత, విద్యార్థులు ఆసక్తి చూపించొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు కేరళలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా ఆడేవి. గతంలో అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో దిగిన సెల్ఫీలు సైతం నెట్టింట పంచుకునేవారు. విజయ్ రాజకీయ ఎంట్రీ, విజయాన్ని సైతం అక్కడి ప్రజలు నిశితంగా గమనించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆదరణ దక్కవచ్చని దేవన్ అంటున్నారు. టీవీకేలోకి దేవన్ ఎంట్రీ జరిగితే.. కేరళలో TVKకి తొలి కీలక అడుగు పడినట్లే. అయితే ఒకవైపు తమిళనాడులో పార్టీని బలోపేతం చేస్తూనే.. కేరళలో సినీ రంగంలో పరిచయం ఉన్న నేతను ముందుకు తీసుకురావడం ద్వారా విజయ్ తన పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఎస్ఐ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు -
జంతర్ మంతర్ ఘటనలపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిశీలించాలని సోమవారం హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది. ఈ అంశంపై త్వరితగతిన మధ్యంతర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది. జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల హింస, బలప్రయోగం ఆరోపణలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ.. మహిళా నిరసనకారులపై హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలను ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.స్వయంగా విచారణ చేపట్టాలని అభ్యర్థనమహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో మహిళలు పోలీసుల చేత వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.బాధిత మహిళలు నేరుగా కమిటీకి ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో వాటిని స్వీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.నోడల్ అధికారుల ద్వారా ఫిర్యాదుల స్వీకరణదీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల్లో మహిళలపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, దాడుల అంశాలను ప్రాధాన్యంగా పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు తెలిపారు. కమిటీ చైర్‌పర్సన్‌కు నోడల్ అధికారులను నియమించే అధికారం ఇచ్చినట్లు చెప్పారు. నోడల్ అధికారుల నియామకం పూర్తయిన తర్వాత బాధితులు ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ విధానంలో ఫిర్యాదులు స్వీకరించాలి అనే అంశాలను కమిటీ ప్రకటిస్తుందని వెల్లడించారు.జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీజంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసుల హింస, నిరసనకారుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. పోలీసుల అధిక బలప్రయోగం, మహిళా నిరసనకారులపై లక్ష్యంగా జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించనుంది.మహిళల ఆరోపణలపై అత్యవసర నివేదికమహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలను సాధారణ అంశంగా కాకుండా ప్రత్యేక ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.జంతర్ మంతర్ ఘటనలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం ఇప్పుడు కీలకంగా మారింది. బాధిత మహిళలకు ఫిర్యాదు చేసే స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేయడం, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపడం కమిటీ ముందున్న ప్రధాన బాధ్యతగా మారింది. -
రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు.. యోగి ఆగ్రహం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. ఈ క్రమంలో.. సంప్రదాయాలు, సంస్కృతిని అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని యోగి మండిపడ్డారు.రాయ్‌బరేలీలో స్వాతంత్య్ర సమరయోధుడు రాణా బేని మాధవ్ బక్ష్ సింగ్ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహిళలు మనుస్మృతి సంకెళ్ల నుంచి బయటకు రావాలని వ్యాఖ్యానించారని యోగి ప్రస్తావించారు.“రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు. కానీ భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఆయనకు ప్రజాస్వామ్యంపై బాధ్యత ఉంది. దేశ సంప్రదాయాలు, వారసత్వాన్ని విమర్శించడం మీ జన్మహక్కు అని భావిస్తున్నారా?” అని యోగి ప్రశ్నించారు. మనుస్మృతి గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ భారతీయ గ్రంథాలను అధ్యయనం చేయాలని యోగి సూచించారు. మనువు, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అథర్వవేదం, శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణం వంటి గ్రంథాలను చదవాలని అన్నారు.“If you want to understand Manusmriti, read Artha Veda, Shatapatha Brahmana, you will get all information.”- CM Yogi Adityanath to Rahul Gandhi on 'Manusmriti mindset' remark pic.twitter.com/xwDfphNMVf— News Arena India (@NewsArenaIndia) August 24, 2026భారతీయ సంప్రదాయాలు, వారసత్వంపై అవగాహన లేకుండానే విమర్శలు చేయడం సరికాదని యోగి పేర్కొన్నారు. దేశ సంస్కృతిని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.విదేశాల్లో భారత్‌పై విమర్శలురాహుల్ గాంధీ గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై భారత సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని యోగి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ బయటకు వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని, విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. దేశం ఉగ్రవాదంపై పోరాడుతున్న సమయంలో సైన్యాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో సైనికులు శత్రువులతో పోరాడుతున్నప్పుడు వారి చర్యలకు ఆధారాలు అడగడం సరికాదన్నారు.కాంగ్రెస్‌పైనా ఫైర్అయోధ్య విరాళాల చోరీ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై యోగి విమర్శలు గుప్పించారు. అయోధ్యలో శ్రీరాముడి ఉనికిని ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, సంస్కృతి గురించి మాట్లాడుతోందని అన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రాణా బేని మాధవ్ బక్ష్ సింగ్ పేరుతో ఆడిటోరియంను యోగి ప్రారంభించారు. ఆయన పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసి, స్మారక సంచికను ఆవిష్కరించారు. రాయ్‌బరేలీ జిల్లాకు ఇది చారిత్రక రోజని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.రాహుల్ ఏమన్నారంటే..ఆగస్టు 22న మహారాష్ట్ర పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో మహిళల హక్కులు, స్వేచ్ఛపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. మనుస్మృతిలో మహిళల స్థానం గురించి ప్రస్తావించారు. “మనుస్మృతి ప్రకారం చిన్నతనంలో మహిళ తండ్రి ఆధీనంలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త మరణించిన తర్వాత కుమారుల ఆధీనంలో ఉండాలని చెబుతుంది. మహిళ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదనే ఆలోచనను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి భావనలు సిగ్గుచేటు” అని అన్నారాయన. అలాగే బీజేపీ, ఆరెస్సెస్‌లు మహిళలను చెరసాల బందీలుగానే చూస్తుంటాయని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ.. యూపీ సీఎం యోగి ఇప్పుడు విమర్శలు గుప్పించారు. #WATCH | Pune, Maharashtra: Addressing the "Chhatron Ki Goonj" program, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The Manusmriti says- "in childhood, a female belongs to her father. In youth, she belongs to her husband. When her lord is dead, she belongs to her sons. A… pic.twitter.com/JsqPlnFXsy— ANI (@ANI) August 22, 2026ఇదీ చదవండి: సెల్ఫీ కోసం వచ్చినట్లు చేసి, ముద్దు పెట్టి.. -
Ayodhya: శ్రావణ మాసంలో చేపల కూరా?
పవిత్రమైన శ్రావణ మాసంలో అందునా.. అయోధ్య నగరంలో చేపల వంటకాల భోజనాలు ఏర్పాటు చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు కొలువై ఉన్నచోట ఇలాంటి పనులు చేయడం ఘోర పాపమేనని తిట్టిపోస్తున్నారు. అయితే కార్యక్రమ నిర్వాహకుడు మాత్రం వ్యక్తిగత ఆహార స్వేచ్ఛ, సంప్రదాయాల పేరుతో ఈ ఏర్పాటును సమర్థించారు.అయోధ్య రామ మందిర విరాళాల గోల్మాల్ వివాదం కొనసాగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. తొలుత ఆయన శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గఢీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రామ్ నిహాల్ నిషాద్ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అజయ్ రాయ్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రాజ్‌పాల్ గౌతమ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేశ్ ప్రతాప్ సింగ్, పూర్వాంచల్ ఇన్చార్జ్ అభిషేక్ దత్ తదితరులు హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అతిథుల కోసం రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో.. చేపల వంటకాలు స్పెషల్కాగా.. అదే వివాదానికి దారి తీసింది.వీడియోతో మొదలైన వివాదంకార్యక్రమ వేదిక వద్ద చేపలు వండుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. భారీ వర్షం పడుతున్న సమయంలోనే అక్కడ చేపలను తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయోధ్యలో చేపల కూర వడ్డింపుపై కొందరు స్థానిక సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రావణ మాసంలో అయోధ్య వంటి పవిత్ర ప్రాంతంలో చేపల విందు ఏర్పాటు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.A Major Controversy at a Congress Event in AyodhyaA fish feast is allegedly being prepared in Ayodhya for the welcome of Uttar Pradesh Congress President Ajay Rai.Ajay Rai is scheduled to visit Arpit Lawn near the Hanuman Garhi temple, where fish is reportedly being prepared… pic.twitter.com/nY5K2SkTcy— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) August 23, 2026ఏం తినాలో మీరే చెప్తారా?అయితే కార్యక్రమ నిర్వాహకుడు రామ్ నిహాల్ నిషాద్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఆహారం తీసుకునే హక్కును కల్పించిందని అన్నారు. సమాజంలో చేపల వేట, చేపలు తినడం సంప్రదాయంలో భాగమని పేర్కొన్న ఆయన.. శ్రావణం, భాద్రపదం వంటి నెలల పేరుతో వ్యక్తుల ఆహార అలవాట్లను ప్రశ్నించకూడదని వ్యాఖ్యానించారు.రాజకీయ దుమారంతన అయోధ్య పర్యటనలో చెలరేగిన ఈ దుమారంపై అజయ్ రాయ్ స్పందించారు. దేశంలో అణచివేత, అన్యాయం కొనసాగుతోందని యూపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రామాలయంలో సమర్పించిన కానుకల విషయంలోనూ ఆయన ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని జైలుకు పంపాలని హనుమంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే అయోధ్యలో చేపల విందు వివాదం ప్రస్తుతం ఆహార స్వేచ్ఛ, మత విశ్వాసాలు, రాజకీయ విమర్శల చుట్టూ కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అతను సీఎం పదవికి అన్నివిధాల అర్హుడు! -
సీజేపీ ఎఫెక్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి!
కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమంతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై కొత్త చర్చ మొదలైంది. స్కూల్ ఠీక్ కరో పేరిట చేపట్టిన ఆ కార్యక్రమం.. నిన్న రాజస్థాన్‌లో తీవ్ర దుమారం రేపింది. జైపూర్ శివారులోని బాగ్రు గ్రామానికి వెళ్లిన ఆ బృందంపై దాడి జరిగింది. ఇది బీజేపీ చేయించిన పనేనని సీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డెడ్‌లైన్ కూడా విధించింది. ఈలోపు.. అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీజేపీ తనిఖీ ఎఫెక్ట్ ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయి. రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బాగ్రు స్కూల్ గురించి కూడా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారడంతో గతంలో అధికారులు దానిని వినియోగానికి అనర్హంగా ప్రకటించారట. దీంతో విద్యార్థులను తాత్కాలిక ఏర్పాట్లలోకి తరలించారు. అయితే తరగతులు పశువుల కొట్టం తరహా ప్రదేశంలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలతోనే CJP బృందం అక్కడికి వెళ్లింది. ఈ ఘటన తర్వాతే సంచలన విషయాలు బయటపడ్డాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద యూడీఐఎస్ఈ (UDISE) 2025–26 గణాంకాల ప్రకారం.. రాజస్థాన్‌లో 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయి. అందునా.. రాజధాని జైపూర్‌లోనే 38 పాఠశాలలకు భవనాలు లేవు. జలావర్ జిల్లాలోని అక్లేరా బ్లాక్‌లో అత్యధికంగా 23 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఖాన్పూర్లో 16, ఝల్రాపటన్లో 11 పాఠశాలలు భవనాల కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తం బడులలో.. 10 బాలికల పాఠశాలలకు భవనాలు లేవని తేలింది. భవనాలు ఉన్నా.. సదుపాయాల కొరతకేవలం భవనాల కొరత మాత్రమే కాకుండా.. ఉన్న పాఠశాలల్లోనూ మౌలిక వసతుల లోపాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని 64,484 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. 2,047 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరో 1,049 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో బన్స్వారా జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 188 పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం లేదు. దుంగర్‌పూర్‌లో 124, ఉదయ్‌పూర్‌లో 98 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలు దౌసా జిల్లాలో అత్యధికంగా 96 ఉన్నాయి.దిద్దుబాటు చర్యలుపాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.550 కోట్లు, భవనాలు లేని లేదంటే శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా వచ్చే ఐదేళ్లలో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.బీజేపీ సర్కార్‌పై ఆగ్రహంభజన్లాల్ శర్మ సర్కార్‌పై ప్రతిపక్షం మండిపడుతోంది. వివరాలు దాస్తూ ప్రభుత్వం నీళ్లు నములుతోందని మండిపడింది. ఆడిట్ వివరాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత టీకారామ్ జూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల పరిస్థితిపై సర్కార్‌కు స్పష్టమైన కార్యాచరణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 3,768 ప్రభుత్వ పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, 83,783 తరగతి గదులు వినియోగానికి అనర్హంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల పరిస్థితి కారణంగా కొన్ని చోట్ల తరగతులు నిలిపివేయాల్సి వచ్చిందని, విద్యార్థుల చేరికలపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భద్రత, పాఠశాలల ప్రమాణాల మెరుగుదల తమ ప్రాధాన్య అంశాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం CJP తనిఖీల ఘటన నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఇంతేకాదు.. కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఉత్తర్వు కూడా చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని స్పష్టం చేసింది.విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. అనుమతి లేకుండా ఎవరూ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా, అనధికారిక చిత్రీకరణను నియంత్రించేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు, విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సీజేపీ తనిఖీల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఆగమేఘాల మీద తీసుకొచ్చారని మండిపడ్డారు. పాఠశాలల వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం తగ్గించేలా ఈ ఆదేశాలు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే CJP ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం, బాగ్రు ఘటన, ఆ తర్వాత బయటపడిన 611 పాఠశాలల గణాంకాలు మరింత చర్చకు దారితీశాయి. దీంతో వివాదాస్పద ఉత్తర్వులను సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకునే నిర్ణయంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ మీటింగ్.. కొట్టుకున్న స్టూడెంట్ యూనియన్లు -
నిఖితకు ఏం జరిగింది?.. కాంచీపురం వర్సిటీలో కలకలం
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపింది. ఆంధప్రదేశ్ తిరుపతికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. రెండ్రోజులుగా బయట కనిపించని ఆమె.. హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఆమె మరణానికి కారుకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కాంచీపురం ఎనతూర్లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో తిరుపతికి చెందిన నిఖిత ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. గత కొన్నిరోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు. రెండు రోజులుగా తరగతులకు హాజరు కాలేదు. హాస్టల్ గదిలోనే ఉంటోంది. గురువారం రాత్రి ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వార్డెన్, ఇతర సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. నిఖిత విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పొన్నేరికరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.విద్యార్థుల ఆందోళనవిద్యార్థిని మృతితో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా నిఖిత తరగతులకు రాలేదని.. ఇటు హాస్టల్ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.“నిఖిత మృతికి కారకులను శిక్షించాలి” అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యంతోనూ ప్రాథమిక చర్చలు జరిపారు. పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే?ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సంబంధిత కారణాలతోనే నిఖిత తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిఖిత మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నీ తల్లి కోసమైనా బతకాల్సింది కదరా!
మహారాష్ట్రలోని ఓ కొండపై చోటుచేసుకున్న విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మీద అలిగి కొండ మీద నుంచి దూకుతానంటూ కొడుకు.. ఆ కొడుకును కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వాళ్లు చనిపోవడం చూసి తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ఘటనకు దారితీసిన కారణమేంటి?.. క్షణాల్లో మూడు ప్రాణాలను బలిగొన్న ఆ వివాదం వెనుక ఉన్న షాకింగ్ కారణాన్ని పోలీసులు వెల్లడించారు.ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా వాలూజ్‌లో ఘోరం జరిగింది. కొడుకును కాపాడేందుకు ప్రయత్నంలో.. కుటుంబం మొత్తం బలైంది. ఈ తీవ్ర విషాదం తిస్గావ్ ప్రాంతంలోని ఖవాడ్యా కొండపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. 19 ఏళ్ల కునాల్ చంద్రగూడే ఇంట్లో తెలియకుండా ఐఫోన్ కొన్నాడు. అయితే దాని ఈఎంఐ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో తండ్రికి అసలు విషయం చెప్పి.. ఈఎంఐ కట్టమని బతిమాలాడు. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో శుక్రవారం పొద్దున గొడవ జరిగింది. పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు, మాజీ సర్పంచ్ సహా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన బుజ్జగింపులుకునాల్ కొండ అంచున నిలబడి తీవ్ర నిర్ణయం తీసుకుంటానని బెదిరించడంతో అంతా బతిమాలడం మొదలుపెట్టారు. దాదాపు మూడు గంటల పాటు అతడిని కిందకు రావాలని నచ్చజెప్పారు. “నీ తండ్రి సంగతి వదిలేయ్.. నీ తల్లి కోసం అయినా బతుకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది” అంటూ పలువురు వేడుకున్నా కునాల్ వినలేదు. అతడికి ఐఫోన్ 15 ప్రో ఇప్పిస్తామని కొందరు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈలోపు కింద పోలీసులు వలతో సిద్దంగా ఉండడం గమనించి.. మరో అంచువైపు వెళ్లి దూకుతానంటూ బెదిరించాడు.చివరకు కుమారుడిని కాపాడేందుకు తండ్రి మురళీధర్ కొండ అంచు వద్దకు వెళ్లి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కునాల్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుండగా.. తండ్రిని పట్టుకుని లాగేశాడు. దీంతో కింద పడిపోతూ బలమైన గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటిదాకా అక్కడే కుప్పకూలి ఏడుస్తున్న సంగీత కూడా ఆ దృశ్యంతో షాక్ తింది. భర్త, కుమారుడు కళ్లముందే పడిపోవడాన్ని చూసిన ఆమె క్షణం ఆలస్యం కూడా చేయకుండా కొండపై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురూ మృతి చెందారు.ఒక ఫోన్ కోసం మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ కుటుంబాన్నే బలి తీసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నోట్: వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు!Tragic news from Chhatrapati Sambhajinagar:19-yr-old Kunal Chandgude died after jumping from Khavdya Hill following a dispute with his parents over a phone.His parents, Murlidhar (48) and Sangita, died trying to save him despite a 3-hr rescue effort by police and fire… pic.twitter.com/1doWOAx5cv— Bhavesh Gujrati (@Bhaveshlivelife) August 21, 2026ఇదే జిల్లాలో మరో విషాదం..ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోనే గురువారం జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైజాపూర్ తాలూకాలోని ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు రాసిన రెండు లైన్ల లేఖలో “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో మీ కోసం కచ్చితంగా డాక్టర్ అవుతాను.. మీరు జాగ్రత్తగా ఉండండి” అని పేర్కొనడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఒకవైపు ఐఫోన్ EMI వివాదం.. మరోవైపు కెరీర్ ఒత్తిడితో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు కుటుంబాలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై చర్చకు దారితీస్తున్నాయి.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: 105 ఏళ్ల దోషికి సుప్రీంకోర్టు సాయం -
విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?
తమిళనాడులో డీలిమిటేషన్ అంశం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ విషయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ వైఖరి మారిందంటూ అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం విజయ్ తన వైఖరిని సడలించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విజయ్ మిత్రపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తారని నిలదీస్తున్నాయి.. డీఎంకే ఎంపీ దయానిధి మారన్, సీఎం విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో డీలిమిటేషన్ బిల్లుపై ఓ పెద్ద జాతీయ పార్టీ డీఎంకేను ‘‘తమిళనాడు ద్రోహులు’’గా అభివర్ణించిందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని ఆరోపించారు.‘‘అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఒక తీర్మానం, అసెంబ్లీలో మరో తీర్మానం చేసి డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నిలిచిన విజయ్.. ఇప్పుడు న్యాయమైన డీలిమిటేషన్ కావాలని చెబుతున్నారు. మరి విజయ్ను రాహుల్‌గాంధీ ద్రోహి అంటారా?’’ అంటూ దయానిధి మారన్ ప్రశ్నించారు.అర్ధరాత్రి భేటీతో మార్పు వచ్చిందా?కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విజయ్ భేటీ అయిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని డీఎంకే ఆరోపిస్తోంది. గతంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన టీవీకే.. ఇప్పుడు ‘‘న్యాయమైన డీలిమిటేషన్’’ అంటూ కొత్త వైఖరి తీసుకుందని విమర్శించింది. ఈ పరిణామాలను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుంటూ విజయ్ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఇది పూర్తి యూటర్న్: అన్నాడీఎంకేవిజయ్ వైఖరిపై అన్నాడీఎంకే కూడా తీవ్రంగా స్పందించింది. టీవీకే ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని ఆరోపించింది. ‘‘ఇప్పుడు మీరు చెబుతున్నదే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత మాట మార్చడం ఎందుకు?’’ అంటూ అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. డీలిమిటేషన్ అంశంపై టీవీకే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అన్నాడీఎంకే ‘‘రాజకీయ డ్రామా’’గా అభివర్ణించింది.టీటీవీ దినకరన్ విమర్శలుఅమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ కూడా విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీవీకే అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఆరోపించారు. డీలిమిటేషన్ అంశంలో విజయ్ వైఖరి మారడంతో ఆ రాజకీయ వ్యూహం బయటపడిందని వ్యాఖ్యానించారు.మా వైఖరిలో మార్పు లేదు: టీవీకేవిమర్శల నేపథ్యంలో టీవీకే ఐటీ విభాగం స్పందించింది. డీలిమిటేషన్ అంశంపై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని, న్యాయమైన డీలిమిటేషన్ కోసం మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది.డీలిమిటేషన్‌పై కొత్త రాజకీయ సమరండీలిమిటేషన్ అంశం ఇప్పటికే తమిళనాడులో సున్నితమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందనే ఆరోపణలు రావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విజయ్ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ముప్పేట విమర్శలు గుప్పిస్తుండగా.. టీవీకే మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. దీంతో రానున్న రోజుల్లో డీలిమిటేషన్ అంశం తమిళనాడు రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: డీలిమిటేషన్.. కేంద్రం కీలక నిర్ణయం -
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ జైపూర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.సీజేపీ దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా.. జైపూర్ రాంపురా–కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ బృందం వెళ్లింది. గత కొంతకాలంగా ఆ స్కూల్లో పశువుల పాక నడుస్తోందన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా పాల్గొనాల్సి ఉంది.Very satisfying face off 🤣🤣🤣Rajasthan showing the way. Dipke got taste in Jaipur and now Ranka and team again in Rajasthan 🔥🤲🏻 pic.twitter.com/37rDnrgPov— Lala (@FabulasGuy) August 21, 2026VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka and others chased away by locals as they tried to visit Bagru village. Shivangi Sharma, CJP worker, says, "They attacked our workers, saying we are terrorists, Naxals. What is this outsider...… https://t.co/MqgiMSCt8R pic.twitter.com/U3VjdVgrl4— Press Trust of India (@PTI_News) August 21, 2026🇮🇳 #Breaking: #Villagers reportedly chased #CJP protestors down and beat them, while their vehicles were also attacked and car windows were smashed during the confrontation in #Jaipur .The incident reportedly took place during a CJP team’s visit to a government #school .… pic.twitter.com/XyAY8uHGzV— pradhyumn sharma (@pradhyu78651514) August 21, 2026అయితే.. ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై అశుతోష్ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని, బీజేపీ పంపించిన వ్యక్తులని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "బీజేపీ పంపించిన గూండాలు" అంటూ విమర్శలు చేశారు.#WATCH | Jaipur, Rajasthan: CJP National Spokesperson Ashutosh Ranka says, "The entire country saw BJP's hooliganism live today. Stone pelting was already happening there but the Police remained mute spectators. Police said that they won't do anything. This has been done at the… pic.twitter.com/pYPCh3UCOP— ANI (@ANI) August 21, 2026ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సీజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.అబ్బే జరిగింది అది కాదు: స్థానికులుఅయితే స్థానికుల్లో కొందరు మాత్రం సీజేపీ ఆరోపణలను ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. ‘‘వాళ్లు 250 మంది వచ్చారు. వాళ్లు చెబుతున్న దాంట్లో నిజం కూడా లేదు. ఆ పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరమ్మతుల కోసం రూ. 12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. బీజేపీనో, కాంగ్రెస్సో, మరేయితర రాజకీయ పక్షమో ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు. మా ఊరి అంశాన్ని రాజకీయం చేయొద్దని మేం అనుకుంటున్నాం. వాళ్లు నిరసన పేరిట స్కూల్‌కు నష్టం కలిగిస్తే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాఠశాల రక్షణ కోసం నిలబడ్డాం’’ అని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు.. తాము దాడి చేశామన్న దాంట్లో నిజం లేదని కూడా అంటుఉన్నారు.#WATCH | Jaipur, Rajasthan: A villager, Anu Sharma, says, "We opposed them because they are attempting to teardown this school...About 20-25 students come here to study. Where will they go?..We won't let them teardown the school. Funds (for repair) have already been… pic.twitter.com/kk86lCPUS4— ANI (@ANI) August 21, 2026స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం.. ఓ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని ఆదేశించింది. విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.ప్రతిపక్షాల విమర్శలుప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టీకారామ్ జూల్లీ.. ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించకుండా అడ్డుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఇదీ చదవండి: మంత్రుల కుక్కలకు మెరుగైన వసతులున్నాయి! -
బిడ్డను బడికి పంపాలంటేనే.. భయంగా ఉంది
ఆ వీడియోలు చూస్తే ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ఒకటే ప్రశ్న.. ‘స్కూల్‌కు పంపిన నా బిడ్డ సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారా?’.. మొన్న రాజస్థాన్ జైపూర్‌లో అమైరా.. నిన్న విశాఖపట్నంలో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ మృతి ఘటనలు.. ప్రతి తల్లిదండ్రినీ కలవరపెడుతున్న ప్రశ్నలుగా మారాయి.విశాఖపట్నంలో హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ బాలుడిని మందలించడం, కొట్టడం.. ఆ తర్వాత చిన్నారి ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం కలచివేస్తోంది. అయితే బాలుడి మృతికి అసలు కారణం ఏంటన్నది పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే ఈ ఘటన మరో పెద్ద ప్రశ్నను మన ముందుంచింది. పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు ‘పనిష్మెంట్’ అవసరమా? లేక ఆ పేరుతో మనం వాళ్లలో భయాన్ని పెంచుతున్నామా?..వీడియో చూస్తున్నప్పుడు కోపం రావడం సహజం. ఒక పసివాడిని భయపెట్టి, కొట్టడం సమర్థించలేం. అదే సమయంలో ఒక ప్రశ్న కూడా వెంటాడుతుంది.. ఆ టీచర్ కూడా ఓ బిడ్డకు తల్లే అయ్యి ఉండొచ్చు కదా? తన పిల్లవాడిని ఎవరైనా ఇలా భయపెడితే ఆమె ఎలా స్పందిస్తారు?. ఇక్కడ సమస్య ఒక్క టీచర్‌తో ముగిసేది కాదు. పిల్లలపై చేయి చేసుకోవడం తప్పు అని తెలిసినా.. ‘కొంచెం కొడితేనే చదువుకుంటారు’, ‘భయపెడితేనే మాట వింటారు’ అనే పాత ఆలోచన టీచర్లలోనే కాదు తల్లిదండ్రుల్లోనూ ఇంకా ఎందుకు బతికే ఉంది?.ఆరేళ్ల పిల్లవాడికి హోంవర్క్ పూర్తి చేయకపోవడం ఒక ‘నేరం’ కాదు. అతడి వయసుకు తగ్గ కారణం ఉండొచ్చు. అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆడుకోవాలనిపించి ఉండొచ్చు. అలసిపోయి ఉండొచ్చు. చెప్పలేని భయం ఏదైనా ఉండొచ్చు. అతడిని కొట్టడం కంటే.. ‘హోంవర్క్ ఎందుకు చేయలేకపోయావు?’ అని అడగాల్సింది.స్కూల్ అంటే భయపడాలా?ఒక పిల్లవాడు టీచర్‌ను చూస్తే భయపడుతున్నాడంటే అది క్రమశిక్షణ కాదు. అతడు తప్పు చేసినప్పుడు తన మాట చెప్పగలిగేంత భద్రతను అనుభవించాలి. స్కూల్ అంటే భయపడాల్సిన చోటు కాదు.. నేర్చుకోవడానికి, తప్పులు చేయడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి సురక్షితమైన స్థలం.ఇక్కడే రాజస్థాన్‌లోని అమైరా ఘటనను మరోసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి తనకు ఎదురవుతున్న ఇబ్బందిని మాటల్లో చెప్పేందుకు, సహాయం కోసం టీచర్‌ను ఆశ్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు చూపించాయి. కానీ ఆ చిన్నారి ఆర్తనాదాన్ని సకాలంలో ఎవరైనా గుర్తించారా? ఆమె ప్రవర్తనలో కనిపించిన ఆందోళనను ఎవరైనా అర్థం చేసుకున్నారా? అనే ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పిల్లలు ప్రతిసారీ ‘నాకు సమస్య ఉంది’ అని స్పష్టంగా చెప్పలేరు. వారి ఏడుపు, భయం, ప్రవర్తనలో మార్పు.. ఇవన్నీ కూడా సహాయం కోసం చేసే పిలుపులే కావచ్చు.మానసికంగా చూస్తే చిన్నారులపై శారీరక శిక్ష తక్షణ భయాన్ని కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలంలో చదువుపై ఆసక్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, పెద్దలను చూసి భయపడటం, సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘పనిష్మెంట్’కు బదులుగా పాజిటివ్ డిసిప్లిన్ అవసరం...అయితే పరిష్కారం ఏంటి?1.పాఠశాలల్లో పిల్లలపై చేయి చేసుకోవడం, అవమానించడం, బెదిరించడం విషయంలో జీరో టాలరెన్స్ ఉండాలి. ప్రతి పాఠశాలలో ఫిర్యాదు వ్యవస్థ ఉండాలి. పిల్లలు నేరుగా చెప్పలేకపోయినా.. తల్లిదండ్రులు, కౌన్సిలర్ లేదా నమ్మకమైన ఉపాధ్యాయుడికి విషయం చేరే మార్గం ఉండాలి.2.ఉపాధ్యాయులకు కేవలం సబ్జెక్ట్ బోధనే కాదు.. చైల్డ్ సైకాలజీ, కోపాన్ని నియంత్రించుకోవడం, పాజిటివ్ డిసిప్లిన్‌పై తప్పనిసరి శిక్షణ ఇవ్వాలి. ఒత్తిడిలో ఉన్న టీచర్‌కు కూడా కౌన్సెలింగ్ అవసరమే.3.తల్లిదండ్రులు ప్రతిరోజూ ఒక్క ప్రశ్న అడగాలి. “ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు?”. అంతేకాదు.. “ఎవరైనా నిన్ను కొట్టారా? భయపెట్టారా? నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా?”.. అని కూడా ప్రేమగా అడగాలి. ఎందుకంటే పిల్లలు తమ బాధను చెప్పడం నేర్చుకున్నప్పుడే మనం వారిని రక్షించగలం.ఒక చిన్నారి స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలు మాత్రమే ఉండాలి.. మనసులో భయం కాదు. టీచర్ చేతిలో చాక్ ఉండాలి.. పిల్లల మీద కోపం కాదు. తల్లిదండ్రుల గుండెల్లో నమ్మకం ఉండాలి.. ఏదో ఆందోళన కాదు. పనిష్మెంట్తో పిల్లలను మార్చలేం.. ప్రేమతో, ఓర్పుతో, అర్థం చేసుకోవడంతోనే వారి భవిష్యత్తును మార్చగలం.ఇదీ చదవండి: టీచర్ కొట్టడంతోనే పిల్లాడు చనిపోయాడా? -
మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ!
నీట్ లీకేజీ వ్యవహారంపై నెలకు పైగా ఆందోళనలు చేసి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. ఇప్పుడు మరో మంత్రి రాజీనామాకు పట్టుబడుతోంది. ‘‘మంత్రుల కుక్కలకు కూడా ఇంత కంటే మెరుగైన సౌకర్యాలు ఉంటున్నాయి. మరి ఈ పిల్లలేం పాపం చేశారు?’’ అంటూ సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఈ ఉద్యమాన్ని నడిపించబోతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదాజీ భూసే(Dadaji Bhuse) పదవి నుంచి తప్పుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితులకు ఆయనే నైతిక బాధ్యత వహించాలని అంటోంది. మంత్రి గనుక రాజీనామా చేయకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. లాతూర్ జిల్లా ఔసా తెహశీల్ ఉజని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే గురువారం సందర్శించారు. సీజేపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను పరిశీలించిన ఆయన.. అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు.తరగతి గదుల్లో బెంచీలు లేకపోవడం, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, పాఠశాలలకు వెళ్లేందుకు సురక్షితమైన రహదారులు లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. “మంత్రుల కుక్కలకు కూడా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస వసతులు లేవు” అని దీప్కే ఘాటు వ్యాఖ్యలు చేశారు.జంతువుల కంటే హీనంగా చూస్తున్నారుకొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని దీప్కే ఆరోపించారు. ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన సమస్య అని, రాజకీయ నాయకులు విద్యార్థుల కోసం ఏమీ చేయకపోతే ప్రజలు వారికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నాయకులు హెలికాప్టర్లలో తిరగడానికే ప్రజలు ఓట్లు వేస్తున్నారా? అని నిలదీశారు.తమ గ్రామాలకు వచ్చే అన్ని పార్టీల నాయకులను విద్య కోసం పనిచేయాలని ప్రజలు డిమాండ్ చేయాలని సూచించారు. పాఠశాలలను బాగు చేసే వరకు ఓట్ల కోసం గ్రామాలకు రావొద్దని నేతలకు చెప్పాలని పిలుపునిచ్చారు. కులం, మతం పేరుతో రాజకీయాల కోసం బయటకు వచ్చే ప్రజలు.. తమ పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలల సమస్యలపై కూడా పోరాడాలని కోరారు.మంత్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తారా?మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని దీప్కే డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి తెలుస్తాయని అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ పాఠశాలల్లో ప్రాథమిక సమస్యలను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు.కొన్ని పాఠశాలల్లో రేకుల పైకప్పులు కారుతున్నాయని, విద్యార్థులు సరైన బెంచీలు లేకుండానే చదువుకుంటున్నారని చెప్పారు. పాఠశాలల పరిసరాల్లో చెత్త, పాత సామగ్రి పేరుకుపోవడంతో పాములు సంచరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పాముకాటుతో విద్యార్థులు మృతి చెందిన ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు(ఆ వివరాలు చివర్లో..).మంత్రి తప్పుకోవాల్సిందే.. లేదంటే ఉద్యమంపాఠశాలల పరిస్థితి చూస్తుంటే దాదా భూసే విద్యాశాఖ మంత్రిగా కొనసాగకూడదని దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ప్రజలతో కలిసి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.సీజేపీ చేపట్టిన పాఠశాలల తనిఖీలతో కొన్ని చోట్ల అధికారులు పనులు ప్రారంభించారని దీప్కే తెలిపారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు. 2029 ఎన్నికల నాటికి జెన్‌జీ కీలక ఓటు బ్యాంకుగా మారుతుందని, విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలను వారు ప్రశ్నిస్తారని పేర్కొన్నారు.ఎవరీ దాదాజీ భూసే..దాదాజీ భూసే మహారాష్ట్రకు చెందిన శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) సీనియర్ నేత, మాలేగావ్ ఔటర్ ఎమ్మెల్యే. 2024 డిసెంబర్ నుంచి మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనను రాజీనామా చేయాలని సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. పాముకాటును నోటిఫయబుల్ డిసీజ్..మహారాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటును నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించింది. ఇందుకు కారణం.. గడ్చిరోలి జిల్లాలో జరిగిన విషాద ఘటన. ఆగస్టు 9న జప్తలై గ్రామంలోని ప్రభుత్వ సహాయంతో నడిచే గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషపాము కాటుకు ముగ్గురు బాలికలు మృతి చెందగా.. మరో ముగ్గురు విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాత పాముకాటు కేసులను వెంటనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడంతో పాటు యాంటీ-స్నేక్ వెనమ్ (ASV) లభ్యతను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, వైద్యులు ప్రతి పాముకాటు కేసు, మరణాన్ని తప్పనిసరిగా అధికారులకు నివేదించాలి. దీంతో పాముకాటు ఘటనలపై సమగ్ర సమాచారం సేకరించి, ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడ యాంటీ-వెనమ్ కొరత ఉంది వంటి అంశాలను గుర్తించి సత్వర చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. -
పెళ్లి వద్దని చెప్పింది.. వేడి నీరు పోసేశారు
ఓ వృద్దుడితో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై వేడినీరు పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. హర్యానాలోని కురేషీపూర్ గ్రామంలో ఈ సంఘటన జరగ్గా ప్రస్తుతం ఆ యువతి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఛాతీ, ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.బాధితురాలు, ఆమె మేనమామ చెప్పినదాని ప్రకారం.. బిహార్‌లోని సహాపూర్కు చెందిన యువతికి రెండేళ్ల క్రితం కురేషీపూర్‌కు చెందిన రోహిత్‌తో పెళ్లయింది. ఇతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ధర్మేంద్ర, లలిత అనే దంపతులు.. తల్లిదండ్రుల్లా చూసుకుంటామని చెప్పి రెండు నెలల క్రితం సదరు యువతిని తమ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత రోహిత్- ఆమె విడాకులు తీసుకునేలా చేశారు. రూ.3 లక్షలకు ఆశపడి తమ దగ్గరే ఉన్న ఈ యువతిని ఓ వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూశారు.కానీ ఈ పెళ్లి సదరు యువతి వ్యతిరేకించడంతో ఆగస్టు 16న తెల్లవారుజామున 4 గంటల టైంలో ధర్మేంద్ర, లలిత కలిసి ఆమెపై వేడి నీరు పోసి గాయపరిచాడు. చికిత్స కోసం బయటకు వెళ్లకుండా అడ్డుకుని, ఓ గదిలో బంధించి తాళం వేసి మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు. ఇదంతా తన సోదరి ద్వారా తెలుసుకున్న యువతి మేనమాన పంకజ్.. పోలీసులతో కలిసి ఆగస్టు 18న కురేషీపూర్‌కు వెళ్లాడు. అయినా సరే ఇంటి తలుపులు తెరవలేదు. తర్వాత రోజు మళ్లీ వెళ్లారు. ఈసారి పోలీసుల సహాయంతో తాళం పగులగొట్టి గదిలో ఉన్న యువతిని బయటకు తీసుకొచ్చారు. తొలుత ఆమెని ఫరీదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.యువతిపై జరిగిన దాడి, ఆమెను గదిలో నిర్బంధించిన ఘటనతో పాటు రూ.3 లక్షలకు వృద్ధుడికి పెళ్లి చేయాలన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వందేమాతరం: కాంగ్రెస్‌పై అమిత్ షా ఆగ్రహం
వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాంగ్రెస్ తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ విధానం వల్లే దేశం రెండు ముక్కలైందంటూ మండిపడ్డారాయన. గురువారం ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి దేశాన్ని అవమానించడమే. రెండు చరణాలే పాడాలని సీడబ్ల్యూసీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం జాతికి వ్యతిరేకం. ఆ పార్టీ వైఖరికి నిరసనగా ప్రజలు ఉద్యమించాలని షా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ 1937లో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన, పాకిస్థాన్ ఆవిర్భావానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.స్వాతంత్య్ర సమరయోధులను అవమానించారువందేమాతరం ఆలపిస్తూ జైళ్లకు వెళ్లిన, ఉరికంబాలు ఎక్కిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తోందని షా విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంకించంద్ర ఛటర్జీ రచనను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలు దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ కౌంటర్.. 1937 నిర్ణయానికే కట్టుబడి ఉంటాంఅమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర అగ్రనేతల సమక్షంలో ఆనాడు తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆలపిస్తామని తెలిపారు.ఇదంతా రాజకీయ రగడే: జైరాం రమేశ్1937 అక్టోబర్ 28న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరంపై తీర్మానం ఆమోదించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం వందేమాతరం అంశాన్ని బీజేపీ రాజకీయ వివాదంగా మారుస్తోందని, యువత, పరీక్షల పేపర్ లీకులు, చందా సేకరణ, విదేశాంగ వైఫల్యం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతంమరోవైపు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి ఆరు చరణాల వెర్షన్‌ను ఆలపించనున్నారు. దీని వ్యవధి సుమారు 3 నిమిషాల 10 సెకన్లు కాగా, జాతీయ గీతం ‘జనగణమన’ వ్యవధి 52 సెకన్లు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గీతం.. కాంగ్రెస్ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలన్న నిర్ణయం మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. -
జస్టిస్ రవికుమార్‌కు షాక్.. ఆ 100 కేసులు బదిలీ!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి కుమార్ దివాకర్ తీర్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత నాలుగు నెలల్లో ఆయన 10 హత్య కేసుల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద విచారణలో ఉన్న మరణశిక్ష, జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న సుమారు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు. అందుకు కారణం ఏంటో కూడా చెబుతున్నారు.ముజఫర్‌నగర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హత్య కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న కేసులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి ప్రకారం.. ఈ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉందన్న ఆందోళన న్యాయవాదులు, కక్షిదారుల్లో నెలకొంది.ఎవరీ రవి కుమార్ దివాకర్?46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో అజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం న్యాయ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. బీకామ్, ఎల్ఎల్ఎం పట్టాలు పొందిన ఆయన 2025 నవంబర్ నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. 2022లో వారణాసిలోని జ్ఞాన్వాపి సముదాయంలో వీడియో సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.నాలుగు నెలల్లో 22 మరణశిక్షలు..రవి కుమార్ దివాకర్ ఇటీవల వరుసగా సంచలన తీర్పులు వెలువరించారు. ఆగస్టు 13న 12 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధించారు. షామ్లీ జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో 2014లో పవన్ కుమార్ ఇంటిపై దాడి చేసి కాల్పులు జరిపిన కేసులో రామ్‌వీర్, రాజీవ్, రాహుల్, హరేంద్ర కుమార్‌లను దోషులుగా తేల్చారు.అంతకుముందు ఆగస్టు 12న 1999లో రూ.5 లక్షల విమోచన కోసం కలప వ్యాపారి సలీంను కిడ్నాప్ చేసి హత్య చేసిన షహనవాజ్‌కు ఉరిశిక్ష విధించారు. దాదాపు 27 ఏళ్ల నాటి కేసులో ఈ తీర్పు వెలువడింది. జూలై 17న 2011లో దోపిడీకి ప్రయత్నిస్తూ రైతు రాజ్సింగ్ను హత్య చేసిన కేసులో నలుగురికి మరణశిక్ష పడింది. జూలై 6న పంచాయతీ ఎన్నికల కక్షల నేపథ్యంలో 2010లో రాజ్బీర్ సింగ్‌ను హత్య చేసిన కేసులో మాజీ గ్రామ సర్పంచ్, అతని సహచరుడికి ఉరిశిక్ష విధించారు. ఈ కేసు ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైనది’ అని కోర్టు అభిప్రాయపడింది.విధుల్లో ఉన్న హోంగార్డును హత్య చేసిన కేసులోనూ..2020లో విధుల్లో ఉన్న హోంగార్డు రతిరామ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన దీపక్‌కు జూలై 2న మరణశిక్ష విధించారు. తన తల్లిపై దాడి చేసిన నిందితుడిని అడ్డుకునేందుకు రతిరామ్ ప్రయత్నించడంతో ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. జూన్ 20న రాజేంద్ర సైనీ హత్య కేసులో గజేంద్ర, రామ్కిరణ్లకు ఉరిశిక్ష విధించారు. మే 30న 15 ఏళ్ల నాటి డబుల్ మర్డర్ కేసులో 50 ఏళ్ల రహీస్‌కు మరణశిక్ష పడింది. అతడు రాజేశ్ దేవి, ఆమె ఆరేళ్ల కుమారుడు హిమాంశును ఇటుకలతో కొట్టి చంపినట్లు కోర్టు నిర్ధారించింది.ఏప్రిల్ 28న 2019 నాటి హత్య కేసులో ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 6న రూ.45 లక్షల ఆర్థిక వివాదం నేపథ్యంలో న్యాయవాది మహ్మద్ సమీర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధించారు.ఎందుకింత చర్చ?ఒకే న్యాయమూర్తి నాలుగు నెలల వ్యవధిలో 10 కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించడం న్యాయ వర్గాల్లోనే కాదు.. ఇటు దేశవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. ముఖ్యంగా మరణశిక్ష అనేది ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైన’ కేసుల్లోనే విధించాల్సిన గరిష్ఠ శిక్ష కావడంతో.. ఈ తీర్పులపై ఆసక్తి నెలకొంది. అయితే మరణశిక్ష విధించినంత మాత్రాన వెంటనే ఉరి అమలు జరగదు. భారత న్యాయవ్యవస్థలో ఇటువంటి తీర్పులకు తదుపరి న్యాయపరమైన దశలు ఉంటాయి. అప్పీళ్లు, ఉన్నత న్యాయస్థానాల పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే తుది పరిణామం ఉంటుంది. ఈ నేపథ్యంలో దివాకర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సుమారు 100 కేసుల బదిలీ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. -
మహేష్‌బాబు సినిమా చూసి.. హత్యకు స్కెచ్!
మంచి కంటే చెడు త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే సినిమాల్లోనూ హీరోలను గ్యాంగ్స్టర్లుగా, మాఫియా డాన్లుగా చూపించే ట్రెండ్ పెరుగుతోంది. తెరపై చూపించే క్రైమ్ సన్నివేశాలు, వాటి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే సందేశాత్మక చిత్రాల నుంచి కూడా చెడునే స్వీకరిస్తుండడం.. ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేరళలో వెలుగుచూసిన ఓ హత్య కేసు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరలేపింది. తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమా.. అక్కడ ఓ దారుణ హత్యకు స్ఫూర్తినివ్వడమే అందుకు కారణం. కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగిన 65 ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ దొంగతనం కేసుగా మొదలైన ఈ ఘటన వెనుక.. మొదట ప్రొఫెషనల్ హంతకుల ప్రమేయం ఉందేమోనని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే మైనర్లు, అందునా పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా నిర్ధారించుకున్నారు. అయితే తన తాత హత్యకు 13 ఏళ్ల మనవరాలే సహకరించడం.. ఈ కేసులో మరో కీలక అంశంగా వెల్లడైంది. కరువత్తలో శివన్కుట్టి(65) హత్య కేసులో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హత్యకు 2017లో విడుదలైన ‘స్పైడర్’ చిత్ర స్ఫూర్తిగా నిలిచిందని మైనర్ నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. మహేష్ బాబు నటించిన ఈ బైలింగువల్ చిత్రంలో దర్శకనటుడు ఎస్జే సూర్య.. సైకో విలన్ పాత్ర భైరవలో అలరించాడు. మురగదాస్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే సూర్య విలనిజానికి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అదుగో ఆ క్యారెక్టర్ నుంచి.. అందునా ఓ సీన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని.. ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సినిమా చూసి హత్యకు ప్లాన్?పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు తొలుత శివన్కుట్టి ఇంటి పైకప్పు పెంకులు తొలగించి లోపలికి ప్రవేశించాలని భావించారు. నిద్రలో ఉన్న సమయంలో పెద్ద రాయితో దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనకు 2017లో వచ్చిన తమిళ సినిమా ‘స్పైడర్’లోని ఓ హత్య సన్నివేశమే ప్రేరణగా నిలిచిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇంటి పైకప్పు కింద చెక్కతో నిర్మించిన సీలింగ్ ఉండటంతో వారి మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో మరో మార్గంలో ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.వాట్సాప్ చాట్లే కీలక ఆధారంఈ కేసులో కీలక ఆధారాలు నిందితుల వాట్సాప్ సంభాషణల ద్వారా లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మనవరాలు, ఆమె స్నేహితుడి మధ్య జరిగిన చాట్లలో హత్యకు సంబంధించిన పలు ప్రణాళికలు చర్చించినట్లు గుర్తించారు. విషం పెట్టడం, వాహనంతో ఢీకొట్టడం వంటి పద్ధతుల గురించి కూడా వారు మాట్లాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కరునాగప్పల్లి ప్రాంతానికి చెందిన ఓ కిరాయి ముఠాను సంప్రదించి హత్య చేయించేందుకు ప్రయత్నించారని.. అయితే డబ్బు ఆఫర్ చేసినా ఆ ముఠా అంగీకరించలేదని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.రాత్రి రైల్లో వచ్చి.. దాడిపోలీసుల ప్రకారం.. నిందితులు శనివారం రాత్రి కొల్లం నుంచి రైలులో కరువట్టకు చేరుకున్నారు. శివన్కుట్టి నిద్రపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పైకప్పు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత.. వెంటిలేటర్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకరు ఇంట్లోకి వెళ్లి తలుపు తెరవడంతో మిగతావారు లోపలికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. శబ్దం విని శివన్కుట్టి లేచి రావడంతో ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత లైవ్ మర్డర్ ఫొటోలను బాలికకు నిందితుడు పంపించాడు.ఐఫోన్, బైక్‌ల కోసం దొంగతనం?హత్య తర్వాత ఇంట్లో ఉన్న ఆరు సవర్ల బంగారాన్ని నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బంగారాన్ని అమ్మి బాలికకు ఐఫోన్, ఇతర నిందితులకు బైక్‌లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంతలో పోలీసులకు దొరికిపోయాడు.తప్పుడు కథనం సృష్టించారా?కేసు దర్యాప్తులో మరో కోణం కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివన్కుట్టి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం. అయితే అది నిజమైన కారణమా? లేదంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు సృష్టించిన కథనా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.కుటుంబంతో కలిసి జీవనం..శివన్కుట్టి కుటుంబం రెండేళ్ల క్రితం కొల్లం నుంచి కరువట్టకు మారింది. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు తొలుత అద్దె ఇంట్లో ఉండేవారు. అనంతరం శివన్కుట్టి అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ ఘటనలో చిన్న వయసులో ఉన్న నిందితులు ఇంత పక్కా ప్రణాళికతో.. అదీ సినిమా చూసి హత్యకు పాల్పడ్డారన్న విషయం కేరళలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. -
రూ.8,452 కోట్ల పీఎంకేర్స్.. బడుల కోసం మళ్లించాలా?
కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ఫండ్ మరోసారి చర్చలోకి వచ్చింది. ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నట్లు తాజా ఆడిట్ వివరాలు వెల్లడించడంతో.. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలనే అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన డిమాండ్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.యువత తనకు అండగా నిలిస్తేనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. యువత కలలను సాకారం చేసేందుకు అవసరమైన అవకాశాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే.. దేశ భవిష్యత్‌కు కీలకమైన విద్యారంగం, ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి పీఎంకేర్స్ నిధులను వినియోగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పీఎంకేర్స్ నిధులు ఎంత పెరిగాయి?.. 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations) ఫండ్‌ను ఏర్పాటు చేసింది. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఫండ్‌లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి.తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎంకేర్స్ ఫండ్ నుంచి మొత్తం చెల్లింపులు కేవలం రూ.87.85 లక్షలుగా ఉన్నాయి. ఇందులో రూ.87.84 లక్షలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందించే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కోసం ఖర్చయ్యాయి. మిగిలిన మొత్తం బ్యాంకు తదితర చిన్న ఖర్చులకు వెళ్లినట్లు వివరాలు వెల్లడించాయి.అంతకుముందు ఏడాది రూ.7,173 కోట్లుగా ఉన్న నిల్వ.. ఏడాదిలో దాదాపు 17.8 శాతం పెరిగింది. ఇందులో సుమారు రూ.7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా.. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే నిధులు పెరిగినప్పటికీ.. విరాళాల రూపంలో వచ్చే ఆదాయం మాత్రం తగ్గింది. 2024-25లో దేశీయ విరాళాలు రూ.479 కోట్లకు పడిపోయాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గినట్లు వివరాలు చెబుతున్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఫండ్‌కు ప్రధాన ఆదాయంగా మారింది.సీజేపీ డిమాండ్ ఏంటి?పీఎంకేర్స్‌లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నప్పటికీ.. దేశంలోని గ్రామీణ పాఠశాలలు కనీస సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు, తరగతి గదుల్లో బెంచీలు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎత్తిచూపుతూ సీజేపీ ఇప్పటికే ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ బడుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తూ.. పాఠశాలల పరిస్థితిని పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సీజేపీ చెబుతోంది.‘‘ఒకవైపు పాఠశాలలకు నిధుల కొరత ఉందని చెబుతున్నారు.. మరోవైపు రూ.8,500 కోట్లు పీఎంకేర్స్‌లో ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఈ డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు వినియోగించకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒక మోడల్ హైటెక్ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని లెక్కిస్తే.. ఈ మొత్తంతో వెయ్యికి పైగా ఆధునిక పాఠశాలలు నిర్మించవచ్చని ఆయన చెప్పారు.పీఎంకేర్స్పై వచ్చిన ఆరోపణలు ఏంటి?పీఎంకేర్స్ ఏర్పాటు అయినప్పటి నుంచే ఈ ఫండ్ పారదర్శకతపై ప్రతిపక్షాలు, కొన్ని పౌరసంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలపై విమర్శలు వచ్చాయి:ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావడం లేదు?పీఎంకేర్స్ నిధులు ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నప్పటికీ.. ఇది సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిధుల సేకరణ, ఖర్చుల వివరాలపై పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని విమర్శలు వచ్చాయి.కాగ్ ఆడిట్ ఎందుకు లేదు?ప్రతిపక్షాలు పీఎంకేర్స్‌ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆడిట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇది ప్రభుత్వ నిధులతో కాకుండా స్వచ్ఛంద విరాళాలతో నడిచే ట్రస్ట్ కావడంతో కాగ్ పరిధిలోకి రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.నిధులు ఎందుకు ఎక్కువగా నిల్వ ఉన్నాయి?రూ.8,452 కోట్లలో ఎక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండటంపై కూడా విమర్శలు వచ్చాయి. అత్యవసర సహాయం కోసం ఏర్పాటైన ఫండ్‌లో ఇంత పెద్ద మొత్తం వినియోగం లేకుండా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.‘‘అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు ఉండగా.. వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?’’ అనేది చాలా మంది అడిగేది. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. పీఎంకేర్స్ అనేది అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన స్వచ్ఛంద విరాళాల ట్రస్ట్ అని, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించేందుకు నిధులు అందుబాటులో ఉండాలని చెబుతోంది.ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి?పీఎంకేర్స్ ఒక స్వతంత్ర ట్రస్ట్ అని, దీనికి ఎలాంటి బడ్జెట్ నిధులు కేటాయించరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో ఇది నడుస్తుందని పేర్కొంటున్నాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, వెంటిలేటర్ల కొనుగోలు, అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు నిధులను నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే..సీజేపీ డిమాండ్‌కు ప్రజల్లో కొంత మద్దతు కనిపిస్తున్నప్పటికీ.. ఆచరణలో ఇది అంత సులభం కాదన్నది ప్రభుత్వ వర్గాల మాట. పీఎంకేర్స్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు అత్యవసర సహాయానికి సంబంధించినవి కావడంతో.. నిధులను విద్యా రంగానికి మళ్లించాలంటే ట్రస్ట్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో పాఠశాలల మౌలిక వసతుల సమస్యలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి భారీ నిధులను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే రంగాల్లో వినియోగించాలనే డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.అసలు ప్రశ్న ఏంటి?పీఎంకేర్స్ విషయంలో ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు.. విపత్తుల సమయంలో వెంటనే ఉపయోగించుకునేలా భారీ నిధి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. ప్రజల విరాళాలతో ఏర్పడిన వేల కోట్ల నిధులు మరింత పారదర్శకంగా ఉండాలని, అవసరమైన రంగాలకు ఉపయోగపడాలని విమర్శకులు కోరుతున్నారు.రూ.8,452 కోట్ల పీఎంకేర్స్ నిధి.. కేవలం ఓ ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. అత్యవసర నిధి లక్ష్యం, ప్రజా ప్రయోజనం, పారదర్శకత మధ్య సమతుల్యతపై జరుగుతున్న పెద్ద చర్చకు ఇది కేంద్ర బిందువుగా మారింది. -
పగటి కలలు కనొద్దు.. రాందేవ్‌కు కంగనా ఘాటు కౌంటర్
న్యూఢిల్లీ: జెన్‌జీ వ్యాఖ్యల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని.. ఆ అవసరం కూడా లేదని సోషల్ మీడియా వేదికగా రాందేవ్‌కు కాస్త ఘాటైన చురకలే అంటించారు.‘‘బాబాజీ.. నా యవ్వనం గురించి, నా బెడ్రూమ్ గురించి పగటి కలలు కనొద్దు’’ అంటూ కంగనా(40) ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. వదంతులు, ఊహాగానాల ఆధారంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని అన్నారు. ‘‘నాకు ఎప్పుడూ తప్పుడు ప్రచారాల విషయంలో సుప్రీంకోర్టు నుంచి చివాట్లు పడలేదు. వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నా.. కాబట్టి నాకు వ్యక్తిత్వ పాఠాలు చెప్పొద్దు. నాది మీ కంటే మంచి క్యారెక్టర్’’ అంటూ రాందేవ్‌పై విమర్శలు చేశారు.ఎక్కడ మొదలైంది?ఇటీవల నీట్ పరీక్ష వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలపై కంగనా స్పందించారు. కొందరు యువత ప్రవర్తనను విమర్శిస్తూ వారిని ‘జనరేషన్ గట్టర్’ అంటూ అభివర్ణించారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, తల్లిదండ్రులపై ఆధారపడుతూ వ్యవస్థకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు.కంగనా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్‌తోనూ ఆమెకు మాటల యుద్ధం నడిచింది. అయితే వ్యవహారం మరింత ముదరడంతో ఆమె వివరణ ఇస్తూ.. మొత్తం జెన్‌జీ యువతను ఉద్దేశించి మాట్లాడలేదని, కొందరి ప్రవర్తనను మాత్రమే విమర్శించానని తెలిపారు.కంగనాపై రాందేవ్ విమర్శలుఈ వివాదంపై స్పందించిన బాబా రాందేవ్(60).. కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘యువతను ‘జనరేషన్ గట్టర్’ అనడం కలుషిత ఆలోచనకు నిదర్శనం’’ అని వ్యాఖ్యానించారు. ఆమె బాల్యం, యవ్వనం, గత విజయాల గురించి ప్రశ్నిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దీంతో రాందేవ్ వ్యాఖ్యలకు స్పందించిన కంగనా.. ఆయన గతంలో పతంజలి సంస్థకు సంబంధించిన తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ప్రస్తావించారు.పతంజలి కేసులో..2024లో పతంజలి సంస్థ వ్యాధులను నయం చేస్తామని ప్రచారం చేసిన ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అనంతరం రాందేవ్ కోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపారు.ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ.. తనపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని కంగనా సూచించారు. దీంతో కంగనా–రాందేవ్ మధ్య మాటల యుద్ధం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్‌జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్‌జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్‌లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్‌లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
ఫ్రీ పెట్రోల్ కోసం ఆశగా వెళ్తే..
కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవలి కాలంలో జనాలను ఆకట్టుకునే పేరుతో చేసే ప్రచారాలు ఎంతవరకు నిజమో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యం పేరిట డబ్బులు వసూలు చేసే స్కాములు, సాయం పేరుతో పెయిడ్ వీడియోలు ఇలా ఎన్నో ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో ‘ఫ్రీ పెట్రోల్’ అంటూ వచ్చిన ఓ ప్రకటనను నమ్మి.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. తీరా అక్కడ వారికి ఊహించని పరిణామం ఎదురైంది.రాకేశ్ ట్రెహాన్ అనే వ్యక్తి సోషల్ సర్వీస్ పేరిట నెట్టింట కాస్త ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. అయితే.. ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తానంటూ ప్రకటించడంతో.. మంగళవారం సాయంత్రం ఛండీగడ్(పంజాబ్) వాహనదారులు బంకుల వద్దకు టూవీలర్లు, కార్లు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. అయితే అప్పటికే భారీ వర్షం మొదలైంది. ఉచితంగా వచ్చే పెట్రోల్ కోసం జనాలు దానిని పెద్దగా లెక్క చేయలేదు. ఈ లోపు క్యూ లైన్ భారీగా పెరిగిపోయింది.అయితే చెప్పిన టైంకి పెట్రోల్ పంపిణీ ప్రారంభం కాలేదు. ఈలోపు బంక్‌ల వద్ద పరిస్థితులు చేజారిపోతుండడంతో నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి వాహనదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈలోపు బంక్వాళ్లు కేవలం 15 మందికి ఉచితంగా పెట్రోల్ కొట్టి.. మిగతావాళ్లకు నో చెప్పారు. ఫ్రీ టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో మిగతా వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉచిత పెట్రోల్ ఇస్తారన్న సమాచారంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినవారిని ఇలా వెనక్కి పంపడం ఏమిటని ప్రశ్నించారు. రాకేశ్‌ను బండ బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.Chandigarh: The city witnessed chaos after a video of a petrol langar organized by Amritsar-based Rakesh Trehan, alias Raja Di King, went viral. A large crowd had gathered at the spot before the police arrived, and after their arrival, the crowd was evacuated from the petrol… pic.twitter.com/pA1iPQ4mh8— IANS (@ians_india) August 18, 2026 ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి వచ్చిన సుమన్ అనే మహిళ.. పెట్రోల్ ఇవ్వడానికి పంపు సిబ్బంది అనుమతించలేదని తెలిపారు. కేవలం 10–15 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినట్లు చెప్పారు. అన్షు అనే మరో వ్యక్తి తాను దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షంలో పెట్రోల్ పంపు వద్ద వేచి చూసినట్లు తెలిపారు.రాకేశ్ రియాక్షన్పరిస్థితిపై రాకేశ్ ట్రెహాన్ స్పందించారు. సోషల్ మీడియాలో ‘రాజా ది కింగ్’గా గుర్తింపు పొందిన ఆయన.. భారీ వర్షం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. వర్షంలో ప్రజలు ఇబ్బందులు పడటం, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో పెట్రోల్ పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు. అక్కడికి వచ్చినవారికి ఆయన క్షమాపణలు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.ఆగస్టు 21 నుంచి మళ్లీ.. మూడు రోజుల పాటు!తాజా ప్రకటన ప్రకారం ‘పెట్రోల్ లంగర్’ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు రాకేశ్ ట్రెహాన్ తెలిపారు. అదే సమయం, అదే ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెట్రోల్ పంపిణీ కోసం ఆగస్టు 21న కూపన్లు లేదంటే కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత పెట్రోల్ పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు. -
కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ స్ట్రీట్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.మిర్జా గాలిబ్ స్ట్రీట్‌లోని ఓ హోటల్లో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు హోటల్లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది.Nine dead, six injured in massive fire at hotel in Kolkata. pic.twitter.com/3Bcso2y1AJ— News Arena India (@NewsArenaIndia) August 19, 2026కొనసాగుతున్న సహాయక చర్యలుసమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో హోటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.చుట్టుపక్కల హోటళ్లకూ మంటలు..మంటలు ఒక్క హోటల్‌కే పరిమితం కాకుండా సమీపంలోని మరికొన్ని హోటళ్లకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ఫ్రీ స్కూల్ స్ట్రీట్, మిర్జా గాలిబ్ స్ట్రీట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు.వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు మృతిఈ ఘటనలో మృతుల్లో పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన వారు హోటల్లో బస చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి కూడా ఉండటంతో ఘటన మరింత విషాదకరంగా మారింది.ప్రమాదానికి కారణం?అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత హోటల్‌ను పరిశీలించి ప్రమాదానికి అసలు కారణాన్ని నిర్ధారించనున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ట్రంప్ కితాబుపై భారత్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న తన వాదనకు భారత్ ఎన్నికల విధానాన్ని ట్రంప్ ఉదాహరణగా చూపించారు. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే భారత్‌లో గుర్తింపు ఆధారిత ఓటింగ్ విధానం అమలవుతోందని.. అందుకే అమెరికాలోనూ ఆ తరహా చట్టం రావాలంటూ ఆయన చట్టసభలపై ఒత్తిడి పెంచారు. దీంతో భారత్ స్పందించింది.భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో నిరూపితమయ్యాయని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా స్పందించబోనని చెప్పారు. అయితే భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ విశ్వసనీయత, పటిష్ఠత ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన వాస్తవమని పేర్కొన్నారు. భారత్‌లో ఎన్నికలు భారీ స్థాయిలో జరిగినప్పటికీ.. ఓటింగ్ ప్రక్రియలో గుర్తింపు, పారదర్శకతకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.అమెరికాలో ఓటర్ల అర్హతను మరింత కఠినంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్న ట్రంప్.. ఇందుకు భారత్ ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపించారు. ఇటీవల భారత్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య ఒక శాతానికి లోపే ఉందని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు పత్రం అవసరమని ప్రస్తావించారు.భారత్ సీఈసీతో అమెరికా అధికారుల చర్చలుట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ నెల ప్రారంభంలో ఆయన అమెరికా ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు లేకుండానే ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రశ్నించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఓటరు గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన వాదిస్తున్నారు.‘సేవ్ అమెరికా యాక్ట్’కు ట్రంప్ పట్టుదలఅమెరికా ఎన్నికల ప్రక్రియలో పౌరసత్వ ధ్రువీకరణ, ఓటరు గుర్తింపును తప్పనిసరి చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ ‘SAVE America Act’కు మద్దతు కూడగడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను నిర్ధారించే నిబంధనలను ఈ బిల్లు మరింత కఠినతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వానికి ఆధారాలు సమర్పించడంతో పాటు.. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధన అమలు చేయాలని ట్రంప్ కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌పైనా ఆంక్షలు విధించాలన్నది ఆయన ప్రతిపాదనలో కీలక అంశం.భారత్ మోడల్‌నే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, పౌరసత్వ ధ్రువీకరణపై రాజకీయ చర్చ తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ట్రంప్ భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనే ఎన్నికలను భారత్ నిర్వహిస్తున్న తీరును ఆయన తన వాదనకు మద్దతుగా ఉపయోగించుకున్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం మాత్రం ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. భారత ఎన్నికల వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం, విశ్వసనీయత ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఎన్నికల సంస్కరణల చర్చలో భారత్ ఓటరు గుర్తింపు విధానం మరోసారి అంతర్జాతీయంగా ప్రస్తావనకు వచ్చింది. -
వందేమాతరం వివాదం.. సోనియాకు బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. బీజేపీ తీవ్రంగా స్పందించింది. వందేమాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలు సంధించారు.ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన సందర్భంగా సోనియాగాంధీ వ్యవహరించిన తీరు తమకు తీవ్రంగా అభ్యంతరకరంగా అనిపించిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వందేమాతరం మొత్తాన్ని ఆలపించడాన్ని ఆమె వ్యతిరేకించినట్లుగా కనిపించిందని వ్యాఖ్యానించారు. జాతీయ గీతం వంటి అంశంపై కాంగ్రెస్ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామం అవమానకరమని విమర్శించారు.కాంగ్రెస్ మీడియా విభాగం దీనిపై ఇచ్చిన వివరణను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేస్తున్నందుకే ఆ సమయంలో అలా జరిగిందన్న వివరణను ఆయన కొట్టిపారేశారు. అది సరైన వివరణ కాదని, వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించిందని అన్నారు.గోవాలోనూ రెండు చరణాలే..ఆగస్టు 15న గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా బీజేపీ నేత ప్రస్తావించారు. అక్కడ కూడా వందేమాతరంలోని రెండు చరణాలనే ఆలపించారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.‘స్వాతంత్య్ర ఉద్యమంపై గుత్తాధిపత్యం చెప్పుకోవద్దు’వందేమాతరం విషయంలో కాంగ్రెస్ ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తే.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి తామే ఏకైక వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని రవిశంకర్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశభక్తికి ప్రతీకగా భావించే వందేమాతరంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.సోనియా వ్యాఖ్యల నేపథ్యంలో..ఇదిలా ఉండగా.. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వందేమాతరం వివాదాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్‌పై దాడి చేసింది. -
‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మరణశిక్ష అమలు చేసే విధానంపై చాలా దేశాలు పునరాలోచన చేస్తున్నాయి. ఇంజెక్షన్లు, ఛాంబర్లు.. ఇలా కొత్త తరహా మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్‌లో అనాదీగా వస్తున్న ఉరిశిక్షను మార్చాలంటూ పిటిషన్ దాఖలు కాగా.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఎంతో బాధాకరమైనదే అయినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెబుతూ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. మరణశిక్షలో ఉరిశిక్షను తొలగించాలంటూ సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ఓ పిటిషన్ వేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 354(5) ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీని “మెడకు ఉరి బిగించి మరణించే వరకు వేలాడదీయాలి” అని నిబంధన ఉంది. ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి.. ఉరి విధానాన్ని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. దీనిని పరిశీలించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి ఆ విధానమే కొనసాగుతుందని చెబుతూ.. పిటిషన్‌ను కొట్టేసింది. అయితే భవిష్యత్తులో బలమైన వైద్య, శాస్త్రీయ ఆధారాలు అందుబాటులోకి వస్తే ఈ అంశాన్ని మరోసారి రాజ్యాంగపరంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.‘ఉరి చాలా బాధాకరం’..రిషి మల్హోత్రా దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. ఉరి తీసే ప్రక్రియలో ఖైదీ తీవ్రంగా, ఎక్కువసేపు బాధపడే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఉరికి బదులుగా లెథల్ ఇంజెక్షన్, కాల్చి చంపడం, విద్యుదాఘాతం లేదంటే గ్యాస్ ఛాంబర్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలని కోరారు. ఉరిశిక్ష అమలులో ఖైదీ వెంటనే చనిపోడని.. మరణాన్ని నిర్ధారించేందుకు కొంత సమయం పడుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి భిన్నంగా కొన్ని ప్రత్యామ్నాయ విధానాల్లో మరణం తక్కువ సమయంలోనే సంభవించే అవకాశం ఉందని వాదించారు.కేంద్రానికి ఆ స్వేచ్ఛ ఉందిఅయితే ప్రస్తుతానికి ఉరి విధానాన్ని రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ఉరిశిక్ష అమలు ద్వారా కలిగే బాధ, ఖైదీ గౌరవం, రాజ్యాంగ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన ప్రత్యామ్నాయం ఉందా? అనే అంశాన్ని నిపుణుల కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్రం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. 2023లోనే మొదలైన చర్చఉరిశిక్ష అమలు విధానంపై ఈ చర్చ ఇప్పటిది కాదు. 2023 మార్చిలో ఇదే పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఉరి వల్ల కలిగే నొప్పి, మరణానికి పట్టే సమయం, అమలులో ఎదురయ్యే సమస్యలపై వివరాలు సేకరించాలని అటార్నీ జనరల్‌ను కోరింది. అదే ఏడాది మేలో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి.. మరణశిక్ష అమలుకు మెరుగైన ప్రత్యామ్నాయ విధానం ఉందా? అనే అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కోర్టుకు తెలిపారు.‘లెథల్ ఇంజెక్షన్’పై భిన్నాభిప్రాయాలువిచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు అమెరికా సహా ఇతర దేశాల్లో అమల్లో ఉన్న లెథల్ ఇంజెక్షన్ విధానాన్ని ప్రస్తావించారు. ఖైదీకి ఉరి లేదా లెథల్ ఇంజెక్షన్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కూడా వాదించారు. అయితే లెథల్ ఇంజెక్షన్ పూర్తిగా నొప్పిలేని, మానవీయ విధానమేనన్న అభిప్రాయాన్ని ప్రాజెక్ట్ 39A సైతం పూర్తిగా సమర్థించలేదు. ఇతర దేశాల్లో ఈ విధానం అమలైన అనుభవాలను పరిశీలిస్తే.. అది కూడా అనేక సమస్యలకు దారితీసిన సందర్భాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రత్యామ్నాయాలపై మరింత శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించింది.ఉరి వేసేవారి మానసిక పరిస్థితిపైనా..విచారణలో మరో ఆసక్తికర అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మరణశిక్ష అమలు చేసే జైలు సిబ్బంది, ఉరివేసే వ్యక్తుల(తలారీ)పై పడే మానసిక ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సందీప్ మెహతా సూచించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుత ఉరి విధానాన్ని రద్దు చేయకపోయినా, మరణశిక్షను ఏ విధంగా అమలు చేయాలి? ఖైదీకి కనీస బాధతో, గౌరవాన్ని కాపాడుతూ శిక్షను అమలు చేయగలమా? అనే అంశంపై భవిష్యత్ చర్చకు మార్గం తెరిచి ఉంచింది. -
అయోధ్య విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు ఊరట
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్చిట్ ఇచ్చింది. చంపత్తో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా కేసులో ఎలాంటి పాత్ర లేదని సిట్ తేల్చింది. రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు, నగదు చోరీ జరిగాయన్న ఆరోపణలు తెరపైకి రావడంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇద్దరూ జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రత, నిర్వహణకు సంబంధించిన అంశాలపై SIT అధికారులు వారిని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చంపత్ రాయ్ తనకు విరాళాల చోరీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన SIT తన తుది నివేదికను సోమవారం ఉత్తర్‌ప్రదేశ్ హోం శాఖకు సమర్పించింది. అనంతరం దానిని తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు.‘అక్రమాలు తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నా’విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటం తన బాధ్యతేనని చంపత్ రాయ్ SITకు వివరించినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా ఆయన వాంగ్మూలంతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన SIT.. విరాళాల చోరీలో రాయ్, అనిల్ మిశ్రా పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని నిర్ధారించినట్లు సమాచారం.జూన్ 13న SIT ఏర్పాటురామ మందిర విరాళాల చోరీ ఆరోపణలపై ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో SITను ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలోపే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.SIT జూన్ 23న ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. విరాళాల నిర్వహణ వ్యవస్థలో పలు లోపాలను గుర్తించిన బృందం.. వాటిని సరిదిద్దేందుకు కఠినమైన సిఫార్సులు చేసింది.ఎనిమిది మందిపై FIRSIT ప్రాథమిక నివేదిక ఆధారంగా ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ సహా పలువురి పేర్లను చేర్చారు. మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) కింద కేసులు నమోదు చేశారు. SIT సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే తదుపరి FIRలు, అరెస్టులకు సంబంధించిన చర్యలు కొనసాగాయి.తాజాగా SIT తుది నివేదికలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్చిట్ ఇవ్వడంతో ఈ కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇక దర్యాప్తు నివేదిక ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తదుపరి చర్యలు తీసుకోనుంది. -
తుకారాం ముండేకు బిగ్ షాక్.. జరిమానా
నిబంధనలు పాటించని ఆహార దుకాణాలపై చర్యలు తీసుకోవడం వరకు బాగానే ఉంది.. కానీ నిబంధనలు పాటించిన తర్వాత కూడా లైసెన్స్ పునరుద్ధరించకుండా ఆ వ్యాపారాన్ని అడ్డుకోవం ఎంత వరకు సబబు?. ఈ వ్యవహారాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది అతిగా వ్యవహరించడమేనని పేర్కొంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు జరిమానా విధించింది.తుకారాం ముండే మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ దూకుడు చూస్తున్నదే. నిత్యం ఏదో ఒక రెయిడ్‌తో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారాయన. అయితే.. పుణెలోని ఓ స్వీట్స్ దుకాణం లైసెన్స్‌ను 98 శాతం నిబంధనలు పాటించినట్లు రీ-ఇన్స్పెక్షన్లో తేలింది. అయినప్పటికీ పునరుద్ధరించకపోవడంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)కు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లు, తినుబండారాల లైసెన్సులను సస్పెండ్ చేయడం FDA అనుసరిస్తున్న విధానంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ‘వింతైన, విపరీతమైన విధానం’గా అభివర్ణించింది.98 శాతం కంప్లయన్స్ ఉన్నా..పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్‌పై ఆహార కలుషితానికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో FDA అధికారులు జూన్ 12న తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని పారిశుద్ధ్యం, సిబ్బంది పరిశుభ్రతకు సంబంధించి పలు లోపాలను గుర్తించారు. అదే రోజు దుకాణం లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుకాణ యాజమాన్యం FDA కమిషనర్‌కు అప్పీల్ చేయడంతో పాటు లోపాలను సరిచేసినట్లు పేర్కొంటూ కంప్లయన్స్ రిపోర్ట్ సమర్పించింది.దీనిపై జూలై 13న FDA అధికారులు మరోసారి దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈసారి దుకాణం 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ లైసెన్స్ సస్పెన్షన్‌ను ఎత్తివేయలేదు. లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యాజమాన్యం FDAకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది.లక్షల ఆదాయం కోల్పోయామని..లైసెన్స్ సస్పెన్షన్ కారణంగా జూన్‌లో దుకాణం మూసివేసినప్పటి నుంచి రూ.8.74 లక్షల ఆదాయాన్ని కోల్పోయామని యాజమాన్యం కోర్టుకు తెలిపింది. కేసును విచారించిన ధర్మాసనం దుకాణాన్ని తిరిగి తెరిచి వ్యాపారం చేసుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా దుకాణ యజమానులకు నెల రోజుల్లోగా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర FDAను ఆదేశించింది.‘మీరు హద్దులు దాటుతున్నారు’FDA ఉద్దేశం మంచిదేనని, ఆహార భద్రత విషయంలో ఒక విభాగం కనీసం చర్యలు తీసుకుంటోందని ప్రశంసించిన ధర్మాసనం.. అదే సమయంలో అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. 98 శాతం నిబంధనలు పాటిస్తున్నట్లు రీ-ఇన్స్పెక్షన్లో తేలిన వెంటనే లైసెన్స్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందని స్పష్టం చేసింది. అలా చేయకుండా దుకాణాన్ని కొనసాగనివ్వకపోవడం సరికాదని పేర్కొంది.కోర్టు ఉత్తర్వులు పరిశీలిస్తా: FDA కమిషనర్బాంబే హైకోర్టు ఆదేశాలపై మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే స్పందిస్తూ.. ముందుగా కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తానని తెలిపారు. ఆ తర్వాతే స్పందిస్తానన్నారు. FDA చట్టం, నిర్దేశిత విధానాల ప్రకారమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. చట్టం, ప్రక్రియలను అనుసరిస్తూ వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. -
శబరిమలలో సినిమా షూటింగ్‌లు బంద్: కేరళ ప్రభుత్వం
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్‌కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేరళ దేవస్వం మంత్రి కే. మురళీధరన్ ఈ కీలక ప్రకటన చేశారు. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగించేందుకు అనుమతించబోమని ఆయన తెలిపారు.శబరిమలలో సినిమా షూటింగ్‌కు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమాలు, మతపరమైన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్‌కు మాత్రం అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆలయాలను సినిమా షూటింగ్ కోసం వినియోగించేందుకు అనుమతించడం సరికాదని అన్నారు.శబరిమలలో షూటింగ్‌కు సంబంధించిన నిబంధనలను తాను పూర్తిగా పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.మోహన్‌లాల్ మూవీతో వివాదంఈ వివాదానికి కారణం మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అతిమనోహరం సినిమా. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శబరిమలలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. పంపా నుంచి సన్నిధానం వరకు కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించి పలు షరతులు విధించినట్లు సమాచారం. శబరిమల లేదా హిందూ మత విశ్వాసాలను ప్రతికూలంగా చూపించకూడదని, షూటింగ్‌కు అవసరమైన ఇతర శాఖల అనుమతులు కూడా తీసుకోవాలని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అనుమతుల్లో కీలకమైన అటవీ శాఖ అనుమతి విషయంలో సమస్య ఏర్పడింది. షూటింగ్‌కు అటవీ శాఖ అనుమతి నిరాకరించడంతో అక్కడ చిత్రీకరణకు బ్రేక్ పడింది. దీంతో అసలు దేవస్వం బోర్డు సాధారణ సినిమాకు అనుమతి ఎలా ఇచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి.ప్రభుత్వ విధానంపై ప్రశ్నలుదేవస్వం బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత.. అటవీ శాఖ దాన్ని తిరస్కరించడంతో వివాదం మరింత ముదిరింది. శబరిమల వంటి అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమా షూటింగ్‌కు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకుండా అనుమతులు ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సాధారణ కమర్షియల్ సినిమాలకు షూటింగ్ అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది.మరో చోటులో షూటింగ్ తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న అతిమనోహరంలో మోహన్‌లాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాలు అలెక్స్, మనోజ్ కే. జయన్, జగదీష్, ఇర్షాద్, సుధీష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం పూర్తయింది. కొచ్చితో పాటు పలు చోట్ల కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్‌ను కొచ్చి, శబరిమలతో పాటు హైదరాబాద్, ముంబైలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే శబరిమలలో షూటింగ్‌కు అనుమతి నిరాకరణతో చిత్ర బృందం ప్రత్యామ్నాయ లొకేషన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇంతకు ముందు..గతంలోనూ శబరిమల, పంబా పరిసరాల్లో పలు సినిమాల షూటింగ్ జరిగింది. తమిళ చిత్రం ‘నంబినార్ కేడువతిల్లై’ (1986)లోని ఓ పాటను శబరిమలలోని 18 మెట్ల వద్ద చిత్రీకరించారు. మలయాళంలో ‘స్వామి అయ్యప్పన్’ (1975), ‘మాలికప్పురం’ (2022) వంటి చిత్రాల్లో శబరిమల ప్రాంతాల్లో షూట్ చేశారు. కన్నడ చిత్రం ‘సీజర్’ (2018)లోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.ఆలయ పవిత్రతే కీలకంశబరిమల కేవలం ఒక పర్యాటక ప్రదేశం లేదా సాధారణ షూటింగ్ లొకేషన్ కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివచ్చే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ వల్ల భక్తుల రాకపోకలు, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.మోహన్‌లాల్ సినిమా షూటింగ్ అనుమతి వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో శబరిమలలో కమర్షియల్ సినిమాల షూటింగ్‌కు దాదాపు తలుపులు మూసేసినట్లయింది. ఇకపై అయ్యప్ప, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక అనుమతుల అవకాశముంటుందని కేరళ దేవస్వం మంత్రి స్పష్టం చేశారు. -
మోదీగారూ.. చూడండి ఏం జరిగిందో!
న్యూఢిల్లీ: యూజీసీ-నెట్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.Modi ji, look at what your NTA has just done.UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్ట్రాక్షన్ మెషీన్‌గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.సెప్టెంబర్‌లో రీటెస్ట్NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది. -
ఆర్థిక ఇబ్బందులతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. మరోసారి తన రాజీనామాను ఉద్ఘాటించారు. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పార్టీలో కొందరి వైఖరి కూడా తన నిర్ణయాన్ని బలపరచాయని తాజాగా పార్టీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను పూనావాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తొలుత తన నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం గౌరవించి, రాజీనామా స్వీకరించకుండా పునరాలోచించాలని కోరిందని తెలిపారు. అయితే అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ అంగీకరించకపోవడంతో.. మరోసారి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు లేఖ రాసి తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. వీలైనంత త్వరగా ఆ పని చేయాలంటూ ఆయన కోరుతున్నారు.వ్యవస్థను వీడుతున్నా..తన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణాలేవీ లేవని పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.‘‘నేను బీజేపీ వ్యవస్థ నుంచి మాత్రమే బయటకు వస్తున్నాను.. సిద్ధాంతాల నుంచి కాదు’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ మోదీ వీరాభిమానినేనని.. భవిష్యత్‌లోనూ సాధ్యమైనంత వరకు బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతుగా ఉంటానని చెప్పారు.ఆ కొందరు ఎవరు?గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని పూనావాలా లేఖలో పేర్కొనడం గమనార్హం. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వారికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వంతో తాను చర్చలు కూడా జరిపినట్లు ఆయన చెప్పినట్లు తెలిపారు.అలాగే భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని.. రాజకీయాలను వదిలి ప్రైవేటు రంగంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ‘‘అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.కాంగ్రెస్ నుంచి బీజేపీకి..మహారాష్ట్రకు చెందిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం ముఖంగా ఎదిగారు. టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున తరచూ ప్రాతినిధ్యం వహించారు. హిందుత్వాన్ని బాగా ప్రచారం చేయడంతో.. అధినాయకత్వం ఆయన్ని చేరదీసింది. 2021లో బీజేపీ ఢిల్లీ ఐటీ, సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా నిర్వహించారు.ఆ తర్వాత.. టీవీ డిబేట్లో పార్టీ తరఫున ప్రతినిధిగా పాల్గొనేవారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలను గుర్తుచేసుకుంటూ.. గత ఐదేళ్లుగా అందించిన వేదిక, గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న రాజీనామా నిర్ణయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
తారాపీఠ్‌లో ఘోర ప్రమాదం.. భక్తుల సజీవ దహనం
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లోని ఓ లాడ్జిలో భారీగా మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో మరికొందరు చిక్కుకుని ఉండడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. వీళ్లంతా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులుగా తెలుస్తోంది.తారాపీఠ్(Tarapith) ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా పేరొందింది. ఇక్కడి తారా దేవి ఆలయాన్ని శక్తి ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన పీఠాల్లో ఒకటిగా భక్తులు భావిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తారాపీఠ్‌కు దర్శనం కోసం వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం, ప్రత్యేక పూజల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పరిసర ప్రాంతాల్లో అనేక హోటళ్లు, లాడ్జీలు అందుబాటులో ఉంటాయి.సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు(Tarapith Fire Accident) చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హోటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు.తారాపీఠ్‌కు పోటెత్తిన భక్తులు..శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తారాపీఠ్‌కు చేరుకున్నారు. వీరిలో పలువురు సమీపంలోని హోటళ్లలో బస చేశారు. ఇదే క్రమంలో అగ్నిప్రమాదానికి గురైన హోటల్లో కూడా భక్తులు ఉన్నట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కొందరు బయటకు వచ్చే అవకాశం లేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదానికి కారణం..?హోటల్లో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదంటే ఇతర కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్ సర్కార్
సాక్షి, చెన్నై: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వేటగాళ్లనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే ఆ ముగ్గురు తమిళులు కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. వాళ్లు వేటగాళ్లు కాదని.. రైతులు అని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఘటనను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటక అటవీ శాఖ వివరణపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆంటోనీ సామి, జాన్ రోజ్ పీటర్, కుమార్ అనే ముగ్గురు తమిళులు మృతి చెందారు. వీరు చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. తమిళులపై జరిగిన ఈ ఘటనను ఖండించిన ఆయన.. కర్ణాటక అటవీ శాఖ చెబుతున్న వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్, డీకే శివకుమార్ సర్కార్‌ను కోరారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి నిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.స్టాలిన్ ఆగ్రహంఈ ఘటనపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తమిళ రైతుల కాల్చివేత ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకూడదు. కాల్పులకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి" అని స్టాలిన్ అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పందించడంలో ఆలస్యం చేయకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు: కర్ణాటక అధికారులుమరోవైపు కర్ణాటక అటవీ అధికారులు మాత్రం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వన్యప్రాణుల వేట కోసం వచ్చారని తెలిపారు. అటవీ సిబ్బందిని ఎదుర్కొన్న సమయంలో వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపామని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, వేటకు ఉపయోగించిన వస్తువులు, అడవి జంతువుల మాంసంతో ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.‘వేట ఆరోపణల్లో నిజం లేదు’.. ప్రతిపక్షాల ఆగ్రహంఅయితే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు కర్ణాటక అధికారుల వాదనలను ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు నిజంగానే వేటకు పాల్పడ్డారా? కాల్పులు అనివార్యమా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా కాల్పుల్లో పాల్గొన్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. కాల్పులు ఆత్మరక్షణలో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వక చర్యా? అనేది విచారణలో తేలనుంది.కావేరీ జలాలు.. మేకెదాటు విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ సుప్రీం కోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్(నీటి విడుదల కోసం..) విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ముగ్గురు తమిళుల మృతితో ఇటు రాజకీయంగానూ ఘర్షణలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్‌రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్‌రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్‌కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్‌కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్‌కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్ భారత్ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికతయారీ శక్తిఫుడ్ ప్రొడక్షన్టెక్నాలజీగతిశక్తిరక్షణ రంగంగ్రీన్ ఎకానమీ.. బ్లూ ఎకానమీయువశక్తి25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుతమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాంగత 12 ఏళ్లలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.సంస్కరణలు మరింత వేగంగా..ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్ రైలు, సెమీకండక్టర్ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్.. మేడిన్ ఇండియానే లక్ష్యంభారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్‌కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందిదేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.యువత తోడుంటేనే..దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్ గ్లోబల్ లీడర్షిప్, సప్లై చైన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన. మహిళా బిల్లుకు ముందుకు రండిమహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.తొలిసారి ఎర్రకోటపై వందేమాతరంఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. వేడుకలు ఇలా.. స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు. -
సీజేపీకి బార్ కౌన్సిల్ చైర్మన్ చురక!
నల్సర్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేసినా.. వేడి ఇప్పుట్లో చల్లారేలా కనిపించడం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ పట్టబడుతోంది. అవసరమైతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై, సీజేపీ ఆరోపణలపై మనన్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో తమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటమే మా ఉద్దేశం. ఈ విషయంలో మా ప్రయోజనాలు, వారి లక్ష్యం ఒకటే’’ అని మనన్ మిశ్రా తెలిపారు.వివాదానికి కారణం ఇదేహైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యే ప్రతిపాదనపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బీసీఐ.. 2026లో నాల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసే విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విద్యార్థుల చర్యలకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.‘‘తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాం’’తొలుత ఇచ్చిన ఆదేశాలపై మనన్ మిశ్రా వివరణ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదన్నారు. ‘‘ఆ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదే. విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశాం. సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకున్నాం. దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదు’’ అని తెలిపారు.‘‘బీసీఐకి, సీజేపీకి ఘర్షణ లేదు’’విద్యార్థుల ప్రయోజనాల విషయంలో బీసీఐ, సీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మనన్ మిశ్రా స్పష్టం చేశారు. ‘‘ఎవరైనా అపార్థంలో ఉంటే స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశ యువత ప్రయోజనాలను కాపాడటం మనందరి బాధ్యత. అభిజీత్ దీప్కే కోరేది కూడా అదే.. మేము కోరేది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఘర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.రూ.14 కోట్ల ఆరోపణలపై స్పందనబీసీఐ సమావేశాలు, సదస్సుల కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిందన్న సౌరవ్ దాస్ ఆరోపణలపైనా మనన్ మిశ్రా స్పందించారు. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, అలాంటి భారీ ఖర్చులు ఏవీ జరగలేదని చెప్పారు. బీసీఐ వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తుందని, వాటిని రూ.14 కోట్ల వ్యయంతో నిర్వహించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.సీజేపీ మాత్రం విజయంగా..బీసీఐ ఆదేశాల ఉపసంహరణను సీజేపీ నేతలు తమ విజయంగా అభివర్ణించారు. సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ‘‘ఇట్స్ డన్ బ్రో’’ అంటూ స్పందించారు. గతంలో తమ ఉద్యమ సమయంలో వైరల్‌గా మారిన నినాదాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే మనన్ మిశ్రా రాజీనామా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు.సుప్రీం నోటీసులుఇదిలా ఉంటే.. ఇది పూర్తిగా సీజేఐకి, విద్యార్థులకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్.. విద్యార్థులు తప్పు చేసినా, నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పింది. బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. అసలు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బీసీఐకు నోటీసులు పంపింది. మరోవైపు.. నిరసన తెలిపిన విద్యార్థులను విచారించాలంటూ గత ఆదేశాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించడంపైనా నల్సార్ స్పందించింది. అది తమకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్‌ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
‘‘మధ్యలో మీ జోక్యమేంటి?’’.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: నల్సార్ లా వర్సిటీ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విద్యార్థులే తప్పు చేసినా.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించారు.హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనాల్సిన కార్యక్రమంపై నిరసన వ్యక్తం అయ్యింది. జంతర్ మంతర్ విద్యార్థుల లాఠీఛార్జి పిటిషన్ విచారణలో ఆయన వైఖరి సరిగా లేదని.. ఆయన నుంచి పట్టా అందుకోవడం తమకు ఇష్టం లేదని చెబుతూ వర్సిటీ నిర్వాహకులకు వాళ్లు సైన్ పిటిషన్ అందజేశారు. ఈ వ్యవహారాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరువు వ్యవహారంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో.. 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని, కొందరి చర్యలకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. విచారణ సందర్భంగా బీసీఐ జోక్యంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.బీసీఐకి నోటీసులుసీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారణ జరిపింది. నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంపై సుప్రీంకోర్టు బీసీఐకి నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసలు ఆ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటికే వివాదాస్పద ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు బీసీఐ కోర్టుకు తెలిపింది. ఈ తరుణంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.‘‘ఇది విద్యార్థులు–నా మధ్య విషయం’’నల్సార్ విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యలపై స్పందించిన సీజేఐ.. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు. నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్‌పై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.‘‘విద్యార్థుల హక్కుల పరిరక్షణే ముఖ్యం’’బీసీఐ చైర్మన్ మానన్ మిశ్రా కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. తొందరపాటులో ఆదేశాలు ఇచ్చామని, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే 40 నిమిషాల్లో సవరించామని పేర్కొన్నారు. బీసీఐ, విద్యార్థుల హక్కుల విషయంలో ఎలాంటి ఘర్షణ లేదని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. మా లక్ష్యం ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటం’’ అని మానన్ మిశ్రా వ్యాఖ్యానించారు.‘కాక్రోచ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదంఈ వివాదానికి నేపథ్యం సీజేఐ సూర్యకాంత్ గతంలో చేసిన బొద్దింకల వ్యాఖ్యలు. ఆయన చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో ఆన్లైన్ ప్రచారం, ఆందోళనలు జరిగాయి.. అయితే తాను నకిలీ డిగ్రీలతో వస్తున్న న్యాయవాదుల్ని ఉద్దేశించే అన్నానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ జెన్‌జీ ఉద్యమం చల్లారలేదు. తాజా బీసీఐ ఆదేశాల అనంతరం CJP నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘అన్ని లీగల్ కాక్రోచ్లు ఒక్కటైతే?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీసీఐ చైర్మన్‌పైనా విమర్శలు కూడా చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.బీసీఐకి సీజేఐ స్పష్టమైన సంకేతంనల్సార్ వ్యవహారంలో సీజేఐ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్థలు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి తెరపైకి తెచ్చింది. -
అదంతా ఫేక్?.. జెన్‌జీ ముసుగు వెనుక షాకింగ్ ‘లెక్క’!
సోషల్ మీడియాలో ఓ తరం.. వీధుల్లో మరో శక్తి.. అంటూ జెన్ జీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. భారత్‌లోనూ పరీక్షల వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యవస్థలపై ప్రశ్నలతో జెన్ జీ యువత ఆందోళనలు చేపట్టిన సందర్భాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. అయితే పోరాటాలు, ట్రెండ్స్, సోషల్ మీడియా యాక్టివిజంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఈ తరం.. తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరిస్తోంది?.. ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రావెల్, లైఫ్‌స్టైల్, ఎక్స్‌పీరియన్స్‌లకు ప్రాధాన్యం ఇచ్చే తరం అంటూ కనిపించే జెన్ జీ.. నిజ జీవితంలో మాత్రం డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందట!. భారీ కొనుగోళ్లు, విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.శాలరీసే(SalarySe) నిర్వహించిన ఈ అధ్యయనం కోసం 5.2 లక్షల మందికి పైగా జీతం పొందుతున్న Gen Z వినియోగదారుల యూపీఐ లావాదేవీలను విశ్లేషించారు. సాధారణంగా జెన్‌జీ అంటే ప్రయాణాలు, డిజిటల్ లైఫ్, అనుభవాల కోసం ఎక్కువ ఖర్చు చేసే తరం అనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవ ఖర్చుల లెక్కలు మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి.70 శాతం ఖర్చు.. ఈ ఐదు కేటగిరీలకే!జెన్‌జీ తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ భాగం అవసరాలకే వెళ్తోంది. బిల్లులు, సబ్స్క్రిప్షన్లు అత్యధికంగా 20.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత కిరాణా సరుకుల కోసం 15.7 శాతం ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సంబంధిత చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం ఖర్చవుతోంది. ఈ ఐదు విభాగాలు కలిపి నెలవారీ ఖర్చుల్లో 70 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్ లైఫ్ కంటే.. జీవితంలోని సాధారణ అవసరాలే వారి బడ్జెట్లో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయి.ట్రావెల్‌కు కేవలం 5 శాతంజెన్జీకు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం అనే ప్రచారం ఉన్నప్పటికీ.. వారి నెలవారీ ఖర్చుల్లో ట్రావెల్ వాటా కేవలం 5 శాతమేనని అధ్యయనం చెబుతోంది. ప్రయాణాలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నా.. అవి వారి రెగ్యులర్ బడ్జెట్‌ను పెద్దగా ప్రభావితం చేయడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే వినోదం, ప్రయాణాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.OTTలకు కూడా చోటుడిజిటల్ వినోదానికి Gen Zలో ఆదరణ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సబ్స్క్రిప్షన్ ఖర్చుల్లో జియోహాట్‌స్టార్ 12.4 శాతంతో ముందంజలో ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ 10.7 శాతం, స్పాటిఫై 5.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ, ఆటోపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలు యువత ఆర్థిక అలవాట్లను మార్చుతున్నాయని అధ్యయనం పేర్కొంది. బిల్లులు ఆటోమేటిక్‌గా చెల్లించడం, సబ్స్క్రిప్షన్లు డిజిటల్‌గా కొనసాగడం వంటి విధానాలు Gen Z జీవితంలో సాధారణంగా మారాయి.వయసు పెరిగేకొద్దీ..అధ్యయనం 18–23 ఏళ్ల వయసు, 24–29 ఏళ్ల వయసు ఉన్న Gen Z గ్రూపులను కూడా పరిశీలించింది. ఆసక్తికరంగా.. ఇరు వర్గాల్లోనూ విచక్షణతో చేసే ఖర్చులు (డిస్క్రెషనరీ స్పెండింగ్) 32 శాతంగానే ఉన్నాయి. అయితే వయసు పెరిగేకొద్దీ అవసరాలపై ఖర్చు పెరుగుతోంది. 18–23 ఏళ్ల వయసు వారిలో అవసరాల ఖర్చు 50 శాతం ఉండగా.. 24–29 ఏళ్ల వయసు వారిలో అది 59 శాతానికి పెరిగింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఖర్చుల ప్రాధాన్యతలు మారుతున్నాయని ఇది సూచిస్తోంది.డిజిటల్ ఫైనాన్స్ వైపు Gen Zశాలరీసే సహ వ్యవస్థాపకుడు పీయూష్ బగారియా ప్రకారం.. భారత జెన్‌జీ పూర్తిగా డిజిటల్ ఆధారిత ఆర్థిక జీవనశైలిని అభివృద్ధి చేసుకుంటోంది. యూపీఐ విస్తృతి కారణంగా డబ్బు నిర్వహణ, చెల్లింపుల విధానం పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు.మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాలో కనిపించే ట్రావెల్, లైఫ్‌స్టైల్ ఇమేజ్‌కు భిన్నంగా జెన్‌జీ వాస్తవ ఖర్చుల తీరు కనిపిస్తోంది. కలలు, అనుభవాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. ముందుగా బిల్లులు, అవసరాలు, ఆర్థిక భద్రతకే యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్‌ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్‌లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్‌ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. -
లోక్‌సభ 19%.. రాజ్యసభ 39%
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వకుండా విపక్ష సభ్యులు పదేపదే నినాదాలు, నిరసనలకు దిగడంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంట్‌ను నిరసనలకు వేదికగా మార్చడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.వర్షాకాల సమావేశాల్లో శాసనపరమైన కార్యక్రమాల పరంగా మంచి పనితీరు కనిపించిందని రిజిజు తెలిపారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. అయితే పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు జరగడంలో మాత్రం సమావేశాలు ఆశించిన స్థాయిలో సాగలేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఉత్పాదకత కేవలం 19 శాతంగా నమోదైందని, రాజ్యసభ ఉత్పాదకత 39 శాతంగా ఉందని వివరించారు.లోక్‌సభలో పలు అంశాలపై చర్చకు అవకాశం ఉన్నప్పటికీ.. విపక్ష సభ్యుల నిరసనల కారణంగా కార్యకలాపాలు పదేపదే అంతరాయం కలిగాయని రిజిజు ఆరోపించారు. కొంతమంది విపక్ష ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారని అంగీకరించిన ఆయన.. లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లుపై మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో చర్చ జరిగిందన్నారు. మిగతా సమయం పెద్దగా సద్వినియోగం కాలేదని పేర్కొన్నారు.తొలిసారి చూశా..విపక్షాల వైఖరిపై రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో తొలిసారిగా విపక్షాలు చర్చల నుంచి పారిపోతున్న పరిస్థితిని చూస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అంటే కేవలం నినాదాలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించి, వాటిపై చర్చ జరిపి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని స్పష్టం చేశారు.కొత్తగా ఎన్నికైన ఎంపీలకు విపక్ష సభ్యులు ఎలాంటి సంప్రదాయాలను నేర్పిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు తొలిసారి వచ్చిన సభ్యులు సభా సంప్రదాయాలను, చర్చల పద్ధతులను నేర్చుకోవాల్సిన సమయంలో.. నిరసనలు, నినాదాలే రాజకీయానికి మార్గమని చూపడం సరికాదని అన్నారు.‘నినాదాలు రోడ్లపై చేయాలి’పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని రిజిజు పేర్కొన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే దానిని సభలో చర్చ రూపంలో వ్యక్తం చేయాలని సూచించారు. నినాదాలు చేయాలనుకుంటే రోడ్లపై చేయొచ్చని.. కానీ పార్లమెంట్లో మాత్రం ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీలను పార్లమెంట్‌కు పంపుతున్నారని గుర్తు చేసిన రిజిజు.. సభా కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల చివరకు నష్టపోయేది ప్రజలేనని అన్నారు. పార్లమెంట్లో చర్చ జరగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.‘ప్రజలే ఈ అహంకారాన్ని బద్దలు కొడతారు’మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు వచ్చి విపక్షాల ఆందోళనలు, సమస్యలను వినడం లేదని ఆరోపించారు. వాళ్లు అసలు సభకు రాలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరి అహంకారంతో కూడుకున్నదని ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ తమ ముందు ఏమీ కాదన్నట్లుగా, తామే సర్వస్వం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘వాళ్లు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్‌కు ప్రాధాన్యత లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఈ అహంకారాన్ని ప్రజలే బద్దలు కొడతారు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. -
ఖర్గే సభా వేదిక ‘శుద్ధి’ వివాదం.. రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో తన ర్యాలీకి కేటాయించిన వేదికను బీజేపీ నేతలు ‘శుద్ధి’ కార్యక్రమాలతో శుభ్రం చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలు రాజ్యసభలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటన కుల వివక్ష, అంటరానితనానికి నిదర్శనమని ఖర్గే మండిపడ్డారు.గురువారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఖర్గే.. హల్ద్వానీలోని రామలీలా మైదానంలో తన సభ జరగాల్సిన ప్రదేశంలో తన రాక తర్వాత కొందరు బీజేపీ నేతలు హవనం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఇది దళితుల పట్ల వివక్షను ప్రతిబింబిస్తోందని, బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు.#WATCH | In Rajya Sabha, LoP and Congress chief Mallikarjun Kharge says, "...I was in Haldwani where I made a public speech at Ramlila Maidan. Lakhs of people were there. At that time, I did not mention the name of any community or religion; I only reiterated the issues of the… pic.twitter.com/oePxPC0jBr— ANI (@ANI) August 13, 2026దీనిని బీజేపీ సమర్థించదుఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే.. ఇలాంటి చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. “ఖర్గే జీ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఇది కాంగ్రెస్‌కు మాత్రమే కాదు.. మనందరికీ బాధ కలిగించే విషయం. బీజేపీ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ సమర్థించదు. ఘటనపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం” అని నడ్డా హామీ ఇచ్చారు.అయితే, ఈ ఘటనకు మొత్తం పార్టీని బాధ్యురాలిగా చూపడాన్ని నడ్డా ఖండించారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండానే బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఖర్గే మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని, ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షుడి హోదాలో పరిశీలిస్తానని తెలిపారు.#WATCH | In Rajya Sabha, Leader of House and Union Minister JP Nadda responds to LoP Mallikarjun Kharge; says, "What Kharge ji said is really sad - not just for Congress party but for all of us...BJP does not subscribe to such activities. Never. But we will investigate this. I… pic.twitter.com/pC2Fx25vPV— ANI (@ANI) August 13, 2026రాజ్యసభలో వాడీవేడి చర్చఖర్గే వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ఆరోపణలను ఖండించగా.. కాంగ్రెస్ సభ్యులు సామాజిక సమానత్వం, దళిత గౌరవం అంశాలను ప్రస్తావించారు. అంటరానితనం వంటి వివక్షకు ఎలాంటి స్థానం లేదని, ఘటన నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్షం పేర్కొంది. అయితే పార్టీపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేసింది.రాజ్యసభ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలుఈ వివాదంపై రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కూడా స్పందించారు. అంటరానితనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. “అంటరానితనం పాపం కాకపోతే.. ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా మనమంతా దీనిని వ్యతిరేకిస్తున్నాం. మనల్ని ఎవ్వరూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు.. మనమంతా ఇప్పటికే శుద్ధులమే” అని అన్నారు. ఘటనపై విచారణ జరిపి, తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.‘హవనం అవసరం ఏమొచ్చింది?’.. ఖర్గే ఫైర్ఇదే అంశంపై ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై మరింత తీవ్ర విమర్శలు చేశారు. “ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేం చాలా కాలంగా చెబుతున్నాం. అసలు అక్కడ హవనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ప్రశ్నించారు. హల్ద్వానీ రామలీలా మైదానంలో అన్ని పార్టీల నేతలు సభలు నిర్వహిస్తుంటారని, కానీ తన సభకు ముందు నిర్వహించిన శుద్ధి కార్యక్రమం హిందూ ధర్మ స్ఫూర్తికి కూడా విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలేనని ఆరోపించిన ఖర్గే.. దేశాన్ని విభజించేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
ముగిసిన వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. చివరిరోజు కేవలం వందేమాతర గీతాలాపనకు లోక్‌సభ పరిమితం కాగా.. రాజ్యసభలో మాత్రం కాసేపు చర్చా..రచ్చ నడిచింది. ఈ తరుణంలో ఆనవాయితీగా ప్రధాని ఇచ్చిన టీ పార్టీ ఆసక్తికర చర్చకు దారి తీసింది. లోక్‌సభ నిరవధిక వాయిదా తర్వాత ప్రధాని మోదీ లోక్‌సభలోని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లకు టీ పార్టీ ఇచ్చారు. అయితే దానిని విపక్షాలు బహిష్కరించాయి. బదులుగా పార్లమెంట్ ఆవరణలో కాసేపు కేంద్ర వ్యతిరేక నినాదాలతో నిరసనలు చేశాయి. అయితే డీఎంకే తరఫున కనిమొళి మాత్రం హాజరయ్యారు. ఆ వెంటనే మోదీ, అమిత్‌షా పార్లమెంట్ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరోవైపు.. అధికార-ప్రతిపక్ష సవాళ్ల నడుమ చివరిరోజు ఉభయ సభల్లో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠకు ఉత్తినే తెర పడింది. లోక్‌సభ ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా పడింది. గురువారం లోక్‌సభకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విపక్ష నేత రాహుల్ గాంధీ సహా అంతా హాజరయ్యారు. ఎలాంటి చర్చకైనా సిద్ధమని కేంద్రం ప్రకటించడం.. నిలదీసి తీరతామని విపక్షాలు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ, వందేమాతర ఆలాపన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే రాజ్యసభ మాత్రం కాసేపు తన కార్యకలాపాలు కొనసాగించింది. విపక్షాలపై కిరెన్ రిజిజు ఫైర్పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యుల తీరుపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు విపక్షాలు ఎలాంటి సంప్రదాయాలు నేర్పిస్తున్నాయంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంట్‌ను నినాదాలు, నిరసనలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. నినాదాలు చేయాలంటే రోడ్లపై చేయొచ్చని.. కానీ పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిందేనని రిజిజు స్పష్టం చేశారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని అన్నారు.పెద్దల సభలో రగడఇవాళ రాజ్యసభలో మాత్రం కాసేపు కార్యకలాపాలు జరిగాయి. మైనింగ్ బిల్లుపై చర్చ.. ఆపై ఆమోదం లభించింది. అయితే కాసేపటికే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ‘శుద్ది’ ఆరోపణలతో పెద్దల సభ వేడెక్కింది. తాను పాల్గొన్న ఉత్తరాఖండ్ ర్యాలీలో వేదికను శుద్ధి చేశారని.. ఇది అంటరానితనం, దళిత వ్యతిరేక చేష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆరోపణపై విచారణ జరిపిస్తామన్నారు. అనంతరం.. ‘‘హోం మంత్రి అమిత్‌షా ఎక్కడ?.. విద్యార్థులపై పోలీసు చర్యకు సమాధానం ఇవ్వరా?’ అంటూ విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో చైర్మన్ కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభం కాగా.. విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభను సైతం నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జులై 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 18 రోజులపాటు(ఇవాళ్టితో కలిపి 19) వాయిదాలకే సరిపోయింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఒక్క పరీక్షా సవరణ బిల్లుపై చర్చ మినహాయించి మరేయితర అంశంపై సరైన చర్చ నడవలేదు. నిరసనల నడుమే కేంద్రం కూడా మూజువాణి ఓటుతో పలు బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం. -
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది.లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఫైనల్ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.చర్చకు సిద్ధం: అమిత్ షావిద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్‌కు వచ్చి తన ఛాంబర్‌లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్‌కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే అమిత్ షా ప్రతిపాదనకు విపక్షాలు అంగీకరించలేదు. చర్చకు ముందు బాధ్యతపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.‘ఆదేశాలు ఎవరివి?’.. రాహుల్ ప్రశ్నఇన్నాళ్లు సభకు రాకుండా భయపడి.. ఇప్పుడు అభూత కల్పన కథలు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, బలప్రయోగానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చింది అమిత్ షా అయితే రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హోంశాఖ పరిధిలోనే ఉంటాయని గుర్తుచేస్తూ.. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.తప్పించుకుంటోంది ఎవరు?విపక్షాల తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. చర్చకు డిమాండ్ చేసిన వారే ఇప్పుడు చర్చకు రావడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హోంమంత్రి స్వయంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నినాదాలు, ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే.. హోం మంత్రి ఇన్నాళ్లపాటు సభకు వచ్చేందుకు భయపడ్డారని.. ఆయన ఇప్పుడు ఇచ్చే సమాధానం ఎవరికి కావాలని, విద్యార్థులపై పోలీసు చర్యలకు ఆదేశాలిచ్చింది ఆయనో కాదో తేల్చాలని, కారకుడు ఆయనే గనుక అయితే రాజీనామా చేయాలని విపక్షాలు మండిపడుతున్నాయి.విద్యార్థుల ఆందోళనలే ప్రధాన అజెండానీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వినియోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.అయితే.. మొత్తం సమావేశాల్లో ఒకే అంశంపై సభ సజావుగా సాగింది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై జరిగిన చర్చ ప్రశాంతంగా జరిగింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా.. ఎలాంటి తీవ్ర అంతరాయం లేకుండా సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత మాత్రం మళ్లీ విద్యార్థుల ఆందోళనలు-పోలీసుల చర్యల అంశంపై రాజకీయ రగడ కొనసాగింది.నిరసనల మధ్య కీలక బిల్లులుపార్లమెంట్లో రాజకీయ రగడ కొనసాగినప్పటికీ.. శాసనపరమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోలేదు. అధికార, విపక్షాల నినాదాల మధ్యే పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది.వందేమాతరం గౌరవం, జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే సవరణలకు ఆమోదం లభించింది. వందేమాతరం అవమానాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు చేశారు.విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. విదేశీ నిధులపై పర్యవేక్షణ, నిబంధనల కఠినతరం ఈ బిల్లులో ప్రధాన అంశాలు.మరోవైపు కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది.చివరి రోజైనా తెరపడేనా?వర్షాకాల సమావేశాల చివరి రోజు ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతుండగా.. విపక్షాలు మాత్రం బాధ్యతపై స్పష్టమైన సమాధానం కోసం పట్టుబడుతున్నాయి. 18 రోజులుగా సాగుతున్న పార్లమెంట్ పోరుకు చివరి రోజు అయినా ముగింపు లభిస్తుందా?.. లేదంటే ఫైనల్ షో కూడా మరో రాజకీయ చిచ్చుతోనే ముగుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
బీజేపీ ఆఫీస్‌లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!
పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.BJP faces allegations of disrespecting Indian flag in Kerala's KasaragodSeveral Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి. -
సాహస రైడ్ సరదా తీరకముందే..
బైక్ రైడ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితోనే తరచూ సాహస యాత్రలు చేసే ఆమె.. మరో ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. కానీ ఆ సాహస యాత్ర కాస్తా విషాదాంతంగా మారింది. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఆమె బైక్‌ను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ముంబైకి చెందిన 24 ఏళ్ల యువ బైకర్ రిద్ధి థక్కర్(Riddhi Thakkar) ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్ ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి ఉన్న రిద్ధి.. వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే.. బస్తర్ టూర్‌కు వెళ్లిన మహిళా బైకర్ల బృందంలో ఉన్న ఆమె అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీంతో.. బైకింగ్ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఢీ కొట్టి.. ఆపై ఈడ్చుకెళ్లి..ముంబై కందివలీ వెస్ట్‌కు చెందిన రిద్ధి థక్కర్.. దాదాపు 23 మంది మహిళా బైకర్ల బృందంతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. రాయ్‌పూర్ నుంచి కాంకేర్ వైపు వెళ్తుండగా ధమ్తరి జిల్లా మార్కటోలా ఘాట్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ల బృందంలోని పలువురు ముందుకు వెళ్లిపోగా, రిద్ధి మరికొందరు వెనుక వస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన భారీ ట్రైలర్ ఆమె బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రిద్ధి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణంప్రమాదాన్ని గమనించిన తోటి బైకర్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు సమాచారం అందించి రిద్ధిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ధమ్తరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పరారీలో డ్రైవర్.. కొనసాగుతున్న దర్యాప్తుప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ వాహనం, డ్రైవర్‌ను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. రిద్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ధమ్తరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెతో కలిసి ప్రయాణించిన ఇతర బైకర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ధమ్తరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. -
అమిత్ షా బండారం బయటపడింది: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ నిరసనల అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“అమిత్ షా బండారం బయటపడింది. ఆయన సభకు ఎందుకు రావడం లేదు? సభకు రావడానికి ఆయన భయపడుతున్నారా?” అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. నీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు, ఆందోళనకారులపై జరిగిన దాడులపై హోంమంత్రి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? పోలీసుల కర్కశ చర్యలపై అమిత్ షా నోరు విప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యత హోంమంత్రిదేనని ఆరోపించారు.VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "Kharge ji and I have held press conferences, and the other Opposition parties have also made it clear that we are not interested in listening to Amit Shah's imagination. We are interested in one simple thing. And when we say 'we',… pic.twitter.com/sjkm33QjZ9— Press Trust of India (@PTI_News) August 12, 2026రాజీనామాకు డిమాండ్నిరసనల సమయంలో కాల్పులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమిత్ షా ఏం మాట్లాడతారన్నది తమకు అవసరం లేదని, బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.“చర్చకు సిద్ధం”: షామరోవైపు, విపక్షాల ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. నీట్ అంశంతో పాటు విపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు రావాలని, సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని కోరారు. విపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, చర్చకు వస్తారా? లేదంటే ఆందోళనలు కొనసాగిస్తారా? అనేది విపక్షాలు తేల్చుకోవాలని అన్నారు.నీట్ నిరసనల అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం చర్చకు సిద్ధమంటూ చెబుతోంది. దీంతో పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. -
నేను రెడీ..: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విపక్షాలు లేవనెత్తుతున్న అన్ని అంశాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభలో చర్చకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.బుధవారం పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. ఇటీవల రాజకీయ, పార్లమెంటరీ చర్చల్లో “లాపతా”, “భాగ్ గయే” వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అన్నారు. తాను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా వస్తున్నానని, తన ఛాంబర్‌లోనే ఉంటున్నానని చెప్పారు.అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ప్రశ్నించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ విపక్షాలే చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.నీట్ అంశంపై చర్చకు సిద్ధంనీట్ నిరసనల సమయంలో పోలీసుల చర్యపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.“చర్చకు సమయం కేటాయించాలని, విపక్షాలు సిద్ధంగా ఉండాలని కోరాం. అదే వారి మొదటి డిమాండ్. దానికి ప్రభుత్వం అంగీకరించింది. నేను కూడా సభలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను” అని అమిత్ షా పేర్కొన్నారు.ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారువిపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. “ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు 3 గంటల వరకు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను సభలో కూర్చొని అందరి అభిప్రాయాలు వింటానని, ప్రతి అంశానికి సమాధానం ఇస్తానని తెలిపారు.దాచాల్సింది ఏమీ లేదుఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని, పార్లమెంట్ సజావుగా నడవడానికి విపక్షాలు సహకరించాలని కోరారు.సజావుగా సాగని సమావేశాలునీట్ నిరసనల అంశంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కొందరు నేతలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సజావుగా సాగలేదు. విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం పలు కీలక బిల్లులను ఆమోదించుకుంది. ఇప్పటివరకు ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.రేపటితో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అమిత్ షా చర్చకు సిద్ధమన్న ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం-విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు చివరి రోజైనా తెరపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
జెన్‌జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్‌కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్‌కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్‌నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్‌జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
కూలిన కొండ.. శిథిలాల కింద ప్రాణాల కోసం వేట!
ముంబైలో భారీ వర్షాల వేళ మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలోని చిరాగ్ నగర్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో సహాయక బృందాలు ప్రాణాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో కుర్లా పశ్చిమ ప్రాంతంలోని గౌసియా చాల్, చిరాగ్ నగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని మట్టి ఒక్కసారిగా కూలిపడి సమీపంలోని రెండు మూడు ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలతో గాలింపుప్రమాదం జరిగిన వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, ముంబై పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక విక్టిమ్ డిటెక్షన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఈ కెమెరాల ద్వారా శిథిలాల లోపల కదలికలు, మనుషుల ఉనికి వంటి సంకేతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించడంతోపాటు.. లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే విషయంపై అత్యంత జాగ్రత్తగా గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కుర్లాలోని భాభా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి మేయర్.. సహాయక చర్యల పరిశీలనముంబై మేయర్ రీతూ తావ్డే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. బీఎంసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. ముంబైలో వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు. ప్రస్తుతం శిథిలాల కింద ఉన్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం అందిన తర్వాత మృతుల సంఖ్య, చిక్కుకున్న వారి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
HP: పెట్రోల్‌పై కొత్త భారం.. లీటర్‌కు 60 పైసలు అదనం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటివరకు కారణాలు అందరికీ తెలిసినవే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, పన్నుల భారం, ప్రపంచ పరిణామాల ప్రభావం. కానీ ఓ రాష్ట్రంలో ఇప్పుడు ఇంధనంపై పడిన కొత్త భారం మాత్రం వీటికి భిన్నం. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై అదనంగా 60 పైసలు వసూలు చేసే కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ప్రజలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూద్దాం.. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ‘విడో అండ్ ఆర్ఫన్ సెస్’ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నేటి(ఆగస్టు 12) నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై అదనంగా 60 పైసలు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర పన్నుల, ఎక్సైజ్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ కొత్త సెస్ అమల్లోకి వచ్చింది. ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇంధనం విక్రయించే సమయంలోనే ఈ సెస్ వర్తిస్తుంది. చిన్న మొత్తం.. కానీ పెద్ద చర్చ!లీటర్‌కు 60 పైసల వసూలు.. ఈ సెస్‌కు చట్టపరంగా ఉన్న పరిమితి మాత్రం ఎక్కువ. ప్రభుత్వం అవసరమైతే లీటర్‌కు రూ.5 వరకు సెస్ విధించే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో ఈ మొత్తం మరింత పెరుగుతుందా? అనే చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం సంక్షేమమేనని చెబుతున్నప్పటికీ.. ప్రజలపై అదనపు భారం మోపుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.వితంతువుల కోసం.. కానీ అందరూ చెల్లించాల్సిందే!ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వితంతువులు, అనాథల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. అయితే ఈ పన్నును చెల్లించేది మాత్రం ప్రతి ఒక్కరూ. పెట్రోల్ వినియోగించే సాధారణ ప్రజలు, ట్యాక్సీ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు కూడా ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై పెట్రోలియం డీలర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇంధనం కొనుగోలు చేసే అవకాశం ఉందని, దాంతో రాష్ట్ర ఆదాయంపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అంతేకాదు.. ఈ సెస్ ద్వారా వచ్చే నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కూడా డీలర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది వితంతువులు, ఎంతమంది అనాథలకు ఈ నిధులు ఉపయోగపడతాయి? ఎంత మొత్తం ఖర్చు చేస్తారు? అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.హిమాచల్ ఆర్థిక పరిస్థితి కారణమా?ఈ కొత్త సెస్ వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం భారీ అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల రుణ చెల్లింపుల భారం ఉంది. రాష్ట్ర అప్పులు లక్ష కోట్ల రూపాయలు దాటిన పరిస్థితుల్లో.. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు గ్రాంట్లలో మార్పులు కూడా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు.ఇతర రాష్ట్రాల్లోనూ ఇంధన సెస్లుఇంధనంపై ప్రత్యేక సెస్‌లు విధించడం హిమాచల్ ప్రదేశ్‌తోనే మొదలైన విషయం కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్లు, సామాజిక భద్రత, పర్యావరణం వంటి అంశాల కోసం పెట్రోల్, డీజిల్‌పై అదనపు సెస్‌లు వసూలు చేస్తున్నాయి. అయితే హిమాచల్ నిర్ణయంలో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సెస్‌ను నేరుగా వితంతువులు, అనాథల సంక్షేమం కోసం ఉద్దేశించినట్లు ప్రకటించడం.సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరమే అయినప్పటికీ.. ప్రజలపై అదనపు పన్నుల భారం ఎంతవరకు సమంజసం? ఈ నిధులు నిజంగా లబ్ధిదారులకు చేరుతాయా? అనేది ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. -
ఆమె కండక్టర్‌తో వెళ్లిపోయింది.. అంతే!
వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్‌కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్‌గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. CCTV visuals are currently going viral on social media, claiming that Kerala YouTuber Akhil NRD's wife, Megha Nair, has run away with a bus conductor. Watch the video to see the reality behind it! 👇 pic.twitter.com/N9WUns571W— Vijitha (@Vijitha96) August 11, 2026అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామంపై అఖిల్ స్నేహితుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్‌తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్ రియాక్షన్‌ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్ అన్నాడట.సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మెర్చంట్ నేవీ నుంచి సోషల్ మీడియా స్టార్..అఖిల్ ఎన్ఆర్డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్‌టాక్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్‌స్టైల్ కంటెంట్, వ్లాగ్స్‌తో భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీసోషల్ మీడియా స్టార్ నుంచి మాలీవుడ్‌లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్. 2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్’ చిత్రంలోనూ నటించాడు. సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.2024లో వివాహం..అఖిల్, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్ సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్ వీడియో రిలీజ్ చేశాక ‘‘ఇది కూడా సోషల్ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు. -
11వ అంతస్తులో మంటలు.. ముంబైలో విషాదం
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్‌లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.విద్యుత్ వైరింగ్ నుంచి మంటలు?అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్, ఏసీ యూనిట్, ఫర్నిచర్, సోఫా, బెడ్, ఫాల్స్ సీలింగ్, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.చిన్నారి సహా ఇద్దరి మృతిప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.గాయపడిన వారిలో ఫైర్‌మ్యాన్ మనోజ్ సోనావానే (30), శివమ్ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు పార్థ్ (32), హిరెన్ (64), యశస్వి (33), అభిషేక్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. Watch: A fire broke out at Shanta Bhavan Building in Mumbai's Vile Parle area. After receiving information about the incident, 10 fire brigade vehicles reached the spot and began efforts to bring the fire under control. No injuries have been reported so far. Firefighters are… https://t.co/PaDkqJiRcZ pic.twitter.com/qvUdBe9Mkn— IANS (@ians_india) August 11, 2026 -
చర్చకు నో.. నినాదాలకు ఓ.. లోక్‌సభలో గందరగోళం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లడంతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సభ సజావుగా సాగనివ్వాలని, దేశ ప్రజలు చర్చ జరగాలని కోరుకుంటున్నారని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను సముదాయించే ప్రయత్నం చేసినా.. విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు.నీట్ అంశం, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుతో పాటు పలు అంశాలపై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ మధ్యలోకి రావడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.VIDEO | Delhi: Lok Sabha session begins amid Opposition protests.(Source: Sansad TV)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/zFYtvhkZs7— Press Trust of India (@PTI_News) August 11, 2026అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు జరిగాయి. విపక్షాల ఆందోళనలకు కౌంటర్‌గా ఎన్డీయే ఎంపీలు మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించారు. సభను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీనే సభ జరగనీయకుండా అడ్డుపడుతున్నారని.. ఆయన చర్చలో పాల్గొనాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్డీయే ఎంపీలకు కౌంటర్‌గా మరోవైపు ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్య, నీట్ అంశం, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కలిసి నీట్ అంశంపై నినాదాలు చేశారు. జార్ఖండ్ పేపర్ లీక్ వ్యవహారానికి రాహుల్ గాంధీ బాధ్యుడు కాదని.. జంతర్ మంతర్ లాఠీ ఛార్జికి మాత్రం అమిత్ షా బాధ్యుడంటూ వాదించారు.సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో సభ సజావుగా సాగాలని ప్రభుత్వం కోరుతుండగా.. తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
పోటాపోటీ నినాదాలు.. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలు, ఇతర అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుండగా.. ప్రతి వ్యూహంలో భాగంగా ఎన్డీయే ఎంపీలు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందనకు దిగారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో అధికార ఎన్డీయే ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించిన ఎంపీలు.. విపక్షాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇదే ఆవరణలో.. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఇన్ని రోజులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం గమనార్హం.పోటాపోటీ నిరసనలు.. పార్లమెంట్ ఆవరణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. ఎన్డీయే ఎంపీలు విపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలోనే విపక్షాల ఎంపీలు సైతం నిరసనకు దిగారు. ఎన్డీయే ఎంపీలేమో.. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. చర్చకు రావాల్సింది పోయి పారిపోతున్నారని ఆరోపిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి వ్యతిరేకంగా కూడా ఎన్డీయే ఎంపీలు నిరసన తెలిపారు. దీనికి కౌంటర్‌గా ఇండియా కూటమి ఎంపీలు నీట్, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే ఎంపీలు కూడా నిరసనలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ నినాదాలతో హోరెత్తింది.చర్చకు సిద్ధం.. ఎందుకు పారిపోతున్నారు?విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్డీయే ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే విపక్షాలు చర్చకు రావాల్సింది పోయి.. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను స్తంభింపజేయడం సరికాదని ఆరోపించారు.#WATCH | Delhi | NDA MPs protest against the Opposition, alleging they are running from discussion. BJP MP Sanjay Jaiswal says, "We are ready for disocussion but Rahul Gandhi is not. He has stalled the Lok Sabha. The Home Minister is ready to answer." pic.twitter.com/hUbmpRetdl— ANI (@ANI) August 11, 2026మోదీ నేతృత్వంలో మంతనాలు.. ఆ తర్వాత ర్యాలీఎన్డీయే ఎంపీల నిరసనకు ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళ్ మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ పరిణామాలు, ప్రతిపక్షాల వ్యూహంపై చర్చించిన అనంతరం ఎంపీలు ర్యాలీ చేపట్టారు. విపక్షాల ఆందోళనలకు ప్రతిస్పందనగా అధికార పక్షం ఈసారి “రివర్స్ స్ట్రాటజీ” అమలు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.Prime Minister @narendramodi waves the Tiranga along with all Ministers and MPs during NDA Parliamentary Party Meeting, Mangal Milan.#MangalMilan pic.twitter.com/PbgWdLaUBf— All India Radio News (@airnewsalerts) August 11, 2026గురువారంతో ముగియనున్న సమావేశాలుప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో చివరి రోజులు సజావుగా సాగాలని కేంద్రం కోరుతోంది. నిన్న ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉండటంతో సభకు ఆటంకాలు కలిగించవద్దని ప్రభుత్వం కోరుతోంది.విపక్షాల డిమాండ్లు ఇవేమరోవైపు విపక్షాలు మాత్రం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అయోధ్య రామమందిరం విరాళాల హుండీ చోరీ ఆరోపణలపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.పార్లమెంట్లో పోరు.. బయటా నిరసనలుఒకవైపు విపక్షాల ఆందోళనలు.. మరోవైపు ఎన్డీయే ఎంపీల ప్రతిఆందోళనలు.. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ వేడికి వేదికగా మారింది. సమావేశాల చివరి రోజుల్లోనైనా సభ సజావుగా సాగుతుందా? లేదంటే రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. -
ఒకే ఫ్రేమ్‌లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్‌సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
రెబల్స్‌లో రెబల్స్.. బీజేపీతో బంధంపై చీలిక!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అనామక పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతు ప్రకటించడం.. తాజాగా జరిగిన ఎన్డీయే ఎంపీల మీటింగ్‌లో ప్రధాని మోదీతో వాళ్లు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. బీజేపీతో సాన్నిహిత్యంపై ఆ వర్గంలోనూ కొందరు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్ల నేపథ్యం కారణంగా.. బీజేపీతో కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్(మాజీ క్రికెటర్)లు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురు ఇటీవల ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉండడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.‘బీజేపీతో వెళ్లం’.. ఎంపీల స్పష్టీకరణబీజేపీతో పొత్తు తమ రాజకీయ భవిష్యత్‌కు నష్టం కలిగిస్తుందని ఈ ఎంపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ సంప్రదాయ ఓటర్లకు దూరమవుతామనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ‘‘మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్డీయేలో భాగస్వాములం కాబోం’’ అని ఎంపీ అబూ తాహెర్ ఖాన్ ప్రకటించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజా ప్రయోజనాల కోసం సహకరిస్తామని మాత్రం ఆయన తెలిపారు.అదంతా డ్రామా?: మమత వర్గం ఫైర్ఎన్సీపీఐలో కొనసాగుతున్న ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్సీపీఐ అనేది ఎన్డీయేకు మిత్రపక్షమని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు.మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ కూడా విమర్శలు చేశారు. ‘‘బీజేపీకి బీ టీమ్‌గా మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గెలిచింది మమతా బెనర్జీ పేరుతో, వ్యతిరేక ఓట్లతో’’ అని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోదీ, షాతో భేటీలు.. మరోవైపు దూరంఆశ్చర్యకరంగా, బీజేపీతో దూరంగా ఉంటామని చెబుతున్న ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార భేటీకి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల ‘మంగళ్ మిలన్’ సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు. తిరిగి సొంత గూటికే?తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్సీపీఐ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అభివృద్ధి అంశాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు.మొత్తానికి.. తృణమూల్ నుంచి వలసలతో బలపడిన ఎన్సీపీఐలోనే ఇప్పుడు అసంతృప్తి స్వరాలు వినిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీతో సంబంధాలే ఈ సంక్షోభానికి కారణమా? లేదంటే ఎంపీల రాజకీయ పునరాలోచనా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
డేట్ అయిపోయిందని పారేస్తే మీ జేబుకే నష్టం!
ప్యాకెట్‌పై ఉన్న తేదీ కనిపించగానే చాలామంది చేసే మొదటి పని.. ఆ ఆహారాన్ని చెత్తబుట్టలో పడేయడం. బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, సాస్‌లు, పాలు వంటి వాటిపై ఉన్న తేదీ దాటితే ఇక అవి పనికిరావని భావిస్తుంటారు. కానీ ప్రతి తేదీ వెనుక ఒకే అర్థం ఉండదు. కొన్ని సందర్భాల్లో తేదీ దాటినా ఆహారం సురక్షితంగా ఉండొచ్చు.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఆహార ప్యాకెట్‌పై ముద్రించిన తేదీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది అనవసరంగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు. బెస్ట్ బిఫోర్(Best Before), ఎక్స్పైరీ డేట్(Expiry Date) మధ్య ఉన్న చిన్న తేడా తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. అసలు ఏ ఆహారం తినొచ్చు? ఏది పారేయాలి? తెలుసుకుందాం..ఇలా అయితే ఫర్వాలేదుఆహార ప్యాకెట్లపై కనిపించే ‘Best Before’ తేదీ అంటే.. ఆ పదార్థం అత్యుత్తమ నాణ్యతతో ఉండే గడువు. అంటే ఆ తేదీ వరకు ఆహారం రుచి, వాసన, రంగు, ఆకృతి వంటి లక్షణాలు మెరుగ్గా ఉంటాయని తయారీదారు హామీ ఇస్తాడు. ఆ తేదీ దాటిన వెంటనే ఆహారం విషపూరితం అయిపోతుందని అర్థం కాదు. ఉదాహరణకు.. కొన్ని ప్యాక్ చేసిన పదార్థాలు సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ‘Best Before’ తేదీ తర్వాత కూడా కొంతకాలం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు జాగ్రత్త అవసరం. తేదీ ఒక్కటే ఆహారం సురక్షితమా? కాదా? అని నిర్ణయించదు.ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ఎక్స్పైరీ డేట్ Expiry Date లేదా యూజ్ బై డేట్ Use-by Date అనేది ఆహార భద్రతకు సంబంధించిన హెచ్చరిక. ఈ తేదీ దాటిన తర్వాత ఆ పదార్థంలో హానికరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల విషయంలో ఈ తేదీని తప్పక పాటించాలి. అందుకే ‘Best Before’ అంటే నాణ్యతకు సంబంధించిన సూచన.. ‘Expiry Date’ అంటే భద్రతకు సంబంధించిన హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.వీటి విషయంలో జాగ్రత్తపాలు, పెరుగు, తాజా మాంసం, చేపలు వంటి పదార్థాలు చాలా త్వరగా పాడయ్యే ఆహారాలు. వీటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే.. ప్యాకెట్‌పై ఉన్న తేదీ రాకముందే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను తేదీ దాటిన తర్వాత తీసుకునే విషయంలో మరింత జాగ్రత్త అవసరం.ఆహారాన్ని ఉపయోగించే ముందు ఈ విషయాలను గమనించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరంగా పెట్టండిప్యాకెట్ ఉబ్బిపోయిందా?లీక్ అవుతోందా?వింత వాసన వస్తుందా?రంగు మారిందా?ఫంగస్ కనిపిస్తుందా?ఆకృతి మారిందా?.. ఇలాంటి మార్పులు కనిపిస్తే.. తేదీ ఉన్నా, లేకపోయినా ఆహారాన్ని తినకపోవడమే మంచిది.వాసన బాగుందని నమ్మొద్దు!చాలామంది ఆహారం చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి వాసన చూస్తారు. వాసన బాగుంటే తినేస్తారు. కానీ ఇది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఆహారంలో ఉన్నా.. వాసన, రంగు, రుచిలో మార్పు కనిపించకపోవచ్చు. అందుకే అనుమానం ఉన్న ఆహారాన్ని రుచి చూసి పరీక్షించడం కూడా మంచిది కాదు.నిల్వ విధానమే కీలకంఆహారం ఎప్పుడు తయారైంది అన్నదే కాదు.. దాన్ని ఎలా నిల్వ చేశారన్నది కూడా చాలా ముఖ్యం. ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పదార్థాలను బయట ఎక్కువసేపు ఉంచితే.. గడువు తేదీ లోపలే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి ప్యాకెట్ తెరిచిన తర్వాత ఆహారం ఉపయోగించే గడువు తగ్గవచ్చు.తినే ముందు ఈ ఆరు విషయాలు చెక్ చేయండి✅ ప్యాకెట్ సురక్షితంగా ఉందా?✅ ఎప్పుడైనా తెరిచారా?✅ సరైన విధంగా నిల్వ చేశారా?✅ ఆహారంలో మార్పులు కనిపిస్తున్నాయా?✅ అది త్వరగా పాడయ్యే పదార్థమా?✅ తేదీ దాటిన సమయం ఎంతైంది?చివరగా.. ఆహారంపై ఉన్న తేదీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ‘Best Before’ దాటిందని ప్రతి పదార్థాన్ని పారేయాల్సిన అవసరం లేదు. అలాగే తేదీ దాటిందని ప్రతి ఆహారాన్ని తినడం కూడా సరికాదు. ఆహారం రకం, నిల్వ విధానం, ప్యాకింగ్ పరిస్థితులు, పాడైన లక్షణాలు.. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. డేట్ చూసి భయపడొద్దు.. కానీ జాగ్రత్తను మాత్రం మర్చిపోవద్దు! -
బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు!
కాంగ్రెస్‌లో జెన్‌జీ రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. పార్టీ లైన్‌ను దాటి కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని సంతోష పెట్టేలా మాట్లాడడం మానుకుంటే మంచిదంటూ సూచనలు చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన ‘యువత కార్యక్రమం’ కంటే.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు జెన్‌జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. కేరళ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ నేతల వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఉండకూడదని పరోక్షంగా హెచ్చరించారు.థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన వేణుగోపాల్.. ఆ వ్యాఖ్యలను తాను పూర్తిగా వినలేదని, మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. “కాంగ్రెస్ నేతలు పార్టీ విధానాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండకపోయినా.. బీజేపీని సంతోషపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు వస్తే బీజేపీకి అది రాజకీయంగా లాభిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.జెన్‌జీపై రాహుల్ ప్రచారాన్ని సమర్థించిన కాంగ్రెస్ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన యువత కార్యక్రమాలను వేణుగోపాల్ గట్టిగా సమర్థించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి వచ్చిన వారు సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు కాదని.. నిజమైన జెన్‌జీ యువతేనని పేర్కొన్నారు. కోటా, డెహ్రాడూన్‌లలోనూ ఇదే తరహా స్పందన వచ్చిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.అసలు థరూర్ ఏమన్నారు?మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్.. రాహుల్ గాంధీ “ఛాత్రోంకీ గూంజ్” కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కార్యక్రమం లేవనెత్తిన అంశాలే CJP నిరసనల్లోనూ ఉన్నాయని.. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన CJP ఆందోళన స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “మనం యువత గొంతు విన్నామా? జెన్‌జీ నాడిని పట్టుకోగలిగామా?” అంటూ థరూర్ ప్రశ్నించారు.అయితే తన వ్యాఖ్యలు పార్టీపైనో, లేదంటే రాహుల్ గాంధీపై దాడి కాదని తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు.సీజేపీ ప్రభావంపై రాజకీయ చర్చనీట్ పరీక్ష అంశాలు, విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అదే సమయంలో యువత సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీయగా.. వేణుగోపాల్ స్పందనతో పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైంది. -
సీజేఐ హైదరాబాద్ నల్సార్ ఈవెంట్‌పై ఉత్కంఠ!
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది.సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో..విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు.“మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”..NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికను పునరాలోచించాలని కోరారు. “ప్రజల హక్కులు, న్యాయం అందుబాటులో ఉండటం, సమస్యలపై తర్కబద్ధమైన చర్చ” వంటి అంశాలను న్యాయ విద్యలో నేర్చుకున్నామని.. అలాంటి సమయంలో నిరసనకారుల ఆరోపణలపై స్పందన విషయంలో అసంతృప్తి ఉన్న వ్యక్తిని గౌరవ అతిథిగా ఆహ్వానించడం తమకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. అయితే అసలు సీజేఐని ఈ ఈవెంట్‌కు నల్సార్ నిజంగానే ఆహ్వానించిందా?.. ఈ అంశంపై వర్సిటీ అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు.మొన్న మహారాష్ట్రలోనూ..ఇదే సమయంలో మహారాష్ట్ర ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)లోనూ జస్టిస్ సూర్యకాంత్ హాజరు కావాల్సిన కాన్వొకేషన్ కార్యక్రమం వాయిదా పడటం చర్చకు దారితీసింది. ఆగస్టు 2న జరగాల్సిన TISS 86వ కాన్వొకేషన్‌ను “అనుకోని పరిస్థితుల” కారణంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినా.. భద్రతా కారణాలు, సాధ్యమైన నిరసనలపై వచ్చిన సమాచారమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది.కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావమా?జస్టిస్ సూర్యకాంత్‌కు సంబంధించిన గత వ్యాఖ్యలు, CJP ఉద్యమం నేపథ్యంలో ఈ పరిణామాలను పలువురు విశ్లేషిస్తున్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ “కాక్రోచ్లు”, “పరాన్నజీవులు” వంటి పదాలు ఉపయోగించారనే ప్రచారం జరిగింది. ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించినవని కొందరు భావించగా.. తాను నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడానని జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఏర్పడింది. అనంతరం NEET పరీక్ష అంశంపై ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి.సౌరవ్ దాస్ ట్వీట్మరోవైపు నల్సార్లోకాక్రోచ్ల నిరసనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ ఆయన నల్సార్‌లో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండడంతో.. ఈ వ్యవహారం వెనుక సౌరవ్ హస్తం ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు.NALSAR student-lawyers with a spine. pic.twitter.com/rX0sDqDzhR— Saurav Das (@SauravDassss) August 9, 2026ఒకే అంశం.. రెండు పరిణామాలుహైదరాబాద్లో NALSAR విద్యార్థులు నేరుగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా.. ముంబైలో TISS కాన్వొకేషన్ వాయిదా చుట్టూ భద్రత, నిరసనల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు న్యాయవ్యవస్థపై గౌరవం కొనసాగాలని భావించే వర్గాలు ఉండగా.. మరోవైపు పౌర హక్కులు, నిరసనలపై న్యాయస్థానాల స్పందనను ప్రశ్నించే కొత్త తరం విద్యార్థుల గొంతు వినిపిస్తోంది. కాన్వొకేషన్ వేదికలు కేవలం పట్టాలు అందించే కార్యక్రమాలేనా? లేదంటే రాజ్యాంగ విలువలపై చర్చ జరిగే వేదికలా? అనే కొత్త చర్చకు ఈ పరిణామాలు దారితీశాయి. -
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారి భేటీ అయిన ఆయన.. ఆ భేటీ సారాంశాన్ని సోషల్ మీడియాలో భావోద్వేగంగా ప్రదర్శించారు. ఈ సమావేశం తనకు ఎంతో విలువైన అనుభూతిని ఇచ్చిందని.. ఈ ఉదయాన్ని తన జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించారు."ఎప్పటికీ గుర్తుండిపోయే ఉదయం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ జీని కలిసే అవకాశం లభించింది. సుదీర్ఘమైన, ఎంతో ఉపయోగకరమైన చర్చ జరిగింది. ఆయన విలువైన సమయం కేటాయించినందుకు, ఆయన ఆలోచనలు, మార్గదర్శకత్వం పొందే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు" అంటూ రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.A morning I will cherish.Had the privilege of meeting Hon’ble Prime Minister Shri @narendramodi Ji. A detailed and enriching interaction. Deeply grateful for his generous time and for the opportunity to benefit from his insights and guidance. 🇮🇳 pic.twitter.com/4A5cEwVCNg— Raghav Chadha (@raghav_chadha) August 8, 2026ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా.. మోదీని కలిసిన ఈ ఉదయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొనడం గమనార్హం. ప్రధానితో జరిగిన ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేదంటే రాఘవ్ చద్దాకు పార్టీలో మరింత కీలక బాధ్యతలు దక్కే సంకేతమా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.రాఘవ్ చద్దా.. ఒకప్పుడు ఆప్‌లో ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లతో నెటిజన్ల దృష్టిని.. మరీ ముఖ్యంగా జెన్‌జీ దృష్టిని ఆకర్షించారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌ల అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆయన మద్దతుగా మాట్లాడారు.నీట్ నిరసనలపై ఎందుకు మౌనంగా ఉన్నాడో అనేదానిపైనా ఆయన పార్లమెంట్లో వివరణ ఇచ్చుకున్నారు. తన రోల్ మారిందని.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో తాను లేనని చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్ వ్యవస్థపై కఠిన చర్యలు అవసరమని, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల పారదర్శకత కోసం కఠిన చట్టాలు, వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్న ప్రభుత్వ వైఖరికి ఆయన మద్దతు తెలిపారు.బీజేపీలో చద్దా పాత్రపై ఆసక్తిరాఘవ్ చద్దా–మోదీ భేటీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటున్నారు. కీలక విధాన అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా.. ఒకప్పుడు భిన్న రాజకీయ వేదికపై ఉన్న రాఘవ్ చద్దా ఇప్పుడు బీజేపీ నేతగా ప్రధాని మోదీని కలవడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపుగా కనిపిస్తోంది.యువతకు మోదీ భరోసామరోవైపు, ఇవాళ ఢిల్లీలోని ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతపై విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో యువత శక్తి, ప్రతిభ కీలకమని అన్నారు. యువతలో ఉన్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని ప్రధాని పేర్కొన్నారు. -
గుజరాత్ అలల బావి మిస్టరీ వీడింది..!
సాధారణంగా బావుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఓ వ్యవసాయ బావి మాత్రం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిచింది. సముద్రపు అలలను తలపించేలా నీరు రోజుల తరబడి ఊగుతూ కనిపిస్తోంది. అది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఇది భూకంపానికి ముందస్తు సంకేతమేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే బావిని నిపుణులు పరిశీలించాక.. దీని వెనక కారణం ఏంటన్నది తెలిసిపోయింది!. విర్పర్డా గ్రామంలోని ఈ వింత బావి గురించి కొన్నిరోజులుగా దేశం చర్చించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అతీత శక్తులంటూ.. ఎవరికి తోచిన కథనాలు వాళ్లు ఇచ్చి పడేస్తున్నారు. అయితే బావిలో ఈ వింత వెనుక సైన్స్ తప్ప మరేయితర కారణాలు లేవని నిపుణులు తేల్చేశారు. అంతేకాదు.. ఎలాంటి ప్రకృతి విపత్తు కూడా రాబోవని అంటున్నారు. ఈ తరహా అలలు ఏర్పడడానికి సరైన కారణం ఏంటన్నది చెబుతున్నారు. An unusual mystery in India: water wildly swaying inside a well in Morbi, and no one can explain whyStrange phenomenon continues for a FIFTH DAY, baffling locals as authorities investigate pic.twitter.com/GykyazKKXi— RT (@RT_com) August 7, 2026సముద్రంలా ఎందుకు ఊగుతోందంటే..భారీ వర్షాల తర్వాత భూమిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుంది. ఈ నీరు భూగర్భంలోని రాళ్ల పొరలు, ఖాళీ ప్రదేశాలు, జలాశయ ప్రాంతాల్లోకి ప్రవహిస్తుంది. ఈ సమయంలో భూమి లోపల ఉన్న గాలి, నీటి ఒత్తిడిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ఒత్తిడి మార్పుల ప్రభావంతో బావిలోని నీరు పైకి కిందికి కదులుతూ అలల మాదిరిగా కనిపిస్తోంది. ముఖ్యంగా లోతైన బావుల్లో ఇలాంటి కదలికలు ఎక్కువగా గమనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.‘వెల్ సీష్’ కూడా ఓ కారణమేనా?ఈ ఘటనకు మరో శాస్త్రీయ వివరణగా ‘వెల్ సీష్’ (Well Seiche). ఒక నిర్దిష్ట ఆకారం, లోతు కలిగిన నీటి నిల్వలో చిన్నపాటి కదలిక కూడా సహజ తరంగాలుగా మారినప్పుడు.. నీరు కొంత సమయం పాటు ముందుకు వెనక్కి ఊగుతుంది. సరస్సుల్లో కనిపించే ఈ తరహా కదలికలు కొన్ని సందర్భాల్లో బావుల్లోనూ కనిపించవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.मोरबी के वीरपरडा गांव में एक कुएं में अचानक पानी छलकने और हिलने-डुलने लगा, जिसे देखने के लिए बड़ी संख्या में लोग इकट्ठा हो गए। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। #Morbi #GujaratNews #ViralVideo pic.twitter.com/hAd95ETbia— Bhoomi (@TheBPnova) August 6, 2026భూకంపం భయం..మోర్బీ ప్రాంతానికి భూకంప చరిత్ర ఉండటంతో ఈ బావిలోని వింత కదలికలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ముఖ్యంగా 2001లో గుజరాత్‌ను కుదిపేసిన భారీ భూకంపం జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బావిలో కనిపిస్తున్న నీటి కదలికలకు భూకంప కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు, భూగర్భ శాస్త్ర నిపుణులు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ లేదంటే క్రియాశీల ఫాల్ట్ లైన్ గుర్తించలేదని తేల్చేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.సముద్రపు ఆటుపోట్ల ప్రభావమా?మోర్బీ అరేబియా సముద్రానికి పూర్తిగా దూర ప్రాంతం కాదు. దీంతో కొందరు స్థానికులు బావి నీరు సముద్రపు ఆటుపోట్ల ప్రభావంతో కదులుతోందని భావించారు. భూగర్భ జల మార్గాలు సముద్రంతో అనుసంధానమై ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే దీనికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భ జలాల ఒత్తిడి మార్పులే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.🚨 GUJARAT | MYSTERIOUS WELLAn unusual phenomenon has drawn crowds to Virparda village in Gujarat's Morbi district where water inside a roadside well has been continuously moving from one side to the other.According to local reports nearby wells remain completely calm while… pic.twitter.com/rJHvXjOZ8V— contentkikamii (@contentkikamii) August 6, 2026ఇలాంటి వింతలు ప్రపంచంలోనూ ఉన్నాయిబావులు, సరస్సుల్లో నీరు అసాధారణంగా కదలడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. సరస్సుల్లో నీరు ఒకే దిశలో ఊగడం, భూగర్భ జలాల్లో ఒత్తిడి మార్పులతో నీటి స్థాయిలు మారడం వంటి పరిణామాలను శాస్త్రవేత్తలు సహజ ప్రక్రియలుగానే వివరిస్తున్నారు. అయితే బావిలో నీరు కదలడం ఆధారంగా భూకంపాలను అంచనా వేయడం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. మన దేశంలో ఇలాంటివి జరిగినా.. ఇప్పుడు సోషల్ మీడియా జమానా కారణంగా మోర్బీ బావి ఉదంతం హైలైట్ అయ్యిందంతే!.భయపెట్టిన బావి.. ఇప్పుడు ఆకర్షణగా మారిందిమొదట ఈ దృశ్యం గ్రామస్తులను భయపెట్టినా.. ఇప్పుడు అదే బావి ఆసక్తికరంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వింతను చూసేందుకు వస్తున్నారు. అధికారులు మాత్రం ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. గుజరాత్ మోర్బీ బావిలో కనిపిస్తున్న ఈ ‘సముద్రపు అలలు’ భూమి లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతోందనే సంకేతం కాదు.. ప్రకృతి తనదైన రీతిలో చూపిస్తున్న అరుదైన జల భౌగోళిక పరిణామం మాత్రమే. -
నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి?.. అభిజిత్ దీప్కే ఫైర్!
భద్రత కోసం వచ్చిన పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు.‘ఎవరిని కలవాలో మీరు నిర్ణయిస్తారా?’వైరల్‌గా మారిన ఓ వీడియోలో.. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి.. ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు.. వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు” అంటూ దీప్కే ప్రశ్నించారు.అంతేకాకుండా.. “మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు” అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.Chhatrapati Sambhajinagar - Abhijit Dipke has made strong allegations against CID officers, accusing them of arrogant and rude behaviour towards people who come to meet him.Dipke, who flared up against the police officers, claimed that visitors arriving for meetings with him are… pic.twitter.com/5hCF6s7p8Y— NextMinute News (@nextminutenews7) August 7, 2026ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదుమరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేశ్ అనే పీఎస్ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. “నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది.నిఘా ఆరోపణలుతన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్లో ‘హిట్ స్ప్రే’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్ యాటిట్యూడ్పైనా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అబిజీత్ దీప్కే.. తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదన్నది దీప్కే వాదన కాగా.. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
ఏడాది తర్వాత అస్థిపంజరంగా..!
కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. -
మై హూ నా.. కొత్త మిత్రులకు మోదీ అభయం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో కొనసాగుతున్న వేళ.. ఎన్డీయేలో కొత్తగా చేరిన ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఉదయం కొత్త మిత్రులతో ప్రత్యేక అల్పాహార సమావేశం నిర్వహించిన ప్రధాని.. వారిలో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేశారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్డీయే ఒక కుటుంబం.. మీకు మేమంతా అండగా ఉంటాం” అంటూ భరోసా ఇచ్చారు.ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి విడిపోయి ఎన్డీయేలో చేరిన 26 మంది ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనే విధానం, తమ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. వీరిలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిన 20 మంది ఎంపీలు ఉన్నారు.ముఖ్యంగా ఉద్ధవ్ శివసేన నుంచి షిండే శివసేనలోకి వచ్చిన ఎంపీలకు ప్రధాని ప్రత్యేక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లతో మరాఠీలో పలకరించిన ఆయన.. కొత్తగా కూటమిలోకి వచ్చిన వారంతా ఎన్డీయేలో సమాన భాగస్వాములేనని, వారికి పూర్తి గౌరవం, అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.పార్లమెంట్ చరిత్రపై అవగాహన పెంచుకోండికొత్తగా ఎన్డీయేలోకి వచ్చిన ఎంపీలను ఉద్దేశించి ప్రధాని.. సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పార్లమెంట్ చరిత్ర, సంప్రదాయాలు, విధివిధానాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. “పార్లమెంట్ చరిత్రకు సంబంధించిన అపారమైన సమాచారం అందుబాటులో ఉంది. దానిని చదివి చర్చలకు సిద్ధం కావాలి” అని ఎంపీలకు సూచించారు.టీఎంసీ నుంచి వచ్చిన ఎంపీలకు కూడా.. టీఎంసీ నుంచి విడిపోయి ఎన్డీఏలో చేరిన 20 మంది ఎన్సీపీ(ఐ) ఎంపీలతో కూడా ప్రధాని మాట్లాడారు. కొత్తగా వచ్చిన సభ్యులు కూటమిలో భాగమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ వనరులను వినియోగించుకోవాలని చెప్పారు.ఎన్డీయే బలం పెంచుకునే వ్యూహంకీలక రాజ్యాంగ సవరణ బిల్లులకు రెండు సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం ఉండటంతో బీజేపీ ఎన్డీయే విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల తొలగింపు నిబంధనలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదిత బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కొత్త మిత్రుల చేరిక కీలకంగా మారింది. ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి 26 మంది ఎంపీలు ఎన్డీయేలో చేరడంతో లోక్‌సభలో ఎన్డీఏ బలం 293 నుంచి 319కి పెరిగింది. అయినప్పటికీ ప్రత్యేక మెజారిటీకి ఇంకా 41 స్థానాల కొరత ఉంది.‘కొత్తవారూ మా కుటుంబ సభ్యులే’కొత్తగా చేరిన ఎంపీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చూపించేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్కు ప్రధాని మోదీ.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు ముందు వరుసలో స్థానం కల్పించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. -
ఏసీ గదిలో నిద్ర.. అదే చివరి రాత్రైంది!
ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం ఆ కుటుంబం మొత్తం ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమించింది. కానీ అదే వారి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాల ధాటికి దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపం ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం కుటుంబమంతా ఒకే ఏసీ గదిలో నిద్రించగా.. అదే వారికి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాలకు దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహులి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది. నగర్ కోత్వాలి పరిధిలోని ఓ పాత ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు.క్షణాల్లో శిథిలాల కిందఎండ తీవ్రత కారణంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏసీ ఉన్న ఒకే గదిలో నిద్రించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బలహీనంగా మారిన పాత ఇంటి పైకప్పు వర్షం ధాటికి కూలిపోయింది. దీంతో నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.ఆరుగురి మృతి.. ఒకరి ప్రాణాలతో పోరాటంఈ ఘటనలో ప్రమోద్ శ్రీవాస్తవ్ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (24), మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ పెద్ద కుమారుడు అమన్ (28) మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శిథిలాల నుంచి స్వయంగా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాత భవనం పరిస్థితి, కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.వర్షాలకు వరుస విషాదాలుప్రతాప్గఢ్ ఘటనతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ పాత నిర్మాణాలు కూలి ప్రాణ నష్టం జరిగింది. బారాబంకీ జిల్లాలోని అలియాబాద్‌లో పాత ఇటుక గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏడేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. సహరన్పూర్ జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా మట్టి ఇల్లు కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. గ్రామస్థుల సహాయంతో ఆమెను బయటకు తీసినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.వరుసగా కురుస్తున్న వర్షాలు పాత ఇళ్లకు ప్రమాదంగా మారుతున్నాయి. బలహీనంగా ఉన్న నిర్మాణాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఆ ముగ్గురే సూత్రధారులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఏ)కు చెందిన ముగ్గురు సబ్జెక్టు నిపుణులు పి.వి.కులకర్ణి(కెమిస్ట్రీ), మనీషా సంజయ్ హవల్దార్(ఫిజిక్స్), మనీషా గురునాథ్ మంధారే(బోటనీ, జువాలజీ) కీలక సూత్రధారులు అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో తాజాగా 94 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ప్రశ్నపత్రాల అనువాదం లేదా పునరనువాదం సమయంలో రఫ్ వర్క్ (ప్రాథమిక పని) కోసం ఈ ముగ్గురు నిపుణులకు ఖాళీ కాగితాలను అందించినట్లు విచారణలో తేలింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పి.వి.కులకర్ణి రసాయన శా్రస్తానికి సంబంధించిన మొత్తం 135 ప్రశ్నలను, వాటి సమాధానాల ఆప్షన్లను చిన్న కాగితం ముక్కలపై క్లుప్తంగా రాసుకుని, వాటిని రహస్యంగా బయటకు తీసుకెళ్లాడని చార్జ్‌షీట్‌లో సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్టీఏ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి ప్రవేశించేటప్పుడు లేదా నిష్క్రమించేటప్పుడు సబ్జెక్టు నిపుణులను తనిఖీ చేయడం గానీ, సోదా చేయడం గానీ జరగలేదని తెలియజేశారు. కులకర్ణి సులభమైన కొన్ని ప్రశ్నలను కంఠస్థం చేసి, తన హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని ఒక కాగితంపై రాసుకున్నాడని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీట్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే.. నిందితులకు కలిసొచ్చిన పరిస్థితులు ఎన్టిఏలో బోటనీ పేపర్‌ను ఇంగ్లిష్ నుంచి మరాఠీ భాషలోకి అనువాదకురాలిగా, జువాలజీ పేపర్ పునరనువాదకురాలిగా పనిచేసిన మనీషా మంధారే ఆ రోజు తన పని ముగించుకుని హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సంబంధిత పేరాలను మార్క్ చేసేవారు. ఆయా సబ్జెక్టులపై ఆమెకు ఉన్న దశాబ్దాల అనుభవంతో నీట్ ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోని సంబంధిత అంశాలతో సులభంగా అనుసంధానించగలిగారు. మార్క్ చేసిన పేరాల ఆధారంగా ఆయా ప్రశ్నలు, వాటి జవాబులను గుర్తించారు. ఇక ఫిజిక్స్ ప్రశ్నల అనువాదకుడిగా పనిచేసిన మనీషా సంజయ్ హవల్దార్ రోజువారీ పని ముగించుకుని ఢిల్లీలోని తన బసకు తిరిగి వచ్చిన తర్వాత ప్రశ్నలను క్లుప్తంగా రాసుకునేవారు. ఎన్టీఏ కార్యాలయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ లేకపోవడం నిందితులకు బాగా కలిసొచ్చింది. వారి నిర్వాకం ఎవరి దృష్టికీ రాలేదు. నీట్ పేపర్లోని తుది ప్రశ్నలు ఆయా నిపుణుల నుంచి మధ్యవర్తులకు, సమన్వయకర్తలకు చేరాయి. అభ్యర్థులతో సంప్రదింపులు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కన్సల్టెన్సీలను నడిపించే తేజస్ హర్షద్‌కుమార్ షా, డాక్టర్ మనోజ్ భగవాన్రావ్ షిరూరే, శివరాజ్ మోతేగాంకర్, ధనంజయ్ నివృత్తి లోఖండే, శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్లకు నీట్ ప్రశ్నలు చేరాయి. ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశగా రాజస్తాన్‌లోని శుభమ్ మధుకర్ ఖైర్నార్, మంగిలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, హరియాణాలోని యశ్ యాదవ్ ద్వారా నీట్ అభ్యర్థులకు చేరాయి. శుభమ్ మధుకర్ ఖైర్నార్ డబ్బు కోసం అభ్యర్థులతో సంప్రదింపులు జరిపాడు. సెక్యూరిటీ కోసం వారి విద్యా పత్రాలు, ఖాళీ చెక్కులను సేకరించాడు. మధ్యవర్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చక్కబెట్టాడు. మంగిలాల్ బివాల్ మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన ఆడియో ఫైళ్లు ఈ కుట్రకు సంబంధించిన ప్రణాళికను బట్టబయలు చేశాయి. -
పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు!
ఒంటరిగా జీవిస్తున్న ఆ వృద్ధ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇంట్లో నగలు కనిపించకుండా పోయాయి.. వాటి గురించి ఆరా తీసేందుకు వెళ్లిన ఇంటి పెద్ద మహిళ తిరిగి రాలేదు. గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఊహించని షాక్ ఎదురైంది. అదృశ్యమైన మహిళ ఇంటి సమీపంలోని పైకప్పుపై చెట్టు కింద శవమై కనిపించింది. ఆ తర్వాత బయటపడిన సీసీటీవీ దృశ్యాలు కేసులో కీలక మలుపుగా మారాయి.హర్యానాలోని పంచకుల సెక్టార్-21లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మన్మోహన్ లాల్ మెహతా భార్య నీరా మెహతా (72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మెహతా ఇంట్లో కొన్ని నగలు కనిపించకుండా పోయాయి. వాటి గురించి తెలుసుకునేందుకు నీరా మెహతా ఇంట్లో పనిచేసే సునీతా దేవి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఘర్షణకు దారితీసి ఉండొచ్చని, ఆ సమయంలోనే నీరా మెహతా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా తేలనున్నాయి.ఇంటి పక్కనే దాచిన మృతదేహంభర్త ఫిర్యాదుతో నీరా మెహతా అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సునీతా దేవి ఇంటికి వెళ్లగా.. ఆ ఇల్లు బయట నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. అనంతరం పక్కింటి పైకప్పు నుంచి పరిశీలించగా.. చెట్టు కింద కప్పి ఉంచిన స్థితిలో నీరా మెహతా మృతదేహం కనిపించింది. వెంటనే ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలుఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా మారింది. సునీతా దేవి, ఆమె కుమారుడు రాజా కలిసి మృతదేహాన్ని తరలించి పక్కింటి పైకప్పుపై దాచేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించిన కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ముగ్గురి అరెస్టుఈ ఘటనకు సంబంధించి పోలీసులు సునీతా దేవి, ఆమె భర్త శంకర్, కుమారుడు రాజాలను అరెస్టు చేశారు. హత్య, ఆధారాల ధ్వంసం, దొంగతనం, ఉమ్మడి ఉద్దేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులు మాత్రం నగల దొంగతనం ఆరోపణలను ఖండించినట్లు పోలీసులు తెలిపారు. సునీతా దేవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో.. నీరా మెహతా ప్రమాదవశాత్తు జారి పడిపోయారని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా నివసించే వృద్ధులు ఇంట్లో పనిచేసే సిబ్బంది వివరాలను పోలీసులతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఘటన పనిమనుషుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది. -
బోఫోర్స్ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!
దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు కుదిపేసిన సంచలన బోఫోర్స్ కేసుకు ఎట్టకేలకు న్యాయపరంగా ముగింపు పడింది. ఒకప్పుడు అధికార పీఠాలను కదిలించిన ఈ వివాదంలో మిగిలిన చివరి న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన ఈ కేసులో ఇకపై కొత్త విచారణకు అవకాశం లేకుండా పోయింది. రాజకీయ ప్రకంపనల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం వరకు సాగిన బోఫోర్స్ అధ్యాయానికి తాజా తీర్పుతో ముగింపు లభించింది.2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అజయ్ కె. అగర్వాల్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించేందుకు నిరాకరించింది.ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు కేసును కొట్టివేయడం, దానిపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ కూడా తిరస్కరణకు గురికావడంతో మళ్లీ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో హిందూజా సోదరులు, స్వీడన్ ఆయుధ సంస్థ ఏబీ బోఫోర్స్‌పై ఉన్న కేసును తిరిగి తెరవడానికి ఇక మార్గం లేకుండా పోయింది.“ఇంకా ఏం మిగిలింది?”.. సుప్రీం ప్రశ్నవిచారణ సందర్భంగా పిటిషన్లో ఉన్న హిందూజా సోదరులు శ్రీచంద్ పీ. హిందూజా, గోపీచంద్ పీ. హిందూజాలు మరణించిన నేపథ్యంలో వారి పేర్లు తొలగించేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పటికే 2005లో ఢిల్లీ హైకోర్టు అన్ని క్రిమినల్ కేసులను కొట్టివేసిందని, 2018లో సీబీఐ అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో దశాబ్దాల నాటి వివాదాన్ని కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టం చేసింది.అసలు బోఫోర్స్ వివాదం ఏంటి?1986లో భారత్–స్వీడన్ ఆయుధ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత సైన్యం కోసం 400 హోవిట్జర్ తుపాకుల కొనుగోలుకు ఈ ఒప్పందం జరిగింది. 1987లో స్వీడిష్ రేడియో ఈ ఒప్పందంలో అక్రమ కమీషన్లు చెల్లించారంటూ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఆయుధ ఒప్పందంలో మధ్యవర్తులకు భారీగా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.భారత రాజకీయాల్లో కల్లోలంబోఫోర్స్ ఆరోపణలు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించాయి. 1989 లోక్‌సభ ఎన్నికల్లోనూ బోఫోర్స్ ప్రధాన ప్రచార అంశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వివాదం కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భారీ నష్టం జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ కేసులో ఇటాలియన్ వ్యాపారవేత్త ఒట్టావియో క్వత్రోచ్చి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆయుధ ఒప్పందంలో మధ్యవర్తిత్వం, కమీషన్ల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు సాగింది. అయితే ఆయనను భారత్‌కు తీసుకురావడంలో దర్యాప్తు సంస్థలు చివరకు విజయం సాధించలేకపోయాయి.14 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు2005లో ఢిల్లీ హైకోర్టు సీబీఐ ఆధారాలు బలంగా లేవని పేర్కొంటూ హిందూజా సోదరులు, ఏబీ బోఫోర్స్‌పై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు తీరుపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ దర్యాప్తుకు భారీగా ప్రజాధనం ఖర్చయిందని పేర్కొంది. ఆ తర్వాత సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. 4,522 రోజుల ఆలస్యంపై 2018లో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది.తాజా తీర్పుతో బోఫోర్స్ కేసులో మిగిలిన చివరి న్యాయ మార్గం కూడా మూసుకుపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో అధికారికంగా తెరపడింది. అయితే భారత రాజకీయ చరిత్రలో మాత్రం బోఫోర్స్ వివాదం ఎప్పటికీ ఒక కీలక అధ్యాయంగానే మిగిలిపోనుంది. -
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
ఓ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ చర్చకు దారితీసింది. ఆ సినిమా అవార్డుల బరిలో నిలవకపోతే తాను నిరాశ చెందుతానంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఆయన ఆ స్థాయిలో ఎందుకు ప్రశంసించారు? ఆ సినిమాపై ఆయనకున్న అంచనాలు ఏంటి?..ఆ సినిమా మరేదో కాదు.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆస్కార్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.🚨BIG: Maharashtra CM Devendra Fadnavis on #Ramayana "I'll be VERY disappointed if Ramayana doesn't win an Oscar." pic.twitter.com/ylrzro3xE7— Daily Bollywood (@Bollywooz) August 6, 2026ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘రామాయణం’కు ఆస్కార్ రాకపోతే అకాడమీ జ్యూరీపై తాను నిరాశ చెందుతానని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం “దశాబ్దపు సినిమా కాదు.. సహస్రాబ్దపు చిత్రం” అని ప్రశంసించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలోనూ ‘రామాయణం’ విజువల్స్, సాంకేతిక ప్రమాణాలను ఆయన ప్రశంసించారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 నవంబర్ 6న దీపావళికి ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మొన్నీమధ్యే అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విశ్లేషణతో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌నూ వదిలారు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
నో మీన్స్ నో.. తెహల్కా మాజీ ఎడిటర్‌కు బిగ్ షాక్
ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు కొట్టివేసింది. తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు కానుంది. అయితే తీర్పు అనంతరం.. కోర్టులో కాసేపు హైడ్రామా నడిచింది.2013 నవంబర్‌లో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో తేజ్పాల్పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.ఈ కేసులో 2014లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2017లో గోవాలోని మపుసా కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2021 మేలో కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసందేకర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు వెలువడడాని కంటే ముందే తేజ్‌పాల్ కోర్టుకు వచ్చారు.బాధితురాలి ప్రవర్తనపై ముందస్తు అంచనాలు సరికాదురాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. ప్రతి బాధితురాలి స్పందన ఒకేలా ఉండదని, వ్యక్తిగత పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అంశాల ఆధారంగా మారుతుందని పేర్కొన్నారు.ట్రయల్ కోర్టు తన తీర్పులో బాధితురాలు లైంగిక దాడి అనంతరం సాధారణంగా కనిపించే ప్రవర్తనను ప్రదర్శించలేదని వ్యాఖ్యానించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. బాధితుల ప్రవర్తనను ఒకే కొలమానంతో అంచనా వేయలేమని తెలిపారు. ఇటు తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది అబాద్ పొండా వాదనలు వినిపించారు.నో మీన్స్ నో.. అరెస్ట్‌కు డిమాండ్తేజ్పాల్ను దోషిగా నిర్ధారించిన అనంతరం ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. బాధితురాలు తన కుమార్తె వయసులో ఉన్నప్పటికీ తేజ్‌పాల్ నేరానికి పాల్పడ్డారని, ఆమె నిరాకరించిన తర్వాత కూడా ముందుకు వెళ్లారని వాదించారు. “ఒక మహిళ ‘నో’ అంటే దాని అర్థం నోనే అని సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లాలి” అని తుషార్ మెహతా కోర్టులో పేర్కొన్నారు.మరోవైపు, తీర్పు అనంతరం తరుణ్ తేజ్‌పాల్ శిక్షలో ఉపశమనం ఇవ్వాలని కోరారు. “నాకు 62 ఏళ్లు. నేను కూడా బాధితుడిననే నమ్ముతున్నాను. నాకు భార్య ఉంది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తాను. దయచేసి నా విషయంలో కొంత సానుభూతి చూపించండి” అని కోర్టును అభ్యర్థించారు.తెహల్కా-తరుణ్ తేజ్‌పాల్ నేపథ్యంతెహల్కా భారత జర్నలిజం చరిత్రలో సంచలనాత్మక దర్యాప్తు కథనాలకు పేరుగాంచిన ప్రముఖ వార్తా మ్యాగజైన్. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టింగ్ ఆపరేషన్లు, అవినీతి బహిర్గతాలు, రాజకీయ–కార్పొరేట్ వ్యవహారాలపై పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తెహల్కా వ్యవస్థాపకుల్లో తరుణ్ తేజ్‌పాల్ ఒకరు. జర్నలిస్టుగా, రచయితగా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. 1990లలో జర్నలిజంలోకి వచ్చిన తేజ్‌పాల్.. పలు ప్రముఖ ప్రచురణ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2000లో తెహల్కా డాట్‌కామ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దానిని వార్తా మ్యాగజైన్‌గా తీర్చిదిద్దారు.తెహల్కా నిర్వహించిన కొన్ని స్టింగ్ ఆపరేషన్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2001లో వెలుగులోకి వచ్చిన “ఆపరేషన్ వెస్ట్ ఎండ్” రక్షణ రంగంలో అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనాలతో తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే తర్వాతి కాలంలో తేజ్‌పాల్ వ్యక్తిగత జీవితం, సంస్థకు సంబంధించిన వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా 2013 లైంగిక దాడి కేసులో హైకోర్టు తీర్పుతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
12 ఎగ్జామ్స్‌లో టాపరే లీకురాయుడు!
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడే యువతకు అతడు ఒకప్పుడు ఆదర్శం. వరుసగా పోటీ పరీక్షలు రాసి.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 పరీక్షల్లో విజయం సాధించాడు. అతడి సక్సెస్ స్టోరీ చూసి ఎంతోమంది అభ్యర్థులు స్ఫూర్తి పొందారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పేరు పేపర్ లీక్ కేసులో మారుమోగుతోంది. జార్ఖండ్ పరీక్షల కుంభకోణంలో ప్రధాన అనుమానితుడిగా అరెస్టైన అభయ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.అభయ్ తివారీ.. జార్ఖండ్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన 19 మందిలో ఒక్కడు. అయితే అతను సాధించిన విజయాల జాబితా చిన్నది కాదు. నేవీ పరీక్ష, భాభా అణు పరిశోధన కేంద్రం (BARC) పరీక్ష, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు.. ఇలా అనేక పోటీ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. 13 ఏళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు క్లియర్ చేయడంతో అతడికి “ఎగ్జామ్ స్టార్”గా గుర్తింపు వచ్చింది. అయితే.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల ఆరోపణలు మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. “అతడి వరుస విజయాల వెనుక ప్రతిభేనా? లేక పరీక్షల వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్ సీఐడీ ఆరోపణల ప్రకారం.. అభయ్ తివారీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ఓ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తన వరుస విజయాలనే(సిసలైన సక్సెసా? లేదంటే మోసమా? అనేది తేలాల్సి ఉంది).. నమ్మకంగా మార్చుకుని అభ్యర్థులను ఆకర్షించాడని అధికారులు భావిస్తున్నారు.పరీక్షల సంస్థతో పాత సంబంధాలుతివారీ గతంలో పరీక్షల నిర్వహణ సంస్థ TRS-Data Processing Private Limitedలో పనిచేశాడు. పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత అతడు జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. పాత పరిచయాలు కొనసాగించాడా? పరీక్షల వ్యవస్థలోకి ఎలా ప్రవేశించాడు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.పేపర్ లీక్‌తో బయటపడిన అసలు విషయంజార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తర్వాత నిరసనలు మరింత పెరిగాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.రాంచీలో రోడ్డెక్కిన విద్యార్థులురాంచీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పరీక్షలు రద్దు చేయాలని, అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరగా.. ప్రభుత్వం మాత్రం సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.ఇటు సీజేపీ ప్రతినిధి అభిజిత్ దీప్కే కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపారు.నలుగురు మంత్రులతో కమిటీవిద్యార్థుల ఆందోళన తీవ్రత పెరగడంతో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. సమస్యలను పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలకు ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థలో లోపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనలు కొంత తగ్గినా.. విద్యార్థులు మాత్రం కేవలం హామీలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.ఒక్క తివారీ కేసు కాదు.. వ్యవస్థకే పరీక్షఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఆదర్శంగా కనిపించిన అభయ్ తివారీ.. ఇప్పుడు అదే పరీక్షల వ్యవస్థపై వచ్చిన అనుమానాలకు కేంద్రంగా మారాడు. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమా? లేదంటే మరేదైనా కోణం ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం దేశంలో పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. -
30 ఫ్లస్.. డీకేకు చెక్ పెట్టే వ్యూహమా?
కేబినెట్ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌లో మొదలైన అసంతృప్తి మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నిరసనలు కొనసాగిస్తుండగా.. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తుండడం.. ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతల అనుచరులు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతలు.. ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అసంతృప్త నేతలు చెబుతున్నారు.ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే..మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన ఇండీ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని అనుచరులు చెబుతున్నారు. మరో నేత బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ గుండు రావు, ఎం. కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎం.సీ. సుధాకర్, ఆర్బీ తిమ్మాపూర్, రహీం ఖాన్ వంటి పలువురు నేతలు కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి పదవుల ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత పాటించలేదని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టగా.. మరికొందరు పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా: డీకేఅసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కఠినంగా స్పందించారు. రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని, రాజీనామా లేఖలు వస్తే నిమిషాల్లో ఆమోదిస్తామని హెచ్చరించారు. “రాజకీయాల్లో రాజీనామాలు సాధారణం. పార్టీ అన్నింటికంటే ముఖ్యం. ఓపికగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, సహనం పాటించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అసంతృప్త నేతలకు సూచించారు. ఈ తరుణంలో.. డీకే శివకుమార్‌తో చర్చల అనంతరం కొందరు నేతలు మెత్తబడినట్లు సమాచారం.నేడు ఏం తేలనుంది?మంత్రి పదవులు దక్కని నేతలు నేడు రహస్యంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో.. తమ డిమాండ్లు, పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే మార్గాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీఎం డీకే వైఖరి కారణం.. అవసరమైతే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.అధిష్టానం రంగంలోకి..కర్ణాటక కాంగ్రెస్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే ఆయన సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. ఇవాళో, రేపో అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా హైకమాండ్ ప్రయత్నిస్తోంది.ప్రభుత్వానికి ముప్పు ఉందా?కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 135 స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కంటే 22 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.అందుకే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పడిపోయేంత సంఖ్యాబలం సంక్షోభం లేదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వెళితే తప్ప ప్రభుత్వానికి తక్షణ ముప్పు ఉండదన్న అంచనా ఉంది. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సీనియర్ నేతల అసంతృప్తి కొనసాగితే అది డీకే శివకుమార్ నాయకత్వానికి, పార్టీ అంతర్గత ఐక్యతకు రాజకీయ సవాల్‌గా మారే అవకాశం ఉంది.ఇప్పటి వరకు మంత్రి పదవుల కోసం జరిగిన అసంతృప్తి.. నేడు జరిగే ఎమ్మెల్యేల సమావేశంతో ఏ మలుపు తిరుగుతుందన్నదే కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం వారిని బుజ్జగిస్తుందా? లేదంటే డీకే శివకుమార్ కఠిన వైఖరినే కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. -
నమ్మకం పోయింది.. వాంగ్‌చుక్ సంచలన ఆరోపణలు
ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజుల నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కేంద్రం సమక్షంలోనే దీక్ష విరమించాలన్నది తన ఉద్దేశం ఏమాత్రం కాదని.. ఆ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారాయన. అయితే ఆ ఘటన తర్వాత ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో జరిగిన అర్ధరాత్రి భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీక్ష విరమణ సమయంలో తీసిన ఫొటోలను వెంటనే విడుదల చేయబోమని మంత్రులు తనకు హామీ ఇచ్చారని, అయితే ఆ మాటను తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.“అందరి సమక్షంలో ప్రకటించాలని కోరా”దీక్ష విరమణను కేవలం అధికార పార్టీ కార్యక్రమంలా చూపించకూడదని తాను భావించినట్లు వాంగ్‌చుక్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి ప్రతినిధులు కూడా పాల్గొన్న తర్వాతే ఈ విషయాన్ని ప్రకటించాలని కోరినట్లు చెప్పారు. “విపక్ష నేతలు, విద్యార్థి నాయకులతో కలిసి ఉమ్మడిగా ప్రకటన చేద్దామని చెప్పాను. ఫొటోలు కూడా అందరి భాగస్వామ్యంతోనే విడుదల చేయాలని కోరాను. దీనికి వారు అంగీకరించారు” అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఈ అంగీకారానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా సాక్షులుగా ఉన్నారని ఆయన తెలిపారు.“కొన్ని నిమిషాల్లోనే ఫొటోలు బయటకు వచ్చాయి”అయితే తనతో జరిగిన అంగీకారం కొద్ది నిమిషాల్లోనే తనకు షాక్ తగిలిందని అన్నారు. “కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫొటోలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయనితో ఐబీ అధికారి వచ్చి నాకు చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యా. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం.. నమ్మకాన్ని దెబ్బతీసింది అని ఆయన అన్నారు.రాహుల్ గాంధీతోనూ సంప్రదింపులు..తన భార్య గీతాంజలి అంగ్మో.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడి, ఆయన చేతుల మీదుగా దీక్షను ముగించే అవకాశం ఉందా అని ప్రయత్నించారని వెల్లడించారు. అయితే అందుకు రాహుల్ గాంధీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తన భార్యపై కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయని, వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.డీల్ చేసుకోవాలనుకుంటే..తన దీక్ష ముగింపు విషయంలో ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు. “నాకు ఏదైనా ఒప్పందం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే 26 రోజుల పాటు దీక్ష చేసే అవసరం లేదు. అంతకంటే పెద్ద అవకాశాలు నాకు ఉండేవి” అని అన్నారు. తనకు పదవులు లేదంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యమని స్పష్టం చేశారు.26 రోజుల దీక్ష.. 10 కేజీల బరువునీట్ వ్యవహారంలో అవకతవకలు, పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటికే నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన సంఘీభావం తెలపగా.. ఆయన దీక్షకు ఆ సంస్థ కూడా మద్దతు తెలిపింది. అయితే క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం, కోర్టు జోక్యంతో బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. నిరసనకారులెవరూ ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల అంశంపై వీడియో సందేశం ఇచ్చిన తర్వాత జూలై 24న వాంగ్‌చుక్ తన 26 రోజుల దీక్షను విరమించారు. అయితే దీక్ష విరమణ సమయంలో కేంద్ర మంత్రులు ఆయనకు సూప్ అందిస్తున్న ఫొటోలు బయటకు రావడం వివాదాస్పదంగా మారింది. ఆయన కేంద్రంతో డీల్ కుదుర్చుకున్నాడంటూ సంచలన ఆరోపణలు దిగారు కొందరు ఆందోళనకారులు. ఈ వ్యవహారంపై వాంగ్‌చుక్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెర దించింది. ఆ పార్టీ భవిష్యత్‌పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం రెండు నెలల క్రితమే వ్యంగ్య రూపంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించిన ఈ సంస్థ.. ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు దీప్కే నాయకత్వం వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.‘పార్టీ పెట్టే ఆలోచన లేదు’తమ భవిష్యత్ ప్రణాళికలపై దీప్కే మాట్లాడుతూ.. “రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. మీడియాకే ఆ అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. మేము ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం” అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల వంటి అంశాలపై పోరాడడమే తమ లక్ష్యమని చెప్పారు.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికCJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారని దీప్కే పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్‌చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.(అయితే ఈ మీటింగ్ జరుగుతున్న వేళ.. ఇవాళ అక్కడి ఆందోళలను విరమించడం గమనార్హం)యువత ఉద్యమానికి కొత్త దిశ?సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, దాదాపు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడం, వాటిపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. “యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరని ఈ ఉద్యమం నిరూపించింది” అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.కేవలం వ్యంగ్య వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా మారే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి కాకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా కొనసాగాలని అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. -
గాల్లో నరకం.. ఒక్క క్షణం ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం!
ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణం.. అంతలోనే ఒక్కసారిగా భారీ కుదుపులు. క్షణాల్లోనే ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. లగేజీ బిన్లు తెరుచుకున్నాయి.. క్యాబిన్ ప్యానెల్స్ ఊడిపోయాయి.. కేకలు, ఆందోళనలతో విమానం భయానక దృశ్యంగా మారింది. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే భయాన్ని మిగిల్చింది.ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మంగళవారం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో క్రూజింగ్ దశలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్ర టర్బులెన్స్‌కు(కుదుపు) గురైంది. దీంతో గాయాల పాలైన ప్రయాణికులు.. ప్రాణభీతితో వణికిపోయారు. కొందరు ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలాంటి ముందస్తు హెచ్చరిక జారీ కాలేదు. హఠాత్తుగా విమానం భారీగా ఊగిపోయింది. ఒక్కసారిగా విమానం కిందకు పడిపోయినట్లు అనిపించింది. కొందరు ప్రయాణికులు సీట్ల నుంచి పైకి ఎగిరి పైభాగాన్ని ఢీకొన్నారు. క్యాబిన్లో లగేజీ కిందపడటం, ఓవర్‌హెడ్ బిన్లు దెబ్బతినడం, ప్యానెల్స్ ఊడిపోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయగా.. కొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.మేము బతకమని అనుకున్నాంఇటలీకి చెందిన వివియానా అనే ప్రయాణికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ.. “ఒక్కసారిగా టర్బులెన్స్ మొదలైంది. నా సోదరి సీటు నుంచి గాల్లోకి ఎగిరిపోయింది. నా తల్లి తలకు గాయమైంది. వెనుక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడి ముఖంపై రక్తం కనిపించింది. మేము చనిపోతామని అనుకున్నాం” అంటూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంది.మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. తన తండ్రి సీటు నుంచి పైకి ఎగిరి విమానం పైభాగానికి తగిలి కిందపడ్డారని తెలిపాడు. తన భార్య, రెండేళ్ల చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపడి గాయపడ్డారని, ఈ ఘటన తమకు “పునర్జన్మలా అనిపించింది” అని చెప్పాడు.వీడియోలు తీయొద్దన్నారుఈ ఘటనపై విమానంలో ప్రయాణించిన కంటెంట్ క్రియేటర్ శిల్పి జైన్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. విమానం కూలిపోతుందేమోనని భయపడ్డామని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సిబ్బంది కోరారని, ఎయిర్‌లైన్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పినట్లు ఆరోపించారు. ల్యాండింగ్ తర్వాత కూడా వెంటనే వైద్య సాయం అందలేదని, కొంతమంది ప్రయాణికులు సహాయం కోసం వేచి చూడాల్సి వచ్చిందని శిల్పి జైన్ పేర్కొన్నారు. 17 మందికి గాయాలుఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడగా.. వారిలో నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత గాయపడిన వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు. కొందరిని ఆస్పత్రుల్లో చేర్చారు. ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. ప్రయాణ సమయంలో కొద్దిసేపు తీవ్ర టర్బులెన్స్ ఎదురైందని, ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపింది. తీవ్రమైన ప్రాణాపాయం లేదని పేర్కొంది. ఘటనపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లి గాయపడిన ప్రయాణికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.టర్బులెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా?ఇది ఇటీవలి కాలంలో నమోదైన మరో తీవ్రమైన టర్బులెన్స్ ఘటన. 2026లోనే ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్ వెళ్తున్న క్యాథే పసిఫిక్ విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురై 10 మంది గాయపడ్డారు. అంతకుముందు 2025లో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర టర్బులెన్స్ కారణంగా అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఆ ఘటనలో 25 మంది వరకు గాయపడ్డారు. వాతావరణ మార్పులు, గాలి ప్రవాహాల్లో అనూహ్య మార్పుల కారణంగా తీవ్రమైన టర్బులెన్స్‌లు మరింత తరచుగా ఎదురవుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ప్రయాణికులకు మరోసారి హెచ్చరికఈ ఘటన మరోసారి విమానంలో ఉన్నప్పుడు సీటు బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. సాధారణంగా విమానం గాల్లో ఉన్నప్పుడు చిన్న కుదుపులు సహజమే అయినా.. ఇలాంటి ఆకస్మిక టర్బులెన్స్‌లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల గందరగోళం.. 145 మందికి పైగా ప్రయాణికుల జీవితాల్లో మాత్రం మరచిపోలేని భయానక అనుభవంగా మిగిలిపోయింది. -
డబ్బుల్లేవా? అయితే చచ్చిపో!
స్నేహం అంటే నమ్మకం.. కష్టాల్లో అండగా నిలిచే బంధం. కానీ అదే ఓ వ్యక్తి జీవితంలో విషాదానికి కారణమైంది. నమ్మినవాళ్లే మోసం చేయడం, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, పైగా బెదిరింపులకు దిగడంతో.. అంతకు మించి అవమానించడంతో ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై.. చివరకు తన ప్రాణాలనే తీసుకున్నాడు. గుజరాత్ సూరత్‌లోని సార్థానా ప్రాంతానికి చెందిన రాజేశ్‌భాయ్ కుంజాడియా ఎంబ్రాయిడరీ వ్యాపారం చేసేవారు. గత కొన్ని నెలలుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో తన స్నేహితులకు అవసరాలు పడడంతో.. తన దగ్గరున్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు. అయితే ఆ నమ్మకం వమ్ము కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజేశ్‌భాయ్ తన స్నేహితుడు ఘనశ్యామ్ అహిర్‌కు కెనడా వెళ్లేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ.14 లక్షలు ఇచ్చారు. కొంతకాలం తర్వాత డబ్బు తిరిగి అడిగినప్పుడు ఘనశ్యామ్ తప్పించుకోవడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రాజేశ్‌భాయ్ పేరుతో పలు బ్యాంకు ఖాతాలు తెరవాలని ఒత్తిడి చేశాడు. ఎందుకు? అని గట్టిగా ఆరా తీస్తే.. సైబర్ నేరాలకు ఉపయోగించే ‘మ్యూల్ అకౌంట్స్’ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్‌భాయ్ అభ్యంతరం చెప్పడంతో తనను సైబర్ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడరు. అదే సమయంలో.. మరో ఇద్దరు స్నేహితులు నికిత్ అలియాస్ రిక్కీ, దాధీ అహిర్లకు కూడా ఆయన డబ్బు ఇచ్చారు. ఒకరికి రూ.2 లక్షలు, మరొకరికి రూ.1.32 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి వద్ద కలిపి రాజేశ్భాయ్కు రావాల్సిన మొత్తం రూ.17.32 లక్షలు. ఆ ముగ్గురు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. స్నేహితులు తనను అవమానించారని, ఒత్తిడి చేశారని రాజేశ్‌భాయ్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. “డబ్బుల్లేవా? అయితే చచ్చిపో” అంటూ వారు చెప్పడంతో రాజేశ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.జులై 30న రాజేశ్‌భాయ్ సూసైడ్ నోట్ రాసి.. తన కుమార్తెతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కుమార్తెను తిరిగి ఇంటికి పంపించి విషం తీసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు.మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నేహితుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని గుర్తించి.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. ఫ్రెండ్షిప్ డే రోజే(ఆగస్టు 2న) ఘనశ్యామ్, నికిత్, దాధీ అహిర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్నేహం పేరుతో నమ్మకద్రోహం చేస్తే ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. -
అసంతృప్తి నేతలకు డీకే శివకుమార్ షాక్!
కర్ణాటక కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది. -
కమల వ్యూహం బెడిసికొట్టింది అక్కడే..!
బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే.. పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలుఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్‌లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరికబంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరిలో కారకులెవరూ?బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్‌కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే: మీసా భారతి
బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. 35 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానాన్ని కైవసం చేసుకున్న పీకే విజయంపై విపక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. లాలూ కూతురు, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన గెలుపు వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఆరోపించారు.బంకీపూర్ ఫలితాలపై ఇండియా టుడేతో మాట్లాడిన మీసా భారతి.. బీజేపీ అధికారిక అభ్యర్థి నీరజ్ కుమార్ కాదని, అసలు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన సొంత బలంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేమని భావించి పరోక్షంగా పీకేకు మద్దతిచ్చిందని ఆరోపించారు. “మీరు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ అని అనుకుంటారు.. కానీ అసలు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్” అని ఆమె పేర్కొన్నారు. బంకీపూర్ ఎప్పటి నుంచో బీజేపీ బలమైన ప్రాంతమని, అక్కడ బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీకి నష్టం లేదని వ్యాఖ్యానించారు.“పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే”ప్రశాంత్ కిషోర్ విజయాన్ని బీజేపీకి అనుకూలంగా మలిచే ప్రయత్నం చేశారని మీసా భారతి మండిపడ్డారు. బీజేపీ అధికారిక అభ్యర్థి ఓడిపోయినప్పటికీ.. పీకే గెలవడం ద్వారా బీజేపీ తన లక్ష్యాన్ని సాధించిందన్నారు. బీజేపీ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎందుకు మార్చారని ప్రశ్నించిన ఆమె.. సొంతంగా గెలిచే నమ్మకం లేకపోవడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.“గుంటనక్క” అంటూ విమర్శలుప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేసిన మీసా భారతి.. ఆయనను “గుంటనక్క”గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని ఆరోపించారు.తేజస్వి గైర్హాజరుపై వివరణబంకీపూర్ ప్రచారంలో ఆర్జేడీ దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలను మీసా భారతి ఖండించారు. ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ వ్యక్తిగత పర్యటనలో ఉండటం వల్ల ప్రచారానికి రాలేకపోయారని సమర్థించారు. అదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఆమె విమర్శలు చేశారు. విద్యార్థుల నిరసనలు జరుగుతున్న సమయంలో విదేశీ పర్యటనలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే.. విజయ సంబురాల్లో ఉన్న జన సురాజ్ పార్టీగానీ, ప్రశాంత్ కిషోర్గానీ మీసా భారతి ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. 36 రౌండ్ల పాటు ఆధిక్యం.. భారీ మెజారిటీతో విజయంబంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ తొలి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 36 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆయన ఆధిక్యాన్ని కొనసాగించారు. జనసూరాజ్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 44,827 ఓట్లు వచ్చాయి. దాదాపు 19,324 ఓట్ల మెజారిటీతో పీకే విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇదే స్థానం నుంచి నితిన్ నబీన్(98,299 ఓట్లు) రేఖా కుమారి(46,363 ఓట్లు)పై దాదాపు 52 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.35 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలుబంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి పట్టున్న ప్రాంతంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే తాజా ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం ద్వారా జనసూరాజ్ పార్టీకి అసెంబ్లీలో తొలి అడుగు పడింది.ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.అయితే బంకీపూర్ ఫలితం కేవలం బీజేపీకి ఎదురుదెబ్బ మాత్రమే కాదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విజయం ద్వారా ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ రాజకీయ స్థలానికే సవాల్ విసిరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లలో కొంత భాగం జనసూరాజ్ వైపు మళ్లడం ఆర్జేడీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటివరకు బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష శక్తిగా ఉన్న ఆర్జేడీకి ముస్లిం–యాదవ్ (ఎంవై) ఓటు బ్యాంకు ప్రధాన బలంగా ఉండేది. అయితే బంకీపూర్‌లో సంప్రదాయంగా ఆర్జేడీ వైపు ఉండే కొన్ని వర్గాల ఓట్లు కూడా ప్రశాంత్ కిషోర్ వైపు మళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయంగా జనసూరాజ్ను కొందరు ఓటర్లు చూడటం మొదలుపెడితే.. భవిష్యత్తులో బీహార్ ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్‌ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్‌ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్‌కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్‌పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్‌ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్!
వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిళ్లు.. కారణాలు ఏవైనా కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనిషిని కుంగదీస్తుంది. అలాంటి సమయంలో సరైన సహాయం, మద్దతు అందకపోతే పరిస్థితులు విషాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాల్సిన ఓ వైద్యురాలే.. చివరకు అదే మానసిక ఒత్తిడికి బలికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఆఫీసర్స్ సిటీ-2 సొసైటీలో నివసిస్తున్న డాక్టర్ హేమికా అగర్వాల్ (40) ఆదివారం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.హేమికా తండ్రి డాక్టర్ ఆర్. చంద్ర కూడా ఘజియాబాద్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన విడాకుల తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె వివాహ బంధం ముగిసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.దాని నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారని.. పేషెంట్లకు చికిత్స కొనసాగిస్తుండడంతో మామూలుగా మారిందని తాము భావించామని చెబుతున్నారాయన. మరోవైపు ఆమె మృతి వార్త స్థానికంగా వైద్య వర్గాల్లో విషాదం నింపింది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఇతరుల మానసిక సమస్యలకు పరిష్కారం చూపే వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడితో విషాద నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ బయటపడకపోవడంతో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అమిత్ షా ఎక్కడ?!
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా వాయిదాల పర్వం(ఇవాళ కూడా) కొనసాగుతోంది. అయితే అమిత్ షా గైర్హాజరీని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోగా.. బీజేపీ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది.విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు అనవసర బల ప్రయోగం జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చలో సంసద్ ర్యాలీ సమయంలో లాఠీలు, పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయని, అందుకే ఘటనకు బాధ్యత హోంమంత్రి అమిత్ షాదేనని విపక్ష నేతలు అంటున్నారు.“అమిత్ షా సమాధానం చెప్పాలి”పరీక్షల సంస్కరణ బిల్లు చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. హోంమంత్రి అనుమతి లేకుండా ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకున్నాయని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని పేర్కొంటూ.. ఆయన సభకు రాకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కేంద్రం వాదన ఏంటి?అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. నిరసనల సమయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి అనవసర బలప్రయోగం జరగలేదని చెబుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.మళ్లీ రంగంలోకి CJPమరోవైపు నీట్ నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి మరో సవాల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసుల ఉపసంహరణ, విద్యార్థులపై చర్యలపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలను మళ్లీ ఉధృతం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.షా మౌనం చర్చనీయాంశంనీట్ నిరసనల వ్యవహారంలో ఇప్పటివరకు అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరీని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు CJP తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.విద్యార్థులపై పోలీసు చర్యల ఆరోపణలు.. అమిత్ షా మౌనం.. కేసుల ఎత్తివేత డిమాండ్.. ఈ మూడు అంశాలు కేంద్రంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో హోంమంత్రి స్పందిస్తారా? రాజకీయ రగడ మరింత కొనసాగుతుందా?? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
ఇక కేసు లేనట్లే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మైనర్ బాలికకు ఊరట లభించింది. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. జంతర్ మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో భాగంగా వైరల్ అయిన వీడియోలో బాలిక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.తొలుత నోయిడా పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో తాను కేవలం 15 ఏళ్ల బాలికనని, ఇతరుల ప్రభావంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వెల్లడించింది. “నేను చేసినది క్షమించరాని తప్పు. చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. ఇది నా మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఆ బాలిక వీడియోలో పేర్కొంది.మోదీ క్షమాభిక్ష.. మారిన పరిణామాలుఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. తనను దూషించిన వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. “అలాంటి పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని క్షమించాలని కోరుకుంటున్నాను” అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలోనూ బాలికపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కూతురిని క్షమించాలని తల్లి విజ్ఞప్తిబాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. “మోదీ గారు గొప్ప మనసుతో నా కుమార్తెను క్షమించారు. ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నాను” అని ఆమె తెలిపారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలని ప్రధానిని కోరారు. చిన్నారులు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.CJP నిరసనల నేపథ్యంలో ఘటననీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసనలు నిర్వహించింది. ఎక్కువగా విద్యార్థులు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడంతో గత నెలలో ఈ నిరసనలను విరమించారు. అయితే నిరసనల సమయంలోనే నోయిడాకు చెందిన బాలిక.. రెచ్చిపోయి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఓ సుప్రీం కోర్టు లాయర్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ప్రధాని క్షమాభిక్ష.. పోలీసుల నిర్ణయం.. మైనర్ బాలికకు భారీ ఊరట లభించినట్లయింది. -
పెన్షన్ కోసం పాత ఉద్యోగంలో చేరిన మాజీ ఎంపీ!
అధికారం, పదవులు ఎప్పటికీ శాశ్వతం కావు.. కానీ నేర్పించిన విద్య మాత్రం జీవితాంతం తోడుంటుంది. పార్టీకి ఆ ప్రాంత ముఖంగా.. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఓ మాజీ ఎంపీ.. ఇప్పుడు మళ్లీ తరగతి గదిలోకి అడుగుపెట్టారు. పదవి పోయిందని, అవమానాలు జరిగాయని కుంగిపోకుండా.. తనకు తెలిసిన విద్యా బాటనే ఎంచుకున్నారు. రాజకీయ కార్యకలాపాలకు దూరమై.. తిరిగి ఉపాధ్యాయ వృత్తిలో చేరడం ఆయన వ్యవహారం.. అందుకు చెప్పిన ఆసక్తికర కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.త్రిపురలోని తూర్పు త్రిపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ తరఫున గెలిచిన రిబతి త్రిపుర(49).. తాజాగా అగర్తలాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ ఉపాధ్యాయుడిగా చేరారు. రాజకీయాల్లో అనుకున్నంత క్రియాశీల పాత్ర లేకపోవడం, పార్టీ పదవుల్లో చోటు దక్కకపోవడంతో ఆయన తన పాత వృత్తి వైపు మళ్లినట్లు తెలుస్తోంది.ఎంపీగా ఎదిగిన ఉపాధ్యాయుడురిబతి త్రిపుర స్వస్థలం ధలాయ్ జిల్లా. చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2001లో అగర్తలాలోని మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు తూర్పు త్రిపుర టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.రాజకీయంగా తగ్గిన ప్రాధాన్యంఅయితే కాలక్రమేణా ఆయన రాజకీయ ప్రాధాన్యం తగ్గింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు బదులుగా తిప్రా మోతా పార్టీ అధినేత ప్రద్యోత్ కిశోర్ దెబ్బర్మన్ సోదరి కృతి దేవి దెబ్బర్మన్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత కూడా రిబతి త్రిపుర బీజేపీ కోర్ కమిటీలో కొనసాగినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుకుగా కనిపించలేదు. తాజాగా పార్టీ ప్రకటించిన కొత్త కార్యవర్గ జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారం అక్కడ వినిపిస్తూ వచ్చింది. దానికి తగ్గట్లే ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.‘రెండున్నరేళ్లుగా పని లేదు.. అందుకే తిరిగొచ్చా’అయితే తన నిర్ణయంపై రిబతి త్రిపుర మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా తనకు ప్రత్యేక బాధ్యతలు ఏమీ లేవని తెలిపారు. “రాజకీయంగా నాకు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక బాధ్యత లేదు. అందుకే నా పాత వృత్తి అయిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి తిరిగి వచ్చాను” అని ఆయన పేర్కొన్నారు.తిరిగి బోధనలో సౌకర్యంగా ఉంటే కొనసాగుతానని, లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అదే సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగం తనకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కూడా ఇస్తుందని తెలిపారు. నెలకు సుమారు రూ.50 వేల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.రాజకీయాల నుంచి.. తరగతి గదికిరిబతి త్రిపుర తిరిగి పాఠశాలలో చేరడాన్ని సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతించినట్లు తెలుస్తోంది. ఆయన నిబద్ధతతో బోధిస్తున్నారని పాఠశాల అధికారులు తెలిపారు. ఎంపీగా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలోకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజమే. కానీ తనకు తెలిసిన రంగంలో తిరిగి అడుగుపెట్టి స్థిరత్వాన్ని ఎంచుకున్న రిబతి త్రిపుర నిర్ణయం.. పదవి కంటే వృత్తి విలువను గుర్తుచేస్తోంది. -
బీజేపీకి బిగ్ టెస్ట్.. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు!
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు హోరెత్తిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బీజేపీ పాలిత మూడు రాష్ట్రాలు.. బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. యువతలో పెరిగిన అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందా? లేదంటే బీజేపీ తన పట్టును కొనసాగిస్తుందా? అన్నది ఈ ఫలితాలతో తేలనుంది.బంకీపూర్, దాతియా, మంజల్పూర్ ఉప ఎన్నికల స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. బంకీపూర్‌లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ ముందంజంలో కొనసాగుతున్నారు. ఇక దాతియా, మంజల్పూర్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాటియాలో కాంగ్రెస్ అభ్యర్థి కాసేపు ఆధిక్యంలో కొనసాగినా.. కాసేపటికే మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు.ఈ ఉప ఎన్నికలు సంఖ్యాపరంగా చిన్నవే అయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కీలకంగా మారాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.బంకీపూర్.. బీజేపీ కంచుకోటలో ఆసక్తికర పోరుబిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన స్థానం. ఇప్పటివరకు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఖాళీ ఏర్పడింది. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ కుమార్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చివరి నిమిషంలో యువ మోర్చా నేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది.ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై ఒత్తిడి పెరిగిందనే సంకేతంగా ప్రచారం చేశాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ నియోజకవర్గంపై ఆసక్తిని పెంచింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. కుల, మతాలకు అతీతంగా తమ అభ్యర్థికి మద్దతు లభించిందని చెబుతూ అనూహ్య ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు.దాతియా.. బీజేపీ అంతర్గత అసంతృప్తికి పరీక్షమధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గం కూడా బీజేపీకి కీలకంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశుతోష్ తివారీ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్ సింగ్ పోటీ చేశారు.అయితే ఈ ఎన్నికలో అసలు చర్చ బీజేపీ అంతర్గత రాజకీయాలపైనే సాగింది. మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆయన వరుసగా మూడు సార్లు దాతియా నుంచి గెలిచారు. ఈసారి అభ్యర్థి మార్పుపై నరోత్తమ్ మిశ్రా వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆయన అనుచరులు నిరసనలు కూడా చేపట్టారు. ఈ అంతర్గత విభేదాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.మంజల్పూర్.. గుజరాత్లో బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గం బీజేపీకి మరో కీలక పరీక్షగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత యోగేష్‌భాయ్ నరేంద్రభాయ్ పటేల్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరఫున మాజీ వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి భిఖాభాయ్ రబారీ బరిలో నిలిచారు. గుజరాత్లో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికలో కీలకంగా మారాయి.యువ ఓటర్ల తీర్పు ఏంటి?ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా అందరి దృష్టి యువ ఓటర్ల తీర్పుపైనే ఉంది. పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఆగ్రహం ఓటింగ్‌లో ప్రతిబింబిస్తుందా? లేక సాధారణ రాజకీయ అంశాలే ఆధిపత్యం చెలాయిస్తాయా? అన్నది ఫలితాల తర్వాత స్పష్టమవుతుంది.అయితే మూడు స్థానాల ఫలితాలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో లేకపోయినా.. ప్రజల మూడ్, ముఖ్యంగా యువత ఆలోచనా విధానంపై ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వనున్నాయి. బీజేపీ కంచుకోటలను కాపాడుకుంటుందా? లేదంటే విద్యార్థి నిరసనల ప్రభావం ప్రతిపక్షాలకు ఊరటనిస్తుందా? మరికాసేపట్లో వెలువడే ఉప ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి. -
బీజేపీకి గుడ్‌బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్‌జీ నిరసనల ఎఫెక్ట్‌తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్‌జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్‌జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్‌లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్‌సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్‌గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్‌జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్‌లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్‌తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.మోదీ ఏమన్నారంటే..ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026చేతులు జోడించి రుచికా క్షమాపణలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.Ruchika Singh, a CJP protester who made abusive remarks against PM Narendra Modi, has issued an apology to the entire country.She claims that other people at the protest influenced and encouraged her to use abusive language. She has promised never to repeat such an act again.… pic.twitter.com/hNQULRZ8r1— Mukesh (@mksh_kgp) July 31, 2026వయసుపై వివాదంఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.నేపథ్యంపై సోషల్ మీడియాలో చర్చఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు వాదనలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్లో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చరుచికాపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. -
చెట్టు మీద భర్త.. వరదలో కొట్టుకుపోయిన భార్యాపిల్లలు
క్షణాల్లో వచ్చిన వరద ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో కారు కొట్టుకుపోతుండగా.. తండ్రి చెట్టును పట్టుకుని బయటపడగలిగాడు. కానీ.. అందులో ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లు మాత్రం అతడి కళ్ల ముందే ప్రవాహంలో కలిసిపోయారు. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. యవత్మాల్ జిల్లాలో వరద ఉధృతికి ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా.. తండ్రి మాత్రం సమయస్ఫూర్తితో చెట్టును పట్టుకుని బయటపడ్డాడు. అయితే తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోవడంతో గుండెలు పగిలేలా కన్నీటి పర్యంతం అయ్యాడు.అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి వెళ్తున్న అవినాశ్ ఖండారే కుటుంబం గురువారం ఈ ప్రమాదానికి గురైంది. అవినాశ్ తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో దర్వా ప్రాంతంలోని కుప్తి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ.. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయడంలో పొరపాటు జరగడంతో వాహనం ముందుకు కదిలింది. వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి ఉధృతమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.కారు కొట్టుకుపోతున్న సమయంలో అవినాశ్ ఖండారే అప్రమత్తమై సమీపంలోని ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే కారులో ఉన్న భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలను మాత్రం రక్షించలేకపోయాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.. ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత వరద ఉధృతి తగ్గగా.. స్థానికులు చెట్టు మీద ఉన్న అవినాశ్‌ను గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం వరదలో కొట్టుకుపోయిన వాహనాన్ని గుర్తించారు. కారుతో పాటు మాధవి, కుమార్తెల మృతదేహాలను వెలికితీశారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. భారీ వర్షాలతో వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
యాంటీ పేపర్ లీక్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటి పేపర్ లీక్ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ పాస్ అయిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో యాంటి పేపర్ లీక్ చట్టంగా మారింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ఇటీవల దేశంలో ‘నీట్’ (NEET) వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.రూ. 10 కోట్ల వరకు జరిమానా: వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. కాగా.. నీట్ పేపర్ లీక్ కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026 -
‘ఇంటికి తిరిగొచ్చినట్టుంది’.. తస్లీమా నస్రీన్ భావోద్వేగం
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతా గడ్డపై అడుగుపెట్టారు. గతంలో తీవ్ర నిరసనలు, వివాదాల కారణంగా నగారన్ని వీడాల్సి వచ్చిన ఆమె.. శుక్రవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరిగి రావడంపై ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.‘‘ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపిస్తోంది. ఇక్కడ నాకు చాలా నచ్చుతుంది’’ అంటూ కోల్‌కతాలో అడుగుపెట్టిన వెంటనే తస్లీమా స్పందించారు. చాలా కాలం తర్వాత తనకు ఎంతో అనుబంధం ఉన్న నగరానికి తిరిగి రావడం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన సందర్భమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆమె రాకను బీజేపీ స్వాగతించింది. అయితే మిగతా రాజకీయ పార్టీలు మాత్రం సరైన సమయం కాదనే అంటున్నాయి.నా అంతట నేను పోలేదు‘‘నేను కోల్‌కతాను ఎప్పుడూ స్వచ్ఛందంగా వదిలిపెట్టలేదు. అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నన్ను వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. అయినా ఏదో ఒక రోజు తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ కోల్పోలేదు’’ అని తెలిపారు. ఏళ్లు గడిచాయి.. ప్రభుత్వాలు మారాయి.. కానీ తిరిగి రావడానికి నాకు తలుపులు మాత్రం మూసే ఉన్నాయి” అని ఆమె గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.#WATCH | Bangladeshi writer and activist Taslima Nasreen arrives in Kolkata, West Bengal pic.twitter.com/IsFSBUaZ7t— ANI (@ANI) July 31, 2026‘ద్విఖండితో’ పుస్తకంతో వివాదంతస్లీమా నస్రీన్ 2007లో కోల్‌కతాను వీడాల్సి వచ్చింది. ఆమె రాసిన ఆత్మకథాత్మక పుస్తకం ‘ద్విఖండితో’పై తీవ్ర నిరసనలు చెలరేగడంతో అప్పటి పరిస్థితుల్లో ఆమె నగరాన్ని విడిచారు. అంతకుముందు బంగ్లాదేశ్‌లో కూడా మతపరమైన వివాదాల కారణంగా ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కోల్‌కతాను తన నివాసంగా మార్చుకున్న ఆమె.. దాదాపు పదేళ్ల పాటు అక్కడే ఉన్నారు.అయితే 2003లో అప్పటి వామపక్ష ప్రభుత్వ హయాంలో ‘ద్విఖండితో’ పుస్తకాన్ని మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందనే ఆరోపణలతో నిషేధించారు.రేపు కార్యక్రమంలో పాల్గొననున్న తస్లీమాకోల్కతా పర్యటనలో భాగంగా శనివారం రవీంద్ర సదన్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో తస్లీమా పాల్గొననున్నారు. మత మౌఢ్యానికి వ్యతిరేకంగా నిర్వహించే సాహిత్య సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో ఉంటున్నారు.తిరిగి వచ్చినా.. పాత జ్ఞాపకాల వెంటరచనల్లో స్వేచ్ఛ, మహిళా హక్కులు, మత ఛాందసవాదంపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే తస్లీమా నస్రీన్‌కు కోల్‌కతాతో ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి రావడం సాహిత్య, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
కాక్రోచ్లు ఏం చేశారో చూడండి.. ఢిల్లీ పోలీసుల కుటుంబాల ఆవేదన
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. గాయపడిన పోలీసుల కుటుంబాలు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో పోలీసులపై కూడా తీవ్ర దాడులు జరిగాయని ఆరోపిస్తూ బాధిత సిబ్బంది కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తమవాళ్లపై జరిగిన దాడులకు కూడా న్యాయం కావాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. జంతర్ మంతర్ ఆందోళనల్లో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఘటనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వాళ్ల కుటుంబ సభ్యులు.. అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు విద్యార్థులపై పోలీసుల చర్యల గురించే ఎక్కువగా చర్చ జరిగిందని, కానీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి.నా తండ్రిని ఈడ్చుకెళ్లి కొట్టారు.. ఢిల్లీ పోలీస్ ఏఎస్ఐ కుమార్తె మాట్లాడుతూ తన తండ్రిపై జరిగిన దాడిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి గతంలో 15 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా పనిచేశారని, అనంతరం ఢిల్లీ పోలీస్‌లో చేరారని తెలిపారు. #WATCH | Delhi | Daughter of a Delhi Police SI (Sub-Inspector) who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "...Before joining the police, my father served as a Marine Commando in the Indian Navy. He dedicated 15 years of his life to the… pic.twitter.com/aevnbcdNyQ— ANI (@ANI) July 31, 2026“జంతర్ మంతర్ వద్ద బ్యారికేడ్ల దగ్గర విధుల్లో ఉన్న సమయంలో ఓ గుంపు ఆయనను ఈడ్చుకెళ్లింది. దాదాపు మూక దాడికి గురయ్యారు. స్పృహ కోల్పోయి ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో నాలుగు గంటలు ఉన్నారు” అని ఆమె తెలిపారు. “రాత్రి 10 గంటలకు సహచర పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఆయన యూనిఫాం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ దృశ్యం మా కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని బాధ” అని చెప్పారు. తన తండ్రి తలకు నాలుగు కుట్లు పడ్డాయని, అయినప్పటికీ “ఇవి విధిలో భాగమే” అంటూ కుటుంబాన్ని ధైర్యం చెప్పారని ఆమె పేర్కొన్నారు.‘సోషల్ మీడియాలో మమ్మల్ని నేరస్థులుగా చూపిస్తున్నారు’పోలీసులపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో నా తండ్రినే నేరస్థుడిగా చూపిస్తున్నారు. కానీ దాడికి గురైన మా కుటుంబానికి కూడా న్యాయం కావాలి. మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి” అని ఏఎస్ఐ కుమార్తె అన్నారు. గాయపడిన పోలీసుల కుటుంబాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయని తెలిపారు.‘రాళ్ల దాడిలో నా భర్త హెల్మెట్ పగిలిపోయింది’మరో ఏఎస్ఐ భార్య సీమ మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన భర్త జులై 20న జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్నారని చెప్పారు. ఆందోళనకారుల సంఖ్య పెరిగిందని, కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని భర్త తనకు చెప్పారని తెలిపారు.VIDEO | Wife of a Delhi Police ACP who sustained injuries during the clash between police and CJP protesters in Delhi on July 20, says, "When he returned home late on the night of July 20 with injuries, it was an extremely painful and traumatic moment for me and my two-year-old… pic.twitter.com/l6YllUXHS3— Press Trust of India (@PTI_News) July 31, 2026“ఆందోళనకారులు పూల కుండీలు, చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. నా భర్త ధరించిన హెల్మెట్ రాళ్ల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. హెల్మెట్ లేకపోతే ఆయన ప్రాణాలతో ఉండేవారు కాదేమో” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.‘సీనియర్ అధికారులను కాపాడుతూ గాయపడ్డారు’మరో ఏఎస్ఐ కుమారుడు లక్ష్య మాట్లాడుతూ.. తన తండ్రి సీనియర్ అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో రాళ్ల దాడికి గురయ్యారని ఆరోపించారు. “తలపై రాయి తగలడంతో నాలుగు కుట్లు పడ్డాయి. ఆన్లైన్లో చూస్తే పోలీసులపై మాత్రమే విమర్శలు కనిపిస్తున్నాయి. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు” అని అన్నారు.#WATCH | Delhi | A family member of a Delhi Police official who sustained injuries during the clash between Police and protesters in Delhi, says, "This was not a student protest; rather, there were mischievous elements who tried to sabotage and discredit the students' protest and… pic.twitter.com/qfyP8CawD4— ANI (@ANI) July 31, 2026రెండు వాదనలు.. వీడియోలు వైరల్జంతర్ మంతర్ ఆందోళనపై ఇప్పటివరకు ప్రధానంగా విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. లాఠీచార్జ్, అరెస్టులు, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసుల కుటుంబాలు విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలు ఘటనకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఆందోళన సమయంలో పోలీసులు కూడా దాడులకు గురయ్యారా? లేక బలప్రయోగం అంశం ఎంతవరకు సమంజసం? అన్నదానిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో విద్యార్థులు, పోలీసులు ఇద్దరి వాదనలు పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జెన్‌జీ నిరసనలపై మౌనం వీడిన రాఘవ్ చద్దా
రాఘవ్ చద్దా.. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రతీ అంశంపైనా ప్రశ్నించారనే పేరుంది. ప్రత్యేకించి జెన్‌జీకి కనెక్ట్ అయ్యే ప్రతీ అంశంపైనా ఆయన నిలదీశారు. ఈ క్రమంలో ఆయన గురించి నెట్టింట కూడా పెద్ద చర్చ జరిగింది. ఆ క్రేజ్‌తో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. అయితే ఆ మధ్య ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎందుకనో సైలెంట్ అయిపోయారు..న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు.. జెన్‌జీ పోరాటంపై ఆయన ఎక్కడా స్పందించింది లేదు. ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు తన పాత్ర మారిందని, అందుకే కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా పరిష్కారాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు.పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కాస్త ఘాటుగా ప్రసంగించారు. పేపర్ లీక్‌ల వంటి సమస్యలను మీడియా ముందు చేసే ప్రకటనలతో పరిష్కరించలేమని.. బలమైన వ్యవస్థాగత మార్పులు అవసరమని అన్నారు.‘అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు’నీట్ పేపర్ లీక్ అంశంపై తాను ఎందుకు స్పందించలేదని చాలామంది ప్రశ్నించారని చద్దా చెప్పారు. “నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ప్రశ్నలు అడగడం నా బాధ్యత. ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాను. ఇప్పుడు నా పాత్ర మారింది. అధికార పక్షంలో ఉన్నందున ప్రశ్నలు వేయడం కంటే పరిష్కారాలు చూపించడం నా బాధ్యత” అని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా హెడ్లైన్ల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని.. సమస్యకు పరిష్కారం దొరికే సమయంలోనే స్పందించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.జెన్‌జీ బాధ న్యాయమే.. నీట్ అభ్యర్థులు, ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆవేదనను చద్దా సమర్థించారు. “మీ కోపం న్యాయమే.. మీ భావోద్వేగాలు న్యాయమే.. మీ బాధ కూడా న్యాయమే” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. నీట్ పరీక్ష అనేది కేవలం ఒక పరీక్ష కాదని.. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు అది ఒక మార్గమని అన్నారు. కోటా, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని, తల్లిదండ్రులు కోచింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారని గుర్తుచేశారు.గతంలో యువత గొంతుకగా గుర్తింపురాఘవ్ చద్దా గతంలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో పలు అంశాలపై దూకుడుగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం, యువతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం ద్వారా సోషల్ మీడియాలోనూ ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే రాజకీయ పరిణామాలు మారడంతో ఆయన వైఖరిలోనూ మార్పు కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గతంలో ప్రశ్నించే గొంతుకగా ఉన్న ఆయన.. ప్రస్తుతం వ్యవస్థలో భాగంగా పరిష్కారాలపై దృష్టి పెడుతున్నానని చెబుతున్నారు.‘పేపర్ లీక్ ఒక దీర్ఘకాలిక వ్యాధి’పేపర్ లీక్‌లను రాజకీయ కోణంలో చూడకూడదని చద్దా అన్నారు. ఇది దేశాన్ని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్య అని, ఏ రాష్ట్రంలో జరిగినా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. “జవాబుదారీతనం, నైతికత రాజకీయాలకు మించి ఉండాలి” అని అన్నారు.కేంద్ర చర్యలకు మద్దతునీట్ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని చద్దా తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచినప్పుడు ఆయన ఒక సంరక్షకుడిలా స్పందించారని అన్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు వేగంగా జరిగిందని, కేవలం 75 రోజుల్లోనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో నీట్ పరీక్షలను ఓఎంఆర్ షీట్లకు బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.Cancer is not cured by Crocin. Paper Leak is not cured by soundbites. It needed a real institutional fix, and today we gave it one.That is why I stood in support of the Public Examination Amendment Bill 2026. Because this is India's first real, institutional answer to paper… pic.twitter.com/qKeI5xFSM5— Raghav Chadha (@raghav_chadha) July 31, 2026మాజీ పార్టీ ఆప్‌పై విమర్శలుపేపర్ లీక్‌లపై మాట్లాడిన చద్దా తన మాజీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా విమర్శించారు. పంజాబ్ ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించారు. బ్లూటూత్ పరికరాల ద్వారా కొందరు అభ్యర్థులకు సహాయం చేశారని, మోసపూరిత పరీక్షల కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.13 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఎస్ఎస్ఎల్సీ ప్రశ్నపత్రం లీక్ ఘటనను కూడా ప్రస్తావించారు.‘విద్యార్థులు మాట్లాడారు.. ప్రభుత్వం విన్నది’ పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం దేశ పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని రాఘవ్ చద్దా అన్నారు. యువతలో నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం, కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో ప్రశ్నలతో ముందుకు వచ్చిన రాఘవ్ చద్దా.. ఇప్పుడు పరిష్కారాల రాజకీయాలపై దృష్టి పెడుతున్నానని చెప్పడం.. జెన్‌జీ తరం ఆందోళనల మధ్య ఆయన రాజకీయ ప్రయాణంపై మరోసారి చర్చకు దారితీసింది. -
'పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదనిస ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే పార్లమెంట్లో యాంటి పేపర్ లీక్ బిల్ పాస్ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా మరోసారి నిర్వహించారు. ఈ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం యాంటి పేపర్ లీక్ బిల్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ కూడా ఆమోదం తెలిపింది. Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf— Narendra Modi (@narendramodi) July 30, 2026


