విక్రయానికి యత్నించిన ముగ్గురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏనుగు దంతాల అక్రమ రవాణా, విక్రయంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు కొరడా ఝళిపించారు. 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, వాటితో కళాత్మకంగా చెక్కి న ఐవరీ వస్తువులను డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి అక్రమ విక్ర యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు డీఆర్‌ఐ హైదరాబాద్ అధికారులు వల పన్నారు.
ఏను గు దంతాలు, ఐవరీ వస్తువుల విక్రయానికి సంబంధించి లావాదేవీ జరుగుతున్న సమ యంలో నిందితులను అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నాలుగు ఏనుగు దంతాలతోపాటు ఐవరీతో తయారు చేసిన ట్రోఫీలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న వస్తువులను నిబంధనల ప్రకారం సీజ్ చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఏనుగు దంతాలు, వాటితో తయా రు చేసిన వస్తువుల వ్యాపారం, కొనుగోలు, విక్రయాలు చట్టప్రకారం నిషేధితమని పేర్కొన్నారు. కాగా, ఎక్కడ స్వా«దీనం చేసుకున్నామనే వివరాలు అధికారులు వెల్లడించలేదు.


