జీఎస్టీ వసూళ్లలో దూకుడు | GST collections set a new record in September | Sakshi
Sakshi News home page

జీఎస్టీ వసూళ్లలో దూకుడు

Oct 2 2026 4:41 AM | Updated on Oct 2 2026 4:41 AM

GST collections set a new record in September

సెప్టెంబర్‌లో తెలంగాణ ఆదాయం రూ.5,327 కోట్లు  

రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల మార్కు దాటిన జాతీయ స్థూల వసూళ్లు  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌ నెలలో సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే తెలంగాణ 18 శాతం వృద్ధితో దూసుకెళ్లింది. జాతీయస్థాయిలో స్థూల జీఎస్టీ రాబడి తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటి కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు భారీగా నిధులు సమకూర్చింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2026లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.2,03,521 కోట్లకు చేరింది. 2025 సెప్టెంబర్‌ వసూళ్లు రూ.1,77,365 కోట్లతో పోలిస్తే 14.7 శాతం పెరిగింది.  

తెలంగాణ వసూళ్ల జోరు  
సెప్టెంబర్‌ 2026 నెలకుగాను తెలంగాణలో మొత్తం రూ.5,327 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన రూ.4,512 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. రాష్ట్రాల వారీగా ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ లెక్కలను పరిశీలిస్తే సెప్టెంబర్‌లో తెలంగాణకు ప్రీ–సెటిల్‌మెంట్‌ ఎస్జీఎస్టీ రూపంలో రూ.2,002 కోట్లు సమకూరాయి. ఐజీఎస్టీ సర్దుబాటు తర్వాత (పోస్ట్‌–సెటిల్‌మెంట్‌) ఈ మొత్తం రూ.4,402 కోట్లకు చేరింది.

గతేడాది సెప్టెంబర్‌ పోస్ట్‌–సెటిల్‌మెంట్‌ రాబడి రూ.3,870 కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) రాష్ట్రంలో మొత్తం దేశీయ వసూళ్లు 13.8 శాతం వృద్ధితో రూ.33,765 కోట్లకు పెరిగాయి. ఇందులో కేంద్ర పరిధిలోని పన్నుల నుంచి రూ.16,618 కోట్లు, రాష్ట్ర పరిధిలోని పన్నుల నుంచి రూ.17,147 కోట్లు వచ్చాయి. ఆరు నెలల కాలానికి పోస్ట్‌–సెటిల్‌మెంట్‌ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.22,231 కోట్లుగా నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement