సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి | Agrawal protest Jantar Mantar Bharat Ratna Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలి

Sep 28 2026 3:21 PM | Updated on Sep 28 2026 4:04 PM

Agrawal protest Jantar Mantar Bharat Ratna Gyanesh Kumar

న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు, సీజేపీతో పాటు చాలా మంది ప‍్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో అగర్వాల్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన సంస్థలు భైఠాయించాయి. 

ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆయా సంఘాల నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. జ్ఞానేశ్ కుమార్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిరసనలో పాల్గొన్నవారు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జ్ఞానేశ్ కుమార్‌తో పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు.  

సర్‌కు మద్దతుగా బీజేపీ..
భారతీయ జనతా పార్టీ నేత జై భగవాన్ గోయల్ కూడా జ్ఞానేశ్ కుమార్ పనితీరును ప్రశంసిస్తూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రతిపక్షాన్ని ఆయన విమర్శించారు.  

జ్ఞానేశ్ కుమార్ చర్యల కారణంగా ఓటరు జాబితా నుంచి బంగ్లాదేశ్, రోహింగ్యా ప్రజల పేర్లను తొలగించారని గోయల్ పేర్కొన్నారు. ఈ చర్య వల్ల పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఎన్నికల సంఘం, ముఖ్యంగా జ్ఞానేశ్ కుమార్ కారణమై ఉండవచ్చని ప్రతిపక్షం భావిస్తోందని గోయల్ వ్యాఖ్యానించారు.  

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని గోయల్ అన్నారు. ప్రతిపక్షానికి ప్రజల మద్దతు లేకపోవడంతోనే ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.  

జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతికూల వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని గోయల్ పేర్కొన్నారు. ఇతర ఎన్నికల కమిషనర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానేశ్ కుమార్ పనితీరుపై ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఆ ఫిర్యాదులో ఉన్నాయని చెప్పారు.  

జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాల నిరసనలు, ఆయనకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహారశైలి, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై రాజకీయ చర్చ మరింత కొనసాగనున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: మంచంపై తొలిసారి నిద్రపోతున్నానంటూ పట్టలేని ఆనందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement