breaking news
st reservation
-
రిజర్వేషన్... ఓ సమాజానికి తెరిచిన తలుపు
రిజర్వేషన్‌ను కేవలం ఒక శాతంగా చూస్తే దాని వెనుక ఉన్న సామాజిక చరిత్ర కనిపించదు. ఒక మారుమూల తండాలో పుట్టిన విద్యార్థి ఉన్నత విద్యా సంస్థ గేటు దాటి నప్పుడు, ఒక గిరిజన యువతి ప్రభుత్వ ఉద్యో గంలో అడుగుపెట్టినప్పుడు, ఒక తండా తన సొంత గ్రామపంచాయతీగా తన అవసరాలపై తానే నిర్ణయం తీసుకునే స్థాయికి వచ్చినప్పుడు– అప్పుడే రిజర్వేషన్, స్వపరిపాలన వంటి విధా నాల అసలు అర్థం తెలుస్తుంది.2011 జనగణన ప్రకారం తెలంగాణలో షెడ్యూల్డ్ తెగల జనాభా రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. అయితే ఎన్నో సంవత్సరాలుగా విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో ఎస్టీలకు అమ లైన రిజర్వేషన్ 6 శాతంగానే కొనసాగింది. 2022 సెప్టెంబర్ 30న తెలంగాణ ప్రభుత్వం జీఓ ఎమ్ఎస్ నం.33 గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. అనంతరం రాష్ట్ర సేవల రోస్టర్ నిబంధ నల్లో కూడా సంబంధిత సవరణలు జరిగాయి. 2026 విద్యా ప్రవేశ నిబంధనల్లోనూ 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ అమలులో ఉన్నట్లు నోటిఫికేషన్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం నాలుగు శాతం పెరుగుదల కాదు. జనాభా వాస్తవికతకు అవకా శాల వ్యవస్థను దగ్గర చేసే ప్రయత్నం.తండా ఒక చిరునామా మాత్రమే కాదు!‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018’ అమ లులో భాగంగా తక్కువ జనాభా గల గ్రామాలు, గిరిజన తండాలు, ఇప్పటికే ఉన్న గ్రామపంచాయతీ కేంద్రాలకు దూరంగా ఉన్న ఆవాసాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీని అసలు విలువ కొత్త పంచాయతీ కార్యాలయం ఏర్పడటంలో మాత్రమే లేదు. సమస్య తండాలో ఉండి, నిర్ణయం మరో గ్రామంలో తీసు కునే పాత పరిస్థితి నుంచి ‘మన తండాకు మన గ్రామసభ, మన అవసరాలకు మన ప్రాధాన్యత’ అనే స్థానిక స్వపరిపాలన భావనకు మార్పు రావడం ముఖ్యమైన అంశం.2017లో తెలంగాణ ప్రభుత్వం ‘షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం లక్ష్యం ఎస్సీ, ఎస్టీ జనాభా వాటాకు అనుగుణంగా అభివృద్ధి వ్యయాన్ని కేటాయించడం; ఆర్థిక, విద్య, మానవాభివృద్ధి సూచికల్లో ఉన్న అంతరాలను తగ్గించడం; సామాజిక గౌరవం, సమానత్వాన్ని బలోపేతం చేయడం. గిరిజన అభివృద్ధి ఒక శాఖకు మాత్రమే పరిమి తమైన బాధ్యత కాకుండా, మొత్తం ప్రభుత్వ ప్రణాళికలో కనిపించాలన్న ఆలోచనకు ఇది సంస్థాగత రూపం ఇచ్చింది. అందువల్ల గిరిజన విధానాల తదుపరి దశ ‘హక్కు కల్పించాం’ అన్న దగ్గర ఆగకూడదు.ఆ హక్కును ఉపయోగించు కునే సామర్థ్యాన్ని కూడా సమాజానికి అందించాలి. రిజర్వేషన్ ఉన్నా పోటీకి అవసరమైన విద్య లేకపోతే ప్రయోజనం పరిమితమవుతుంది. గ్రామపంచాయతీ ఉన్నా తగిన నిధులు, సిబ్బంది, మౌలిక వసతులు లేకపోతే స్వపరి పాలన బలహీనమవుతుంది. తండాను గ్రామపంచాయతీగా గుర్తించడం మొదటి అడుగు. ఆ గ్రామపంచాయతీని మంచి పాఠశాల, ఆరోగ్య సేవ, రహదారి, తాగునీరు, ఉపాధి అవకాశాలు ఉన్న సమాన అవకాశాల గ్రామంగా తీర్చిదిద్దడం తదుపరి అడుగు.ప్రభుత్వాలు మారుతాయి. రాజకీయ పరిస్థి తులూ మారుతాయి. కానీ ఒక సమాజానికి లభించిన విద్యా అవకాశం, ప్రాతినిధ్యం, స్థానిక స్వపరి పాలన వంటి హక్కులను ప్రతి ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలి. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో అమలులోకి వచ్చిన 10 శాతం ఎస్టీ రిజర్వేషన్, తండాల గ్రామపంచాయతీ పునర్వ్య వస్థీకరణ, ఎస్సీ–ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి వంటి నిర్ణయాలు గిరిజన విధాన చరిత్రలో స్పష్టంగా నమోదు కావాల్సిన అంశాలు.అదే సమయంలో వాటి అమలులో మిగిలిన లోటు పాట్లను ప్రస్తుత, భవిష్యత్ ప్రభుత్వాలు పూరించడం కూడా అంతే అవసరం. ప్రతి తండాకు నాణ్యమైన పాఠశాల, ప్రతి గిరిజన విద్యార్థికి ఉన్నత విద్యకు చేరుకునే అవ కాశం, యువతకు నైపుణ్యం–ఉపాధి, ప్రతి గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు, రాజ్యాంగ హక్కులు ఆచరణలో అందే వ్యవస్థ – ఇవే తదుపరి లక్ష్యాలు కావాలి.- డా. బానోత్ చంద్రావతి, వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే, వైరాఇదీ చదవండి: కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్ ఇంటెలిజెన్స్'! -
సుప్రీంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 23 నుంచే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్‌ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీని ప్రకారం.. సుప్రీంకోర్టులో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కల్పిస్తారు.రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లు ఈ రిజర్వేషన్లకు అర్హులు. న్యాయమూర్తులకు ఇవి వర్తించవు. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టునూ అమల్లోకి తీసుకురావడం సరైన నిర్ణయమని అభిప్రాయడ్డారు. సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ రిజర్వేషన్లు దోహదపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
తుది తీర్పునకు లోబడే గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు. -
గిరిజన రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6.5 శాతంగా ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే రిజర్వేషన్లు 9.08 శాతంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కేంద్రానికి సమర్పించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాన్క్లేవ్లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రం త్వరితంగా అనుమతులిస్తే వర్సిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
పంచాయతీలకు 39 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు జిల్లావ్యాప్తంగా 39 నామినేష న్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కౌడిపల్లి రాయిలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. 21 వార్డులకు గాను 35 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఈ నెల 10న బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. సంగారెడ్డి మండలం చింతలపల్లి పంచాయతీ సర్పంచ్ పదవితో పాటు ఒకటో వార్డును ఎస్టీలకు రిజర్వు చేశారు. గతంలోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం కూడా ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 21 వార్డులకు గాను, 9 చోట్ల ఒక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. మునిపల్లి మండలం పెద్దచల్మెడ 10వ వార్డు, మెదక్ మండలం వాడిలోని ఆరో వార్డుకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఒకరు కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న చోట ఈ నెల 18న ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


