హైదరాబాద్‌లో 24.5% వర్షపాత లోటు.. మేఘాలున్నా వాన లేదు! | Hyderabad Weather Turns Hot And Humid As Southwest Monsoon Fails To Bring Expected Rainfall, Check Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 24.5% వర్షపాత లోటు.. మేఘాలున్నా వాన లేదు!

Sep 28 2026 9:45 AM | Updated on Sep 28 2026 10:19 AM

Hyderabad Rainfall Deficit Southwest Monsoon Groundwater Weather

మహానగరంలో 24.5 శాతం లోటు వర్షపాతం

వర్షాకాల సీజన్‌ను వెంటాడిన ఎల్‌నినో ప్రభావం

త్వరలో నిష్క్రమించనున్న నైరుతి రుతు పవనాలు

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరాన్ని ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సీజన్‌ నిరాశపర్చాయి.  ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో మేఘాలు వర్షించలేదు. సాధారణంగా జూన్‌ తొలి వారంలోనే ప్రవేశించి నగరవాసులకు ఉపశమనం కలిగించే వానలు, ఈసారి కనీస స్థాయిలో కూడా కురవకపోవడం గమనార్హం.

భూగర్భ జలాలు పుంజుకోవడానికి అవసరమైన వర్షపాతం జాడే లేకుండాపోయింది. తేలికపాటి జల్లులకే వర్షాకాలం సీజన్‌ పరిమితమైంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే సమయం ఆసన్నమైనా నీటి లోటు మాత్రం తీరలేదు. మరోవైపు ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో భానుడి ప్రతాపానికి ప్రస్తుత వర్షాకాలంలోనూ ఉక్కపోత తప్పడంలేదు.

మేఘాలు కమ్ముకున్నా.. 
ఈసారి నగర వాతావరణంలో కనిపిస్తున్న ప్రధాన విచిత్ర పరిస్థితేమిటంటే.. ఆకాశం మబ్బులతో నిండిన సందర్భాలు ఎన్నో ఉన్నా, ఆశించిన స్థాయిలో వర్షం నేలను తాకలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ జల్లులు కురిస్తే, సమీప ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగింది. వర్షపాతం  అసమాన పంపిణీ కూడా తీవ్ర సమస్యగా పరిణమించింది. ఒక ప్రాంతంలో భారీ వర్షం పడితే, పక్కనే ఉన్న ప్రాంతంలో మాత్రం వాన ఆనవాళ్లే లేకుండా పోయాయి. ఈ నెల చివరి నాటికిì రాష్ట్రం మొత్తం వర్షపాతం లోటు 23 శాతానికి చేరగా, మహా నగర పరిధిలో ఏకంగా 24.5 శాతంగా నమోదైంది.

సాధారణం కంటే దిగువకే
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో నమోదైన వర్షపాత గణాంకాలు ఆందోళనకర రీతిలో ఉన్నాయి. జూన్‌ 1 నుంచి సెపె్టంబర్‌ 27 వరకు నమోదైన వివరాలను విశ్లేíÙస్తే, మూడు జిల్లాల్లోనూ సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతంలో భారీగా కోత పడటంతో రానున్న రోజుల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలపై భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉష్ణోగ్రతల వైపరీత్యం
సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలంలో నగరంలో ఆహ్లాదకర, చల్లని వాతావరణం నెలకొనాలి. కానీ ఈ సీజన్‌ అందుకు భిన్నంగా తీవ్రమైన ఉక్కపోత, ఎండల తీవ్రతతో నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు భూగర్భ జలమట్టాలు పతనం స్థాయికి చేరాయి. ట్యాంకర్ల నీటిపై ఆధారపడే నివాసితుల సంఖ్య సెపె్టంబర్‌లో రెండు నుంచి మూడింతలు పెరగడం గమనార్హం.

ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త టోల్‌ విధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement