ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల్లో తిరుగుబాటు మొదలైంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.విజయవాడ ధర్నాచౌక్‌కు వద్దకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు లాఠీచార్జ్ చేసి అడ్డుకునే యత్నం చేశారు. మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చిపడేస్తూ అమానుషంగా ప్రవర్తించారు. అయినా తాము వెనక్కి తగ్గేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.


