నటి, సోషల్‌మీడియా యాక్టివిస్ట్ స్వరా భాస్కర్ రాజకీయనాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకుని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. వివాహానికి ముందు నుంచే వీరిద్దరు చాలామంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్ చేస్తున్న ప్రైమ్ వీడియో రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్ 2'లో పోటీదారుగా ఉన్న స్వరా ఒక తాజా ఎపిసోడ్ తన వ్యక్తిగతానికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఫహద్‌ను వివాహం చేసుకునే ముందే తాను రెండుసార్లు ఐవీఎఫ్‌కి ట్రై చేసి విఫలమైనట్లు వెల్లడించారు. అలాగే తన వివాహం, ప్రెగ్నెన్సీ రెండు శుభావార్తలు ఒకేసారి తన జీవితంలోకి వచ్చాయని పేర్కొంది. ఆ షోలో తన పోటీదారు ప్రియాంక చాహర్ చౌదరితో మాట్లాడుతున్నప్పుడూ స్వరా ఈ విషయాలు పంచుకుంది. తాను ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడం, సింగిల్ మదర్‌గా ఉండటం గురించి తన పేరెంట్స్‌ని ఎలా ఒప్పించిందో గుర్తుచేసుకుంది.
పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, అందుకే ఐవీఎఫ్ ద్వారా బిడ్డను పొందాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిపి ఒప్పించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది. అయితే వాళ్లు మొదట షాక్‌కి గురయ్యారని, ఆ తర్వాత తన నిర్ణయానికి మద్దతిచ్చారని చెప్పుకొచ్చింది. అలాగే భారత్ వంటి దేశాల్లో ఇది కాస్త సవాలుతో కూడిన నిర్ణయమని కూడా తన పేరెంట్స్ హెచ్చరించినట్లు తెలిపింది.
తనకు ఒక బిడ్డ, కుటుంబం కావాలని ఉండేదని, అందుకే అనామిక స్పెర్మ్ బ్యాంక్ దాత ద్వారా రెండుసార్లు ఐవీఎఫ్ చేయించుకున్నా, కానీ ఫెయిలైందని పేర్కొంది. తాను మరోసారి ప్రయత్నించేలోపే స్వరా ఫహద్ అహ్మద్‌ని కలవడం అతడితో డేటింగ్ వెళ్లడం, ప్రెగ్నెంట్ అవ్వడం చకచక జరిగిపోయాయని చెప్పుకొచ్చింది. కేవలం రెండు మూడు నెలలకే ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపింది. ఆ తర్వాత కోర్టులో అధికారికంగా రిజిష్టర్ మ్యారేజ్ చేసకున్నట్లు తెలిపింది.
అందువల్ల వివాహం, గర్భవతి అవ్వడం వంటి రెండు శుభవార్తలు ఒకేసారి తన జీవితంలోకి వచ్చాయని చెప్పుకొచ్చింది. కాగా, నటి స్వరా భాస్కర్ రాజకీయనాయకుడు ఫహద్ అహ్మద్‌ని జనవరి 2020లో ఒక నిరసన ర్యాలీలో కలుసుకున్నారు. మొదట్లో వీరిద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత 2022 చివరలో డేటింగ్ ప్రారంభించారు. అనంతరం ఫిబ్రవరి16, 2023న కోర్టులో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు. వివాహం జరిగిన తొమ్మిది నెలలకే సెప్టెంబర్ 23, 2023న రాబియా అనే కుమార్తెకు జన్మనిచ్చింది.
ఇదీ చదవండి: ఫ్లైట్ అటెండెంట్‌గా 12 ఏళ్ల చిన్నారి..! ఎట్టకేలకు నెరవేరిన కల..)


