వైద్యవిద్యలో ఎస్టీ రిజర్వేషన్‌కు 37 మంది అనర్హులు | 37 candidates ineligible for ST reservation in medical education | Sakshi
Sakshi News home page

వైద్యవిద్యలో ఎస్టీ రిజర్వేషన్‌కు 37 మంది అనర్హులు

Sep 28 2026 3:05 AM | Updated on Sep 28 2026 3:05 AM

37 candidates ineligible for ST reservation in medical education

కాళోజీ వర్సిటీ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో 37 మంది అభ్యర్థులకు ఎస్టీ రిజర్వేషన్‌ వర్తించదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వీరిని తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కేటగిరీలో అనర్హులుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి సెప్టెంబర్‌ 22న అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ పేర్కొంది. ఈ 37 మందిలో తొమ్మిది మందికి ఎంబీబీఎస్‌ సీట్లు తొలి, రెండో విడత కౌన్సెలింగ్‌లో ఎస్టీ కేటగిరీలో కేటాయించారు. 

తాజాగా వారు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్టీ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారని, తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్‌కు అర్హులు కాదని తేలడంతో ఆయా సీట్ల కేటాయింపును వర్సిటీ రద్దు చేసింది. ఈ సీట్లను తదుపరి కౌన్సెలింగ్‌లో అర్హులైన ఎస్టీ అభ్యర్థులకు కేటాయించనుంది. అయితే ఎస్టీ రిజర్వేషన్‌ ప్రయోజనం కోల్పోయిన 37 మంది పూర్తిగా ప్రవేశాలకు అనర్హులని కాదు. తదుపరి కౌన్సెలింగ్‌ (మాప్‌అప్‌/స్ట్రేవేకెన్సీ)లో వారి అర్హత, నీట్‌ ర్యాంకు, మెరిట్‌ ఆధారంగా ఓపెన్‌ కేటగిరీ కింద పరిగణించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీట్లు రద్దయిన తొమ్మిది మంది కూడా నిబంధనలకు అనుగుణంగా ఓపెన్‌ కేటగిరీలో సీట్లు కేటాయించే అవకాశం ఉండొచ్చు. ఈ సీట్ల రద్దుతో ఏర్పడే ఖాళీలను మూడో విడత/మాప్‌అప్‌ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనుంది.  

వైద్య విద్యలో అదనపు ఫీజులను అరికట్టాలి 
మెడికో పేరెంట్స్‌ కార్యవర్గ తీర్మానం 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఎఫ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని మెడికో పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణచారి ఆరోపించారు. ఈ వసూళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం, ఎఫ్‌ఆర్‌సీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన రాష్ట్రస్థాయి మెడికో పేరెంట్స్‌ ఫ్యామి లీ మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యవర్గ భేటీలో వైద్య విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement