పాముకాటుతో పసివాడి మృతి
ఎస్‌ఎస్ తాడ్వాయి: పాము కాటుతో ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం వెంగళాపూర్‌లో ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈక తిరుపతి, స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు ఆదివారం మధ్యాహ్నం తల్లి పక్కన మంచంలో నిద్రిస్తున్నాడు.
బాలుడు ఒక్కసారిగా ఏడవడంతో తల్లి స్వప్న పరిశీలించింది. శరీరంపై రెండు, మూడు చోట్ల పాము కాట్లు ఉన్నట్లు గుర్తించింది. కాటు గాయాల నుంచి రక్తస్రావం కావడంతో వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం పస్రాకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గోవిందరావుపేటకు, అనంతరం ములుగు తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


