ఆరోగ్యంపై అవగాహనకు ‘రన్‌’ల దోహదం | Minister Seethakka at the start of the Pink Power Run | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై అవగాహనకు ‘రన్‌’ల దోహదం

Sep 28 2026 3:13 AM | Updated on Sep 28 2026 3:13 AM

Minister Seethakka at the start of the Pink Power Run

పింక్‌ పవర్‌ రన్‌ 3.0 ప్రారంభంలో మంత్రి సీతక్క 

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): మహిళల్లో రొమ్ము కేన్సర్‌ (బ్రస్ట్‌ కేన్సర్‌)పై అవగాహన కల్పించడం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం నిర్వహించిన పింక్‌ పవర్‌ రన్‌ 3.0ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందేందుకు ఇలాంటి రన్‌లు ఎంతగానో దోహదపడతాయన్నారు. డీజీపీ సీవీ ఆనంద్, ఎంఈఐఎల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణారెడ్డి, సుధా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్, ఒలెక్ట్రాగ్రీన్‌ టెక్‌ ఉపాధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తదితరులు వివిధ రన్‌లను జెండా ఊపి ప్రారంభించారు. 

సినీ హీరో సిద్దు జొన్నలగడ్డ, మాజీ ప్రపంచ సుందరి ఓపల్‌ సుచేత పాల్గొని రన్నర్లను ఉత్సాహ పరిచారు. సంగీత దర్శకుడు తమన్‌ బృందం లైవ్‌ మ్యూజిక్‌తో రన్నర్లతో ఉత్సాహాన్ని నింపారు. మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్, సుధా ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన పింక్‌ పవర్‌ రన్‌ 3.0 రన్‌ను 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో నిర్వహించారు. 

అమెరికా, ఇంగ్లాండ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఇథియోపియా, ఉగాండా, శ్రీలంక, ఐస్‌లాండ్, టాంజానియా, కెన్యా తదితర దేశాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. 10కే రన్‌లో అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ లారా విలియమ్స్‌ స్వయంగా పాల్గొనగా, సుధారెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, ఓపల్‌ చేతన 5కే రన్‌లో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన రమాబాయి రణ్‌వీర్‌ పింక్‌ పవర్‌ రన్‌లో పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు రూ.75 లక్షల విలువైన నగదు, బహుమతులతో పాటు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement