హైకోర్టు ఉద్యోగుల్లో కొందరిపై ‘సవతి తల్లి’ ప్రేమెందుకు? | Supreme Court fires on Andhra Pradesh govt | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉద్యోగుల్లో కొందరిపై ‘సవతి తల్లి’ ప్రేమెందుకు?

Sep 29 2026 5:04 AM | Updated on Sep 29 2026 5:04 AM

Supreme Court fires on Andhra Pradesh govt

రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

కొందరికి పర్మినెంట్‌.. మరికొందరికి ఔట్‌సోర్సింగ్‌ ఏమిటి? 

రెగ్యులరైజేషన్‌ డ్రాఫ్ట్‌ స్కీమ్‌తో రావాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టులో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఒకే బ్యాచ్‌కి చెందిన ఉద్యోగుల్లో కొందరిని పర్మీనెంట్‌ చేసి, మరికొందరిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరికి పర్మీనెంట్, మరికొందరికి ఔట్‌సోర్సింగ్‌ ఏమిటని సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి రెండు వారాల్లో రెగ్యులరైజేషన్‌ డ్రాఫ్ట్‌ స్కీమ్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

తదుపరి విచారణను అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది. రొక్కం వేణుగోపాల్‌ రావు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 ఏళ్ల క్రితం హైకోర్టు పరిధిలో 140 ఫాస్ట్‌ ట్రాక్, స్పెషల్, స్పెషల్‌ మేజి్రస్టేట్‌ కోర్టులను ఏర్పాటు చేసి, డ్రైవర్లు, ప్యూన్లు, అటెండర్లు, స్టెనోగ్రాఫర్లు, రికార్డ్‌ అసిస్టెంట్లను నియమించారు.

 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హైకోర్టు తన పరిధిలోని ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించింది. ఏపీలో మాత్రం కొందరిని పర్మీనెంట్‌ చేసి, మరికొందరి పోస్టులను ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పోస్టులుగా మార్చారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులోని దాదాపు 200 మంది ఉద్యోగుల్లో సగంమంది గతంలో రిట్‌ దాఖలు చేయగా, అనంతరం ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్‌ చేసింది. ఆలస్యంగా  ఆశ్రయించిన మిగతా ఉద్యోగుల అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement