బెళగావిలో వీడిన మిస్టరీ
నిందితుడు, మహిళ అరెస్టు
కర్ణాటక: స్నేహితురాలిని లైంగికంగా వేధిస్తున్నాడనని ఆమె మిత్రుడు రుణదాతను హత్య చేశాడు. బెళగావి జిల్లా అథని తాలూకాలోని బల్లిగేరిలో ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీదేవి రాజపుత్ అనే మహిళను రణవీర్ రాజ్‌పుత్ లైంగిక వేధించేవాడు. అతడు ఆమెకు కొంత డబ్బు అప్పు ఇచ్చాడు. ఆ కారణంతో సతాయించసాగాడు. సెప్టెంబర్ 21న రాత్రి బైక్ స్టార్ట్ కావడం లేదని చెప్పి రణవీర్‌ను బైరు పవార్ అనే వ్యక్తి పిలిపించుకొన్నాడు. ఆ తరువాత గొంతుకు తాడు బిగించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య తరువాత బైరు, శ్రీదేవికి ఫోన్ చేసి చెప్పాడు. విచారణ చేపట్టిన అథణి పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: పెళ్లైన 5 నెలలకే టెకీ ఆత్మహత్య


