2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో | Indian origin man becomes UK first Sikh RAF fighter pilot since World War 2 | Sakshi
Sakshi News home page

2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో

Aug 17 2026 3:46 PM | Updated on Aug 17 2026 3:53 PM

Indian origin man becomes UK first Sikh RAF fighter pilot since World War 2

భారత సంతతికి చెందిన 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్‌దీప్ సింగ్ డాంగ్ (Arshdeep Singh Dang), బ్రిటన్ చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF)లో ఫైటర్ పైలట్‌గా పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సిక్కు యోధుడు ఫైటర్ స్క్వాడ్రన్ నుండి 'వింగ్స్' (Wings) సాధించడం ఇదే తొలిసారి అని RAF తెలిపింది.

నార్త్‌ వేల్స్‌లోని 'RAF వ్యాలీ'లో శుక్రవారం (ఆగస్టు 14న) జరిగిన వేడుకలో అర్ష్‌దీప్ సింగ్ పట్టభద్రుడయ్యారు. తన తండ్రిని పైలట్‌గా చూడాలనేది తాతగారైన సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ కల అని, అయితే ఆయన చిన్నతనంలోనే మరణించడంతో ఆ అవకాశం రాలేదని అర్ష్‌దీప్ తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాతగారి కలను తాను నిజం చేసినట్లు  అర్ష్‌దీప్‌  వెల్లడించారు.రక్షణ రంగంలో ఫ్రంట్‌లైన్ ఫైటర్ విమానాలను నడిపేందుకు ఆయన మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ తీసుకోనున్నారు.

ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్‌ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!

1998లో చండీగఢ్‌లో జన్మించిన అర్ష్‌దీప్, తన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకే (UK) వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబం ఇంగ్లాండ్‌లోని సౌత్ ఆల్‌లో నివసిస్తోంది. ఆయన తండ్రి జగ్‌దీప్ సింగ్ డాంగ్ (లుధియానా), తల్లి గగన్‌దీప్ కౌర్ (అమృత్‌సర్). బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం మరియు తత్వశాస్త్రం (Mathematics & Philosophy) అభ్యసించిన ఆయన, 2022లో ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 2025లో ఫాస్ట్ జెట్ శిక్షణ ప్రారంభించి, అక్టోబర్ 2025లో టెక్సాస్‌లో సోలో ఫ్లైట్ పూర్తి చేశారు. జులై 2026లో 'వింగ్స్ టెస్ట్'లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ ఇంద్రలాల్ రాయ్, హర్దిత్ సింగ్ మాలిక్, స్క్వాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పూజ్జీ సహా, బ్రిటిష్ సైనిక విమానయానంలో సేవలందించిన భారతీయ సంతతికి చెందినఈ ఘనత సాధించి భారతీయుల సరసన అర్ష్‌దీప్‌ చేరారు.

ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్‌ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement