టీడీపీ గూండాగిరి.. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత | TDP Supporters tried to attack the YSRCP office in Eluru | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాగిరి.. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత

Sep 28 2026 9:12 PM | Updated on Sep 28 2026 9:30 PM

TDP Supporters tried to attack the YSRCP office in Eluru

ఏలూరు:  వైఎస్సార్‌సీపీనే లక్ష్యంగా పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు.. మళ్లీ రెచ్చిపోయిన ఘటన ఏలూరులోని అశోక్‌నగర్‌లో చోటు చేసుకుంది.  వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ఆపీస్‌పై దాడికి యత్నించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.  

ఈ క్రమంలో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు అశోక్‌నగర్‌లో భారీగా పోలీసులను మోహరించారు. దెందులూరులో అబ్బయ్య చౌదరి పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం.. టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. అటు దెందులూరు, ఇటు ఏలూరులోని వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా పేట్రేగిపోయాయి. 

టీడీపీ కార్యకర్తల దుశ్చర్యపై దెందలూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘ లా అండ్ డాక్టర్ ఏమైందో అర్థం కావటం లేదు. నిన్నే మా కార్యకర్తలపై రక్తం వచ్చేలా కొట్టి దాడి చేశారు.  కొత్త రాజ్యాంగం ఏమన్నా నడుస్తుందో ఏమో అర్థం కావడం లేదు. జంగారెడ్డిగూడెం మా పార్టీ కార్యక్రమంలో పాల్గొని వేగివాడలో.. మా కార్యకర్త కుటుంబంలో వివాహానికి వెళ్లి.. వస్తుండగా.. నా కారు పైకి వచ్చి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. మాజీ శాసనసభ్యుడునైన నాకు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా....?’ అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:  చంద్ర‌బాబు స‌ర్కారుపై కాకర్ల ధ్వ‌జం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement