శంషాబాద్‌లో దారుణం.. మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యం! | Shamshabad Cab Driver Incident Full Deatils | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో దారుణం.. మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యం!

Sep 28 2026 9:32 AM | Updated on Sep 28 2026 9:32 AM

Shamshabad Cab Driver Incident Full Deatils

సాక్షి, హైదరాబాద్‌: విమానాశ్రయానికి వెళ్తున్న ఓ మహిళకు క్యాబ్‌ డ్రైవర్‌ షాక్‌ ఇచ్చాడు. మార్గమధ్యలో రూట్‌ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదును కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది.

వివరాల మేరకు.. గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయానికి క్యాబ్‌లో బయలుదేరింది. ఆమె వద్ద రూ.60 వేల నగదు ఉన్న విషయాన్ని డ్రైవర్‌ గుర్తించాడు. ఈ క్రమంలో తొండుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌ ఓఆర్‌ఆర్‌ నుంచి రూట్‌ మార్చి సర్వీస్‌ రోడ్డులోకి తీసుకెళ్లాడు. అనంతరం కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో క్యాబ్‌ను నిలిపి మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు బాధితురాలు ఆరోపించింది.

దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు కారు నుంచి బయటకు వచ్చి కేకలు వేసింది. అనంతరం, క్యాబ్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే క్యాబ్‌లో ఉన్న మహిళకు చెందిన రూ.60 వేల నగదు బ్యాగ్‌ను డ్రైవర్‌ తీసుకెళ్లినట్లు సమాచారం. ఘటనపై బాధితురాలు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: మాటా మాటా పెరిగి.. రోకలి బండతో కొట్టి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement