సీఎం విజయ్ యూటర్న్.. గంటల్లోనే వెనక్కి తగ్గిన సర్కార్! | Vijay govt revokes RTI exemption for law and order department after backlash | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్ యూటర్న్.. గంటల్లోనే వెనక్కి తగ్గిన సర్కార్!

Sep 27 2026 3:24 PM | Updated on Sep 27 2026 3:50 PM

Vijay govt revokes RTI exemption for law and order department after backlash

సాక్షి,చెన్నై: సమాచార హక్కు చట్టం పరిధిలోకి శాంతిభద్రతల విభాగాన్ని తీసుకురాకుండా మినహాయింపునిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున సీఎం విజయ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

రాష్ట్రంలోని పబ్లిక్,శాంతిభద్రతల విభాగాన్ని ఆర్‌టీఐ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ముందుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పోలీసు కస్టడీ మరణాలు, సామాజిక ఘర్షణలు, నిరసనలు, పోలీసు కాల్పులు వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన రికార్డులను పౌరులు ఆర్‌టీఐ ద్వారా అడిగి తెలుసుకునే అవకాశం కోల్పోతారు.

దీనివల్ల ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపిస్తుందని, ప్రజాస్వామ్య హక్కులకు విఘాతమని రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాగ్రహం,తీవ్ర విమర్శల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. వివాదం ముదరకముందే ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement