సోషల్‌ మీడియా 'సొంత డబ్బా' కోసమేనా? | TDP Chandrababu social media just for self-promotion | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా 'సొంత డబ్బా' కోసమేనా?

Sep 29 2026 4:25 AM | Updated on Sep 29 2026 4:25 AM

TDP Chandrababu social media just for self-promotion

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ‘సోషల్‌ మీడియా వార్‌’కు తెర లేపింది. నిజానికి మీడియాను వాడుకోవడంలో ఆయనను మించిన రాజకీయ నాయకుడు భారత దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో... సోషల్‌ మీడియాను ప్రభుత్వ పథకాల ప్రచారానికి వాడుకోవాలని బాబు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది! ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార సాధనాలను ఉపయోగించు కోవడం కొత్తేమీ కాదు. అయితే సోషల్‌ మీడియా యుగంలో ఆ ప్రచారానికి కొత్త రూపం వచ్చింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వంటి వేదికల ద్వారా ప్రజలను చేరుకోగలిగే
ఇన్‌ ఫ్లుయెన్సర్లను అధికారికంగా ఎంప్యానెల్‌ చేసి, వారికి పారితో షికం చెల్లించే విధానాన్ని ప్రభుత్వం తాజాగా కేబినెట్‌ ఆమోదంతో ముందుకు తీసుకువచ్చింది.

ప్రభుత్వ వివరణ ప్రకారం సంక్షేమ పథకాలు, మౌలిక వస తులు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశం.  యువత ఎక్కువగా ఉపయోగించే డిజిటల్‌ వేదికల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాల సమాచారం ప్రజలకు చేరడం ప్రయోజనకరమే కావచ్చు. కానీ ప్రజాధనంతో ఏర్పడే ఏ ప్రచార వ్యవస్థకైనా పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. ఎందుకంటే ఇక్కడే ఒక సున్నితమైన రేఖ ఉంది. అది ప్రభుత్వ సమాచార ప్రచారానికి– అధికార పార్టీ రాజకీయ ప్రచారానికీ మధ్య రేఖ. ఆ రేఖ చెరిగిపోకుండా చూడటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ప్రచార మాధ్యమం రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయగల మహత్తర శక్తి.

పారదర్శకత ముఖ్యం
ఒక యూట్యూబ్‌ వీడియో, ఒక రీల్, ఒక వైరల్‌ పోస్టు కొన్ని గంటల్లోనే లక్షల మందిని చేరగలదు. అందుకే నేటి రాజకీయ ప్రచా రంలో సోషల్‌ మీడియా అత్యంత ప్రభావశీలమైన సాధనాల్లో ఒకటిగా మారింది. అందుకే పారదర్శకంగా ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్స ర్లను అధికారికంగా ఎంప్యానెల్‌ చేయాలి. ఎవరెవరిని ఎంపిక చేశారు? ఎంతమంది ఉన్నారు? వారి ఛానళ్లు, ఫాలోవర్ల సంఖ్య ఎంత? ఏ కేటగిరీలో ఎంపిక చేశారు? ఎంత పారితోషికం నిర్ణయించారు? ఏ ప్రభుత్వ కార్యక్రమం కోసం ఎంత చెల్లించారు?– ఈ వివరాలన్నీ ప్రజల ముందుంచాలి. ప్రభుత్వం ఒక పబ్లిక్‌ సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి వ్యక్తిగత డబ్బు కాదు, ఆయన డబ్బా కొట్టడానికి... అది ప్రజల డబ్బు. ప్రజల కోసమే వెచ్చించాలి. ప్రస్తుతం ప్రకటించిన విధానంలో ఫాలోవర్ల స్థాయిని బట్టి వేర్వేరు కేటగిరీలకు చెల్లింపులు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రచారంలో పారదర్శకత ముఖ్యం. ప్రజలు, జర్నలిస్టులు, ప్రతి పక్షాలు, పౌరసమాజం ఆ వ్యవస్థను పరిశీలించాలి. ప్రభుత్వ పథ కాల ప్రచారం ఎక్కడితో ముగుస్తోంది? రాజకీయ ప్రచారం ఎక్కడ మొదలవుతోంది? అన్నది ప్రశ్నించగలగాలి. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఒక అధికారిక విధానంగా, ఎంప్యానెల్‌మెంట్, చెల్లింపుల వ్యవస్థతో ముందుకు తీసుకురావడం వల్ల పారదర్శకతపై చర్చ మరింత అవసరమైంది. ప్రభుత్వానికి ప్రచారం అవసరం. ప్రజలకు సమాచారం అవసరం. కానీ ప్రజాస్వామ్యానికి అంతకంటే ఎక్కువగా పారదర్శ కత అవసరం. సోషల్‌ మీడియా నేటి రాజకీయ బ్రహ్మాస్త్రమైతే, దాన్ని ప్రయోగించే వ్యవస్థకు ప్రజాస్వామ్య నియంత్రణ కూడా ఉండాలి. అందుకే ప్రశ్న ఒక్కటే... ఇన్‌ ఫ్లుయెన్సర్లను ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఇన్‌ ఫ్లుయెన్సర్లకే ‘ఇన్‌ ఫ్లుయెన్సర్‌’ ఎవరు?
– వీరేంద్ర కాపర్తి ‘ సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement