తేజస్వి (ఫైల్)
ఇల్లాలి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
హైదరాబాద్: కుటుంబ కలహాలు ఇల్లాలి హత్యకు దారితీశాయి. భార్య తలపై భర్త రోకలి బండతో కొట్టడంతో అక్కడిక్కడే ఆమె మృతి చెందిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ ఎల్.మధుబాబు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా పులివెందులకు చెందిన నరేందర్ కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు నెలల క్రితం నగరంలోని బాగ్‌లింగంపల్లికి వచ్చాడు. ఆయనకు భార్య తేజస్వి (28), ఐదేళ్ల కుమారుడు లోహిత్ ఉన్నారు. నరేందర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ బార్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో నరేందర్‌కు, భార్య తేజస్వికి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నరేందర్ కోపోద్రిక్తుడయ్యాడు. తేజస్వి తలపై రోకలి బండతో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. నిందితుడు నరేందర్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: దారుణం.. గర్భిణీ కడుపుపై ఎక్కి తొక్కారు.. కడుపు విచ్ఛిన్నమై


