శాంతించిన గోదావరి | Sammakka Sagar Barrage continues to flood | Sakshi
Sakshi News home page

శాంతించిన గోదావరి

Sep 28 2026 2:58 AM | Updated on Sep 28 2026 2:58 AM

Sammakka Sagar Barrage continues to flood

సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి కొనసాగుతున్న వరద 

కన్నాయిగూడెం: ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఆదివారం ఉదయం నుంచి శాంతించి తగ్గుతూ వస్తోంది. శనివారం సాయంత్రం వరకు గోదావరిలోకి భారీగా వరదలు వచ్చాయి. దీంతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో 7,78,600 క్యూసెక్కుల వరకు పెరిగింది. ఆదివారం ఉదయం వరకు 7,35,740 క్యూసెక్కులకు చేరి నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. సాయంత్రం వరకు 6,24,800 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 81.2 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. దీంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు అదే మోతాదులో వదులుతున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement