పంచాయతీలకు 39 నామినేషన్లు | nominations to 39 panchayati | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు 39 నామినేషన్లు

Jan 6 2014 11:38 PM | Updated on Sep 2 2017 2:21 AM

ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు జిల్లావ్యాప్తంగా 39 నామినేష న్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు జిల్లావ్యాప్తంగా 39 నామినేష న్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి మండలం చింతలపల్లి సర్పంచ్ ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కౌడిపల్లి రాయిలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి  నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. 21 వార్డులకు గాను 35 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఈ నెల 10న బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. సంగారెడ్డి మండలం చింతలపల్లి పంచాయతీ సర్పంచ్ పదవితో పాటు ఒకటో వార్డును ఎస్టీలకు రిజర్వు చేశారు.

 గతంలోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం కూడా ఎవరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 21 వార్డులకు గాను, 9 చోట్ల ఒక్కరు చొప్పున నామినేషన్లు వేశారు. మునిపల్లి మండలం పెద్దచల్మెడ 10వ వార్డు, మెదక్ మండలం వాడిలోని ఆరో వార్డుకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఒకరు కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న చోట ఈ నెల 18న ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement