Breaking: బ్యాంక్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా | Breaking: Bank employees three-day strike postponed | Sakshi
Sakshi News home page

Breaking: బ్యాంక్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

Sep 27 2026 11:35 PM | Updated on Sep 27 2026 11:54 PM

Breaking: Bank employees three-day strike postponed

సాక్షి, హైదరాబాద్:  దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), UFBU ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు.

ఈ చర్చల అనంతరం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు చేపట్టాల్సిన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తున్నట్లు UFBU ప్రకటన జారీ చేసింది. ఇక సమ్మె వాయిదా పడటంతో సోమవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. దాంతో మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని భావించిన ఖాతాదారులకు తాజా నిర్ణయంతో భారీ ఊరట లభించింది. జరగాల్సిన సమ్మెను వాయిదా వేసిన నేపథ్యంలో తదుపరి చర్చలు, నిర్ణయాలపై బ్యాంక్ ఉద్యోగ సంఘాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement