ఓట్ల చోరీతో బీజేపీ పట్టుబడింది | Distribution of CMRF cheques and smart ration cards to beneficiaries | Sakshi
Sakshi News home page

ఓట్ల చోరీతో బీజేపీ పట్టుబడింది

Sep 28 2026 2:56 AM | Updated on Sep 28 2026 2:56 AM

Distribution of CMRF cheques and smart ration cards to beneficiaries

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు: మంత్రి ఉత్తమ్‌

దేశం కోసం కష్టపడుతున్న రాహుల్‌ను ప్రధాని చేసేందుకు ప్రజలు చూస్తున్నారు 

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ

హుజూర్‌నగర్, నేరేడుచర్ల: కేంద్రంలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతూ పట్టుబడిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థ కాదని.. ఓటు హక్కు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఆస్తి కాదన్నారు. ఓటర్ల జాబితా సవరణ, డేటా నిర్వహణ, పేర్ల తొలగింపు–చేర్పులకు సంబంధించి తలెత్తిన సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను, స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అలాగే నేరేడుచర్లలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందించారు.

ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు కమిషనర్లే సీఈసీ పక్షపాత వైఖరిని తప్పుబట్టారని చెప్పారు. ఇది తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారు నేడు ఆధారాలతో సహా పట్టుబడ్డారన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొన్నేళ్లుగా నిరుపేదల కోసం దేశాన్ని కాపాడేందుకు నిరంతరం కష్టపడుతున్నారని.. కాబట్టి ఆయన్ను దేశ ప్రధానిని చేయాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. 

16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశాం 
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేశామని.. ఈ స్మార్ట్‌ రేషన్‌కార్డులు పేదోడి ఆత్మగౌరవం అని మంత్రి ఉత్త మ్‌ చెప్పారు. గత ప్రభుత్వం రూ. 10,500 కోట్లు ఖర్చు చేసి ఇచ్చిన రేషన్‌ దొడ్డు బియ్యం ప్రజలు తినేందుకు పనికిరాకుండా ఉండేదని.. కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీలకు, రైస్‌ మిల్లుల దందాలకుమాత్రమే ఉపయోగపడేదని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement