సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడి మరీ.. | Gujarati Man Breaks into Seema Haider House Then Happend This Next | Sakshi
Sakshi News home page

సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడి మరీ.. ఫోన్‌ నిండా ఆమె ఫొటోలే!

May 4 2025 9:01 AM | Updated on May 4 2025 1:15 PM

Gujarati Man Breaks into Seema Haider House Then Happend This Next

భారతీయ భర్త సచిన్‌తో సీమా హైదర్‌

న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్‌-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్‌(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..

ఓ వ్యక్తి సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్‌.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.

గుజరాత్‌  సురేందర్‌ నగర్‌కు చెందిన తేజస్‌.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్‌ ఉంటున్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్‌లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్‌ షాట్స్‌ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి వచ్చానని తేజస్‌ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే‌ ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement