వైభవంగా ప్రారంభమైన వెంకటగిరి పోలేరమ్మ జాతర.
వెంకటగిరి పట్టణం భక్తజన సంద్రంగా మారింది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నాలుగో ఏడాది సైతం జాతర కనుల పండువగా నిర్వహిస్తున్నారు.
దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో స్థిరపడిన వెంకటగిరి వాసులు భారీ సంఖ్యలో జనజాతరకు హాజరయ్యారు.
వేడుకను ప్రత్యక్షంగా తిలకించి ఆనవాయితీ ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. పోలేరమ్మ తల్లి దీవెనల కోసం పట్టణానికి ఇసుక కేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తున్నారు.


