మహారాష్ట్ర: ధర్మాంగాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ధర్మాంగాన్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో బొలేరోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.
అయితే, స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: భర్తను చంపిన ప్రేమ జంటకు పెళ్లి ముహూర్తం


