ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరు స్వచ్ఛతకు మారు పేరు. కాకపోతే కాస్త విలక్షణంగా విభ్నింగా ఆచారం రూపంలో జరగడం విశేసం. నిజానికి 2014లో స్వచ్ఛ భారత మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి గాంధీ జయంతి పరిశుభ్రత కార్యక్రమాలకు పర్యాయపదంగా మారింది. కానీ ఉత్తర కన్నడ మాత్రం దీన్ని శతాబ్దాలు చేస్తుంది ఒక సంప్రదాయ ఆచారంలో భాగంగా. ఏడాదిలో సరిగ్గా ఈ కాలంలో దీన్ని పాటిస్తుండటం విశేషం. మొత్తం ఊరు ఊరే స్వచ్ఛతకు మారుపేరుగా స్వచ్ఛందంగా ఈ పని చేయడం వివేషం. మరి ఆ ఆసక్తికరమైన ఆచారం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా..!.
ఉత్తర కన్నడలో సముద్ర తీరంలోని ప్రతి గ్రామం సంచార దేవత వడలగజ్జి కోసం ఎదురు చూస్తూ..ఉపయోగించనివి, పారవేసే గృహోపకరణాలు, వ్యర్థాలను మూటకట్టి ఉంచుతారు. దాన్ని ఉత్తర కన్నడలోని హోన్నవార్ తాలుకాలోని కర్కి గ్రామస్థులు ఒక ఆలయ సమీపంలో జాతీయ రహదారి 66 వద్ద ఆలయంలోని దేవతకు సమర్పిస్తారు. అక్కడ ఈ వ్యర్థాలను పయోగించిన గృహోపకరణాలను దేవతకు సమర్పిస్తారు.
మహిళలు పసుపు, కుంకుమ, ఆకుపచ్చ గాజులు ధరించి మరి ఈ వ్యర్థాల తోపాటు చీర, కోబ్బరికాయలు, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అలాగే సజీవంగా ఉన్న కోళ్లు, ఉప్పును కూడా విసురుతారట. ఆ అమ్మవారిని వ్యర్థాల దేవతాగా కొలుస్తారు అక్కడి ప్రజలు. ఆమె వ్యాధులను తొలగిస్తుందనేది అక్కడి ప్రజల నమ్మకం. ఆ తర్వాత ఆ వ్యర్థాలను కాల్చడం, లేదా పూడ్చిపెట్టడం చేస్తారు.
ఈ ఆచారం వెనుక ఉన్న కథ..
శతాబ్దాల క్రితం, ఉత్తర కన్నడలో వర్షాకాలం కలరా, రకరకాల జ్వరాలు, బోదకాలు, కడుపు సంబంధిత అంటివ్యాధులు ప్రబలంగా ఉంండేవి. దాంతో ఈ వ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించమంటూ ప్రజలు వడగలమ్మ అమ్మవారిని ప్రార్థించి వ్యర్థ పదార్థాలు సమర్పించేవారు. ఒకవేళ అప్పటికే గ్రామంలో ఏదైన ప్రబలి ఉంటే..దాన్ని నిర్మూలించడానికి ఇలా నైవేద్యాలు సమర్పిస్తారని స్థానికులు చెబుతున్నారు.
ఆ నేపథ్యంలో ఇంటిని పరిశుభ్రం చేసి..ఆ తర్వాత పనికరాని చీపుర్లు, సంచులు, చిరిగిన బట్టలు, వ్యవసాయ పనిముట్లు, గొడుగులు, చివరికి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిని దేవతకు సమర్పిస్తారు. పెద్ద శబ్దంతో సంగీతం మోగిస్తూ దేవతకు స్వాగతం పలుకుతారు. రథంపై వస్తున్న దేవతకు భక్తులు తమ ఇంటి వ్యర్థాలు, రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అర్ధరాత్రి వేళ రహదారి పక్కన ఉన్న పొరుగు గ్రామానికి అప్పగిస్తారు. “ఈ దేవత రెండు మార్గాలలో ప్రయాణిస్తుంది -- ఒకటి మంజుగిని, గోకర్ణ మీదుగా ఉత్తరం వైపు అంకోలాకు వస్తుంది, అక్కడ భక్తులు నైవేద్యాలను సేకరించి వాటిని తదుపరి గ్రామానికి తీసుకువెళతారు.
గతంలో, వారు వాటిని తమ భుజాలపై మోసేవారు, ఇప్పుడు వాహనాల్లో తీసుకువెళ్తుండటం విశేషం. ఈ దేవతను వడగలమ్మ లేదా వడగలజ్జి అని పిలుస్తారు. మరికొన్ని గ్రామాలు ఈ దేవతను మరిహోరే అని పిలుస్తారు. అలా ఆ దేవత రథం అంకోల గుండా కార్వార్‌ను చుట్టి అక్కడ కాళి నది సమీపంలోని ఒక నిర్జన ప్రదేశంలో వదిలేస్తారు. అక్కడ వాటిని కాల్చివేయడం గానీ పూడ్చిపెట్టడం గానీ చేస్తారట.
ఇదీ చదవండి: స్పర్శే దృష్టిగా..అంధ శిల్పి అద్భుత సృష్టి..!


