ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో విషాదం! | Hyderabad Kapra Woman Died Over Job Stress | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో విషాదం!

Oct 2 2026 7:38 AM | Updated on Oct 2 2026 7:58 AM

Hyderabad Kapra Woman Died Over Job Stress

హైదరాబాద్‌: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. స్వాతి మహాజన్‌ (35), గోపాలకృష్ణ తులసీదాస్‌ వాఘలేకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు స్వరూప్‌ (6) ఉన్నాడు. దంపతులు యూకేకు వెళ్లి ఇద్దరూ ఉద్యోగం చేశారు. రెండేళ్ల క్రితం తిరిగి వచ్చి కాప్రాలో నివసిస్తున్నారు. గోపాలకృష్ణకు ఉద్యోగం రాగా స్వాతికి లభించలేదు. దీంతో ఆమె ఇంటి వద్దే ఉండేది.

గత నెల 30న పక్కింటి వ్యక్తి మధ్యాహ్నం స్కూల్‌ నుంచి స్వరూప్‌ను తీసుకువచ్చి ఇంటి డోర్‌ కొట్టాడు.  స్వాతి ఎంతకీ స్పందించకపోవడంతో విషయాన్ని భర్త గోపాలకృష్ణకు తెలియజేశాడు. ఇంటికి చేరుకున్న గోపాలకృష్ణ తలుపులు బద్దలుగొట్టి లోనికి వెళ్లి చూడగా  సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.   కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : 70 ఏళ్ల మహిళను చంపి డ్రమ్‌లో, ట్రిపుల్ మర్డర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement