గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Pays Tributes To Gandhi And Lal Bahadur Shastri | Sakshi
Sakshi News home page

గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్‌ జగన్‌ నివాళులు

Oct 2 2026 8:22 AM | Updated on Oct 2 2026 8:41 AM

YS Jagan Pays Tributes To Gandhi And Lal Bahadur Shastri

సాక్షి, తాడేపల్లి: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్, ఎంపీ మిథున్‌రెడ్డి, పూనూరి గౌతమ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ. ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి. వారిద్దరి పోరాటం, త్యాగం తరతరాలకు ఆదర్శనీయం. ఈ మహనీయుల జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement