ఖైరతాబాద్‌లో దిమ్మతిరిగే రిజల్ట్స్‌.. దానం సంచలన వ్యాఖ్యలు | Danam Nagender Sensational Comments On Khairtabad Elections | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌లో దిమ్మతిరిగే రిజల్ట్స్‌.. దానం సంచలన వ్యాఖ్యలు

Sep 28 2026 11:13 AM | Updated on Sep 28 2026 11:17 AM

Danam Nagender Sensational Comments On Khairtabad Elections

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై దానం నాగేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో తనపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు తనదే అన్న ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఓటు చోరీతోనే గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు.

నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద దానం నాగేందర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా దానం.. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో తనపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్‌ ఉపఎన్నికలో సత్తా చాటుతాం. ఎవడు కొడితే మైండ్‌ బ్లాక్‌ అవుతుందో.. అలా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీపై దానం నాగేందర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

బీజేపీ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఓటు చోరీతోనే గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే కిషన్‌రెడ్డి గెలిచేవారు కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే దానం నాగేందర్‌ అనర్హతను సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పొంగులేటి ఆస్తులపై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement