సందర్భం
నేడు మహాత్మాగాంధీ జయంతి
మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్రోద్య మానికి నాయకత్వం వహించిన మహోన్నత వ్యక్తి మాత్రమే కాదు... సత్యం, అహింస, సామాజిక సమానత్వం, స్వావలంబన, గ్రామీణ స్వరాజ్యం, పారిశుద్ధ్యం వంటి విలువలకు జీవి తాంతం కట్టుబడిన దూరదృష్టిగల నాయకుడు. మానవ చరిత్రలో రాజ్యహింసను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అహింసను శక్తిమంతమైన పోరాట సాధనంగా మలిచిన నాయకుడు. సత్యా గ్రహం ద్వారా అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజ లను శాంతియుతంగా సమీకరించారు.
సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం, సమా నత్వం, మానవ హక్కులు ఉండాలన్న భావన ఆయన సామాజిక తత్వంలో కీలకమైనది. చరఖా, ఖాదీ ఆయనకు కేవలం వస్త్ర తయారీ సాధనాలు కాదు; స్వావలంబన, గ్రామీణ ఉపాధి, స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు ప్రతీ కలు.
మహిళలు సమాజంలో సమాన హక్కులు, సమాన అవకాశాలు పొందాలని గాంధీజీ కోరు కున్నారు. స్వాతంత్య్రోద్యమంలో మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రజా ఉద్యమాల్లో వారి పాత్రను విస్తరించారు. మహిళా సాధికారత అంటే కేవలం చట్టపరమైన హక్కులు ఇవ్వడం మాత్రమే కాదు; విద్య, ఆర్థిక స్వావలంబన, భద్రత, గౌరవం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనవి.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదగాలనీ, స్థానిక అవసరాలకు స్థానికంగా పరిష్కారాలు లభించా లనీ ఆయన భావించారు. నేటి గ్రామీణ అభివృద్ధి కూడా రోడ్లు నిర్మించడం లేదా భవనాలు ఏర్పాటు చేయడానికే పరిమితం కాదు. రైతులకు మార్కెట్ అనుసంధానం, సాగు నీరు, తాగునీరు, విద్యుత్, గృహాలు, పారిశుద్ధ్యం, డిజిటల్ కనెక్టి విటీ, బ్యాంకింగ్ సేవలు, మహిళలకు ఉపాధి అవ కాశాలు వంటి అనేక అంశాలు గ్రామీణ జీవన ప్రమాణాలను ప్రభా వితం చేస్తున్నాయి.
పారిశుద్ధ్యం విషయంలో గాంధీజీకి ప్రత్యే కమైన దృక్పథం ఉంది. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదనీ, ప్రతి వ్యక్తి బాధ్యత కూడా అని నొక్కిచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల విని యోగం, వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం వంటి అంశాలను ఆయన సామాజిక సంస్కరణలో భాగంగా చూశారు.
మోదీ పాలన – గాంధీవాదం
గ్రామీణ భారతదేశ అభివృద్ధి గాంధీజీ ఆలో చనల్లో ముఖ్యమైన అంశం. మోదీ పాలనలో ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ ద్వారా గ్రామీణ రహదారి అనుసంధానాన్ని విస్తరించారు. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా పేద రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామీణ కుటుంబాలకు తాగు నీటిని అందించడంలో ‘జల్ జీవన్ మిషన్’ కీలక కార్యక్రమంగా మారింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడంలో ‘ప్రధాన మంత్రి జ¯Œ ధన్ యోజన’ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం 2014లో ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రారంభించింది.
గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అంటే కేవలం ఒక మహానాయ కుడికి నివాళి అర్పించడం మాత్రమే కాదు; ఆయన నమ్మిన మానవతా విలువలను మన జీవితాల్లో ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆత్మపరి శీలన చేసుకోవడం కూడా.
- చింతా సాంబమూర్తి, వ్యాసకర్త జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ మాజీ సభ్యులు
ఇదీ చదవండి: సేవయే సాధనగా: గాంధీజీ ఆధ్యాత్మిక ప్రయాణం


