పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతోనే అరెస్టా? | Preventive Detention Can't Be Solely Based On Custodial Confession: Supreme Court | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంతోనే అరెస్టా?

Sep 30 2026 12:34 AM | Updated on Sep 30 2026 12:35 AM

Preventive Detention Can't Be Solely Based On Custodial Confession: Supreme Court

ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించాలి 

అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎన్‌ఎస్‌ఏ 

సంభల్‌ ఘర్షణల నిందితుడిపై ఆదేశాల కొట్టివేత

న్యూఢిల్లీ: నిందితుడు పోలీసుల మందు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జాతీయ భద్రతా చట్టం కింద అతడిని అదుపులోకి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ముందస్తు అరెస్ట్‌ అనేది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాల్సిన చర్యని తెలిపింది. 2024 నాటి సంభల్‌ మత ఘర్షణల కేసులో ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ముల్లా అఫ్రోజ్‌ అనే వ్యక్తిని జాతీయ భద్రతా చట్టం కింద ముందస్తు అరెస్ట్‌ చేయడం చెల్లదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ శీల్‌ నాగూల బెంచ్‌ స్పష్టం చేసింది. అక్రమ ఆదేశాలు జారీ చేసినందుకుగాను ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం పది లక్షల రూపాయల జరిమానా చెల్లాంచాలని న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.

ముందస్తు అరెస్ట్‌ తీసుకునే ముందు అంతటి అసాధారణ పరిస్థితి ఉందా? అన్నది పోలీసులు నిర్ణయించుకోవాలని, ఆచితూచి వ్యవహరించాలని తెలిపింది. ఇతర సాక్ష్యాలు, ఆధారాలేవీ లేని పరిస్థితుల్లో నేరాంగీకర వాంగ్మూలాన్ని విశ్వసించదగ్గ సాక్ష్యంగా పరిగణించలేమని బెంచ్‌ తెలిపింది. సాక్ష్యంగా పరిగణించలేని అంశం ఆధారంగా ముందస్తు అరెస్టు ఆదేశాలు జారీ చేయడం సరికాదని తెలిపింది. ఒకవేళ పోలీసులు నేరాంగీకర వాంగ్మూలంతోపాటు ఇతర సాక్ష్యాధారాలపై ఆధారపడి ఉంటే వాటి ఆధారంగా ఆ ముందస్తు అరెస్ట్‌ చెల్లుతుందా? లేదా? అన్నది న్యాయస్థానం నిర్ణయించాలని వివరించింది.

ముల్లా అఫ్రోజ్‌ విషయంలో పోలీసులు తనను బెదిరంచి, హింసించి వాంగ్మూలం తీసుకున్నారని చెబుతున్నారని వ్యాఖ్యా నిస్తూ బెంచ్‌ పలీసుల ఆదేశాలను కొట్టివేసింది. అఫ్రోజ్‌పై 2025 అక్టోబరు 13న జాతీయ భద్రతా చట్టం కేసు మోపారని, అయితే అప్పటికే అతడిపై మోపిన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ లభించిందని బెంచ్‌ గుర్తించింది. అటువంటి పరిస్థితుల్లో అతడిని మళ్లీ జాతీయ భద్రతా చట్టం కింద మందస్తు అదుపులోకి తీసుకోవడం శిక్షించడమే అవుతుందని తెలిపింది.

అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత ముల్లా అఫ్రోజ్‌పై జారీ అయిన ముందస్తు అరెస్ట్‌ ఉత్తర్వులు అక్రమం, చట్టవిరుద్ధమని తెలిపింది. ఈ కేసులో తీర్పునిచ్చే సందర్భంలో జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా 27 వ జన్మదినానికి నాలుగు రోజుల ముందు మరణించిన తన లీగల్‌ గుమాస్తాకు నివాళులు అరి్పంచారు.  2024 నవంబరులో షాహీ జామా మసీదు సరేర్వకు న్యాయస్థానం ఆదేశించినప్పుడు సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికులు భద్రతాధికారులతో ఘర్షణకు దిగారు. ఈ గొడవల్లో నలుగు మరణించగా.. చాలామంది గాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement